RELATED NEWS
NEWS
ఓర్లాండోలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

 

 

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఓర్లాండోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ టోర్నమెంట్ క్రీడా స్ఫూర్తిని రగిలించింది. మొత్తం పద్దెనిమిది టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీ పడ్డాయి. ఒర్లాండోలో ఉండే తెలుగువారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటి ప్రతినిధి సాయి ఎర్రాప్రగడ ఈ పోటీల్లో పాల్గొనే టీంలను ఆహ్వనించారు.ఈ క్రికెట్ పోటీలకు సదరన్ రియాల్టీ ఎంటర్ ప్రైజస్ కు చెందిన ఇంద్రసేన్ కాశీరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

 


 

 

 ప్రసాద్ కాశీ రెండు బాల్స్ వేసి లాంఛనంగా ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. 18 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి.. ఈ  18 టీంలను ఎ గ్రూపు, బీ గ్రూపుగా విభజించారు. ఎ,బీ టీంల మధ్య హోరా హోరీగా సమరం జరిగింది. వాటిలో నుంచి  యుసీఎఫ్ ఈగల్స్, సచ్ ఇండియన్స్, యుసీఎఫ్ నైట్ మేర్స్, లేక్ నోనా లయన్స్ జట్టులు సెమీ ఫైనల్ కు చేరాయి. వీటిలో యుసీఎఫ్ ఈగల్స్,  లేక్ నోనా లయన్స్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో  సచ్ ఇండియన్స్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండో సెమీ ఫైనల్.. యుసీఎఫ్ నైట్ మేర్స్ కు సచ్ ఇండియన్స్ కు మధ్య జరిగింది.


భారీ సిక్సులు, ఫోర్లతో  సచ్ ఇండియన్స్ విజయం సాధించి ఫైనల్ కు చేరింది. యుసీఎఫ్ ఈగల్స్ కు, సచ్ ఇండియన్స్ కు జరిగిన ఫైనల్  హోరా హోరీగా జరిగింది. ఇందులో యుసీఎఫ్ ఈగల్స్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. బెస్ట్ బాలర్ అవార్డును సచ్ ఇండియన్స్ కు చెందిన రాజేష్ ను వరించింది.   బెస్ట్ బ్యాట్స్ మెన్  అవార్డును యుసీఎఫ్ నైట్ మేర్స్ టీం కు చెందిన మిలన్ జాన్ కు దక్కింది. టోర్నమెంట్ అనంతరం నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి సాయి ఎర్రాప్రగడ వివరించారు..ఈ టోర్నమెంట్ లో సేవలందించిన ఎంఫైర్లకు, వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానికంగా తెలుగు కమ్యూనిటీ నాయకులు డాక్టర్ శాంతారామ్ నల్లంశెట్టి, శ్రీనివాసరావు కటకం లాంటి వారి చేతుల మీదుగా ఆటగాళ్లకు బహుమతులు పంపిణి చేశారు. నాట్స్ క్రికెట్ కప్ 2014 విజేతలు రన్నరప్ , బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కు అవార్డులను మెల్ బోర్న్, ఫ్లోరిడా కు చెందిన డా. వాసుదేవ్ నలిపిరెడ్డి స్పాన్సర్ చేశారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను  సత్య మంతెన ప్రశంసించారు. ఈ టోర్నమెంట్ లో విజయానికి తమ వంతు సాయం అందించిన ప్రసాద్ కాశీ , మన్మోహన్ పులియల, రాజేష్ కేశినేని తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.

TeluguOne For Your Business
About TeluguOne
;