RELATED NEWS
NEWS
నాట్స్ న్యూజెర్సీ టీమ్ చే ఇళ్లులేని పేదలకు ఆహారం పంపిణీ

 

నాట్స్ న్యూజెర్సీ టీమ్ చే ఇళ్లులేని పేదలకు ఆహారం పంపిణీ

 


న్యూ బ్రన్స్విక్ , న్యూ జెర్సీ: మార్చ్ 19: సేవే గమ్యంగా అమెరికాలో పనిచేస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు ఆర్జనైజేషన్ నాట్స్... న్యూజెర్సీలోని ఇళ్లు లేని పేదల కోసం ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. ఇందులో భాగంగా నాట్స్ న్యూజెర్సీ టీమ్ పలురకాల ఆహార పదార్ధాలను పంచిపెట్టింది. న్యూ బ్రన్ స్విక్, ఎడిసన్ ప్రాంతాల్లోని ఇళ్లు లేని వారికి ఓజానమ్ హోమ్ లెస్ షెల్టర్ తాత్కాలిక నివాస వసతులు కల్పిస్తుంది. ఈ షెల్టర్ లో వసతి పొందుతున్న వారికి న్యూజెర్సీ నాట్స్ టీమ్ పౌష్టిక ఆహారాన్ని అందజేసింది. సుమారు 200 మందికి చిరుధాన్యాలు, రొట్టెలు, పాలు, పళ్లరసాలు, అరటిపళ్లు, బత్తాయి, యాపిల్స్, బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీ, క్యాన్డ్ ఫుడ్స్ మొదలైనవి అందించారు. దాదాపు రెండు వారాల నుంచి నాలుగు వారాల అవసరాలకు సరిపడా ఆహారాన్ని పంచారు.


 
ఉదారంగా సహాయం చేయడానికి వచ్చిన నాట్స్ ను ఓజానమ్ హోమ్ లెస్ షెల్టర్ ప్రత్యేకంగా అభినందించింది. ఇళ్లు లేని పేదలకు తమవంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని నాట్స్ ఈ సందర్భంగా తెలిపింది. నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ సారథ్యంలో జరిగిన ఈ ఈవెంట్ లో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ శ్యామ్ మద్దాళి, నాట్స్ న్యూజెర్సీ టీమ్ సభ్యులు గంగాధర్ దేసు, రమేష్ నూతలపాటి, రంజిత్ చాగంటి, అరుణ గంటి, రాజేంద్ర అప్పలనేని, శ్రీహరి మందాడి,  వంశీ వెనిగళ్ళ,  మురళీ మేడిచర్ల, చంద్ర శేఖర్ కొణిదెల, ప్రసాద్ బొబ్బ, సుధీర్ తుమ్మల, ఆశా వైకుంఠం, రేఖ ఉప్పలూరి, మోహన్ వెనిగళ్ళ, రాకేష్ దొమ్మలపాటి, జయ వెంకట్ చనమోలు, శేఖర్ గుత్తికొండ, శ్రీనివాస్ చాగంటి తదితరులు హాజరై, ఆహార పదార్ధాలను పంచిపెట్టారు.

 


 
అమెరికాలోని తెలుగువారి కోసం 24 గంటల హెల్ప్ లైన్ ను ప్రారంభించిన తొలి తెలుగు నేషనల్ ఆర్గనైజేషన్ నాట్స్. 1-888-483-5848 (1-888-4-TELUGU) కు కాల్ చేసి ఎటువంటి సహాయాన్నైనా పొందే అవకాశం కల్పించింది. సేవా కార్యక్రమాలు చేయాలనే అభిలాష ఉన్నవారెవరైనా  సరే నాట్స్ లో భాగస్వాములు కావొచ్చు. మరిన్ని వివరాల కోసం https://www.natsworld.org/become-a-member/, www.natsworld.org వెబ్ సైట్ చూడొచ్చు.

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;