పెట్టు బడులే ధ్యేయంగా కేటీఆర్ అమెరికా పర్యటన
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో సమావేశమవుతారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలుచేస్తున్న విధానాలను కంపెనీల ప్రతినిధులకు వివరిస్తారు.