English | Telugu

'భీష్మ' థాంక్స్ మీట్‌కు మెగా హీరో!

నితిన్ టైటిల్ రోల్ చేసిన 'భీష్మ' సూపర్ హిట్ రేంజిలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైజాగ్‌లో ఫిబ్రవరి 29న థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. దీనికి చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ హాజరవుతుండటం గమనార్హం. వైజాగ్‌లోని సిరిపురంలో ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 29 సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు.

తాప్సి మొగుడిని కొట్టిందిగా...

అవును... తాప్సి మొగుడిని కొట్టింది. అయితే... అది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! రియల్ లైఫ్‌లో ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కదా! తెలుగులో గోపీచంద్ సరసన తాప్సి నటించిన సినిమాల్లో 'మొగుడు' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తుందా? ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోతే యుట్యూబ్‌కి వెళితే, అందులో సినిమా ఉంది. చూడండి. పెళ్లి తర్వాత అమ్మాయి అప్పగింతల సీన్ అది. 

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం ప్రయాణం..!

నలుగురు అపరిచితులు.. 3,450 కిలోమీటర్ల దూరం ప్రయాణం.. వాళ్ల ప్రయాణం దేనికోసం.. ఆ ప్రయాణంలో వాళ్లు ఎదుర్కొన్న అనుభవాలేమిటి?.. ఈ కాన్సెప్టుతో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా ఒక చిత్రాన్ని ప్రారంభించారు నిర్మాత జి. మహేష్. నలుగురు అపరిచితులుగా సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, ఇంద్రజ, ప్రియ వడ్లమాని నటిస్తున్నారు.

పవన్‌తోనా... రూమరే!

పవన్ కళ్యాణ్ పక్కన కథానాయిక ఎవరు? ఈ ప్రశ్న పై అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ఒకటికి రెండు సినిమాలలో పవన్ పక్కన కథానాయికలను ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం పవన్ రెండు సినిమాలు చేస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో

ప్రియ పోయే... పూర్ణ వచ్చే!

ప్రియ అంటే ప్రియమణి! ఆమె నటించాల్సిన పాత్ర ఇప్పుడు పూర్ణ దగ్గరకు వచ్చింది! తెలుగులో 'నువ్విలా నేనిలా', 'అవును' చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూర్ణ గుర్తుందా? ఇప్పుడు రియాలిటీ షోలో జడ్జిగా చేస్తోంది. ఆ పూర్ణ!! అఫ్ కోర్స్... ప్రియమణి కూడా అదే షోలో జడ్జిగా చేస్తున్నారు.

వెండితెరపై నటిగా లక్ష్మీపార్వతి!

దివంగత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి తొలిసారి వెండితెరపై కనిపించబోతున్నారు. 'రాధాకృష్ణ' అనే మూవీలో ఆమె ఒక కీలక పాత్ర చేస్తున్నారు. కనుమరుగు అవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో, పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక ప్రేమకథను తెరకెక్కిస్తూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ప్రసాద్ వర్మ.

బిగ్ స్టోరీ: టాలీవుడ్‌లో కొత్త జంటల సందడి

తొలినాళ్ల నుంచీ తెలుగు సినిమా తెరపై ఎన్నో జంటలు ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ వస్తున్నాయి. స్క్రీన్‌పై వాళ్ల కెమిస్ట్రీ, వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ చూసి జనం అబ్బురపడుతూ వస్తున్నారు. హీరో హీరోయిన్లు విడిపోయిన సీన్లు వస్తే మనం చాలా బాధపడతాం. చివరలోనైనా ఆ ఇద్దరూ కలుసుకోవాలని కోరుకుంటాం. ఎప్పుడైనా ఆ ఇద్దరిలో ఒకరు చనిపోవడమో, లేక ఇద్దరూ చనిపోవడమో జరిగితే మన గుండెలు ఆగిపోయినంత పనవుతుంది.

'భక్త కన్నప్ప' కోసం మంచు విష్ణు రూ. 60 కోట్ల బడ్జెట్!

బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు.

టైటిలే కాదు... చైతు క్యారెక్టరూ పాత పద్ధతిలోనే?

పరశురామ్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా రూపొందనున్న చిత్రానికి లెజెండరీ యాక్టర్, చైతు తాతయ్య 'నాగేశ్వరరావు' టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అఫ్‌కోర్స్... ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదనుకోండి. ప్రజెంట్ జనరేషన్ లో ఎక్కువగా ఎవరూ 'నాగేశ్వరరావు' లాంటి పేర్లు పెట్టుకోవడం లేదు. ఓల్డ్ ఫీల్ ఉంటుందని. అటువంటి టైటిల్ సినిమాకు పెట్టాడు పరశురామ్.

'కెజిఎఫ్' హీరోపై క్రికెటర్ పైచేయి

ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి ఏడాది 'మోస్ట్ డిజైరబుల్ మెన్' పేరుతో ఏ నగరానికి ఆ నగరంలో సర్వే చేస్తుంటుంది. మహిళలకు మరో సర్వే చేస్తుందనుకోండి. ప్రతి ఏడాది టైమ్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసే రిజల్ట్స్ కోసం కొంతమంది ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. 'బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2019' రిజల్ట్స్ 'కెజిఎఫ్' హీరో యష్ అభిమానులకు షాక్ ఇచ్చాయి.

హోమో సెక్సువల్ సినిమాపై అరబ్ దేశాల్లో బ్యాన్

హిందీ హీరో ఆయుష్మాన్ ఖురానా, నటుడు జితేంద్ర కుమార్ జంటగా నటించిన బాలీవుడ్ సినిమా 'శుభ్ మంగళ్ జ్యాదా సావదాన్'. ఇద్దరు మగాళ్ళు జంటగా నటించిన సినిమా అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే... ఇదొక గే ఎంటర్ టైనర్. ఇద్దరు అబ్బాయిల ప్రేమ కథతో రూపొందిన సినిమా.

అందుకు 'నో' అంటున్న రకుల్

"బరువు తగ్గమంటే తగ్గుతాను. నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ, బరువు పెరగడం అని చెబితే అస్సలు పెరగను" అని రకుల్ ప్రీత్ సింగ్ చెబుతున్నారు. ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే బరువు తగ్గడానికి 'ఎస్' అంటున్న ఈమె.... బరువు పెరగడానికి మాత్రం నో అంటున్నారు....

న్యూడిటీ... నయా ఫ్యాషన్!

అందాల భామలు అంగాంగ ప్రదర్శన చేస్తుంటే అందంగా కెమెరాలో బంధించడమే సెలబ్రిటీ ఫొటోగ్రఫీగా మారిన రోజులు ఇవి. కింగ్ ఫిషర్ క్యాలెండర్ కోసం పలువురు భామలు బికినీల్లో ఫొటోలు దిగారు. ఫేమస్ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని మరో అడుగు ముందుకు వేశారు.

చిరంజీవి ఔట్.. ప్రభాస్ ఇన్!

ప్రస్తుతం 'ఓ డియర్' మూవీ చేస్తోన్న ప్రభాస్, దాని తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ప్రకటించారు. రెండే రెండు సినిమాలు.. 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి'లతో నాగ్ అశ్విన్ కీర్తి ప్రతిష్ఠలు దేశవ్యాప్తమయ్యాయి.

చిరంజీవి 152లో 'మహర్షి' జోడి?

చిరంజీవి 152వ సినిమా షూటింగ్ మాంచి స్పీడు మీద వుంది. మెగాస్టార్ మీద తీయాల్సిన సన్నివేశాలను దర్శకుడు కొరటాల శివ చకచకా తీస్తున్నారు. మే నెలలోపు మెగాస్టార్ సీన్స్ కంప్లీట్ చేస్తే... తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మీద తీయాల్సిన సీన్లు చేసుకోవచ్చనేది

చిరంజీవి152కి మహేష్ డేట్స్ ఇచ్చేశాడు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152 సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. కథ, కథలో తన క్యారెక్టర్ ను మహేష్ ఆల్రెడీ విన్నారు. దర్శక, నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే...

నాగశౌర్యకు నితిన్ కౌంటర్ ఇచ్చేశాడుగా!

'భీష్మ' మూవీ సక్సెస్ మీట్‌లో యంగ్ హీరో నాగశౌర్యకు గట్టి చురకవేశాడు నితిన్. ఫిబ్రవరి 21న విడుదలైన 'భీష్మ' మూవీ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తూ, విడుదలైన ఐదో రోజే బ్రేకీవెన్ సాధించేసింది. ఆ క్రిడిట్ అంతా డైరెక్టర్ వెంకీ కుడుములదేనంటూ అంతా ప్రశంసిస్తున్నారు.

బిగ్ ఫైట్: 'ఆర్ఆర్ఆర్'ను టార్గెట్ చేస్తున్న 'ఆచార్య'!

యస్.యస్. రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్'కు ఇటు ప్రేక్షకుల్లో, అటు ట్రేడ్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. రాజమౌళి మునుపటి బ్లాక్‌బస్టర్ మూవీస్ 'బాహుబలి', 'బాహుబలి 2'లను చాలా వెనక్కి నెట్టేలా 'ఆర్ఆర్ఆర్' మూవీకి ప్రి బిజినెస్ జరిగింది. 'బాహుబలి 2' వంటి ఇండియన్ ఇండస్ట్రీ రికార్డ్స్ ఫిల్మ్ తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై అందరి దృష్టీ ఉండటం సహజం.

మెహరీన్‌... నిర్మాత గొడవలో కొత్త ట్విస్ట్‌

నాగశౌర్య కథ రాయడంతో పాటు హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’ విడుదలైంది. కొంతమంది ప్రేక్షకులను, ముఖ్యంగా థ్రిల్లర్స్‌ను ఇష్టపడేవాళ్లను ఆకట్టుకుంది. ఆల్రెడీ థియేటర్ల నుండి సినిమా వెళ్లింది. రీల్‌ లైఫ్‌లో నాగశౌర్యను ప్రేమించిన అమ్మాయిగా హీరోయిన్‌ మెహరీన్‌ కనిపించింది....

రవితేజ నుండి మరో రెట్రో సినిమా

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెట్రో జోనర్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. కథల్లో కొత్తదనం కోసం కాలంలో వెనక్కి వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న 'జాన్' 1980 నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమే. రవితేజ కూడా 1980 నేపథ్యంలో సాగే కథతో మరో సినిమా

మహేశ్ - వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయింది!

ఇది టాలీవుడ్‌లో లేటెస్టుగా చక్కర్లు కొడుతున్న గాసిప్! 'సరిలేరు నీకెవ్వరు' మూవీ షూటింగ్‌లో ఉండగానే 'మహర్షి' డైరెక్టర్ వంశీ పైడిపల్లితో మరో సినిమా చెయ్యడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. వంశీ చెప్పిన స్క్రిప్టు మహేశ్‌కు బాగా నచ్చిందనీ, అందుకే 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత మరోసారి వంశీతో కలిసి పనిచెయ్యాలని మహేశ్ నిర్ణయించుకున్నాడనేది మనకు తెలిసిన వార్త.

'భీష్మ' బాక్సాఫీస్: నితిన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్!

హ్యాట్రిక్ ఫ్లాపులతో కెరీర్‌లో క్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్న నితిన్.. ఎట్టకేలకు రిలీఫ్ ఫీలయ్యాడు. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'భీష్మ' ట్రేడ్ విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తూ తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి, అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అంతే కాదు, సంక్రాతి సినిమాలు 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' తర్వాత మంచి ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా కూడా నిలిచింది 'భీష్మ'.

అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!

'క్రాక్' టీజర్‌లోని "అప్పిగా.. సుబ్బిగా.. నువ్వు ఎవడైతే నాకేంట్రా నా టొప్పిగా!" డైలాగ్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్' మూవీలోంది. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ మహా శివరాత్రి సంద‌ర్భంగా శుక్రవారం సాయంత్రం యూట్యూబ్‌లో రిలీజైంది. 'డాన్ శీను', 'బలుపు' సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమా 'క్రాక్'.

ప్రెషర్ కుక్కర్ మూవీ రివ్యూ

పాటలు, ప్రచార చిత్రాలు 'ప్రెషర్ కుక్కర్' సినిమాకు బజ్ తీసుకొచ్చాయి. 'అమెరికా పొయ్యి నువ్వైతవుర లంగ' అంటూ రాహుల్ సిప్లిగంజ్ చేసిన ప్రమోషనల్ సాంగ్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. మరి, సినిమా ఎలా ఉంది?

విజయనిర్మల కాంస్యవిగ్రహాన్నిఆవిష్కరించిన సూప‌ర్ స్టార్

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలోఏర్పాటు చేసిన విజయనిర్మల  కాంస్య విగ్రహాన్ని...

జస్ట్ మిస్... కమల్ & కాజల్

నిజం నిలకడ మీద తెలుస్తుంది - పెద్దలు చెప్పిన మాట! సోషల్ మీడియా జమానాలో ఎవరికీ నిలకడ ఉండడం లేదు. నిలకడగా నిజం తెలిసేలోపు అబద్దాన్ని అందరికీ చెప్తున్నారు. ఆ తొందరే కొంపలు ముంచుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను చంపేస్తోంది. దర్శకుడు...

అల్లు అరవింద్‌పై వాళ్లు ఫైర్ అవుతున్నారు!

సంక్రాంతికి విడుదలైన 'అల.. వైకుంఠపురములో' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంత వసూలు చేసిందనే దానిపై కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యిందనే విషయంలో కాంట్రవర్సీ లేదు. ఈ మూవీన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణతో పాటు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామి.

విక్రమ్ పది రోజుల్లో డబ్బింగ్ చెప్తాడట

నాగచైతన్య, సమంత జంటగా నటించిన 'ఏమాయ చేసావె' విడుదలై నిన్నటికి (ఫిబ్రవరి 26కి) పదేళ్లు. ఇదే సినిమాను తమిళంలో శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయ' తీశాడు దర్శకుడు గౌతమ్ మీనన్. కాకపోతే క్లైమాక్స్ వేరుగా ఉంటుంది. నిజానికి..

రేణు దేశాయ్ దర్శకత్వంలో మ్యూజికల్ వీడియో

రేణు దేశాయ్ పేరు చెబితే ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు రైతు సమస్యలకు సంబంధించిన టీవీ కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ తో ముడిపెడుతూ రాసిన పుకార్లను ఖండిస్తూ వచ్చే వివరణలు... ఇవే గుర్తొస్తున్నాయి. గతంలో రేణు దేశాయ్ కథానాయికగా నటించారు...

మహేష్ చుట్టూ దర్శకుల చక్కర్లు

నిజమే... వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇదీ నిజమే... ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. అయితే......

'శ్యామ్ సింగరాయ్'గా నాని.. 2020లో మూడు సినిమాలు!

నాని పుట్టినరోజు సందర్భంగా అతను హీరోగా నటించనున్న 27వ సినిమా టైటిల్‌ను నిర్మాతలు సోమవారం ప్రకటించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్న ఆ మూవీ టైటిల్.. 'శ్యామ్ సింగరాయ్'. నాని పోషించనున్న క్యారెక్టర్ పేరునే సినిమా టైటిల్‌గా పెట్టినట్లు సమాచారం. 'భీష్మ' వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నది.

అల్లు అర్జున్ డబుల్ రోల్?

​అవును, ఇప్పుడు ఫిలింనగర్‌లో హాట్ హాట్‌గా ప్రచారంలోకి వచ్చిన వదంతి ఇదే. 'అల.. వైకుంఠపురములో' వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. బన్నీ ఇందులో..

విదేశాలు వెళ్ళనున్న మహేష్-పరశురామ్

ఒక విషయంలో స్పష్టత వచ్చింది... 'సరిలేరు నీకెవ్వరు' విజయం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా కంటే ముందు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి....

రానాతో ఒకటి.. గోపీచంద్‌తో ఒకటి!

దర్శకుడు తేజ శనివారం (ఫిబ్రవరి 22) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు.

పోలీసుల ముందుకు కమల్ హాసన్?

'భారతీయుడు 2' సెట్స్‌లో బుధవారం క్రేన్ కిందపడి ముగ్గురు మృతి చెందిన దుర్ఘటనలో కథానాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ను పోలీసులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. బుధవారం రాత్రి ప్రమాదం జరిగిన వెంటనే క్రేన్ ఆపరేటర్ రాజన్ అదృశ్యం అయ్యాడు. పోలీసులు శుక్రవారం అతడిని అరెస్ట్ చేశారు.

సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో తీసిన 'రెడ్‌' సాంగ్‌!

యూరప్‌లో చాలా ఎగ్జయిటింగ్‌ లొకేషన్‌ 'డొలమైట్స్'. ఇటలీకి చెందిన ఈ పర్వత తీరప్రాంతంలో చాలా హాలీవుడ్‌ సినిమాల షూటింగ్‌లు జరిగాయి. తాజాగా 'రెడ్‌' సినిమా షూటింగ్‌ ఇక్కడ జరిగింది. రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం 'రెడ్'. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్‌ నిర్మి స్తున్న ఈ చిత్రం కోసం రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ఆ రెండు పాటల్లో ఒకదాన్ని డోలమైట్స్‌లో షూట్‌ చేయడం విశేషం.

భీష్మ మూవీ రివ్యూ

నితిన్ హీరోగా నటించిన లాస్ట్ మూడు సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయినా... 'భీష్మ'పై క్రేజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా సినిమా ఉందా? దర్శకుడిగా తొలి సినిమా 'ఛలో'తో  హిట్ కొట్టిన వెంకీ కుడుముల ద్వితీయ విఘ్నం దాటాడా? రెండో సినిమాతో హిట్ అందుకున్నారు? రివ్యూ చదివి తెలుసుకోండి. 

చెన్నైలోని ఈవీపీ స్టూడియో.. అక్కడ షూటింగ్ చేస్తే మరణించాల్సిందేనా?

మూడేళ్ల క్రితం... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' సెట్స్ లో ప్రమాదం కారణంగా మైకేల్ అనే టెక్నీషియన్ మృతి చెందాడు. రెండేళ్ల క్రితం... బహుశా సెప్టెంబర్ నెలలో అనుకుంట! లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమిళ 'బిగ్ బాస్' రియాలిటీ షో చిత్రీకరణలో గుణశేఖరన్ అనే ఏసీ మెకానిక్ మృతి చెందాడు.

భారతీయుడు2 సెట్‌లో భారీ ప్రమాదం ముగ్గురు మృతి

సినీలోకం అంటేనే అదో మోజు. అన్నింటికంటే సినిమాకే లోకంల క్రేజ్ ఎక్కువ. అలాంటి సినిమాల్లో ప్రమాదాలు డైరెక్టర్ సృష్టి, కానీ సృష్టిస్తున్న సినిమాలో ప్రమాదం జరిగితే అదీ ఓ భారీ విషాదంగా మారితే కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్2 సినిమా సెట్స్ లో ఇదే జరిగింది.

Movie Reviews

Latest News

Video-Gossips

Gallery

దిల్ రాజు పెళ్లికి ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు లేటు వయసులో ఘాటుగా పెళ్లి చేసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? ఆయన పెళ్లి పై ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? తదితర ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.

బిగ్ న్యూస్: ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్!

​ఇది నిజంగా వెరీ బిగ్ న్యూస్. ప్రభాస్ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సన్నాహాలు చేస్తోంది. 'మహానటి' లాంటి జాతీయ అవార్డులు పొందిన చిత్రాన్ని రూపొందించిన్ నాగ్ అశ్విన్ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సి. అశ్వినీదత్....

బాలకృష్ణ ఆట స్టార్ట్ చేసేది హైదరాబాద్‌లోనే

కథ రెడీ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించబోయే మూడో సినిమాది. కథానాయిక కూడా రెడీ... 'డిక్టేటర్' తర్వాత మరోసారి బాలకృష్ణ సరసన తెలుగమ్మాయి అంజలి కథానాయికగా నటించనున్నది. కెమెరాలు, ఇతర సరంజామా

బికినీ వద్దు... శ్రీదేవి బయోపిక్ ముద్దు

పాయల్ రాజ్ పుత్ పేరు చెబితే కుర్రకారుకు పిక్ ఎక్కించే ఫిగర్ గుర్తొస్తుంది.‌ 'ఆర్.ఎక్స్.100', 'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమాల్లో హాట్ హాట్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో ఆమె అందాలు ఆరబోసింది. అందువల్ల, ఆమెను హాట్ ఫిగర్ గానే చాలా మంది ప్రేక్షకులు చూస్తున్నారు. చూడడమే కాదు...

నిజమే.. మెగాస్టార్ సినిమాలో సూపర్‌స్టార్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో సూపర్‌స్టార్ మహేశ్ ఒక కీలక పాత్ర చేయడం ఖరారైంది. 1980ల కాలానికి చెందిన కథతో తయారవుతున్న ఈ మూవీలో విప్లవ నాయకునిగా చిరంజీవి నటిస్తున్నారు. ఇందులో కథకు అత్యంత కీలకమైన ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి మొదట రాంచరణ్ సిద్ధమయ్యాడు. అయితే 'ఆర్ఆర్ఆర్' సినిమా పూర్తయ్యే దాకా మరో సినిమా చెయ్యకూడదనే రాజమౌళి నిబంధన అతనికి అడ్డంకిగా మారింది.

'అంధాధున్' తెలుగు రీమేక్ మొదలైంది

​నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తోన్న సినిమా సోమవారం ప్రారంభమైంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'అంధాధున్'కు ఇది రీమేక్. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 6గా ఈ చిత్రాన్ని ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు...

నేడు అతిలోకసుందరి రెండో వర్ధంతి

ఫిబ్రవరి 24 శ్రీదేవి రెండో వర్ధంతి. 2018లో ఇదే రోజు దుబాయ్‌లో ఒక పెళ్లికి హాజరై బాత్‌టబ్‌లో పడి ఆ అతిలోకసుందరి సుందరి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణం దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులకు గుండె ఆగినంత పనైంది. ఇక ఆమె భర్త బోనీ కపూర్, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషి పరిస్థితి అయితే ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే.

అక్కడ ప్రభు... ఇక్కడ రాజేంద్రప్రసాద్

తండ్రిని కొడుకు చదివిస్తే... ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏజ్‌లో ఓ వ్యక్తి కాలేజీకి వెళితే ఎలా ఉంటుందనే పాయింట్ చుట్టూ అల్లిన కథతో తెరకెక్కిన సినిమా 'కాలేజ్ కుమార్'. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటించాడు. మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. కాలేజీకి వెళ్లే తండ్రిగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించారు.

ఫస్ట్ సినిమాలో ఫస్ట్ షాట్... ఐదారుసార్లు అలాగే చేశా: మెహరీన్

తెలుగులో మెహరీన్ తొలి సినిమా 'కృష్ణగాడి వీరప్రేమగాథ'. కథానాయికగా ఆమె తొలి సినిమా కూడా అదే. అంతకు ముందు ఒక సోప్ యాడ్, బ్యూటీ ప్రోడక్ట్ యాడ్స్ ఏవో చేశారు. దర్శకుడు హను రాఘవపూడికి 'కృష్ణగాడి వీరప్రేమగాథ' రెండో సినిమా. అంతకుముందు ఆయన 'అందాల రాక్షసి' తీశారు. ఎవరో కోఆర్డినేటర్ ద్వారా మెహరీన్ ఫొటోలు చూసి కృష్ణగాడి ప్రేయసి మహాలక్ష్మి పాత్రకు సెలెక్ట్ చేశారు.

సరోగసీ ద్వారా కూతుర్ని కన్న హిందీ హీరోయిన్

ప్రముఖ హిందీ హీరోయిన్ శిల్పా శెట్టి, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా దంపతులకు ఫిబ్రవరి 15న కుమార్తె పుట్టింది. ఇద్దరికీ ఇది రెండో సంతానం. వీళ్లకు 7 ఏళ్ళ కుమారుడు వియాన్ ఉన్న సంగతి తెలిసిందే. అమ్మాయికి శమిషా శెట్టి కుంద్రా అని పేరు పెట్టారు. విచిత్రం, విశేషం ఏమిటంటే... శిల్పాశెట్టి గర్భవతి కాలేదు. మరి, కుమార్తె ఎలా పుట్టింది? అనుకుంటున్నారా!?