RELATED NEWS
NEWS
‘ఆటా’ అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి

 

అమెరికా తెలుగు సంఘం (ఆటా) నూతన అధ్యక్షుడిగా సుధాకర్ పెర్కారి ఎన్నికయ్యారు. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం అమెరికాలోని నెవడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ నగరంలో వున్న వెనీషియన్ హోటల్లో జరిగింది. ఆటా బోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతోపాటు లాస్‌వేగాస్, కాలిఫోర్నియాలలో నివసిస్తున్న తెలుగువారిలో దాదాపు 200 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. పూర్వ అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం నూతన అధ్యక్ష బాధ్యతలను సుధాకర్ పెర్కారికి అప్పగించారు. సుధాకర్ పెర్కారితోపాటు కొత్తగా ఎన్నికైన ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ సందర్బంగా బాధ్యతలు స్వీకరించారు. కరుణాకర్ అసిరెడ్డి, అరవింద్ ముప్పిడి, శ్రీరాంరెడ్డి, నరేందర్ చీమర్ల, రవి పట్లోల్ల, అజయ్ ఆలేటి, లోకేష్ అనంతుల, శ్రీధర్ బాణాల, పరమేష్ భీంరెడ్డి, శ్రీనివాస్ దర్గుల, వినోద్ కుకునూర్, హరి లింగాల, వేణుగోపాల్ సంకినేని నూతన సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;