RELATED NEWS
NEWS
ఉత్తర డెట్రాయిట్ సిలికానాంధ్ర మనబడి సాంస్కృతికోత్సవం లో విరిసిన చిన్నారి తెలుగు వెలుగులు

ఈ వారంతం డెట్రాయిట్ లో సిలికానాంధ్ర మనబడి పిల్లల సాంస్కృతికొత్సవం విజయవంతంగా జరిగింది. అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం విచ్చేసిన పెద్దలు కొనియాడారు. Troy, Shelby Township మనబడి తరగతుల నుంచి సుమారు 120 మంది పిల్లలు నాటకాలు, పద్యాలు, పాటలు, నృత్యరూపకాలు చేసి అందరిని మెప్పించారు. పిల్లల శోభాయాత్రతో కార్యక్రమం మొదలై, Troy మరియు Novi మనబడి నుండి శ్రీ పొట్టిశ్రీరాముల విశ్వవిద్యాలయం పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

మనబడి పిల్లల శోభాయాత్రప్రతివారాంతం మనబడి పిల్లలకు తెలుగు భాష భోదిస్తున్న ఉపాధ్యాయ బృందం

తెలుగు స్ఫూర్తి, కీర్తి, నీతి అన్న అంశంపై సుమారు ఆరున్నర గంటలు జరిగిన ఈ సాంస్కృతికోత్సవంలో చిన్నపిల్లల తరగతుల నుండి పెద్ద తరగతులలో చదువుకొంటున్న అనేక మంది విద్యార్థులు హాస్య, చారిత్రాత్మక, పౌరాణిక, జానపద, కల్పితరూపకాలతో ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుమారు 350 మంది భాషాభిమానులను అబ్బురపరిచారు. 4-6 ఏళ్ళ చిన్నపిల్లలు కృష్ణదేవరాయల కొలువులో నెలవైయున్న అష్టదిగ్గజాల పాత్రలలో ముద్దు ముద్దు మాటలతో పద్యాలు తెలుగు పండుగల గురుంచి చెప్పారు, ఆ తరువాత మిగతా తరగతుల పిల్లలు అమెరికాలో అయోమయ దేశస్తులు అనే హాస్య నాటకం, పేదరాసి పెద్దమ్మ కథలు, యోగ్యుడైన వాడు రాజు అవుతాడని పిల్లలకుస్పూర్తి నిచ్చే మహారాజు అనే నీతి కథ, ఆలీబాబా 40 దొంగలు అనే హాస్యం, నీతి మేళవించిన నృత్యరూపకం, పౌరాణికానికే మకుటంఅయిన శ్రీ రామ పట్టాభిషేకం, భారతస్వాతంత్ర్య పోరాటానికి జీవం పోసి, త్యాగాలనోర్చిన తెలుగు మరియు ఇతర భారతీయ యోధుల పాత్రలతో చారిత్రాత్మక నాటకం వంటి ఎన్నో అధ్బుతమైన అంశాలు ప్రదర్శించారు. ఈ చివరి నాటకంలో స్వాతంత్ర్యయోధులుగా పిల్లలు వారి పాత్ర వారే తెలుగులో వ్రాసుకోవడం, నేరేటర్ గా వారే వ్యవహరించడం తెలుగుపై పెంపొందిన వారి పట్టుని మనబడి అందించిన ఒక మెట్టు గా చెప్పవచ్చు.


తెలుగు పండుగలు గురించి ముద్దు ముద్దు మాటలతో వివరిస్తున్న 4-6 ఏళ్ళ బాలబడి విద్యార్థులు

 


అందరినీ నవ్వించి దురాశ దుఃఖానికి చేటు అని చెప్తూ ఆకట్టుకున్న ఆలీబాబా 40 దొంగల పాత్రధారులుభారత స్వాతంత్ర్యసమరాన్ని చక్కగా ప్రదర్శించిన ప్రకాశం విద్యార్థులు


ఈ సాంస్కృతికోత్సవంలో మొదటి సారి విద్యార్థుల స్నాతకోత్సవం జరపడం గొప్ప నాంది గా చెప్పుకోవచ్చు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పెట్టిన పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి తెలుగు “జూనియర్ సర్టిఫికేట్” పట్టభద్ర ప్రధానం చేసారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పెట్టిన “Junior Certificate” పరీక్షలో ఉత్తీర్ణులై మనబడి స్నాతకోత్సవం లో పట్టభద్రాలు పొందిన విద్యార్థులు.

 ఈ సాంస్కృతికోత్సవానికి మరొక విశేషం – స్థానిక పాఠశాల, Troy మరియు Rochester School Districts, నుండి ప్రధానాధ్యాపకులు విచ్చేసి పిల్లలకు వారి తల్లిదండ్రులకు తమ తమ సందేశాలు ఇవ్వటం. Mr. Jeremey Whan, Principal, BEMIS Elementary School, Mrs. Stephanie Miller, Principal, Morse Elementary School, Mr. Michael Behrmann, Executive Director, Elementary Education, Rochester Schools, వేదికపై వచ్చి పిల్లలు ఒక్క భాష కాకుండా విభిన్న భాషలు నేర్చుకోవడం వల్ల వారి మెదడు చురుకుగా పని చేస్తుందని, అందులోను తమ తల్లిదండ్రులనుంచి సంక్రమించిన తెలుగును నేర్చుకోవడం ఈ పిల్లల విజ్ఞానాభివృద్ధికి ఎంతో తోడ్పడంలో సందేహం లేదని అందరిని అభినందించారుస్థానిక పాఠశాలల ప్రధానాధ్యాపకులు మనబడికు సహాయంగా నిలుస్తున్నామని సందేశాన్నిచ్చారు.

కార్యక్రమం తరువాత ట్రాయ్ అతిథి రెస్టారెంట్ వారు మంచి పసందైన విందు భోజనం కూర్చి అందరి మన్ననలను చూరగొన్నారు. ఈ సాంస్కృతికోత్సవాన్ని మిషిగన్ మనబడి స్వచ్ఛంద సేవా కర్తలు, తెలుగు సంస్కృతి సైనికుల సహాయ సహకారాలతో విజయవంతంగా ముగించారు. కొత్త తరగతుల లో మీ పిల్లలు నమోదు చేసుకోవాలంటే manabadi.mi@gmail.com కు  e-mail చెయ్యండి:

TeluguOne For Your Business
About TeluguOne
;