హీనా రబ్బానీ ఖర్ లవ్‌ఎఫైర్
posted on Sep 29, 2012 @ 12:39PM
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్, పిపిపి నేత బిలావల్ భుట్టోతో ప్రేమ వ్యవహారం నడుపుతోందని బంగ్లాదేశ్ వారపత్రిక బ్లిట్జ్ ప్రచురించింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం అక్రమంగా ప్రేమ వ్యవహారం నడిపితే శిక్షార్హమేనని రాసింది. వివాహేతర సంబంధం ప్రచారం నేపథ్యంలో హీనాను జర్దారీ విదేశాంగ బాధ్యతల నుండి తొలగించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేకాకుండా, బిలావల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు గాను దేశ విదేశాంగ మంత్రిత్వ బాధ్యతల నుంచి హీనా రబ్బానీ ఖర్‌ను తక్షణం తొలగించాలని దేశాధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఇస్లామిస్ట్ గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రస్తుతం న్యూయార్క్‌లో జరుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు అమెరికాకు వెళ్లిన పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో పాటుగా విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖర్ ఉన్నారు. ఇదిలావుండగా, తన భార్య హీనాకు, పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టోకు మధ్య రహస్య ప్రేమాయణం సాగుతున్నట్టు పత్రికలతో పాటు.. ఇంటర్నెట్ సమాజంలో వచ్చిన వార్తలను ఆమె భర్త, పారిశ్రామికవేత్త ఫిరోజ్ గుల్జర్ తీవ్రంగా ఖండించారు.