RELATED NEWS
NEWS
తొలిసారిగా వైట్ హౌస్ లో నాట్స్ యూత్ సింపోజియం ప్రోగ్రామ్

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్ అమెరికాలో చారిత్రకమైన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అమెరికా అధ్యక్ష భవన ("వైట్ హౌస్ ") శ్వేత సౌథంలోని 'ఐసన్హోవర్ భవనం' లో "సౌత్ ఏషియన్ అమెరికన్ యూత్ సింపోజియం" దిగ్విజయంగా నిర్వహించే బాధ్యతలను భుజానికెత్తుకుంది. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న వైట్ హౌస్ సౌత్ ఏషియన్ అమెరికన్ యూత్ సింపోజియం నిర్వహించే బాధ్యతను నాట్స్ కు కట్టబెట్టింది. మూవ్ ఆన్, బులియింగ్, యూత్ లీడర్ షిప్, కమ్యూనిటీ సర్వీసెస్, యువతను సన్మార్గంలో నడిపే మార్గాలు, కెరీర్ డెవలప్ మెంట్ లాంటి అంశాలపై ఈ సింపోజియంలో చర్చ జరగనుంది. యువతను సమాజం కోసం సన్మార్గంలో నడిపేలా దిశా నిర్థేశం చేసేలా ఈ సింపోజియం సాగనుంది. దక్షిణాసియా దేశాలకు చెందిన అమెరికన్ యువత పాల్గొనే ఈ కార్యక్రమం యువతలో స్ఫూర్తిని నింపనుంది. ఎనిమిది దేశాలకు చెందిన రెండు వందల మంది మిడిల్ స్కూల్, హై స్కూల్, కాలేజీ యూత్ ఈ సింపోజియానికి హాజరుకానున్నారు. యువత సరికొత్త ఆలోచనలకు, స్ఫూర్తినిచ్చే చర్చా కార్యక్రమాలకు ఈ సింపోజియం వేదిక కానుంది.

శ్వేత సౌథం నించి నాట్స్ కి వచ్చిన పిలుపు మేరకు, అమెరికా లోని పలు రాష్ట్రాల నాట్స్ చాప్టర్స్ కో-ఆర్డినేటర్స్ సహకారంతో, స్థానిక వాషింగ్టన్ చాప్టర్  ప్రతినిధులైన రావ్ లింగ, లక్ష్మి లింగ ల సమన్వయంతో జరగనున్న ఈ  సింపోజియంలో అనేక మంది ప్రముఖులు పాల్గొని యువతకు దిశా నిర్థేశం చేయనున్నారు.  యువత ఆలోచనలు, అభిప్రాయాలకు అద్ధం పట్టే ఓ సావనీర్ ను కూడా ఈ సందర్భంగా నాట్స్ విడుదల చేయనుంది. దక్షిణాసియా యువత అంతా కలిసి చేసే సాంస్కృతిక ప్రదర్శన ఈ సింపోజియంలో ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఈ సమాజానికి మనం ఏం చేయగలం అనే దానిపై కూడా యువతకు మార్గదర్శనం చేసేలా ఈ సింపోజియం సాగనుంది. మే 22 న వైట్ హౌస్ లో ఈ యూత్ సింపోజియం జరగనుంది.

ఈ  సింపోజియం దిగ్విజయం గా జరగాలని సౌత్ ఆసియన్ దేశాల ప్రతినిధులతో పాటు శ్వేత సౌథం లోని ప్రెసిడెంట్ సలహా సంఘ కమీషన్ (AAPI) శేఖర్ నరసింహన్, కిరణ్ అహుజ (Executive Director, WHIAAPI (WHITE HOUSE INITIATIVE ON ASIAN AMERICANS AND PACIFIC ISLANDERS ) లు  తమ అభినందన తీర్మానాల్లో అకాంక్షించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;