RELATED NEWS
NEWS
శ్రీమంతుడి కాన్సెప్ట్ తో నాట్స్ ముందడుగు... గ్రామాల దత్తతకు నడుంబిగించిన నాట్స్

 


శ్రీమంతుడి కాన్సెప్ట్ తో  నాట్స్ ముందడుగు...

గ్రామాల దత్తతకు నడుంబిగించిన నాట్స్

 


జన్మభూమి రుణం తీర్చుకునేందుకు  ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరో ముందడుగు వేసింది. పల్లె ప్రగతితో భారతదేశ వికాసం సాధ్యమని నమ్మిన నాట్స్ అభివృద్ధికి నోచుకోని గ్రామాల దత్తతకు నడుంబిగించింది. అమెరికా నుంచి సొంతగడ్డ తెలుగునేల పై అడుగుపెట్టిన నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. మారుమూల గ్రామాల అభివృద్ధికి నాట్స్ తన వంతు సాయం చేస్తుందని మన్నవ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస మునిసిపాలిటీతో పాటు మందస మండలం కొండలోగాం గ్రామంలో మోహనకృష్ణ మన్నవ పర్యటించారు. పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కోనేరు( నెహ్రుపార్కు)ను నాట్స్ అభివృద్ధి చేస్తుందని ఆయన హమీ ఇచ్చారు. స్థానికంగా  గ్లో సంస్థతో కలిసి రాష్ట్రంలో మారుమూల గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ విద్య, వైద్య సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు.

 

పల్లె ప్రగతికి నాట్స్  తన వంతు సహయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని కూడా మోహన కృష్ణ మన్నవ తెలిపారు. మందస మండలం కొండలోగాంలో పర్యటించిన ఆయన నాట్స్, గ్లో సంస్థ సంయుక్తంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇచ్ఛాపురం,పలాస నియోజకవర్గాల్లో చాలా మంది ప్రజలు కిడ్ని వ్యాధులతో బలవుతున్నారనే విషయాన్ని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ నాట్స్ అధ్యక్షుడి దృష్టికి తీసుకువచ్చారు.. బాధిత గ్రామాల్లో  వైద్యం అందించేందుకు  తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మోహన కృష్ణ మన్నవ హామీ ఇచ్చారు. నాట్స్ ప్రత్యేక బృందాలు వచ్చి ఆ బాధిత గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కిడ్ని వ్యాధులకు మూలలను కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పటికే ఉద్దానంలో నాట్స్ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి.. ప్రజలు కిడ్ని వ్యాధుల బారి నుంచి కాపాడేందుకు తన వంతు సాయం చేస్తుందని తెలిపారు. నాట్స్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతోనే చేస్తామన్నారు.

ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేసేందుకు నాట్స్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. భాషే రమ్యం.. సేవే గమ్యం అనే లక్ష్యంతో ఏర్పడిన నాట్స్ ఆది నుంచి అమెరికాలో తెలుగువారికి అండగా నిలబడుతూనే జన్మభూమి తెలుగునేలలో అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుందన్నారు.  శ్రీకాకుళంతోపాటు అనంతపురం జిల్లాలోనూ వీలైనన్ని ఎక్కువ గ్రామాలను దత్తత తీసుకునేందుకు నాట్స్, గ్లో సంస్థలు సన్నద్ధంగా ఉన్నాయని శ్రీకాకుళానికి చెందిన గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరి అన్నారు. ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారుతున్న తరుణంతో తెలుగు పల్లెలను ప్రపంచానికి కనెక్ట్ చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని వివరించారు.

TeluguOne For Your Business
About TeluguOne
;