RELATED NEWS
NEWS
NATS Starts Helpline For New Jersey Fire Victims

న్యూ జెర్సీ: అమెరికాలోని న్యూజెర్సీ  ఆవేనెల్ లో భారీ అగ్నిప్రమాదం సంభ‌వించింది. వుడ్ బ్రిడ్జి విలేజి అపార్టమెంటులో జ‌రిగిన ఈ  ప్రమాదంలో ప్రాణ‌న‌ష్టం ఏమీ జ‌ర‌గ‌కున్ననూ భారీగా ఆస్తి న‌ష్టం జ‌రిగింది. తెలుగువారు  అధికంగా నివ‌సించే ఈ అపార్ట్ మెంటులో ఎన్నో విలువైన వ‌స్తువులు  అగ్నికి అహుత‌య్యాయి. పాస్ పోర్ట్ లు,  వీసాలు, గ్రీన్ కార్డులతో  ప్ర భుత్వ ధృవీక‌ర‌ణ పత్రాలెన్నో బూడిద‌గా  మారాయి. తెలుగువారికి సంబంధించిన  అనేక డ్యాకుమెంట్లు, ప‌త్రాలు, ఎడ్యుకేష‌న్ స‌ర్ట‌టి పికెట్లు, నిత్యావ‌స‌రాలు, బంగారు ఆభ‌ర‌ణాలు సైతం మంట‌ల్లో  కాలిపోయాయి.

 

new jersey fire accident, nata helpline for nj fire victims, nata helpline nj fire, nj fire victims nata helpline, nj fire victims speaker manohar, speaker manohar help to nj fire victims, nata helpline contact numbers, nata contact numbersరంగంలోకి  దిగిన    నాట్స్  టీమ్ - బాధితుల‌కు  భ‌రోసా ఇస్తున్న  నాట్స్

అమెరికాలో తెలుగు వారికి అండ‌గా ఉండే నాట్స్  అగ్ని ప్రమాద సంఘ‌టన తెలియ‌గానే వెంట‌నే  అక్కడ‌కు చేరుకుంది. తెలుగువారికిభ‌రోసా ఇచ్చే ప్రయ‌త్నం చేసింది. అగ్నిప్రమాద బాధితుల‌కు ఆహ‌రం అందించ‌డంతో పాటు తాత్కలికంగా వ‌స‌తి ఏర్పాట్లు  చేస్తోంది. బాధిత కుటుంబాల‌కు అండ‌గా  ఉన్నామంటూ భ‌రోసా క‌ల్పించింది. బాధితులు కోల్పోయిన ధృవ‌ప‌త్రాల‌ను తిరిగిపొందేందుకు  తమ వంతు సాయం చేస్తామ‌ని తెలిపింది.. నాట్స్  హెల్ఫ్ లైన్ ద్వారా  ఎప్పటిక‌ప్పుడు సాయం అందించేందుకు నాట్స్ అన్ని  ఏర్పాట్లు చేసింది. నాట్స్  ప్రత్యేకంగా ఓ టీమ్ ను అక్కడే  పెట్టి బాధితుల‌కు అండ‌గా నిలుస్తోంది. నాట్స్  ప్రెసిడెంట్ రవి మాదాల ఈఘటనకు గురైన వారికి  తీవ్ర సానుభూతి ని తెలియచేసారు. తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి నాట్స్ చేయగలిగిన సాయం చేస్తుందని చెప్పారు. స్థానికంగా అందుబాటులో వున్న నాట్స్ టీం నుండి జాయింట్  సెక్రటరీ మోహన కృష్ణ మన్నవ, మీడియా కో ఆర్డినేటర్ మురళీకృష్ణ మేడిచెర్ల, హెల్ప్ లైన్ టీం సభ్యలు రంజిత్ చాగంటి,లీలాకృష్ణ కనికిచెర్ల  మరియు ఇతర సభ్యులు హుటాహుటిన  ప్రమాద స్థలానికి వచ్చి తమ వంతు  స్వ చ్చంధంగా సేవ‌లు అందించటానికి నడుం బిగించారు.
                          
ప్రవాసాంధ్రులకు అండ‌గా మేమున్నాం, స‌ర్టిపికెట్లు అన్ని ఇప్పిస్తాం: స్పీక‌ర్ మ‌నోహ‌ర్

అగ్ని ప్రమాద బాధితుల‌కు  ఆంధ్ర ప్రదేశ్ స్పీక‌ర్  నాదెండ్ల  మనోహర్. త‌న ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు..బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. కాలిపోయిన వీసాలు, ఇత‌ర ధృవ‌ప‌త్రాల విష‌యం అమెరికా అధికారుల‌తో కూడా చర్చించి వాటిని మ‌ళ్లీ  ఇప్పించే  ప్ర య‌త్నం
చేస్తామన్నారు. మ‌న రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున ఇచ్చిన ధృవ‌ప‌త్రాలు, ఎడ్యుకేష‌న్  డ్యాకుమెంట్లు అన్ని తిరిగి వ‌చ్చేలా చేస్తామ‌ని  హ‌మీ ఇచ్చారు. బాధితులు తాము  ప్రమాదంలో కోల్పోయిన  డాక్యు మెంట్ల వివ‌రాల‌ను  ఈ కింది  మెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయ‌గ‌ల‌రు.
fire.victims@natsworld.org

 

new jersey fire accident, nata helpline for nj fire victims, nata helpline nj fire, nj fire victims nata helpline, nj fire victims speaker manohar, speaker manohar help to nj fire victims, nata helpline contact numbers, nata contact numbersరండి.. మాన‌వ‌త్వంతో ఆదుకుందాం.. నాట్స్

నాట్స్ హెల్ఫ్ లైన్ ఇప్పటికే  రంగంలోకి దిగి. అమెరికా అధికారుల‌తో చ‌ర్చలు జ‌రుపుతోంది. డ్యాకు మెంట్లు  ఎలా తిరిగి ఇప్పించాల‌నే దానిపై అమెరికా పోలీసుల‌తో కూడా స‌మావేశ‌మైంది. అటు మ‌న రాష్ట ప్రభుత్వ స‌హ‌కారం  కూడా తీసుకుంటుంది. బాధితుల కోసం హెల్ఫ్ లైన్ ద్వారా విరాళాలు సేక‌రిస్తోంది.. స‌ర్వం  కోల్పోయిన  సాటి తెలుగువారిని ఆదుకునేందుకు ప్రవాసాంధ్రఉలు ముందుకు  రావాలని పిలుపు నిస్తోంది.

నాట్స్ నిర్వహిస్తున్న ఉచిత మెడికల్ కాంప్ ని సంప్రదించవలసిన చిరునామా 400 State St, Perth Amboy, NJ, 08861. ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించబడు తేది 07/15/2012.
ఉచిత ట్రీట్మెంట్ కావలిసినవారు సంప్రదించవలసిన నంబరు: 732-735-NATS లేదా  natsclinic@gmail.com ఈమెయిలు ద్వారా సంప్రదించవచ్చు.

నాట్స్ డైరెక్టర్ డా.మధు కొర్రపాటి, మోహన కృష్ణ మన్నవ భారత దౌత్యవేత్త కార్యాలయం తో సంప్రదించి  భాదితులు కోల్పోయిన ధ్రువ పత్రాలు, పాస్పోర్ట్ తదితర అధికారిక పత్రాలను తిరిగి అందచేయటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసారు. స్థానిక అధికారులతో సంప్రదించి - వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, SSNs మరియు ఇతర అధికారిక పత్రాలు తిరిగి అందచేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

TeluguOne For Your Business
About TeluguOne
;