RELATED NEWS
NEWS
నాట్స్ తెలుగు సంబరాల్లో బాలయ్య, బాలు, కీరవాణి, కాజల్

 

               నందమూరి బాలకృష్ణ                              కాజల్ అగర్వాల్

 

అమెరికాలో తెలుగువారిని ఒక్కటి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. అమెరికాలో తెలుగు సంబరాల కోసం శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాలస్ లో జూలై 4 నుంచి 6 వ తేదీవరకు మూడు రోజుల పాటు.. అమెరికాలో ఉండే తెలుగువారికి అంతులేని ఆనందాలు పంచేందుకు సంబరాల కమిటీ సర్వం సిద్దం చేస్తోంది. నందమూరి నట సింహం బాలక్రిష్ణ,కాజల్, నిషా, ఇలా ఎందరో సినీ ప్రముఖులు నాట్స్ సంబరాలకు విచ్చేస్తున్నారు. వీరితో పాటు.. కామెడీ స్టార్ ఆలీ.. కోన వెంకట్ , నిర్మాత సాయి కొర్రపాటి.. ఇలా ఎందరో సినీ దిగ్గజాలు సంబరాలకు తరలివస్తున్నారు. సినిమా నిర్మాణంపై సదస్సులు, వ్యాపార మెళుకువలపై చర్చా కార్యక్రమం, ఆధ్యాత్మిక సమ్మేళనం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహార్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా రానున్నారు. అమెరికాలో తొలిసారిగా ఈటీవీ పాడుతా తీయగా..నిర్వహించిన బాలు.. నాట్స్ సంబరాల వేదికపై పాడుతా తీయగా ఫైనల్ నిర్వహించనున్నారు. ఇక కీరవాణి మ్యూజికల్ నైట్.. సంబరాలకు విచ్చేసిన వారిని సంగీత ప్రవాహంలో ముంచెత్తనుంది.. సంబరాలకు వచ్చే తెలుగు ప్రముఖుల జాబితా కూడా పెరిగింది. స్వామి గణపతి సచ్చదానంద స్వామి చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సంబరాల్లో ఇంకా స్వామి పరిపూర్ణనంద, శ్రీ మాత శివ చైతన్యానంద , శ్రీ రాజారావు అడుసుమిల్లి, శ్రీ,మోహన్ జాదవ్, డా. సంతోష్ కుమార్ లు తమ ఆధ్యాత్మిక సందేశాలను ఇవ్వనున్నారు. శ్రి. P. V. V. రామరాజు (ఆర్ధిక మంత్రిత్వ శాఖ సలహాదారు, ఆఫ్ఘనిస్తాన్), మహేర్ మాసో (మేయర్,సిటీ అఫ్ ఫ్రిస్కో),బెత్ వాన్ డుయనే (మేయర్ సిటీ అఫ్ ఇర్వింగ్),సెనేటర్ జాన్ కోర్నిన్ (US సెనేటర్ టెక్సాస్) వంటి ప్రముఖులు విఛెయనున్నారు.

 

                           కీరవాణి                                                బాలసుబ్రమణ్యం   

 

ఇక కొత్తగా  మా టీవీ సూపర్ సింగర్  అంజనా సౌమ్య, నటి సంజనా, యాంకర్ సుమ కనకాల కూడా  సంబరాల్లో పాల్గొంటున్నారు.. ఇక నాట్స్ సంబరాల్లో భాగంగా నిర్వహించిన అనేక ఆటల పోటీల్లో విజేతలకు సంబరాల వేదికపై బహుమతులు అందించనున్నారు. మ్యాథ్స్ చాలెంజ్ విజేతలకు కూడా సంబరాల వేదికపైనే బహుమతులు ప్రదానం ఉంటుందని నాట్స్ తెలిపింది. అమెరికాలో ఉండే తెలుగువారు ఎంతో సాధన చేసి సంబరాల వేదికపై ఎన్నో కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. వాటిలో ముఖ్యంగా స్వరవేదం, నాదమ్రుతవర్షిణి, రేలారేరేలా, సరిగంచు చీర, బాలగానమ్రుతం, మన పండుగల ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి కోసం నెల రోజుల నుంచి డాలస్ లో  సంబరాల టీం  భారీ కసరత్తు చేస్తోంది.  ఇండియా నుంచి వచ్చిన గురువుల పర్యవేక్షణలో.. చిన్నారులు, యువతీ,యువకులు రిహార్సల్స్ ముమ్మరంగా చేస్తున్నారు..



సంబరాల నమోదుకు భారీ స్పందన...
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో పాల్గొనేందుకు తెలుగువారు మేముసైతమంటూ పోటీ పడుతున్నారు. వేలమంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.. నాట్స్ ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రావడంతో.. వచ్చేవారికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా నాట్స్ టీం భారీ ఏర్పాట్లు చేస్తుంది.  ఇప్పటికే నాట్స్ ఇప్పటికే బుక్ చేసిన హోటల్స్ తో పాటు  దగ్గర్లోని మరికొన్ని హోటల్స్  కూడా సిద్దం చేస్తోంది. పేర్ల నమోదు కార్యక్రమం కూడా  శరవేగంగా జరిగేలా ఏర్పాట్లు చేసింది.. సంబరాలను అంబరాన్ని అంటే నిర్వహించేందుకు నాట్స్.. సంబరాల టీం  అహార్నిశలు శ్రమిస్తోంది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;