RELATED NEWS
NEWS
జొన్నవిత్తులను సన్మానించనున్న సియాటెల్ నాట్స్ చాఫ్టర్

ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఘనంగా సన్మానించనుంది.. బుధవారం అమెరికాలోని సియాటెల్ వేదికగా జొన్నవిత్తులకు ఘన సన్మానం జరగనుంది. జొన్నవిత్తులతో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమానికి సియాటెల్ నాట్స్ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. తియ్యటి తెలుగు పాటలను అందించిన గేయ రచయిత తెలుగులోని మాధుర్యాన్ని ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. అందరితో తన అనుభవాలను పంచుకోనున్నారు. తెలుగు ప్రముఖులను గౌరవించడంతో.. సత్కరించడంలో ఎప్పుడు ముందుండే నాట్స్ జొన్నవిత్తుల సన్మానానికి సన్నాహాలు చేస్తోంది. సియాటెల్ లో ఉండే తెలుగువారందరూ ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాలని నాట్స్ కోరుతోంది.

 

TeluguOne For Your Business
About TeluguOne
;