RELATED NEWS
NEWS
కాన్సస్ నగరంలో మనోహరంగా జరిగిన ETV స్వరాభిషేకం

కాన్సస్ నగరంలో మనోహరంగా జరిగిన ETV స్వరాభిషేకం ! స్థానిక తెలుగువారికి మరింత చేరువగా నాట్స్ కాన్సస్ చాప్టర్ ప్రారంభం !!

నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ETV స్వరాభిషేకం సంగీత విభావరి మనోహరమైన గేయాలతో వీనులవిందు చేస్తూ అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం ఆగస్టు 23 న స్థానిక షానీమిషన్ నార్త్ వెస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమానికి వెల్లువెత్తిన ప్రవాస తెలుగువారిని చూస్తే, సంగీతానికి ఉన్న అనిర్వచనీయమైన శక్తి ఏమిటో అర్థమవుతుంది. దాదాపు వెయ్యి మంది పైగా ఆహుతుల మధ్య ఈ స్వరాభిషేకం కార్యక్రమం కాన్సస్ రాష్ట్రంలోనే అత్యంత జనాదరణ పొందిన తెలుగు సంగీత విభావరిగా నిలచింది. ముఖ్యంగా బాలుగారు స్వయంగా పాటలను పాడి తరువాత విశ్లేషిస్తూ, తన గత స్మృతులను సభకు విచ్చేసిన అందరితో పంచుకోవడం అంటే నిజంగా అది ఒక మధురానిభూతి.

ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు (మనో), సునీత, ఎస్పీ చరణ్, గీతామాధురి, శ్రావణభార్గవి, మాళవిక, హేమ చంద్ర, శృతి, హారిక తదితరులు 80 సంవత్సరాల తెలుగు సినిమా ప్రస్థానంలో ఆణిముత్యాల్లాంటి శ్రావ్యమైన పాటలను  తమ సుమధుర గాత్రంలో ఆలపించి కాన్సస్ నగర తెలుగు వారిని మంత్రముగ్ధుల్ని చేశారు.  గాయని సునీత వ్యాఖ్యానంలో ఆద్యంతం సుస్వరాల సంగీత జల్లులతో దాదాపు మూడు గంటల పాటు తెలుగు పాటల లోకంలో  వెల్లువెత్తిన సంగీత ప్రవాహం తెలుగువారిని తన్మయత్వంలో ముంచెత్తింది.



 

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీత ప్రియుల హృదయాలను దోచుకుంటున్న ETV స్వరాభిషేకం కార్యక్రమాన్ని కాన్సస్ నగర పరిసరప్రాంతాల తెలుగు వారి కోసం నాట్స్ ప్రత్యేకంగా సమర్పించింది.  ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శ్రీనివాస్ కోనేరు, నేషనల్ ఫండ్ రైజింగ్ డైరెక్టర్ వెంకట్ కొల్లి,  సెయింట్ లూయీస్ ప్రతినిధి బృంద సభ్యులు నేషనల్ జాయింట్ ట్రెజరర్ శ్రీనివాస్ మంచికలపూడి, శివకృష్ణ మామిళ్ళపల్లి  తదితరులు పాల్గొన్నారు. భాషే రమ్యం, సేవే గమ్యంగా అమెరికాలో తెలుగు జాతి ఐక్యత,తెలుగు భాష, సంస్కృతి కోసం నాట్స్ అహర్నిశలు చేస్తున్న  కృషి ని వివరిస్తూ నాట్స్ చేసిన పలు సేవా కార్యక్రమాల గురించి రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కోనేరు సవివరంగా సభికులకు తెలియచేసారు.



 

ఈ సేవలు స్థానిక తెలుగు వారికి మరింత చేరువయ్యేలా కాన్సస్ నగర చాప్టర్ ను ప్రారంభిస్తున్నట్లు ఆహుతుల హర్షధ్వానాల మధ్య శ్రీనివాస్ మంచికలపూడి  ప్రకటించారు. కాన్సస్ సమన్వయకర్త రవి గుమ్మడిపూడి నాట్స్ సేవా బృందాన్ని సభికులకు పరిచయంచేశారు . ఈ కార్యక్రమంలో రవి ఆయసోల,  ప్రకాష్ నారాయణ్, వెంకట్ మంత్రి, రాజ గోపాలుని, సురేందర్ మందుల  ప్రభ్రుతులు, నాట్స్ విద్యార్థి సేవాదళం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాట్స్ కార్యక్రమాలకు మద్దతుగా స్థానిక భారతీయ సంఘాల ప్రతినిధులు మేము సైతమంటూ ముందుకొచ్చారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ రవి గుమ్మడిపూడి ధన్యవాదాలు తెలియచేశారు.



 

TeluguOne For Your Business
About TeluguOne
;