RELATED NEWS
NEWS
శీతాకాలంలో ఆపన్నులకు నాట్స్ వెచ్చటి సాయం

 

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే నాట్స్ మరో సత్కార్యానికి శ్రీకారం చుట్టింది. న్యూజెర్సీలో నిరాశ్రయులు, అనాధల కోసం మానవత్వంతో స్పందించింది. శీతాకాలంలో వారిని చలి బారి నుంచి రక్షించేందుకు నడుంబిగించింది. దుప్పట్లు. జాకెట్స్, స్పెట్టర్లు, షర్ట్స్, గ్లోవ్స్, పంపిణి చేసింది.గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నాట్స్... బాలల దినోత్సవం సందర్భరంగా నాట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎడిషన్ లోని కేథలిక్ చారిటీస్ ద్వారా నాట్స్ ఈ సత్కార్యం చేసింది.. నిరాశ్రయులకు, అనాథల పిల్లలకు అండగా నిలిచే కేథలిక్ చారిటీస్ నాట్స్ సేవా పథంతో ముందుకు వచ్చి దుప్పట్లు, స్పెటర్లు ఇవ్వటాన్ని అభినందించింది. భవిష్యత్ లో కూడా నిరాశ్రయులకు, అనాథ పిల్లలకు ఆవాసాలు ఏర్పాటు చేసేందుకు తన వంతు సాయం చేసేందుకు నాట్స్ తన వంతు సాయం అందిస్తామని తెలిపింది. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహనకృష్ణ మన్నవ ఆర్ధ్వర్యం లోన్యూజెర్సీ టీమ్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై నాట్స్ ఛైర్మన్ మధు కొర్రపాటి ప్రశంసల వర్షం కురిపించారు. నిరాశ్రయులకు, అనాధ పిల్లలకు ఆయన దుప్పట్లు, స్పెటర్లు, షర్టులు పంపిణి చేశారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ అరుణగంటి, నాట్స్ న్యూజెర్సీ టీమ్ సభ్యులు రమేష్ నూతలపాటి, శ్రీహరి మందాడి, వంశీ వెనిగళ్ల, వాసు తుపాకుల, ప్రసాద్ గుర్రం, చంద్రశేఖర్ కొణిదెల, శ్రీనివాస్ వెంకట్, సోమ కలగర, గణేశ్ ధనేకుల, శ్రీథర్ దొనేపూడి, సుథీర్ పోటు తదితరుల ఈ సత్కార్యానికి తమ హర్థిక, ఆర్థిక మద్దతు అందించారు. అమెరికాలో తెలుగువారికి ఏ కష్టమోచ్చిన నాట్స్ అండగా నిలబడుతుందని.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతుందని నాట్స్ తెలిపింది. అమెరికాలో తెలుగువారు ఏ ఆపదలో ఉన్నా కూడా 1-888-4-Telugu నెంబరుకు కాల్ చేయవచ్చని.. నాట్స్ వారికి చేతనైనంత సాయం చేస్తుందని నాట్స్ పేర్కొంది.

 

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;