LIFE STYLE
అతను ఇంటర్నెట్ని ముందుగానే ఊహించాడు
‘మార్షల్ మెక్లుహాన్’ – ఈ పేరుని చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ ‘గ్లోబల్ విలేజ్’ అన్న పదాన్ని వినే ఉంటారు కదా! ఆ మాటని మొదటిసారి ఉపయోగించిన వ్యక్తే మార్షల్ మెక్లుహాన్. అంతేకాదు... సాంకేతికతకు, మీడియాకు సంబంధించి ఆయన చేసిన అనేక ప్రతిపాదనలు సంచలనం సృష్టించాయి. సరిగ్గా 106 ఏళ్ల క్రితం మార్షల్ కెనడాలో పుట్టాడు. మంచి చదువు చదువుకుని ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాడు. అప్పుడే ప్రజలు నిదానంగా టీవీకి అలవాటుపడుతున్నారు. అదో అద్భుతం అనుకుని మురిసిపోతున్నారు. మీడియా అన్న పదం అప్పుడప్పుడే ప్రచారంలోకి వస్తోంది. ఆ సమయంలో మార్షల్ మీడియా గురించి ప్రత్యేకించి పుస్తకాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిలో అనేక సిద్ధాంతాలు చేశాడు. మార్షల్ 1962లో The Gutenberg Galaxy అనే పుస్తకం రాశాడు. అందులో ఆయన మానవచరిత్రను నాలుగురకాలుగా విభజించాడు. * మొదటి దశ acoustic age- ఈ దశలో కేవలం వినికిడి ద్వారానే సమాచారం ఒకరి నుంచి ఒకరికి చేరుతుంది. * రెండో దశ literary age – ఈ దశలో నిదానంగా రాయడం అలవాటు అవుతుంది. ఆకుల మీదో, కాగితాల మీదో సమాచారాన్ని రాసుకుంటారు. * మూడో దశ print age – ఈ దశలో పుస్తకాలను ముద్రించడం సులువుగా మారిపోతుంది. కావల్సినంత సమాచారం పుస్తకాల రూపంలో దొరుకుతుంది. * నాలుగో దశ electronic age – ఈ దశంలో సమాచారం అంతా కూడా టీవీ, కంప్యూటర్ వంటి పరికరాల ద్వారానే ఒకరి నుంచి ఒకరికి చేరతాయి. మానవుడు మొదటి మూడు దశలనీ దాటేసి నాలుగో దశలోకి చేరిపోయాడనీ, ఇక మున్ముందు అంతా సమాచార విప్లవమే అని తేల్చి చెప్పేశాడు మార్షల్. అంతేకాదు! కంప్యూట్ అనే పరికరం కేవలం లెక్కలు చేయడానికే కాదునీ... పరిశోధనలు చేయడానికీ, ఒకరొకొకరు సమాచారం అందించుకోవడానికి సాయపడుతుందనీ ఊహించాడు. ఆ తర్వాత ఎప్పుడో 25 ఏళ్లకి కానీ జనాలకి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదు. దీన్ని బట్టి మార్షల్ ఊహ ఎంత ఖచ్చితమైనదో తెలిసిపోతుంది. మీడియాదే రాజ్యమనీ మున్ముందు ప్రతి విషయాన్నీ మీడియా తనదైన దృష్టిలో ప్రజలకు చేరవేస్తుందనీ ఆనాడే పసిగట్టారు మార్షల్. అందుకే ‘the medium is the message’ అన్న మాటని ఉపయోగించారు. ‘మీడియా ఎంత చెబితే అంత’ అన్న భావం ఇందులో స్ఫురిస్తుంది. మార్షల్ బతికున్నంతకాలమూ ఆయన మాటల్ని ఎవరూ పెద్దగా నమ్మలేదు. తరచూ టీవీలూ, మేధావులూ ఆయనను తల్చుకున్నా... ఆయన మాటలు నిజమవుతాయని ఎవరూ భావించలేదు. కానీ 1980లో మార్షల్ చనిపోయిన పదేళ్ల తర్వాత ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం మొదలుపెట్టింది. ఇక ఆ తర్వాత జరిగినదంతా మనకి తెలిసిన చరిత్రే! ఏదన్నా పరిణామం జరిగిన తర్వాత దాని గురించి విశ్లేషించడం, అందులో మనం కూడా పాలుపంచుకోవాలని కోవడం సహజమే! కానీ భవిష్యత్తులో ఇలా జరగబోతోంది అని ముందుగానే ఊహించడం గొప్ప లక్షణం. అందుకే ఇవాళ గూగుల్ సైతం మార్షల్ని గౌరవించుకోవాలని అనుకుంది. ఆయన పేరుతో ఒక డూడుల్ని రూపొందించింది. - నిర్జర.
ఏ సందర్భంలో అయినా గడగడా మాట్లాడేసినంత మాత్రాన మనకి వాక్చాతుర్యం ఉందని మురిసిపోవడానికి లేదు. ఎవరి ముందైనా కూడా జంకు లేకుండా ఉపన్యాసం దంచేసినంత మాత్రాన మనం గొప్ప వక్తలం అనుకోవడానికీ లేదు. మనం చెప్పే మాట అవతలివారికి వినపడాలి. అది స్పష్టంగా అర్థమవ్వాలి. స్వరం కూడా వినసొంపుగా ఉండాలి. అప్పుడే మనం పలికే పదానికి ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఉత్త కంఠశోష మాత్రమే మిగులుతుంది. అందుకోసం కొన్ని చిట్కాలను పాటిస్తే తప్పక ఉపయోగం ఉంటుందంటున్నారు నిపుణులు. సరైన శ్వాస: ఆరోగ్యంగా ఉండాలంటే గాఢంగా ఊపిరి పీల్చుకోవాలని అందరూ చెప్పే విషయమే! ఇలా ఊపిరితిత్తుల లోతుల నుంచి ఊపిరి పీల్చుకునే అలవాటు వల్ల మన మాటలో కూడా మార్పు వస్తుంది. మాటని బలంగా చెప్పగలుగుతాం. కావాలంటే గట్టిగా ఊపిరి తీసుకుని మాట్లాడి చూడండి... మీ మాటల్లోని మార్పు మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. నిదానంగా: భయంతోనో, మనసులో మాటని త్వరత్వరగా చెప్పాలన్న ఉద్విగ్నతతోనో మనం హడావుడిగా మాట్లాడతాం. భాష మీద పట్టుంటే త్వరగా మాట్లాడగటం అన్న అపోహ కూడా చాలా మంది ఉంది. అందుకనే భారతీయులు ఆంగ్లంలో మాట్లాడేటప్పుడు హడావుడిగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. దీని వల్ల అసలుకే ఎసరు తప్పదు. తప్పులుతడకలుగా మాట్లాడటమో, తడబడటమో, మన మాట అవతలివారికి అర్థం కాకపోవడమో జరుగుతుంది. ఉపన్యాస కళ మీద మంచి పట్టు ఏర్పడే వరకు కాస్త ఆలోచించి నిదానంగా మాట్లాడటమే మంచిది. రికార్డు చేసుకుని: ఎవరి మాటలు వారి చెవులకు అద్భుతంగానే తోస్తాయి. కానీ మన మాటలు అవతలివారికి ఎలా వినిపిస్తుందో గ్రహించం. అందుకోసం ఒక్కసారి మన మాటల్ని మనమే రికార్డు చేసుకుని వింటే మన శ్రావ్యమైన గొంతు మీద మనకి ఉన్న నమ్మకాలన్నీ పటాపంచలైపోతాయి. దాంతో ఎలాగైనా సరే మనం మాట్లాడే తీరుని మార్చుకోవాలన్న పట్టుదల ఏర్పడుతుంది. గొంతు తెరచి: చాలామంది మాట్లాడుతుంటే ఊరికనే పెదాలని ఆడిస్తున్నట్లు కనిపిస్తుందే కానీ స్పష్టత ఉండదు. నోరు పూర్తిగా తెరిచి మాట్లాడకపోతే మన మాటలు గొణుగుతున్నట్లుగానే వినిపిస్తాయి. నోరు పూర్తిగా తెరుకుని మాట్లాడినప్పుడు పెదాలు కూడా విచ్చుకుంటాయి. నాలుకా, కింద దవడలు కూడా కదులుతూ ఉన్నప్పుడు పదాలను స్పష్టంగా, దృఢంగా పలకగలుగుతాం. వ్యాయామం: సంగీత స్వరాల మీద పట్టు సాధించేందుకు మన పెద్దలు చన్నీళ్లలో గొంతు వరకూ మునిగి సాధన చేసేవారట. అంత కష్టం మనవల్ల కాదు కానీ స్వరం మెరుగుపడేందుకు చాలా వ్యాయామాలే ఉన్నాయి. ఉదాహరణకు Cicely Berry వ్యాయామం పేరుతో ఇంటర్నెట్లో శోధిస్తే కొన్ని పదాలు కనిపిస్తాయి. వీటిని కనుక పలుకుతూ ఉంటే మన ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే సంస్కృత శ్లోకాలని చదవడం, Tongue twistersని అభ్యసించడం వల్ల కూడా ఉచ్ఛారణ మెరుగుపడుతుందని చెబుతారు. - నిర్జర.
ఫేస్బుక్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ ఇది... కొందరు శాస్త్రవేత్తలు ఐదు కోతులను ఒకే గదిలో పెట్టారట. ఆ గది మధ్యలో ఓ పెద్ద బల్లని ఉంచారు శాస్త్రవేత్తలు. ఆ బల్ల మీద వాళ్లు రోజూ ఒక తాజా అరటిపండుని ఉంచేవారట. గదిలో ఉన్న కోతుల్లో ఒకటి ఆ అరటిపండు కోసం బల్ల ఎక్కేందుకు ప్రయత్నించగానే... కింద ఉన్న మిగతా కోతుల మీద చల్లటి నీళ్లను కుమ్మరించేవారు శాస్త్రవేత్తలు. అంటే అరటిపండు కోసం పైకి వెళ్లే కోతి వల్ల కింద ఉన్న కోతులకి శిక్షపడేదన్నమాట. దాంతో కొన్నాళ్లకి ఆ కోతులు పైకి ఎక్కేందుకు సాహసించడం మానేశాయి. ఒకవేళ ఏదన్నా కోతికి నోరూరి బల్లని ఎక్కేందుకు ప్రయత్నించగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని లాగిపారేసేవి. కొద్ది రోజుల తరువాత ఈ ప్రయోగంలో శాస్త్రవేత్తలు ఓ చిన్న మార్పుని తీసుకువచ్చారు. ఆ అయిదు కోతుల్లో ఒకదాన్ని బయటకు తీసుకువెళ్లిపోయి, దాని స్థానంలో ఒక కొత్త కోతిని ప్రవేశపెట్టారు. ఈ కొత్త కోతి అరటిపండుని చూడగానే గభాలున బల్లని ఎక్కేందుకు సిద్ధపడిపోయింది. కానీ వెంటనే ప్రమాదాన్ని గ్రహించిన మిగతా కోతులు, దాన్ని దబదబా కిందకి లాగేశాయి. ఇలా రెండు మూడుసార్లు తన్నులు తిన్న తరువాత, కొత్త కోతి కూడా మిగతా కోతులలాగానే నిమ్మళంగా ఉండిపోయిది. ఒకో వారం గడుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తలు ఒకో పాత కోతికి బదులుగా మరో కొత్త కోతిని గదిలో ఉంచసాగారు. కొంతకాలం గడిచేసరికి కొత్త కోతులు అక్కడి వాతావరణానికి, మిగతా కోతుల స్వభావానికి అలవాటుపడిపోయాయి, తాము కూడా అందుకు అనుగుణంగానే ప్రవర్తించడం నేర్చుకునేవి. కొన్నాళ్లకి ఆ గదిలో పాత కోతులేవీ లేకుండా పోయాయి. కొత్త కోతులకి చన్నీళ్లతో విధించే శిక్ష అసలేమాత్రం అనుభవం లేదు. అయినా కూడా ఎప్పుడన్నా ఓ కోతి ఆదమరచి అరటిపండు కోసం బల్ల దగ్గరకు చేరుకోగానే, మిగతా కోతులన్నీ కలిసి దాన్ని కరిచి పారేయడం మానలేదు!!! కొందరు మనుషులు కూడా బహుశా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారేమో! ఒక పనిని తాము ఎందుకు చేస్తున్నామో చాలా మంది ఆలోచించరు. దాని వల్ల తనకు ఎలాగూ నష్టం కలుగుతుంది. ఇతరులకు కూడా తన చర్య వల్ల నష్టం కలుగుతున్నా, వీళ్లు తమ తీరుని మార్చుకోరు. ఒక్కసారి మన మొండివైఖరిని పక్కకి పెట్టి విచక్షణకు పదును పెడితే, జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ కథ చెబుతోంది. ఆ పరిష్కారం వల్ల మనం ముందుకు సాగడమే కాదు, ఇతరులను కూడా విజయం వైపుగా నడిపించేందుకు దోహదపడిన వారమవుతాం. లేకపోతే... ..Nirjara
బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?
ప్రపంచంలో యువతరం నేడు ఆత్మహాత్యలకు పాల్పడుతోంది. ముఖ్యంగా పోటీ తత్వాన్ని అంగీకరించకపోవడం, ఆత్మన్యూనతా భావం వెంటాడుతూ ఉండడంతో ఒక వైపు ఉద్యోగభధ్రత లేకపోవడం ఆర్ధిక సమస్యలు మరోవైపు కరోనా యువతను కుంగ దీస్తూ ఉండడంతో బతుకు పోరాటం చేయలేక భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి ఓర్పు సహనం లేని కుర్రకారు యదార్ధ గాధ మీ ముందు ఉంచుతున్నాను. అతను ఒక ప్రైవేటు ఉద్యోగి. చాలీచాలని జీతం అయినా పెళ్ళిచేసుకున్నాడు. భార్య గర్భవతి. ప్రసవం ఎలా చేయించాలి అన్న దగ్గర నుంచి అంతా ఏమౌతుందో అన్న స్ట్రెస్. ఎలాగో ఒకలా బాబు పుట్టాడు అంతా బాగుంది అనుకున్నారు. బారసాలకు ఊరు వెళ్ళారు. పూజా పునస్కారం బాగానే ఉంది. అప్పుడే మొదలైంది అసలు కథ. పిల్లాడికి డాక్టర్ చెప్పిన విధంగానే పాలపొడి డబ్బాలు కొనాలని గట్టిగా చెప్పాడు. అసలు మీరు ఏ డబ్బాలు కొన్నారో నాకు వాట్సాప్ చెయ్యాలంటాడు. రోజూ వీడియో కాల్ చెయ్యాలి అన్నాడని అమ్మాయి అంటుంది. అలాకాకపోతే నాతో మాట్లాడవద్దని అంటూ అత్తామామతో గొడవకు దిగాడు. బావమరిదిని సైతం వదలలేదు నువ్వెంత అంటే నువ్వెంత అన్నాడు. నీ అంతు చూస్తానంటూ అనుకున్నారు. కొద్దిరోజులకు అంతా సద్దుమణిగింది అనుకున్నారు. ఊరినుంచి వచ్చి ప్రశాంతంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఊహించని ఘటన జరిగింది. తన భార్య ఫోన్ మాట్లాడలేదని, మామ తనను అవమానించాడని మనసులో పెట్టుకున్న అతగాడు అంతా నిద్రపోయాక తనదగ్గర ఉన్న సానిటైజర్ తీసుకున్నాడు. మొబైల్ ఫోనులో నా చావుకు అత్త మామ భార్య కారణమంటూ పేస్ బుక్ లో పెట్టాడు. ఆఘమేఘాల మీద వెళ్లిన బావమరిది పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. వెంటనే వచ్చిన పోలీసులను చూసి మరింత రెచ్చిపోయాడు. మళ్ళీ సానిటైజర్ తీసి పోలీసుల ముందు తాగే ప్రయత్నం చేయడంతో, పోలీసులు ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి పంపారు. అసుపత్రి ఫీజ్ 15000 పైమాటే. అసలు సమస్య పక్కకి పోయింది. ఉరిలో పరువుపోయింది, చుట్టాల్లో ఉన్నగౌరవం పోయింది. కేవలం ఒక పట్టుదల మనిషిని చావువరకూ తీసుకెళ్ళింది. అన్నిసమస్యలకి చావు ఒక్కటే పరిస్కారం కాదన్న విషయం ఎందుకు గ్రహించరు. స్త్రీలకంటే ముందు పురుషులే ఆత్మహత్య చేసుకుని తనువు చలిస్తున్న వారి సంఖ్య 3.5% ఎక్కువగా ఉందని ఒక సర్వేలో వెల్లడించింది. నానాటికీ పెరుగుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సహజంగా ఇతరులపై ఆధారపడని, సహాయం తీసుకోకపోగా ఇతరుల పట్ల తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు. దీనికితోడు మొండితనం కూడా తోడవ్వడంతో తను అనుకున్నది జరగలేదన్న సమస్య వీరిని వెంటాడుతూ ఉంటుందని ఆందోళనతోనే ఆత్మాహాత్యలకు పాల్పడుతూ ఉంటారని పరిశోధకులు విశ్లేషించారు. ఈ అంశంపై పరిశోదన చేయడమంటే సవాళ్ళతో కూడుకున్నదని న్యూయార్క్ చెందిన ఫోర్ దానా విశ్వ విద్యాలయం గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ సోషల్ సర్వీస్ కు చెందిన కాల్ మాన్ ఈ విషయం వెల్లడించారు. చావు అన్నింటికీ పరిస్కారం కాదు. బ్రతికుండగా సాధించలేనిది.. చచ్చి ఏం సాధిస్తాం?
HEALTH
బాదం పప్పు రుచికరంగా ఉండడమే కాదు.. ఎంత శక్తివంతమో తెలుసుకుందాం. బిపి, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నవారికి పీచుపదర్ధాన్ని అందిస్తుంది. బాదం పప్పు వల్ల పోషక విలువలు మరెన్నో లాభాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు. ఒక ఔన్స్ బాదం పప్పులో 165 క్యాలరీలు, 6 గ్రాముల కార్బో హైద్రేట్స్, 35 గ్రాముల పీచుపదార్ధాలు ఉంటాయి. కొవ్వువల్ల వచ్చే హృద్రోగ సమస్యలనుండి నివారించేది బాదం పప్పుమాత్రమే అంటే అతిశయోక్తి కాదు. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. 1/3 వంతు కప్పు బాదం పప్పు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. బాదం పప్పులో కాల్షియం లభిస్తుంది. దీనివల్ల బాదం శరీరంలోని ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. రక్తనాళాలలో రక్తం గడ్డ కడితే బాదం దీనిని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన కండరాలు, బలమైన గుండెకు దోహదం చేసేది బాదం పప్పే. మీకు ఒకవేళ ఎలర్జీ ఉంటే అంటే ముఖ్యంగా పాలుత్పత్తులు ఇతర పదార్ధాలవల్ల ఎలర్జీ ఉంటే వీటి స్థానంలో ఆవుపాలకు బదులు బాదం పాలు వాడవచ్చు. ఈ పాలలో లాక్టోసీస్, కొలెస్ట్రాల్ లేకుండా ఉంటాయి. ఆహారంలో పీచుపదార్ధం అత్యవసరం. మీ రక్తంలో చక్కర నిల్వను తగ్గిస్తుంది. హృద్రోగ సమస్యకు చెక్ పెట్టేది బాదం మాత్రమే. 23 బాదం పప్పులకు 25 గ్రాముల పీచుపదార్ధం లభిస్తుంది. శరీరంలో వచ్చే ముడతలను నివారిస్తుంది. మెటబాలిజం ను వృద్ధి చేస్తుంది. అందరు ఎదుర్కొంటున్న అధిక బరువు నుంచి బయటపడేందుకు బాదం ఉపయోగ పడుతుంది. సెలోటోనియం లెవెల్ ను నియంత్రిస్తూ నిద్రను నియంత్రించడంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల పగలు మేల్కొని రాత్రి సుఖంగా నిద్రపోవచ్చని నిపుణులు వెల్లడించారు. అరకప్పుబాదం తీసుకోవడంవల్ల శరీరం లోని ఆర్గాన్లు మెరుగు పడతాయని సెక్స్ జీవితం సంతృప్తికరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. బాదం పప్పులు విటమిన్ ఇ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయి. శరీరంలో కణాలు నాశనం కాకుండా కాపాడుతాయి. విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు ఆల్జీమర్స్ , క్యాన్సర్ ను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. ల్యాక్టో బేసిలెస్ వల్ల ఆహారం జీర్ణం అయ్యేందుకు సహాకరిస్తుంది. ఇన్ఫెక్షన్ ల నివారణకు అవసరమైన రసాయనాలు బాదం అందిస్తుంది.
Food Check Drink Diet Crunching calories? Here are three drinks that will help you burn fat faster... Vegetable Juices Whether you juice them alone or combine them with fruits, Veggies like cabbage, broccoli and cauliflower are efficient fat-fighting weapons. Rich in phytonutrients, these juices help reduce the overall amount of body fat, reduce inflammation, control blood sugar levels and help balance hormones. Green Tea A cup of green tea a day will help drive the fat away. Green tea is packed with antioxidants that boost metabolism, as well as increase energy levels and suppress the appetite. Black coffee Black coffee, when consumed in moderation, has abundant health benefits. It contains antioxidants that help reduce the risk for certain types of cancer. Also the caffeine in coffee boosts metabolism and helps you burn calories faster. But remember, milk and sugar are big no-no’s. Fitness Check Fit Facts Quick facts to be kept in mind when planning your fitness regime... No matter how old you are or how poor your current level of fitness may be, there’s nothing stopping you from starting an exercise routine to get healthy and fit. Start as small regimes. For example, start with 20 minutes of exercise and then boost up the time period, as you go. This way, you won’t burn yourself out before you even get started. Simply adding movement into your daily routine can increase your level of fitness. Whether it’s taking the stairs or walking your dog, everything counts.Jogging is a great way to burn the calories and its good for the bones too. However, it might be too strenuous for some. But no worry, as walking at a brisk pace burns almost as many calories as jogging the same distance. Walking through water or against the wind burns approximately, 50 more calories an hour. Switch things up, if you’ve been walking for a month, try running or cycling next. Gradually increase the durations and types of workouts, This keeps your workout fun and your mind motivated. Take care, Stay Healthy!!!! -Sandya Koya
పౌష్టికాహార లోపం.. దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణం
నేడు ప్రపంచంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు విస్తరిస్తున్నాయి. డీజనరేటివ్ డిసీజెస్ లో ముఖ్యమైనవి హృద్రోగ సమస్యలు, డయాబెటీస్. 1960 లో ఈ అంశాలపై జరిపిన పరిశోధనల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అందులో ఒక శాతం మాత్రమే డయాబెటీస్ తో బాధ పడుతున్నారని పేర్కొన్నారు. డయాబెటీస్ ఇప్పుడు 20 నుంచి 30 శాతానికి చేరుకుంది. డయాబెటీస్ వచ్చే వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో ఉంటుందని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాలలో నివసిస్తున్న 40% ప్రజలు హై బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ఉండే మరో 30% మంది ప్రజలు ఊబకాయం సమస్యలతో బాధ పడుతున్నారని, దీని వల్ల వారికి అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు దురదృష్టం కొద్దీ ఈమధ్య కాలంలో పాండమిక్ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. కరోనా మొదటి విడత రెండవ విడత ప్రజలను మరింత భయానికి గురి చేసింది. చాలా మంది యువతీ యువకులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురి అయినట్లు, అందులో తమకూ కరోనా వచ్చిందన్న భయంతో చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అర్బన్ ప్రాంతాలలో ముఖ్యంగా కౌమారదశలో ఉండే పిల్లలలోను డయాబెటీస్ తో బాధపడుతున్నవారు 70% మంది ఉన్నట్లు, ఇందులో స్త్రీ పురుషులు ఉండటం గమనార్హం. ఇందులో అయితే సాధారణ, అతిసాధారణమైన పౌష్టిక ఆహారం లోపంతో పాటు హార్మోన్ లోపాలు, అనీమియా సమస్యలు అంటే రక్తహీనత వంటి సమస్యలతో పాటు థైరాయిడ్ వంటి సమస్యలు గ్యాస్ట్రో సమస్యలు, పెద్దపేగు చిన్నపేగుకు సంబందించిన సమస్యలతో బాధ పడడం సహజమని ప్రచురణలో పేర్కొన్నారు. అనారోగ్యం నాణ్యమైన జీవితాన్ని తగ్గించడమే కాదు, ఆర్ధిక సమస్యలు సృష్టించడంతో పెనుభారంగా మారుతోంది. గతంలో ఉన్న సమస్యలకు తోడు పాండమిక్స్ తో పాటు పౌష్టికాహార లోపం మరిన్ని ఆనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయని తేల్చి చెప్పారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న ఆనారోగ్య సమస్యలకు కారణం పౌష్టికాహార లోపం. అందువల్ల రోగనిరోధకశక్తి తగ్గుతుందని, ఇవే దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారణాలుగా మ్యాక్స్ జరసం పేర్కొన్నాడు.
భారత్ లో 63 మిలియన్ల ప్రజలకు చెవిటి సమస్యలు!!
భారత్ లో 63 మిలియన్ల ప్రజలు చెవిటి సమస్యలతో బాధపడుతున్నారు. చెవుడు ప్రధానమైన సమస్య వయస్సు వల్లేనని, అనుకోకుండా రావడం లేదా నెమ్మదిగా వినికిడి శక్తి తగ్గుతూ ఉంటుందని అంచనా. కొందరిలో దీనికి భిన్నంగాను ఉండవచ్చు. అయితే దీనిని నిర్లక్ష్యం చేయరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపై పూర్తిగా చెవిటి వారిగా ఉండకుండా వినికిడి సమస్యనుండి బయటపడవచ్చునని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వినికిడి సమస్య నివారణతో పాటు వినికిడి శక్తిని పెంపొందించుకోవచ్చని అంటున్నారు. వినికిడి సమస్య చాలా తీవ్రమైనదిగా చెప్పవచ్చు. ఇది ఇతర అనారోగ్యసమస్యలకు దారి తీస్తుందని వైద్యులు పేర్కొన్నారు. వినికిడి సమస్యవల్ల చదువుపై శ్రద్ధ తగ్గడం, ఒత్తిడికి గురికావడం, సామాజికంగా వెనుకబడ్డామన్న ఆత్మన్యూనతా భావానికి గురి అయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తక్కువ వినపడటం, కొన్ని శబ్దాలు వినపడకపోవడం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అర్ధం కాకపోవడం వల్ల వినికిడి లోపం ఉన్నట్లు గమనించవచ్చు. ఇతరులతో పూర్తిగా చెప్పలేకపోవడం, సంబంధబాంధవ్యాలు తగ్గిపోవడం, ఇతరులతో కలిసేందుకు ఇష్ట పడకపోవడం వంటి అంశాలు వేధిస్తాయి. దీని ప్రభావం నిత్యజీవితంపై చూపిస్తుంది. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఫ్రస్టేషన్ వంటిసమస్యలు ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని గమనించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యతో భార్యా భర్తలు దాంపత్య జీవితానికి సైతం దూరంగా ఉండాల్సి వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. వినికిడి సమస్యను నిర్లక్ష్యం చేస్తే మీ చెవికే ప్రమాదం ఏర్పడవచ్చని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వినికిడి సమస్యను గుర్తించండి.. వినికిడి శక్తిని పెంచుకోండి. ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తరువాత ఎన్నో రకాల శస్త్ర చికిత్సలు అందులోబాటులో ఉన్నాయి. సమస్య ఏదైనా సకాలంలో గుర్తించడం ముఖ్యం. చికిత్స తీసుకోవడం అత్యవసరం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
TECHNOLOGY
కండ్ల ముందే ప్రపంచం.. కళ్లజోడు లోనే సమస్తం
సాంకేతిక రంగంలో మరో విప్లవానికి రిలయన్స్ సంస్థ తెరతీసింది. జియో ఇంటర్నెట్ తో లక్షలాది మంది వినియోగదారులను తన ఖాతాలో జమచేసుకున్న ఈ సంస్థ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన జియో గ్లాసెస్ డిజిటల్ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాయి. రిలయన్స్ సంస్థ 43న వార్షికోత్సవంలో జియో గ్లాస్ ను ఆవిష్కరించారు. ఈ కళ్లజోడుతో ఇప్పటివరకు అరచేతిలో ఇమిడిన ప్రపంచం ఇంక కంటి ముందు సాక్షాత్కరించబోతుంది. కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచమంతా డిజిటలైజ్ అయ్యిన తరుణంలో ఆన్ లైన్ క్లాస్ లు, వీడియా కాన్ఫరెన్సులు, జూమ్ మీటింగ్ లు సగటు మనిషి జీవితంలో సాధారణమైన తరుణంలో ఈ జియో గ్లాస్ లు ఎంతో ఉపయోగకరంగా ఉండ బోతున్నాయి. అయితే వీటి ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. జియో గ్లాస్ ఫీచర్స్ - నల్లని రంగు..కాస్త మందంగా.. కూలింగ్ గ్లాసెస్ లను పోలిన వీటి బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే. - ఈ గ్లాసెస్ ద్వారా మన స్మార్ట్ ఫోన్ నుంచి 25 మిక్సిడ్ రియాలిటీ యాప్స్ పనిచేసేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. - ప్రత్యేకంగా పొందుపరిచిన 3 డి హోలో గ్రాఫిక్ డిజైన్ ద్వారా వర్చువల్ రియాల్జీలో మీటింగ్స్ నిర్వహించుకోవచ్చు. - ఇందులో అమర్చిన సెన్సార్లు, హార్డ్ వేర్ అధునాతన టెక్నాలజీలో పనిచేస్తాయి. ఎక్స్ ఆర్ సౌండ్ సిస్టం ద్వారా ఎలాంటి కేబుల్ అటాచ్ మెంట్ లేకుండా మీకు ఇష్టమైన మ్యూజిక్ వినవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లు వినవచ్చు. అన్ని రకాల ఆడియో ఫార్మెట్లను సపోర్ట్ చేసే టెక్నాలజీ ఇందులో ఉంది. - హై రిజల్యూషన్ లో ఉండే డిస్ ప్లే ద్వారా గేమింగ్, షాపింగ్ ఎంజాయ్ చేయవచ్చు. - ఇందులోని హోలా గ్రాఫిక్ వీడియో కాల్ ద్వారా పెద్ద స్క్రీన్ పై ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. - అంతేకాదు 3డీ వర్చువల్ అవతార్, 2డి వర్చువల్ ఇంటరాక్షన్ ద్వారా కూడా మీకు కావల్సిన విధంగా ఈ కళ్లజోడు పనిచేస్తుంది. - జియో మిక్స్ డ్ రియాలిటీ క్లౌడ్ అందుబాటులో ఉండటంతో ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. - ప్రపంచాన్నిసుందరంగా చూపించగల టెక్నాలజీని ఈ కళ్లజోడుతో అందిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపార వేత్తలు ఇలా అన్నిరంగాల వారికి ఉపయోగపడేలా ప్రపంచాన్ని అరచేతిలో నుంచి కండ్లముందుకు తీసుకువస్తున్నారు.
YouTube Premium and Music services launched in India, starts at Rs 99 per month
Just over a week after the launch of the Spotify in India, there is a new streaming service in town. YouTube has launched YouTube Premium, YouTube Originals and YouTube Music in India — the services were launched globally last June. YouTube Music (ad-supported), YouTube Music Premium (ad-free), YouTube Premium (ad-free) have been launched in India. According to YouTube, YouTube Music will be available both as a standalone mobile app and a Web-based desktop interface that is designed for music streaming. The service offers original songs, albums, thousands of playlists, and artist radio as well as YouTube's own catalog of remixes, live performances, covers, and music videos. YouTube has also brought its premium service with original content to India. Earlier called YouTube Red, this service offers ad-free playback and access to YouTube’s cache or original shows and movies. At the moment there is a mix of shows, but nothing big enough to drive someone to take a subscription. We will have to wait and see if YouTube will put its money behind Indian shows. subscription plan offers: YouTube Music Premium is priced Rs 99 a month. YouTube Premium will be available for 129 a month and will include membership to YouTube Music Premium. The subscription will offer an ad-free experience with background play and offline downloads for millions of videos on YouTube, as well as access to all YouTube Originals. Those buying the new Samsung Galaxy S10 series will also get four months of free access to YouTube Premium and YouTube Music Premium.
Your WhatsApp account will be deactivated if you use these apps
WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. WhatsApp suggests to immediately download the original app to continue using the service.The Facebook-owned WhatsApp on its official has warned people of account ban if they use altered versions of WhatsApp like GBWhatsApp and WhatsApp Plus. These are unsupported versions of WhatsApp and using these apps can lead to the temporary ban of the account.WhatsApp cares deeply about the safety of our users. To protect the privacy and security of their account, we strongly recommend users only download WhatsApp from official app stores or from our website. People using GBWhatsApp and WhatsApp will see an in-app message saying your account is temporarily banned. The chat app suggests to immediately download the original app to continue using the service. WhatsApp doesn't support these third-party apps because we can't validate their security practices," the company states on its FAQ page. Before switching to the original app, WhatsApp recommends you to back up their chat history. Those using GBWhatsApp and WhatsApp Plus can follow these steps to save their chat history. 1)Open GB WhatsApp and tap More options > Chats > Back up chats. 2)Go to Phone Settings > tap Storage > Files. 3)Find the folder GB WhatsApp and tap and hold to select it. 4)In the upper right corner tap More > Rename and rename the folder to "WhatsApp." 5)Go to the Play Store and download and install the official WhatsApp app. 6)On the Backup found screen, tap Restore > Next. WhatsApp should load with your existing chats.
Best phones under 20,000 in 2019