Read more!

పసిప్రాణాన్ని మింగిన జగన్ నిర్లక్ష్యం!

Publish Date:Jul 27, 2024

జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు పేరుతో పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించి అసంపూర్తిగా మధ్యలో వదిలేసింది. ఇలా మధ్యలో ఆగిపోయిన తరగతి గది లింటెల్, దాని మీద వున్న గోడ కూలి నెల్లూరు భక్తవత్సల నగర్‌ కేఎన్ఆర్ నగరపాలక పాఠశాలలో గురుమహేంద్ర అనే విద్యార్థి మరణించాడు. ఈ పాఠశాలలో 12 గదులను నిర్మించాలని పనులు ప్రారంభించారు. కానీ, ఆ పనులన్నీ రెండేళ్ళ క్రితం ఆగిపోయాయి. ప్రమాదకరంగా వున్న ఈ గదుల్లో విద్యార్థులు ఆటలు ఆడుకుంటున్నారు. ఊహించని విధంగా లెంటెల్, గోడ కూలిపోవడంతో గురుమహేంద్ర మరణించాడు. భవిష్యత్తు మీద ఎన్నో కలలతో చదువుకుంటున్న తమ కుమారుడు మరణించడంతో గురుమహేంద్ర తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ భవనాలు ప్రమాదకరంగా వున్నాయని గతంలో ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని ప్రధానోపాధ్యాయుడు చెబుతున్నారు.  విద్యార్థి మరణానికి దారితీసిన నిర్మాణంలో వున్న తరగతి గదులు, మొండి గోడలను డీఈఓ పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలను కలెక్టర్, పాఠశాల విద్యా కమిషనర్, విద్యాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, ఉన్నతాధికారులకు వివరించారు. దుర్ఘటన మీద స్పందించిన కలెక్టర్ విద్యార్థి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ సంఘటన మీద మంత్రి నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేసి, విచారణకు ఆదేశించారు. విద్యార్థి తల్లిదండ్రులకు అండగా వుంటామని హామీ ఇచ్చారు.

ఏపీ అసెంబ్లీలో తమాషా సంఘటన!

Publish Date:Jul 25, 2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమాషా సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి మీద శ్వేతపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం కేసులు పెట్టిన వాళ్ళు లేచి నిల్చోండి అన్నారు. దాంతో పవన్ కళ్యాణ్‌తో సహా మెజారిటీ సభ్యులు లేచి నిల్చున్నారు. దాంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం వీళ్ళని లోపల వేయాలని కేసులు పెట్టింది. కానీ ప్రజలు వీళ్ళని అసెంబ్లీకి పంపించారు అని అన్నారు. ఆ తర్వాత కేసులేవీ లేని వాళ్ళు లేచి నిల్చోండి అని అడిగారు. అప్పుడు చాలా కొద్దిమంది మాత్రమే లేచి నిల్చున్నారు. ‘మీరు అదృష్టవంతులు’ అని చంద్రబాబు ఈ సందర్భంగా చమత్కరించారు.

అబ్బాయిలలో ఈ విషయాలు అమ్మాయిలకు తెగ నచ్చుతాయట..!

Publish Date:Jun 10, 2024

  అమ్మాయిలు, అబ్బాయిలు.. ఈ జెండర్ మధ్య బేధమే పెద్ద అట్రాక్షన్. అబ్బాయిల పట్ల అమ్మాయిలు.. అమ్మాయిల పట్ల అబ్బాయిలు ఆకర్షితులవడం చాలా కామన్. వ్యక్తిత్వం వల్ల కావచ్చు, అందం వల్ల కావచ్చు, స్టైల్ వల్ల కావచ్చు.. ఏదో ఒక విషయానికి ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవడం అనేది మాత్రం జరిగేదే. అయితే అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిలను చూసి ఆకర్షితులైతే మనసులో దాచుకోలేరు. ఆ ఆకర్షణ ఎక్కువ రోజులు కొనసాగి అదలా ప్రేమగా మారే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అమ్మాయిలు మాత్రం ఎవరైనా అబ్బాయి తనకు నచ్చినా, అబ్బాయిలో కొన్ని విషయాలు నచ్చినా అస్సలు బయట పడరు. బయటకు చెప్పరు కూడా. అమ్మాయిలకు అబ్బాయిలలో నచ్చే విషయాలు కొన్ని ఉన్నాయి. వాటి వైపు ఓ లుక్కేస్తే.. ఫొటోలంటే చాలా ఇష్టం.. అమ్మాయిలకు ఫొటోలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తనకు నచ్చిన అబ్బాయితో ఫొటో దిగడమంటే ఎక్కడలేని సంతోషం వారిలో ఉంటుంది. అబ్బాయిలు తమకు తాము ఇద్దరికీ కలిసి ఫొటోలు తీయాలని, వీడియోలు తీయాలని  అమ్మాయిలు కోరుకుంటారు. ఇలా ఫొటోలు తీసే అబ్బాయిల పట్ల వారు మరింత ప్రేమతో ఉంటారు. ఓపెన్ గా మాట్లాడటం.. ఓపెన్ గా మాట్లాడే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.  జీవితం గురించి ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు, ఇద్దరికి సంబంధించిన కలల గురించి ఓపెన్ గా మాట్లాడటం, ఏదైనా విషయం గురించి లోతుగా మాట్లాడటం లేదా చర్చించడం మొదలైనవి చేయడం వల్ల ఇద్దరి మధ్య బంధం చాలా డీప్ గా ఉన్నట్టు వారు ఫీలవుతారు. అంతేనా అమ్మాయి చెప్పే విషయాన్ని శ్రద్దగా వినేవారు అయితే ఇక అమ్మాయిలకు చాలా పిచ్చి ప్రేమ ఏర్పడుతుంది.  అందుకే అమ్మాయిని ప్రేమిస్తే వారు చెప్పేది శ్రద్దగా వినడం ముఖ్యం. కౌగిలి.. ఒక కౌగిలి బోలెడు ధైర్యాన్ని, నీకు నేనున్నా అనే నమ్మకాన్ని, జీవితం మీద భరోసాను  ఇస్తుంది. తన భాగస్వామి తనను కౌగిలించుకోవడం వల్ల అమ్మాయికి తన భాగస్వామి మీద ప్రేమ పెరుగుతుంది. అమ్మాయిలు బాధలో ఉన్నప్పుడు,  ఆమె దిగులుగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు దగ్గరకు తీసుకోవడం, కౌగిలించుకోవడం,  ఆమె వీపును ప్రేమగా నిమరడం లాంటివి చేస్తే తన అలసట, బాధ అన్నీ మర్చిపోతుంది.                                          *రూపశ్రీ.

పదే పదే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? దాని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాకవుతారు!!

Publish Date:Jul 26, 2024

టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా రకాలుగా సులభతరం చేసిందనడంలో సందేహం లేదు. ఎక్కడికైనా ప్రయాణం చెయ్యాలంటే  ఆటో లేదా టాక్సీ కోసం ఎక్కువసేపు  వెయిట్ చెయ్యాల్సిన అవసరం లేదు. వివిధ రకాల యాప్స్ నుండి క్యాబ్ బుక్ చేసుకుని సౌకర్యవంతంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. షాపింగ్ చేయడానికి చేతిలో క్యాష్ లేకపోయినా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. టెక్నాలజీ మాయ వల్ల చాలా మంది కాలం మొత్తం బిజీ బిజీగా గడుపుతారు. ఈ కారణంగా కనీసం వంట చేసుకోవాలన్నా కష్టంగానే ఉంటుంది చాలామందికి. ఈ కారణంగా నగరాలలో, ఓ మోస్తరు పట్టణాలలో  ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తుంటారు.  బిజీ జీవితాలకు ఆన్లైన్ ఫుడ్ అనేది శ్రమ తగ్గించి రుచికరమైన ఆహారాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. దీని వల్ల  ఇంట్లో కూర్చొని  ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు. కానీ ఇంతకు ముందు  ఈ సౌకర్యాన్ని అయిష్టంగా  ఉపయోగించుకునేవారు. ఆన్లైన్ ఆర్డర్ అంటే ఖర్చు నుండి బోలెడు ఆలోచనలు చుట్టుముట్టేవి. కాస్త వంట వస్తే ఎంతో సులువుగా అయిపోయే భోజనం వందలాది రూపాయలు ఖర్చుపెట్టి కొనాలా అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది.  సమయాన్ని సంపాదించడానికి వెచ్చించేవారు  వంట చేసుకునే సమయంలో డబ్బు సంపాదించి అందులో కొంత ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుందిలే అనే వింత ఆలోచనకు అలవాటు పడ్డారు. ఇక పెద్దవాళ్లు ఇంట్లో లేక అడిగేవారు లేకపోతే ఈ తరం దంపతుల నుండి బ్యాచ్లర్స్ వరకు అందరిదీ ఇదే పంధానే.  తోచినప్పుడల్లా ఫోన్ తీసుకుని ఆర్డర్ పెట్టేయడమే.  నిమిషాల్లో వేడివేడిగా ఆహారం డోర్ డెలివరీ అవుతుంది. ఈ వ్యసనం చాలా దారుణంగా తయారవుతోంది.  ఇది మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.  ఆన్లైన్ ఫుడ్ తినడం వల్ల జరుగుతున్న సమస్యలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. చాలా వరకు  ఫుడ్ డెలివరీ ఎంపికలలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, అలాగే అధిక క్యాలరీలు, తక్కువ పోషకాలు ఉన్న ఆహారాలే ఉంటాయి. కాలక్రమేణా వీటిపై  ఆధారపడటం అసమతుల్య ఆహారం  తీసుకోవడానికి దారితీస్తుంది.  ఇది శరీరంలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాల లోపానికి దారితీస్తుంది. నేటి కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్న ఉబకాయం, అధికబరువు, మధుమేహం వంటి సమస్యకు ఇదిగో ఈ ఆన్లైన్ ఫుడ్ లే కారణమవుతాయి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు, ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తాయి. ఈ రకమైన ఆహారంలో అధిక మొత్తంలో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు,  సోడియం ఉంటాయి, ఇది జీవక్రియను దెబ్బతీస్తుంది.  శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఆన్లైన్ ఫుడ్ కు అలవాటు పడేవారిలో బయటపడిన మరొక దారుణ నిజం ఏమిటంటే చిన్నవయసులోనే వస్తున్న గుండె సంబంధ సమస్యలు. అనారోగ్యకరమైన ఆహారాలు అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  స్ట్రోక్‌తో సహా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అధికంగా వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.  ఇది ధమనులలో  పేరుకుపోతుంది. ఫైబర్  పోషకాలు లేని  ఆహారాలు మలబద్ధకం, కడుపులో వికారం,  పేగుల పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలకు కారణమవుతాయి.  అలాగే వీటిలో అధిక చక్కెర,  అధిక కార్బోహైడ్రేట్ ఉంటాయి. ఇలాంటి ఆహారాలను  తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఊహించనివిధంగా పెరుగుతాయి.  ఇది క్రమంగా  టైప్-2 డయాబెటిస్,  ఇతర జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది . ఆహారాన్ని ఆర్డర్ చేసే వ్యసనం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అంటే సాధారణ ఆహారం ఆరోగ్యానికి అలాగే మనస్సుకు కూడా మంచిది. కానీ  వేయించిన, అధిక కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల  అనేక వ్యాధులకు గురి కావాల్సి ఉంటుంది. ఇది  ఒత్తిడి, ఆందోళన,  నిరాశకు  కారణమవుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. పదే పదే బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్నది.  ఇది  బడ్జెట్‌ను పాడుచేస్తుంది ఆహారంపై అధికంగా ఖర్చు చేయడం వల్ల కలిగే ఆర్థిక ఒత్తిడి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే ప్యాకేజింగ్,  వ్యర్థాలు తరచుగా ఆహార పంపిణీతో ముడిపడి ఉంటాయి, ప్లాస్టిక్ కాలుష్యం వంటి పర్యావరణ సమస్యలకు ఇది  దారి తీస్తుంది.                                                       *నిశ్శబ్ద.
[

Health

]

మీ ఫిట్నెస్ బాగుండాలా?? అయితే ఈ తప్పు చేయొద్దు!

Publish Date:Jul 27, 2024

క్రీడాకారులు అంత ఆక్టివ్ గా, ఫిట్ గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా?? చాలామంది వారి ఆహారం అని, వారు చేసే వ్యాయామమని అంటారు. కానీ ఇది శుద్ధ తప్పు. అవన్నీ ఎంత పక్కాగా పాటించినా నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఎవరూ ఫిట్ గా ఉండలేరు. దీన్ని బట్టి చూస్తే నిద్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. నిద్ర ఒక గొప్ప ఔషధం అని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప క్రీడాకారులు తమ ఒత్తిడిని చక్కగా అధిగమిస్తున్నారన్నా, రోజును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారన్నా దానికి వారి నిద్రా విధానాలే మూల కారణం. మానవ జీవక్రియకు, కణజాలాల పెరుగుదలకు శరీరంలో కండరాల మరమ్మత్తులో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న చక్కని నిద్ర ద్వారానే సాధ్యమవుతుంది. సరిగ్గా గమనిస్తే నిద్ర చక్కగా ఉన్నవారు, నిద్రలేమి సమస్య, నిద్రకు సరైన సమయం కేటాయించని వారిని కంపెర్ చేస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మనిషి ఫిట్నెస్ లో నిద్ర కీ పాయింట్ అని అంటున్నారు. ఏరోబిక్ ఫిట్నెస్ ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికి చాలా చక్కని ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాయామాలలో భాగంగా శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. కండరాల పెరుగుదల కోసం.. శరీర కంధర సామర్థ్యం చక్కగా ఉండాలంటే కండరాలను కష్టపెట్టడమే మార్గం కాదు. ఆ కండరాలు రిలాక్స్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిద్ర దానికి చక్కని మార్గం. కండర వ్యవస్థ నిద్రలో బలోపేతం అవుతుంది. అలాగే కండరాలకు తగినంత ప్రోటీన్లు కూడా అందితే కండరాలు దృఢంగా మారతాయి.  హార్మోన్ల గుట్టు టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అనేవి అనాబాలిక్ హార్మోన్లుగా పిలవబడతాయి. ఈ రెండూ నిద్రలోనే విడుదల అవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో రకాల కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా జరిగి ఫిట్నెస్ బావుంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా మంచి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి బాగా లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండా కేవలం మెదడు మీద భారం పడుతూ ఒత్తిడుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో నిద్ర చక్కని ఔషధం. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఫిట్నెస్ కి మొదటి అడుగు పర్ఫెక్ట్ గా పడినట్టే..                                    ◆నిశ్శబ్ద.