RELATED NEWS
NEWS
ఘనంగా ముగిసిన నాట్స్ తెలుగు సంబరాలు

అమెరికాలో అంబరాన్నేంటేలా జిరగిన నాట్స్ తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి.. మన రాష్ట్రం నుంచి అతిరథ మహారథులు.. అత్యంత ప్రముఖులు హాజరై .. ప్రవాసాంధ్రులకు తమ సందేశాన్ని అందించారు. శ్రీ పరిపూర్ణ నంద స్వామీ హిందు సమాజం మీద ఇచ్చిన సందేశం అందరిని ఆకట్టుకుంది. సంబరాల్లో యువత ఆట పాటలతో వేదికను హోరెత్తించింది. నృత్యాంజలి ప్లూట్ డ్యాన్స్ తో పాటు.. మన పండుగల విశేషాలను తెలిపే నృత్యము, జయ జయ దుర్గే.. అంటూ.. దుర్గా మాత ప్రత్యేకత మీద రూపొందించిన సంప్రదాయ నృత్యము తెలుగు కళా వైభవం, సంబరాల వేదికపై ప్రతిబింబించాయి. అంతే కాకుండా తారంగం.. తారంగం అంటూ.. ఆ చిన్ని క్రిష్ణుడి చిలిపి చేష్టల మీద రూపొందించిన నాట్యం.. జగదానంద కారక.. అంటూ.. రామాయణాన్ని వివరించిన నృత్యము తెలుగువారిని విశేషాంగా ఆకట్టుకుంది. హోయలా, ధింసా, కోయ గిరిజనుల నృత్యాలు, బోనాలు.. ఇలా ఎన్నో భారతీయ సంస్క్రతి సంప్రదాయాలను ప్రతిబించించే కార్యక్రమాలు సంబరాల వేదికపై ప్రదర్శించారు. ఇక నాట్స్ స్వర వేదం కార్యక్రమం.. సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిమిక్రీ, కామెడీ స్కిట్లు.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

 

 


పాడుతా తీయగా ఫైనల్

అమెరికాలో తొలిసారిగా నిర్వహించిన ఈటీవీ పాడుతా తీయగా కార్యక్రమం.. ఫైనల్ పోటీలు నాట్స్ వేదికపై  అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రఖ్యాత గాయకుడు ఎస్.పి బాల సుబ్రమణ్యం నిర్వహించిన ఈ పాడుతా తీయగా లో.. గానకోకిలల  ప్రవాహం  సంబరాలకు విచ్చేసిన వారిని సంగీత సాగరంలో ముంచెత్తింది.

 



కీరవాణి మ్యూజికల్ నైట్..

సుస్వరాల వాణి.. కీరవాణి.. నాట్స్ సంబరాల వేదికపై సంగీత సునామీ సృష్టించారు .  కీరవాణి పాటల ప్రవాహంలో గీతామాధురి, రేవంత్,నోయెల్,భైరవ(కీరవాణి పెద్ద కుమారుడు) ఇలాం ఎందరో గాయకులు... తమ గానామృతం లో తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని మధురానుభూతులు పంచారు.. కీరవాణి సంగీతో హోరులో ప్రవాసాంధ్రుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.



 

బాలయ్య, మనోహార్ సందేశాలు..

ప్రవాసాంధ్రుల్లో సేవాభావంతో చేపడుతున్న కార్యక్రమాలు.. అభినందనీయమంటూ.. నాట్స్ కు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలక్రిష్ణ తన అభినందనలు తెలిపారు.. సేవా పథంతో చేపట్టే ఏ కార్యక్రమానికైనా తన మద్దతు ఉంటుందని తెలిపారు. అటు నాదెండ్ల మనోహార్,  నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రవాసాంధ్రులు తెలుగు సంప్రదాయల పరిరక్షణకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేందుకు స్వర్గథామం లాంటిదని బిజినెస్ సెమీనార్ లో కూడా మనోహార్ చెప్పుకొచ్చారు.  సంబరాల్లో ఆట పాటలతో పాటు.. వ్యాపార, ఆరోగ్య, వైద్య సదస్సులను నాట్స్ నిర్వహించింది.

మహిళల సమస్యలపై కూడా  సంబరాల్లో  నారీ సదస్సును నాట్స్ నిర్వహించింది.

 సంబరాల్లో భాగంగా  నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు  వేదికపై ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. దాదాపు ఏడు వేలమందికిపైగా హజరైన నాట్స్ సంబరాల్లో... ఎవరికి ఏ లోటు రాకుండడా నాట్స్ టీం ఎన్నో ఏర్పాట్లు చేసింది. గత కొద్ది రోజులుగా సంబరాల కోసం విశేష కృషి చేస్తున్న నాట్స్ టీంకు...తెలుగు కుటుంబాల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. 

2015 లో లాస్ ఏంజిల్స్ లో నాట్స్  సంబరాలు

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి జరిగే నాట్స్ సంబరాలు ఈసారి 2015లో లాస్ ఏంజిల్స్ నిర్వహించనున్నట్టు.. నాట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రణకుమార్ తెలిపారు. ఆ తర్వాత రెండేళ్లకు  2017లో  అట్లాంటాలో తెలుగుసంబరాలు నిర్వహిస్తామని ఆయన ముందుగానే ప్రకటించారు. శ్రీనివాస్ కోనేరు వందన సమర్పణ చేసారు. జనగణమన జాతీయ గీతా లాపనతో 2013  సంబరాలు  ముగిశాయి.

TeluguOne For Your Business
About TeluguOne
;