కేట్ మాస్ టాప్ లెస్ అందాలు

కొప్పున్నమ్మ ఏ ముడి చుట్టినా అందమే అన్నట్టుగా అందాలు పుష్కలంగా ఉన్న సుందరీమణి వాటిని కొంగుచాటున దాచిపెట్టుకోవడానికి ఇష్టపడకుండా రకరకాలుగా ప్రదర్శించుకోవడంలో తప్పేంలేదని గర్వపడడంకూడా ఓ అందమే. తన అందాలను గర్వంగా బైటేసుకుని తిరిగే టాప్ మోడల్ కేట్ ని చూస్తే జనానికి పిచ్చక్రేజ్. కేట్ హాలిడే కెళ్లిందంటే చాలు ఆమె అభిమానులకు అది జాలీడే కిందే లెక్క. ఎందుకంటే.. వెన్నెముకను నిటారుగా నిలబెట్టి యద సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కేట్ చూపించే దర్పం ఇంకెవరికీ రానేరాదని అభిమానులంతా ముక్త కంఠంతో చెబుతారు. ఎప్పుడూ విప్పి చూపించే కేట్ ఉన్నట్టుండి ఫ్రాన్స్ హాలిడేలో యదను ఆరంగుళాల ఓ గుడ్డముక్కతో కప్పేసేసరికి జనం ఉసూరన్నారు. ఒక్కసారిగా కేట్ ఇంత దయలేకుండా మారిపోయిందేంటబ్బా అని తలలు బాదుకున్నారు. తమ అభిమాన మోడల్ లో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని చూసి అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. చక్కనమ్మ చూడచక్కని అందాల్ని అలా చూపించుకుంటూ తిరుగుతుంటే బాగుంటుందికానీ, అలా మూసేసుకు తిరగాలన్న నిర్ణయాన్ని ఆమె ఎప్పటికీ పాటించదలచుకుంటే మాత్రం చాలామందికి హార్టెటాక్ లు రావడం ఖాయమని కేట్ ఫ్యాన్స్ ముక్త కంఠంతో చెబుతున్నారు.

చంద్రబాబు యాత్రమీద భారీ అంచనాలు

జనంతో మమేకమయ్యేందుకు చంద్రబాబు 117 రోజుల పాదయాత్రను చేపట్టారు. అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి యాత్ర మొదలవుతోంది. అక్టోబర్ రెండో తేదీన హిందూపురంలోని హనుమంతుడి ఆలయంలో పూజలు జరిపాక చంద్రబాబు యాత్రను ప్రారంభించబోతున్నారు. తొలిరోజున బావమరిది బాలయ్యబాబుతోపాటు, చిన్నబాబు లోకేష్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికూడా యాత్రలో పాల్గొంటున్నారు. కోడలు బ్రహ్మణి అమెరికాలో ఉన్న కారణంగా యాత్రకు దూరంగా ఉన్నట్టు సమాచారం. తొలిరోజు యాత్రలో మొత్తం కుటుంబమంతా కలిసి పాల్గొనాలని ముందుస్తు ప్రణాళికఉన్నా అమెరికా ప్రయాణం కారణంగా కోడలు బ్రహ్మణి యాత్రలో పాల్గొనలేకపోతోంది. అక్టోబర్ రెండో తేదీ ఉదయం చంద్రబాబు తన సతీమణితో కలిసి బాపూఘాట్ ని, ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శించి నేరుగా విమానంలో బెంగళూరుకెళ్లిపోతారు. అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో హిందూపూర్ కి చేరుకుని యాత్రని ప్రారంభిస్తారు. మొదటి రోజు 5 కిలోమీటర్లమాత్రమే పాదయాత్ర ఉంటుందని, రాత్రికి బాబు ఓ స్పిన్నింగ్ మిల్లులో బసచేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బాబుతోపాటు రెండొందలమంది భద్రతా సిబ్బంది, వాలంటీర్లు, నేతలు, కార్యకర్తలు, సతీమణి భువనేశ్వరి ప్రత్యేకంగా పంపించిన ఓ వంటమనిషి, చంద్రబాబు ఆహార ఏర్పాట్లకోసం ప్రత్యేకించి ఓ బస్సు, రెండు మంచినీళ్ల ట్యాంకర్లు తరలివస్తాయి. చంద్రబాబు పాదయాత్రకోసం వందేమాతరం శ్రీనివాస్ ఆరు పాటల్ని సిద్ధం చేశారు. అనంతశ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ ఈ పాటలు రాశారు.

బ్రజేష్ మిశ్రాకి ఘన నివాళి

దేశానికి మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన బ్రజేష్ మిశ్రాకి ఢిల్లీ లోథీ రోడ్ లోని శ్మశాన వాటికలో ఘనంగా జరిగాయి. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న బ్రజేష్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయ్ హయాంలో బ్రజేష్ ప్రిన్సిపల్ సెక్రటరీగాకూడా పనిచేశారు. తర్వాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి భారత్ శాశ్వత ప్రతినిధిగాకూడా పనిచేశారు. 1999లో కార్గిల్ యుద్ధసమయంలో బ్రజేష్ భద్రతా సలహాదారుగా కీలకపాత్రను పోషించారు. ఎన్డీయే ప్రభుత్వం పడిపోయాక వాజ్ పేయ్ రాజకీయాలకు దూరం కావడంతో బ్రజేష్ మిశ్రాకూడా బీజేపీకి దూరమైపోయారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో, పాక్, చైనా దేశాలతో సంబంధాల విషయంలో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుగా 1998లో నియమితులైన ఆయన ఆ పదవిలో 2004 మే 23 వరకు కొనసాగారు.

విమలక్కపై టిఆర్ ఎస్ ప్రతి విమర్శలు

ఢిల్లీలో ఎవరికాళ్లో పట్టుకుంటే తెలంగాణ రాదంటూ విమలక్క చేసిన వ్యాఖ్యలపై టిఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమకు ఎవరి కాళ్లూ పట్టుకోవాల్సిన అవసరమే లేదని, అసలు తెలంగాణ ఉద్యమం ఇంతవరకూ వచ్చిందంటే అదంతా కేవలం కేసీఆర్ పుణ్యమేనని టిఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు చెప్పుకొచ్చారు. నిజంగా టిఆర్ ఎస్ దయనీయ పరిస్థితిలో ఉంటే యూపీఏ  అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ ఎందుకు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలే కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఉద్యమం ఊపందుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడానికి రాజకీయ చతురత కూడా అవసరమని , అందుకే కేసీఆర్ హస్తినలో మకాం వేసి వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ వాదుల్ని క్రూరమృగాలతో పోలుస్తున్న లగడపాటికి దేశ బహిష్కరణ శిక్ష విధించాలంటూ జూపల్లి డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లో జీవవైవిధ్య సదస్సు

హైదరాబాద్ లో జీవ వైవిధ్య సదస్సు ప్రారంభమైంది. 193 దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరయ్యారు. రాబోయే తరాలకు మంచి జీవితాన్ని అందించేందుకు అన్ని దేశాలూ విస్తృత స్థాయిలో కృషి చేయాలని, కాలుష్య రహిత సమాజంలో బతికే హక్కు మానవులందరికీ ఉందని కేంద్ర మంత్రి జయంతి నటరాజన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం వాతావరణ కాలుష్యం పెద్ద తలనొప్పిగా మారిందన్నారు. అభివృద్ధివల్ల ఏర్పడుతున్న పర్యావరణ సమస్యల్ని గుర్తిస్తే మాత్రం సరిపోదని, వాటికి పరిష్కారాలుకూడా కనుక్కోవాలని సూచించారు. 1992లో, 2000 సంవత్సరంలో జరిగిన జీవవైవిధ్య సదస్సులవల్ల చాలావరకూ కదలిక వచ్చిందని, ప్రస్తుతం జరుగుతున్న సదస్సువల్ల అన్ని దేశాల్లోనూ పర్యావరణ పరిరక్షణపట్ల అవగాహన పూర్తి స్థాయిలో పెరుగుతుందని జయంతి నటరాజన్ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై అధిష్టానానికి టి.కాంగ్ ఎంపీల కంప్లైంట్

తెలంగాణ మార్చ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందంటూ టి.కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతుందని, 2014 ఎన్నికల్లో రాహుల్ ని ప్రథానిగా చూడడం కష్టమేనని హెచ్చరించాలని టి.కాంగ్ ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని విస్మరిస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ అధిష్ఠానానికి చిక్కులు తప్పవనే సంకేతాల్ని పంపడమే ఈ ఫిర్యాదు పరోక్ష లక్ష్యమని కొందరు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీమీద ప్రజల్లో నమ్మకం పోయిందని, తిరిగి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తెలంగాణ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని టి.కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానానికి చెప్పబోతున్నారు. ఈసారి రాజీనామాలంటూ చేస్తే తెలంగాణ విషయంలో తాడోపేడో తేలేవరకూ వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు.

రాజీనామాలకు సిద్ధమౌతున్న తెలంగాణ మంత్రులు

  ప్రత్యేక తెలంగాణని సాధించుకునేందుకు తెలంగాణ మంత్రులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. తెలంగాణ మార్చ్ సందర్భంగా రాజుకున్న వేడి మంత్రుల్ని రాజీనామాలకు పురికొల్పుతోంది. ఇంత తతంగం జరుగుతున్నా మంత్రులు చూస్తూ ఊరుకున్నారన్న అపప్రథ రాకుండా ఉండాలంటే రాజీనామాలు చేయడమే మంచి మార్గమని తెలంగాణ జెఎసి నేతలు మంత్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ సారి రాజీనామాలు చేస్తేమాత్రం ఇక వెనకడుగువేసేదిలేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రకటించారు. తెలంగాణ మార్చ్ కి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మరోవైపు తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించారని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో అసాంఘిక శక్తులు ప్రవేశించాయన్న ఆరోపణల్ని సమర్ధంగా ఎదుర్కునేందుకు అంతా కలిసికట్టుగా కృష్టి చేయాలని, అరాచక శక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవాలని దామోదర రాజనర్సింహ జేఏసీ నేతలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మార్చ్ లో పాల్గొనేందుకు వెళ్తున్న చాలామంది నేతల్ని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉపముఖ్యమంత్రి డిజిపిని నిలదీశారు. అలాంటిదేంలేదని ఆయన కొట్టిపారేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన డెప్యూటీ సీఎం రాజీనామాల ప్రతిపాదనపై తీవ్రంగా ఆలోచిస్తున్నారు.   

లగడపాటి దిష్టిబొమ్మ దహనం, ఉస్మానియాలో ఉద్రిక్తత

తెలంగాణ మార్చ్ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మారోసారి ఉద్రిక్తత చెలరేగింది. ఉస్మానియా యూనివర్సిటీని మూసేయాలంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు వర్సిటీ విద్యార్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. రెచ్చిపోయిన విద్యార్దులు ఉస్మానియా పోలీస్టేషన్ పై రాళ్లు రువ్వారు. లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మని తగలబెట్టారు. గుంపుని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాల్ని ప్రయోగించారు. తెలంగాణ వేడి రాజుకున్నప్పుడల్లా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత తలెత్తడం సర్వసాధారణంగా మారిపోయిందని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిసారీ అదనపు బలగాల్ని వర్సిటీలో మోహరించి రెచ్చిపోతున్న విద్యార్ధుల్ని అదుపుచేయడానికి ప్రయత్నించడం కష్టంగా ఉందని పోలీసులు అంటున్నారు. విద్యార్ధుల ముసుగులో కొన్ని అసాంఘిక శక్తులు యూనివర్సిటీలో తిష్టవేశాయన్న ఆరోపణలుకూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ మార్చ్ నేపధ్యంలో యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంటుందని ముందుగానే ఊహించి, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి విద్యార్ధులు విధ్వంసానికి దిగకుండా అడ్డుకున్నామని పోలీసులు అంటున్నారు.

తెలంగాణ మార్చ్, రణరంగంగా మారిన నెక్లెస్ రోడ్

  నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న తెలంగాణ మార్చ్ వేదిక వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తెలంగాణ వాదులు తొలగించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు, వాటర్‌కేన్లను ప్రయోగించారు. దీంతో వేదిక వద్ద కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఖైరతాబాద్ నుండి తెలంగాణ కవాతు కోసం వస్తున్న ఓ తెలంగాణవాది తల పగిలింది. పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను, బారీకేడ్లను దాటుకొని వచ్చేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెక్లెస్‌రోడ్డులో దగ్గరలో ఉన్న జలవిహార్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది. ఈ ఘటనకు ఎవరు పాల్పడింది తెలియరాలేదు.

పదవులకు రాజీనామా చేసే టైం వచ్చింది: జానా

టీ. ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడం పై జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల అరెస్ట్‌ బాధాకరమన్నారు, వెంటనే టీ. కాంగ్రెస్ ఎంపీలను విడుదలచేయాలని అన్నారు. తెలంగాణ కవాతుపై ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను కుడా వెంటనే విడుదల చేయాలని, అవసరమైతే భవిష్యత్‌లో పదవులను లెక్కచేయని పరిస్థితులు ఎదురుకావొచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. అలాగే, కవాతుపై ఉద్యమ నేతలు ఇచ్చిన హామీని సైతం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో ధూంధాం నిర్వహిస్తున్న వారిని, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు అనుమతి ఉన్నప్పటికీ ర్యాలీగా వస్తే మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు.      

టీ కాంగ్రెస్ ఎంపీలు అరెస్ట్, సీఎంపై ఫైర్

తెలంగాణ వాదుల అరెస్టులకు నిరసనగా సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన టీ. ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడంతో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా? లేక పార్లమెంటరీ వ్యవస్థ నడుస్తుందా? అని ప్రశ్నించారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.   ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అరెస్టులు ఆపకపోతే సీఎం కిరణ్ ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఇవాళ సీఎంతో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అంటే సీఎంకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చీము, నెత్తురు ఉంటే తక్షణమే మంత్రులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వైపు విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం, లాఠీచార్జ్ జరుగుతోంది. మరోవైపు అరెస్టుల పరంపర కొనసాగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సిగ్గు, శరం ఉంటే సీఎం కిరణ్ సర్కార్‌కు వత్తాసు పలకకుండా తెలంగాణ కోసం పోరాడాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ కవాతు, రణరంగంగా మారిన ఓయు

  ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం ఉదయం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెక్లస్ రోడ్డులోని తెలంగాణ కవాతు వేదిక వద్దకు బైక్ ర్యాలీతో బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకోవడంతో వారు పోలీసులతో గొడవకు దిగారు.విద్యార్థులు పోలీసులు వేసిన బారీకేడ్లను, ముళ్లకంచెను తొలగించి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సమయంలో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను విద్యార్థుల పైకి ప్రయోగించారు. దీంతో ఈ ఘటనలో ఓ విద్యార్థికి ఓ తూటా తగిలి గాయమైనట్లుగా తెలుస్తోంది.

11 గంటలకు పూర్తికానున్న నిమజ్జనం

ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనం కోసం నిన్న బయలుదేరిన విగ్రహాలు ఇంకా ఆదివారం ఉదయం కుడా ట్యాంక్ బండ్ వద్ద బారులు తీరాయి. ఆదివారం 11 గంటలకు మొత్తం విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. నిన్న హైదరాబాద్ నగరం భక్తజన సంద్రంగా మారింది. ఒకవైపు చిరుజల్లులతో మొదలైన వర్షం జోరుగా కురిసినా భక్తకోటి ఉత్సాహాన్ని అది అడ్డుకోలేకపోయింది. 11 రోజుల పాటు పూజలందుకున్న విఘ్నేశ్వరుడికి భక్తులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చ రిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా రాత్రి ఒంటిగంట లోపే ఖైరతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనం కూడా పూర్తయింది.     హుస్సేన్‌సాగర్‌తో పాటు సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా, కూకట్‌పల్లి, ఐడీపీఎల్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో నిమజ్జన పర్వం కొనసాగింది. భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేశ్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. అత్తాపూర్‌లో హైటెన్షన్ తీగలకు జెండా తగిలి విద్యుదాఘాతంతో ఆరుగురికి గాయాలయ్యాయి. మధ్యాహ్నం వరకు అంతంత మాత్రంగా జరిగిన నిమజ్జనం సాయంత్రానికి ఊపందుకుంది. ఖైరతాబాద్‌లో 58 అడుగుల మేర ఏర్పాటుచేసిన భారీ గణనాథుని ఊరేగింపు కూడా ఈసారి తొందరగా మొదలైంది. ఉదయం మంత్రి దానం నాగేందర్, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, డీజీపీ దినేశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 2.50 ప్రాంతంలో క్రేన్ ద్వారా లడ్డూను తీశారు. మధ్యాహ్నం 3.45కు గణపతిని క్రేన్‌తో 26 చక్రాల ట్రాలర్ మీదకు చేర్చారు. దాదాపు 3 గంటలు సాగిన వెల్డింగ్ పనుల అనంతరం రాత్రి 7గంటల సమయంలో ఊరేగింపు ప్రారంభమైంది.

నిమజ్జనానికి కదిలిన ఖైరతాబాద్ మహాగణపతి

  రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. విజ్ఞేష్వరున్ని తరలించడానికి 26 టైర్ల లారీని సిద్ధం చేశారు. 11 రోజుల పాటు అశేష పూజలందుకున్న మహా గణపతి శోభయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగనుంది. 56 అడుగుల ఎత్తున్న వినాయకుడి నిమజ్జనాన్ని దర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులతో ఖైరతాబాద్ ప్రాంతం నిండిపోయింది. భక్తజన సందోహం మధ్య ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి బయల్దేరాడు. గణనాధున్ని భారీ వాహనంపైకి ఎక్కించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ వరకు ఊరేగింపుగా వెళ్లి హుస్సేన్ సాగర్ లో మహా గణపతి నిమజ్జనమవుతాడు. మహా గణపతి ఈ అర్ధరాత్రికి ట్యాంక్‌బండ్‌కు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున తరలివస్తున్న వినాయక విగ్రహాలతో హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు శోభాయమానంగా మారాయి. నిమజ్జన దృశ్యాలను చూసేందుకు జనం వెల్లువలా వస్తున్నారు.

హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు

నగరంలోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం ఉదయం నుంచే భారీ వినాయకులు సాగర్‌లో నిమజ్జనం అవుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి వస్తున్న అందమైన విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై బారులు తీరాయి. 'గణపతి బబ్బా మోరియా' అంటూ సాగరతీరమంతా మారుమ్రోగుతోంది. ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్డులో భక్తుల కోలాహలం నెలకొంది. చిన్నా, పెద్దా అంతా ఆనందంగా నిమజ్జన వేడుకలో పాల్గొంటున్నారు. వీలైనంత త్వరగా విగ్రహాల నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి ఉత్సవ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. విజ్ఞేష్వరున్ని తరలించడానికి 26 టైర్ల లారీని సిద్ధం చేశారు. 11 రోజుల పాటు అశేష పూజలందుకున్న మహా గణపతి శోభయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగనుంది. 56 అడుగుల ఎత్తున్న వినాయకుడి నిమజ్జనాన్ని దర్శించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులతో ఖైరతాబాద్ ప్రాంతం నిండిపోయింది.  

హీనా రబ్బానీ ఖర్‌ లవ్‌ఎఫైర్

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్‌, పిపిపి నేత బిలావల్ భుట్టోతో ప్రేమ వ్యవహారం నడుపుతోందని బంగ్లాదేశ్ వారపత్రిక బ్లిట్జ్ ప్రచురించింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని రాసింది. వివాహేతర సంబంధం ప్రచారం నేపథ్యంలో హీనాను జర్దారీ విదేశాంగ బాధ్యతల నుండి తొలగించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, బిలావల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను దేశ విదేశాంగ మంత్రిత్వ బాధ్యతల నుంచి హీనా రబ్బానీ ఖర్‌ను తక్షణం తొలగించాలని దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఇస్లామిస్ట్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.     ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లిన పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాటుగా విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఉన్నారు. ఇదిలావుండగా, తన భార్య హీనాకు, పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోకు మధ్య రహస్య ప్రేమాయణం సాగుతున్నట్టు పత్రికలతో పాటు.. ఇంటర్నెట్ సమాజంలో వచ్చిన వార్తలను ఆమె భర్త, పారిశ్రామికవేత్త ఫిరోజ్ గుల్జర్ తీవ్రంగా ఖండించారు.