RELATED NEWS
NEWS
నాట్స్ సేవలకు ముగ్ధుడైన చంద్రబాబు

 

నాట్స్ సేవలకు ముగ్ధుడైన చంద్రబాబు


నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ చంద్రబాబు తో భేటీ

పవన్ కుమార్ రెడ్డి సింగన కు చంద్రబాబు చేతుల మీదుగా రూ.10,60,000,00 చెక్ ప్రదానం

 

 

భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ప్రారంభమైన NATS పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని ఆనతి కాలం లోనే అమెరికా లో నే కాకుండా స్వదేశం లో కూడా విశేష ఆదరణ చూరగొంది. ఈ సేవా కార్యక్రమాలలో భాగంగానే నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ ఉభయ తెలుగు రాష్ట్రాల పర్యటన లో భాగంగా ఆదివారం, కడప జిల్లా, కొండూరు గ్రామానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి సింగన కి సహాయం అందచేయటానికి విజయవాడకు  విచ్చేశారు.

 

మాడిసన్, విస్కాన్సిన్ లో కడప జిల్లా కొండూరు గ్రామ వాసి, పవన్ కుమార్ రెడ్డి సింగన (31సం.)  ఫిబ్రవరి 3, 2016 న ఉదయం ఆఫీసు కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదంలో గాయపడి, కుడి కంటిని పోగొట్టుకొని, మెదడు లో కొంత ప్రాంతం కూడా తొలగించబడింది. ఎడమ చేయి, ఎడమ కాలు అచేతన స్థితి లో ఉన్నాయి. అనతరం, ప్రస్తుతం హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో కోమా లో ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి గౌ. శ్రీ. నారా చంద్ర బాబు గారి చేతుల మీదుగా, వారి కుటంబ సభ్యులైన పవన్ కుమార్ మేనమామ బి.వి.సుబ్బారెడ్డి, తండ్రి నాగిరెడ్డి లకు పది లక్షల,అరవై వేల  రూపాయల (Rs.10,60,000.00) చెక్ ను అందచేసారు. పవన్ కుమార్ రెడ్డి త్వరలో కోలుకోవాలని ఆశాభావం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖామాత్యులు శ్రీ. అచ్చన్నాయుడు, GLOW కార్యదర్శి శ్రీ. యార్లగడ్డ వెంకన్న చౌదరి (V.C), నాట్స్ ప్రెసిడెంట్  శ్రీ మోహన కృష్ణ మన్నవ   , నాట్స్ ఇండియా ప్రతినిధి శ్రీ. రతీష్ కుమార్ తదితరులు విచ్చేశారు.

 


 నాట్స్ చేసే సేవా కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  నాట్స్ ప్రెసిడెంట్ శ్రీ. మోహన కృష్ణ మన్నవ చంద్రబాబుకి  వివరించారు . చంద్రబాబు చాల ఆసక్తి గా వివరాలు అడిగి మరీ  తెలుసుకున్నారు. .నాట్స్ చేస్తున్న కార్యక్రమాలని చంద్రబాబు అభినందించారు. మోహన కృష్ణ మన్నవ మాట్లాడుతూ, నాట్స్ చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. అటు అమెరికా లోనే కాకుండా, జన్మభూమి పైకూడా తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నామని, అందులో భాగంగా, విశాఖపట్టణం, శ్రీకాకుళం, అనంతపురం, గుంటూరు లలో పాఠశాలలదత్తత కార్యక్రమం, ఇండియా నించి అమెరికా కు వచ్చే ఉన్నత చదువులకి వచ్చే విద్యార్థులకి రాష్ట్రవ్యాప్తంగా అవగాహనా సదస్సులు,

ప్రత్యేకంగాఉద్యోగ ఆధారిత నైపుణ్య అభివృద్ధి కి  శిక్షణ, గ్రామీణ విద్యార్ధుల కోసం వ్రుత్తి విద్యా నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించబోతోందని ప్రకటించారు.  మరుగు దొడ్లు, ఇంకుడు గుంతల తవ్వకం వాటిపై కూడా నాట్స్ ద్రుష్టి సారించిందని, వాటిపై ఈ సంవత్సరం నుంచే అమలు చేయాలని సంకల్పించిందని ప్రకటించారు. అమెరికా లో 24 * 7 హెల్ప్ లైన్ ని (1-888 483 5848 ) ప్రారంభించిన మొట్టమొదటి   ఇండియన్ ఆర్గనైజేషన్ నాట్స్ అని మోహన కృష్ణ తెలిపారు.

 

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గౌ. శ్రీ. నారా చంద్ర బాబు నాయుడు మాట్లాడుతూ నాట్స్ చేస్తున్న పలు సేవా,  దాతృత్వ కార్యక్రమాలని ప్రత్యేకంగా అభినందించారు. పవన్ కుమార్ రెడ్డి కి వైద్య ఖర్చుల నిమ్మిత్తం 5లక్షల రూపాయలు  విరాళం కూడా  ప్రకటించారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, దానికి తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. ప్రతీ NRI జన్మ భూమి అభివృద్దికి పాటుపడాలని, తెలుగు వారంతా ఒక్కటై ఆంద్రరాష్ట్ర పునఃనిర్మాణం లో భాగాస్వామ్యులవ్వాలని పిలుపు నిచ్చారు.

నాట్స్ చేస్తున్న ఇలాంటి సేవ కార్యక్రమాలకి ఎంతో చేయిత నిస్తున్న గ్లో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరి గారికి నాట్స్ ప్రెసిడెంట్ శ్రీ. మోహన కృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;