RELATED NEWS
NEWS
డాల్లస్ లో “ఆక్టేవ్ సౌండ్ ప్రొ” సంస్థ వినూత్న కార్యక్రమం జయప్రదం!

ప్రేమికుల రోజున  ప్రవాస భారతీయుల గుండెల్లో గిలిగింతలు....కుటుంబమంతా జేజేలతో కొట్టిన కేరింతలు!
 

 

 

“వేలంటైన్స్ డే” ..అదేనండి ప్రపంచమంతా ఫిబ్రవరిలో మనం జరుపుకొనే ప్రేమికుల దినోత్సవం.. ప్రియురాలితో కలిసి ఏ పార్క్ లోనో లేక సినిమా హాలులోనో ఎంచక్కా ఓ రొమాంటిక్ సినిమా చూసి అలా సాయంత్రం బటాణీ-చాట్ తింటూ.. బీచ్ లో చల్లని పిల్లగాలి కెరటాలతో ఎగసి పడే పైట కొంగు సవరించు కుంటున్న వయ్యారి ఒంపుసొంపుల గడుసరి ప్రియురాలును వాలుచుపులతో చూస్తూ లోకాన్నే మరచి పోవడం ...ఇవి మనలో చాలామందికి ఉన్న చిన్ననాటి మరువలేని తీపి అనుభావాలు. కాని పదివేల మైళ్ళ దూరంలో దశాబ్దాల కాలం ప్రవాసంలో పిల్లాపాపలతో నివాసం ఉంటూ ఉంటే ఇవన్నీ కుదురుతాయా ? అయినా పాత చింతకాయ పచ్చడి లాగా కేవలం రోజాపూలు ప్రియురాలి కి అందిస్తేనే ప్రేమున్నట్లా?. మరి పిల్లల విషయం?.....ఈ ప్రశ్నలన్నిం టికీ ప్రవాసంలో ప్రప్రధమంగా గట్టి సమాధానమిచ్చాడు “ఆక్టేవ్ సౌండ్ ప్రొ” అధినేత “డిజె క్రు”. సాయంకాలపు సమావేశానికి పద్మ మరియు వెంకట్ ములుకుట్ల దంపతులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ప్రియదర్శిని మరియు చినసత్యం వీర్నపు దంపతులు ఆహ్వాన వేదిక పై అతిథులను స్వాగతించారు.


భారతీయ సంతతికి చెందిన దాదాపు యాభై కుటుంబాలు స్థానిక రుచి ప్యాలస్ రెస్టారంట్ లో శనివారం సాయంత్రం ఏడు గంటలకు సమావేశమయ్యారు . ఎవ్వరూ ఊహించని రీతిలో పన్నీటి గంధాలు మరియు రోజా పుష్పాలతో  ఆహ్వానం, ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వ్యక్తిగత కుటుంబ ఛాయాచిత్రం,  మంచి ఊపున్న సంగీతం తో కార్యక్రమం ప్రారంభమయ్యింది. పిల్లలకు ప్రత్యేకంగా మ్యాజిక్ షో, బెలూన్స్, ఫేస్ పెయింటింగ్స్, ఆటలు, పాటలు, నృత్యాలతో అల్లరి పిల్లలంతా ఆనందోత్సాహాలతో  కేరింతలు కొట్టారు. ఎప్పుడూ డాన్స్ చెయ్యని యువతీ యువకుల లో నిదిరించే డాన్సర్ ను లేపేందుకు ప్రత్యేకంగా డాన్స్ స్టెప్పులు నేర్పిన అంశం అందరినీ విశేషంగా ఆకట్టు కొంది.


“ఆక్టేవ్ సౌండ్ ప్రొ” అధినేత “డిజె క్రు” వేదికపై మాట్లాడుతూ “ఇలాంటి కలయిక సకుటుంబ సపరివార సమేతంగా అందరి ఆనందం కోసం ప్రత్యేకంగా డాల్లస్ లో  మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయడం జరిగింది. విచ్చేసిన మిత్రుల విశేష స్పందన చూసి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరపడానికి ఇది ఒక కొత్త స్ఫూర్తి”.


నోరూరించే రుచికరమైన భోజనం తో పాటు  చక్కని వేదిక మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించిన రుచి ప్యాలెస్ సిబ్బంది మరియు యాజమాన్యానికి, గంటల తరబడి తమ అమూల్య సమయాన్ని వెచ్చించి కష్టించిన సేవకులకు, ప్రవాసంలో అన్నీ దృశ్యాలను అద్దంపట్టి ప్రపంచానికి చూపిస్తున్న టివి9కు, నగరంలో అన్నీ వినోద కార్యక్రమాలకు టిక్కట్లను అధునాతనంగా అందిస్తున్న మై డీల్స్ హబ్ కు,  “ఆక్టేవ్ సౌండ్ ప్రొ”  అధినేత “డి జె క్రు” కృతఙ్ఞతలు తెలియజేయడంతో అత్యంత ఆనందాన్ని అందించిన ప్రేమికుల వేదికకు తెరపడింది.

TeluguOne For Your Business
About TeluguOne
;