RELATED NEWS
NEWS
అర్చన వైద్యానికి నాట్స్ చేయూత

చేయి చేయి కలపాలి. చేయూత ఇవ్వడానికి ముందడుగు వేయాలి.. దేశమేదైనా... స్పందించే మనస్సు ఉండాలి. ఇక దేశం కాని దేశంలో మన వాళ్లు ఆపదలో ఉంటే మరింత దయాహృదయంతో స్పందించాలి.. ఇలానే స్పందించిన అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్. తాను స్పందించడమే కాదు... హృదయమున్న ప్రతి ఒక్క తెలుగువారు స్పందించేలా చేసింది. రోడ్డు ప్రమాదంలో తోబుట్టువును కోల్పోయి, ఆశక్తురాలిగా మారిన అర్చనకు నాట్స్ అండగా నిలిచింది, ఆమె కుటుంబానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్న నాట్స్ సంబరాల్లో మాటలను.... చేతల్లో చేసింది... అమెరికాలో అర్చన అపర్ణలకు జరిగిన ప్రమాదం దాని వల్ల ఆ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని నాట్స్ సంబరాల్లో ఎందరో అమెరికాలో ఉంటున్న తెలుగువారి ముందుంచింది.. అప్పుడే చాలా మంది దాదాపు 45 వేల డాలర్లు సాయం చేస్తామని హామీ ఇచ్చారు, ఆ హామీని నెరవేర్చే బాధ్యతలను భుజానికెత్తుకున్న నాట్స్ దాతలు, మనసున్న మారాజుల నుంచి విరాళాలు సేకరించింది.

 

చేయి చేయి కలపాలి. చేయూత ఇవ్వడానికి ముందడుగు వేయాలి.. దేశమేదైనా... స్పందించే మనస్సు ఉండాలి.

ఇప్పటివరకు 31 వేల డాలర్లు సేకరించి అర్చన కుటుంబానికి అందిచింది, తాజాగా మరో 6820 డాలర్లు విరాళాలు సేకరించి దానికి సంబంధించిన చెక్కును అర్చన కుటుంబానికి ఇచ్చింది.. ఆర్థిక సాయమే కాకుండా. అర్చన కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు నాట్స్ వారి ఇంటికి వెళ్లి.. చెక్కు అందించి.. వారికి భరోసా ఇచ్చింది. అర్చన కుటుంబానికి తమ మద్దతు సహకారం ఎప్పుడు ఉంటుందని నాట్స్ ప్రతినిధి కొర్రపాటి అన్నారు. ఇంకా ఎవరైనా, సహాయం చేయదలచినవారు. www.natsworld.org కి లాగిన్ అయ్యి, తమవంతు సహాయం చేయవలసిందిగా కోరారు. న్యూ జెర్సీ నాట్స్ కార్యవర్గ సభ్యుల బృందం అర్చన ఇంటికి వెళ్లి మనోధైర్యాన్ని కల్పించింది.

చేయి చేయి కలపాలి. చేయూత ఇవ్వడానికి ముందడుగు వేయాలి.. దేశమేదైనా... స్పందించే మనస్సు ఉండాలి.

 

ఈ బృందంలో మధు కొర్రపాటి, గంగాధర్ దేసు, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీధర్ అప్పసాని, విమల్ కావూరు, శ్రీనివాస్ మద్దాలి, రాజ్ అల్లాడ, వేణు పాల్యం, మురళీ కృష్ణ మేడిచెర్ల, రంజిత్ చాగంటి, విష్ణు ఆలూరు, శ్రీహరి మందాడి, NRC నాయుడు, మూర్తి గులివెందుల, రామస్వామి, సాంబయ్య కోటపాటి, హరి బుంగతావుల, చైతన్య పెద్దు తదితరులు ఉన్నారు, అర్చన సోదరుడికి HI వీసా రాగానే, ఇక్కడ కాని, ఇండియాలో కాని, ఉద్యోగ ప్రయత్నానికి కూడా సహాయ పడతామని హామీ ఇచ్చారు. ఈ నెల 10 న అర్చన చదువుకొన్న కాలేజీలో పట్టా తీసుకోవటానికి తను చదువుకున్న ముర్రే స్టేట్ యూనివర్సిటీ, ముర్రే, KY యాజమాన్యం నించి పిలుపు వచ్చింది. అర్చన అపర్ణల పేరు మీదుగా ప్రతీ ఏటా, అవార్డు కూడా ప్రదానం చేయనున్నట్టు కళాశాల యాజమాన్యం తెలిపింది. నాట్స్ ప్రతినిధుల సమక్షంలోనే అర్చన తన బర్త్ డే కేక్ కట్ చేశారు. అర్చన త్వరలో కోలుకోవాలని నాట్స్ ప్రతినిధులు ఆకాంక్షించారు.. నాట్స్ తమకు ఎంతో అండగా నిలుస్తోందని అర్చన తల్లిదండ్రులు నాట్స్ ప్రెసిడెంట్ రవి మాదాల ఇతర కార్యవర్గ సభ్యులకు తమ కృతజ్ఞతలు తేలియజేశారు.

చేయి చేయి కలపాలి. చేయూత ఇవ్వడానికి ముందడుగు వేయాలి.. దేశమేదైనా... స్పందించే మనస్సు ఉండాలి.

https://picasaweb.google.com/110795728518157232056/NATS_Archana?locked=true&feat=email

TeluguOne For Your Business
About TeluguOne
;