RELATED NEWS
NEWS
లాస్య కూచిపూడి అరంగేట్రం

 

 

 

 

మన భారత దేశంలో ఎక్కువ మంది తల్లులు పిల్లలతో వేసవి సెలవుల్లో టీవీ సీరియల్స్ చూస్తూ కాలం గడిపేస్తుంటే అమెరికాలోని భారతీయులు మాత్రం మన సంస్కృతిని పిల్లలకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ఓ తల్లిదండ్రుల ప్రయత్నం నేడు ఫలాలనిచ్చింది. డెన్వర్ కు చెందిన సుధీర్ గడ్డి పాటి, ప్రియా దంపతుల గారాల చిన్నారి లాస్య, డెన్వర్ లోని లేక్ వుడ్ కల్చరల్ సెంటర్ లో దాదాపు 400 వందల మంది సభికుల సమక్షంలో అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించింది.

 

ఈ ప్రోగ్రాంలో ప్రేక్షకులు పూర్తిగా లీనమై దాదాపు నాలుగు గంటల పాటు పది సంవత్సరాల చిన్నారి లాస్య వరుసగా అలుపు లేకుండా అద్భుతమైన హావ భావాలతో నయన మనోహరంగా నాట్యం చేస్తుంటే ప్రేక్షకులు మైమరచి పోయారు.

 మొదట చిన్నారి లాస్య, నటరాజ నర్తనముతో ప్రారంభించి బాల గణేశుని లయ బద్ద నాట్యాన్ని, కొలువైతివా రంగస్వామి అంటూ శ్రీ రంగ నాధుని యొక్క, మహా వైభవాన్ని భక్తి తో ప్రదర్శించిది. బృందావనమనే నందన వనములో వయ్యారి గోపిక, గోపాలుని విన్యాసాన్ని కన్నుల పండుగ గా ప్రదర్శించినది . వివిధ యుగాలలో ధర్మాన్ని రక్షించడానికి, దుష్ట శక్తులను సంహరించడానికి మహా విష్ట్నువు ని యొక్క దశావతారములు అయిన మత్స్య, కుర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అపురూపాలను సభ లో ఆవ్విష్కరించింది. శివోహం అంటూ కైలాస నాథుని శివ పంచాక్షరి ద్వారా శివుని విన్యాసాలను అద్బుతముగా ప్రదర్శించినది.


ఆది శక్తిగా,మహిషా సుర మర్దిని గా “అయి గిరి నందిని , నందిత మేదిని ,విశ్వ వినోదిని నందనుతే ,గిరివర వింధ్య సిరోది నివాసిని ,విష్ణు విలాసిని జిష్ణు నుతే ” అని శృతి కలుపుతూ,అడుగులు వేస్తూ దుర్గాదేవి ,మహిససురుదనే రాక్షకుడు మద్య సంవాదం ,పోరాటం చివరికి మహిశాసురుని సంహారం లో లాస్య  లయ బద్దమైన అడుగులు ఆ దేవిని, మహిషాసురుడిని ఏక కాలంలో మన కళ్ళముందు నిలిపే చూపులతో ,శక్తీ మాత దుర్గా దేవి తొమ్మిది రూపాలను లోని నవరసాలు అద్భుతముగా ప్రదర్శించింది.వీక్షకులు మంత్రం ముగ్దులై చిన్నారిని కరతాళ ధ్వనులతో ఆద్యంతం అభినందిస్తూ తన్మయ సభ ఆద్యంతము వ్యాక్యాతలుగా శ్రీ Sam thomas,శ్రీమతి ఇందిరా దుగ్గిరాల వారి అద్బుతముగా చేసిన కామెంటరీ ప్రత్యెక ఆకర్షణగా నిలచినది త్వము ఈ పొందారు.


ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన సిలికాన్ ఆంధ్రా చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ “మొట్ట మొదటి సారి 10 సంవత్సరాల చిన్నారి నాట్య అరంగేట్రం అమెరికాలో చూస్తున్నానని, లాస్య కూచిపూడి లో అద్భుతాలు సృష్టించ బోతున్నదని ప్రశంసల వర్షం కురిపించారు. చివరగా కూచిబొట్ల ఆనంద్ గారిని ఘనంగా సత్కరించారు.

 నాట్య చారి సరిత బంగారాల ఆద్వర్యములో మృదంగం విద్వాంసులు శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం వోకల్ విద్వాంసులు శ్రీ వికె అరుణ కుమార్, వయోలిన్ మహేష్ అయ్యిర్, ఫ్లూట్ ప్రశాంత్ కల్లూర్, వీణ జ్యోతి వేణుగోపాల్, సుహాసిని శెట్టి ల ఆధ్వర్యంలో అద్బుతమైన సంగీత వాయిద్యాల సమ్మేళనముతో లాస్య నాట్య హేలి లేక్ వుడ్ కల్చరల్ సభికులను మంత్ర ముగ్దులను చేసింది.సభలో నాట్య చారిణి సరిత బంగారును సుదీర్, ప్రియ కొర్రపాటి దంపతులు ఘనంగా సన్మానించారు. చివరగా ప్రియ కొర్రపాటి అతిడులకు ,సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరి కి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతి ధులు గా కొలరాడో ప్రొఫెసర్ డా. మార్క్ స్పిట్జ్స్, శ్రీ కొల్లి రాంగోపాల్ గారు ఐఏఎస్, శ్రీమతి శ్యామరెడ్డి (NATA President elect) సిలికాన్ ఆంధ్రా చైర్మన్ ఆనంద్ కూచిబొట్ల, యూత్ అండ్ వివేకానంద కన్వీనర్ చిల్లకూరు గోపి, కీస్ సాఫ్ట్వేర్ అధినేత్రి శ్రీమతి జ్యోతి రెడ్డి, కాస్ట్యూమ్స్ శ్రీ శివ కుమార్ , అతిధులు సుభాస్ చంద్ర బోసు, అరుణ కుమారి దంపతులు ప్రవాసాంధ్ర ప్రముఖులు dr భాస్కర్ కారుమం కొల్లా చి, sri PVN సురేష్ బాబు . అజితా కొల్లా, వంశీలు పాల్గొన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;