RELATED NEWS
NEWS
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న నాట్స్..

 

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న నాట్స్..

 


అమెరికాలోని తెలుగువారి యోగక్షేమాలే లక్ష్యంగా ఆవిర్భవించిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. అమెరికాలోని సియాటెల్‌లో నివాసముంటున్న బోయినపల్లి శ్రీకాంత్‌కు భార్య కశ్మీరాతో పాటు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య కశ్మీరా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడి ఇటీవలే మరణించారు. భార్యకు వైద్యం చేయించే స్థామత శ్రీకాంత్‌కు లేదు..అయినప్పటికి తన శక్తికి మించి భార్యను కాపాడుకునేందుకు ఆయన చివరి వరకు పోరాటం చేశారు. ఈలోగా ఈ విషయం స్థానిక తెలుగువారి ద్వారా నాట్స్ ప్రతినిధులకు తెలిసింది. కశ్మీరాను ఆదుకోవాలని నాట్స్ పిలుపునివ్వడంతో స్పందించిన తెలుగువారు విరాళాలు అందజేశారు. కానీ ఈలోపే కశ్మీరాను క్యాన్సర్ మింగేసింది. అయినప్పటికి శ్రీకాంత్ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించిన నాట్స్ విరాళాల ద్వారా సేకరించిన 17,398 డాలర్ల చెక్కును ఆయనకు అందజేసింది. నాట్స్ సియాటెల్ జోనల్ కో-ఆర్డినేటర్ ప్రసాద్ సేనాపతి శ్రీకాంత్‌ను పరామర్శించి చెక్కును ఆయనకు అందజేశారు. తెలుగువారికి ఎప్పుడు , ఏ ఆపద వచ్చినా వారికి చేయూత అందించేందుకు నాట్స్ ముందుంటుందని ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.

TeluguOne For Your Business
About TeluguOne
;