RELATED NEWS
NEWS
న్యూజెర్సీలో కపిల్ దేవ్ తో విందు చేసే సువర్ణావకాశం

జూలై 1 ,2 , 3 తేదిల్లో న్యూ జెర్సీలో జరిగే నాట్స్ సంబరాల్లో మన క్రికెట్ ఆరధ్య దైవం కపిల్ దేవ్ పాల్గొంటున్న సంగతి విదితమే. ఆ సందర్భంలో కపిల్ దేవ్ ను కలిసేందుకు ఎదురుచూస్తున్నారు. నాట్స్ (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ప్రవాసాంధ్రులు, అమెరికన్ క్రికెట్ ప్రియుల కోసం "Meet & Greet " ఏర్పాటు చేయనుంది. కపిదేవ్ చెప్పే క్రికెట్ కబుర్ల కోసం క్రికెట్ ప్రియులు ఇప్పటినుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కపిల్ దేవ్ కు ఉపోద్ఘాతాలు, పరిచయాలు అక్కర్లేదు. కపిల్ గురుంచి ఎంత చెప్పనా తక్కువే. అదే ఆయన గొప్పతనం.

1980-81 లో, ప్రముఖ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఇండియా మొదట 1 - 0 వెనుక పడింది. ఆ క్లిష్ట సమయంలో 143 పరుగుల లక్ష్యాన్ని చేరడానికి, కపిల్ దేవ్ గాయాలతో ఉండి కుడా అద్వితియమయిన పాత్ర పోషించాడు. నాలుగవరోజు ఆట ముగిసేసరికి 18/3 ఉండగా, కపిల్ దేవ్ గాయాలను లక్ష్య పెట్టకుండా, చివరి రోజు బలమయిన ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ వికెట్స్ పడగొట్టి విజయ కేతనం ఎగరేశాడు. ఇండియా విజయంలో ఆయనదే కీలక పాత్ర. ఆ ఇన్నింగ్స్ లో 16.4–4–28–5 గణాంకాలు నమోదు అయ్యాయి.

ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో, ధోని సారధ్యంలో ఇండియా కప్ సాధించింది. దాంతో ధోని అపార కీర్తి సాధించాడు. కాని, 1983 లో కపిల్ దేవ్ సారధ్యంలో మొదటసారి ప్రపంచ కప్ సాధించిన మధుర జ్ఞాపకాన్ని భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. చరిత్రలో అదొక రికార్డుగా నిలిచిపోయింది. అదే మ్యాచ్ లో, జింబాబ్వే మ్యాచ్ తో మొదట ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుని 17/5 తో పీకల లోతుకు కూరుకుపోగా, చివరి క్షణంలో కపిల్ దేవ్ 138 బంతులతో 175 పరుగులు చేశాడు. చివరి వికెట్ కి 126 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.. అందులో, 16 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో ఇండియా 31 పరుగులుతో గెలిచింది. తర్వాతి మ్యాచ్ లో, ఆస్ట్రేలియాను ఓడించి, సెమి ఫైనల్స్ అర్హత సాధించి, ఆపై ఇంగ్లాండ్ మీద కుడా గెలిచి, ఫైనల్స్ లో వెస్ట్ ఇండీస్ టీం మీద గెలుపు సాధించడం ఒక అపూర్వ ఘట్టం. అలా కపిల్ దేవ్ తనను తాను నిరూపించుకున్నాడు. క్రికెట్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.

జూలై లో జరిగే, నాట్స్ సంబరాలకు క్రికెట్ తేజం కపిల్ దేవ్ ను ముఖ్య అతిధి గా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా కపిల్ దేవ్ ను వ్యక్తి గతంగా కలిసి, వివిధ విషయాలు చర్చించే సదవకాశాన్ని నాట్స్ కల్పిస్తోంది. మీరు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలంటే, నాట్స్ వెబ్ సైట్ లో లాగిన్ అయి, మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. http://www.natsworld.org/sambaralu/spg/payform.php?ref =

నాట్స్ "Meet& Greet "లో పాల్గొన్నవారిలో ఒక ఫ్యామిలీని లక్కీ విన్నర్ గా ఎంపిక చేసి, ఈమెయిలు ద్వారా తెలియజేస్తాం. వారి వివరాలను నాట్స్ వెబ్ సైట్ లో ప్రచురిస్తాం.

TeluguOne For Your Business
About TeluguOne
;