తెలంగాణ మార్చ్, రణరంగంగా మారిన నెక్లెస్ రోడ్
posted on Sep 30, 2012 @ 5:06PM
నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న తెలంగాణ మార్చ్ వేదిక వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తెలంగాణ వాదులు తొలగించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయువు, వాటర్‌కేన్లను ప్రయోగించారు. దీంతో వేదిక వద్ద కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఖైరతాబాద్ నుండి తెలంగాణ కవాతు కోసం వస్తున్న ఓ తెలంగాణవాది తల పగిలింది. పోలీసులు ఏర్పాటు చేసిన ముళ్ల కంచెను, బారీకేడ్లను దాటుకొని వచ్చేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నెక్లెస్‌రోడ్డులో దగ్గరలో ఉన్న జలవిహార్‌కు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చెలరేగింది. ఈ ఘటనకు ఎవరు పాల్పడింది తెలియరాలేదు.