RELATED NEWS
NEWS
చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన

శ్రీ చిన్న జీయార్ స్వామిజీ బో నెస్‌లో వైభవవంత స్వాగతం… తొలి స్కాట్లాండ్ ఉపన్యాసం ఘన విజయం

బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే మద్దతుతో నిర్వహించిన చారిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా, మహా ఆచార్య శ్రీ చిన్న జీయార్ స్వామికి 29 జూన్ సాయంత్రం ఘన సంప్రదాయ స్వాగతం పలికింది. 29 జూన్ బోనెస్ టౌన్ హాల్‌లో ఆయన తొలి స్కాట్లాండ్ ఉపన్యాసాన్ని 500 మందికి పైగా భక్తుల సమక్షంలో నిర్వహించారు.

స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి తాజా పూలమాల సమర్పించగా, అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి (విజయ్ కుమార్ రాజు పర్రి కుమారుడు) స్కాటిష్ కళ ఐనటువంటి బ్యాగ్‌పైప్ ప్రదర్శనను స్థానిక కళాకారులతో కలిసి ఆకట్టుకునేలా ప్రర్శించారు!

తరువాత ప్రసాద్ మంగళంపల్లి మరియు ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయబద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమం నిజరూపం దాల్చడంలో రాజశేఖర్ జాల JET UK వారితో సమన్వయం చేస్తూ ముఖ్యభూమికను పోషించారు.

వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్య‌క్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.

ఆ పిదప స్వామీజీ Ego, Equality & Eternity — A Journey from Self to Supreme అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, ‘అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం’ అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన ‘భువన విజయం’ అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.

కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు మరియు ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు.

‘‘పుష్ప స్వాగతం నుండి ప్రసాదం యొక్క చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి మరియు ఐక్యతతో మిళితం చేసింది’’ అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు.

జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంశా పత్రరూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు. ‘‘ఏడు కొండల (తిరుపతి) నుండి ఏడు కొండల (ఎడింబర్గ్) వరకు’’ అని భువన విజయం వారు అందులో పోల్చుతూ ప్రచురించిన తీరు అద్భుతం.

‘‘ఇది స్కాట్లాండ్ మరియు బోనెస్‌ను రంగులతో నింపిన అద్భుత సంప్రదాయ వేడుక’’ అని ఒక వీక్షకుడు పలికిన మాట ఈ ఘనతను మరింత విస్మయపరుస్తోంది.

TeluguOne For Your Business
About TeluguOne