తెలంగాణ కవాతు, రణరంగంగా మారిన ఓయు
posted on Sep 30, 2012 @ 1:41PM
ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం ఉదయం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెక్లస్ రోడ్డులోని తెలంగాణ కవాతు వేదిక వద్దకు బైక్ ర్యాలీతో బయలుదేరిన ఓయూ విద్యార్థులను పోలీసులు ఎన్‌సిసి గేటు వద్ద అడ్డుకోవడంతో వారు పోలీసులతో గొడవకు దిగారు.విద్యార్థులు పోలీసులు వేసిన బారీకేడ్లను, ముళ్లకంచెను తొలగించి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ సమయంలో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయు గోళాలను విద్యార్థుల పైకి ప్రయోగించారు. దీంతో ఈ ఘటనలో ఓ విద్యార్థికి ఓ తూటా తగిలి గాయమైనట్లుగా తెలుస్తోంది.