RELATED NEWS
NEWS
సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో ట్యాక్స్ సెమీనార్

 

 

అమెరికాలో తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించే నాట్స్, చికాగో తెలుగు అసోషియేషన్ తో కలిసి టాక్స్ సెమీనార్ ను ఏర్పాటు చేసింది. చికాగోలో జరిగిన ఈ సెమీనార్ లో ట్యాక్స్ కౌన్సిలింగ్, ఆర్థిక ప్రణాళికలపై తెలుగువారికి అవగాహన కల్పించారు. ప్రముఖ ఆర్థిక నిపుణులు ..సీపీఏ దీపా రామచంద్రన్.. టాక్స్ గురించి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందించారు. టాక్స్ రిటర్న్స్ ఎలా చేయాలి. టాక్స్ సేవింగ్ కు ఎలాంటి చిట్కాలు పాటించాలి..వ్యక్తిగత పన్ను విధానం, వ్యాపార పన్నుల విధానం గురించి సమగ్రంగా వివరించారు.


ప్లెక్సీబుల్ సేవింగ్ అకౌంట్, హెల్త్ సేవింగ్ అకౌంట్లు, డబ్బు పొదుపు, పెట్టుబడి మార్గాలు, పెట్టుబడులు పెట్టడంలో అనుసరించాల్సిన మార్గాలను కూడా ఆర్థిక నిపుణులు కైరన్, బక్వీర్ మోస్వీ  సూచించారు.  సీటీఏ ప్రెసిడెంట్  శ్రీనివాస్ బొప్పన్న, నాట్స్  చికాగో కో ఆర్డినేటర్ నాగేంద్ర వేగి , సీటీఏ వైస్ ప్రెసిడెంట్ మూర్తి కొప్పాకలు ఈ సెమీనార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.  ఇక నాట్స్, సీటీఏ చేపడుతున్న  సేవాకార్యక్రమాలను నాట్స్ ఉపాధ్యక్షులు రవి అచంట ఈ సెమీనార్ లో  వివరించారు. సీటీఏ కార్యదర్శ శ్రీధర్ ముమ్మనగండి, సీటీఏ కార్యనిర్వహక కమిటీ సభ్యులు రమేష్ మర్యాల, వర ప్రసాద్ బోడపాటి, నాగేంద్ర వేగి, చంద్ర ఇండ్లమూరి , రావ్ అచంట, సుజనా అచంట, రామ్ కొప్పాక తదితరులు ఈ సెమీనార్ విజయవంతానికి ప్రత్యేక కృషి చేశారు..

TeluguOne For Your Business
About TeluguOne
;