RELATED NEWS
NEWS
అన్నార్తులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన నాట్స్


న్యూజెర్సీ నాట్స్ క్యాన్ ఫుడ్ డ్రైవ్

అన్నార్తులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన నాట్స్

 


న్యూ బృన్స్విక్:  డిసెంబర్ 3: ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా వ్యాప్తంగా ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ రంగంలోకి దిగింది. నాట్స్ ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందిస్తున్నాయి. తాజాగా న్యూజెర్సీ లో నాట్స్ ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. నాట్స్ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారంతా పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో మేముసైతం  అని పోటీపడ్డారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ నాయకత్వంలో ఈ  ఫుడ్ డ్రైవ్ జరిగింది. నాట్స్ నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడింట్ శ్రీహరి మందాడి,  న్యూజెర్సీ నాట్స్ కో ఆర్డినేటర్ వంశీకృష్ణ వెనిగళ్ల, విష్ణు ఆలూరు మద్దతుతో చాలా మంది ఈ ఫుడ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్యాం మద్దాళి, నాట్స్ మాజీ అధ్యక్షుడు బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గంగాధర్ దేసు తో పాటు న్యూజెర్సీ నాట్స్ నాయక గణం రమేష్ నూతలపాటి, మురళీ కృష్ణ మేడిచెర్ల, అరుణ గంటి, శ్యాం నాళం, చంద్రశేఖర్ కొణిదిల, సూర్య గుత్తికొండ, సురేష్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, అరుణ్ మాదిరాజు, మోహన్ రావు కూనమనేని, శ్రీధర్ దోనేపూడి, రేవంత్ ఇనగళ్ల  ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అన్న నినాదాన్ని చేతల్లో రుజువు చేస్తూ నాట్స్ ప్రతి యేటా భారీ ఎత్తున ఈ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

 

న్యూజెర్సీతో పాటు అమెరికాలోని పలు నగరాల్లో ఈ ఫుడ్ డ్రైవ్ జరగనుంది. ఫుడ్ డ్రైవ్ ద్వారా సేకరించిన ఫుడ్ క్యాన్స్ ను స్థానిక ఓజామన్ కేథలిక్ ఛారిటీకి నాట్స్ డోనేట్ చేసింది. పేదపిల్లల కడుపులు నింపేందుకు ఈ ఛారిటీ సంస్థ పనిచేస్తుంది. నాట్స్ ప్రతి చాప్టర్ లోనూ ఈ ఫుడ్ డ్రైవ్ నిర్వహించి పేదపిల్లల ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తోంది. నాట్స్ పిలుపుకు స్పందించి తమ వంతుగా  ఫుడ్ క్యాన్స్ అందించిన ప్రతి ఒక్కరిని నాట్స్ ధన్యవాదాలు తెలుపుతోంది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;