పదవులకు రాజీనామా చేసే టైం వచ్చింది: జానా
posted on Sep 30, 2012 @ 3:22PM
టీ. ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడం పై జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల అరెస్ట్ బాధాకరమన్నారు, వెంటనే టీ. కాంగ్రెస్ ఎంపీలను విడుదలచేయాలని అన్నారు. తెలంగాణ కవాతుపై ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. అరెస్టు చేసిన తెలంగాణవాదులను కుడా వెంటనే విడుదల చేయాలని, అవసరమైతే భవిష్యత్‌లో పదవులను లెక్కచేయని పరిస్థితులు ఎదురుకావొచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. అలాగే, కవాతుపై ఉద్యమ నేతలు ఇచ్చిన హామీని సైతం కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు హైదరాబాదు, తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద న్యూడెమోక్రసీ కార్యకర్తలను పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెక్లస్ రోడ్డులో ధూంధాం నిర్వహిస్తున్న వారిని, ప్రసాద్ ఐమాక్స్ ప్రాంతంలో ర్యాలీగా వస్తున్న తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కవాతుకు అనుమతి ఉన్నప్పటికీ ర్యాలీగా వస్తే మాత్రం అనుమతించేది లేదని పోలీసులు చెబుతున్నారు.