బ్రజేష్ మిశ్రాకి ఘన నివాళి
posted on Oct 1, 2012 @ 4:47PM
దేశానికి మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన బ్రజేష్ మిశ్రాకి ఢిల్లీ లోథీ రోడ్ లోని శ్మశాన వాటికలో ఘనంగా జరిగాయి. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న బ్రజేష్ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వాజ్ పేయ్ హయాంలో బ్రజేష్ ప్రిన్సిపల్ సెక్రటరీగాకూడా పనిచేశారు. తర్వాతి కాలంలో ఐక్యరాజ్యసమితికి భారత్ శాశ్వత ప్రతినిధిగాకూడా పనిచేశారు. 1999లో కార్గిల్ యుద్ధసమయంలో బ్రజేష్ భద్రతా సలహాదారుగా కీలకపాత్రను పోషించారు. ఎన్డీయే ప్రభుత్వం పడిపోయాక వాజ్ పేయ్ రాజకీయాలకు దూరం కావడంతో బ్రజేష్ మిశ్రాకూడా బీజేపీకి దూరమైపోయారు. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల్లో, పాక్, చైనా దేశాలతో సంబంధాల విషయంలో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ మొట్టమొదటి జాతీయ భద్రతా సలహాదారుగా 1998లో నియమితులైన ఆయన ఆ పదవిలో 2004 మే 23 వరకు కొనసాగారు.