NEWS
లండన్‌లో ‘తాల్’ సంక్రాంతి వేడుకలు

 

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దక్షిణ లండన్‌లోని బ్రోమ్లేలో జరిగిన ఈ వేడుకలలో బ్రిటన్‌లో నివసిస్తున్న అనేకమంది తెలుగువారు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలలో భాగంగా జరిపిన బొమ్మల కొలువులు, ముగ్గుల పోటీలలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న లావణ్య కవర్తపు, సునీల్ గంధం, ఆషా పెద్దు, వేణు, ప్రవీణ్, అరుణ్, భాను, నవీన్, సుందరం, భారతి, వందన, సునీల తదితరులను తాల్ ఛైర్మన్ ధర్మవతి నిష్టల అభినందించారు. ఈ సందర్భంగా ధర్మవతి నిష్టల మాట్లాడుతూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ దశమ వార్షిక ఉగాది వేడుకలను లండన్‌లో నిర్వహించనున్నామని ప్రకటించారు. ఈ వేడుకలలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ‘తాల్’ చేపడుతున్న కార్యక్రమాలను ట్రస్టీ వంశీ మోహన్ వివరించారు. ‘తాల్’ సంక్రాంతి వేడుకలలో బ్రోమ్లే నగర మేయర్ జులియన్ బెన్నింగ్‌టన్, ఆయన భార్య వలేరి బెన్నింగ్‌టన్ పాల్గొన్నారు.


TeluguOne For Your Business
About TeluguOne
;