అఖిలపక్ష భేటీకి టి.టిడిపి డిమాండ్
posted on Oct 1, 2012 @ 3:59PM
ఎన్ని అడ్డంకులు ఎదురైనా శాంతియుత వాతావరణంలో తెలంగాణ ప్రజలు మార్చ్ ని నిర్వహించిన తీరు అభినందనీయమని టి.టిడిపి ఫోరం అంటోంది. ఎన్నిరకాలుగా తెలంగాణ ప్రజల్ని అడ్డుకున్నా వాళ్ల మనసుల్లో బలంగా ఉన్న మనోభావాల్ని ఆపలేరని టి.టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పటికైనా పార్టీలన్నీ కలిసొస్తే తెలంగాణని సాధించుకోవడం పెద్ద విషయమేం కాదని, ఇందుకోసం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. తెలంగాణపై లేఖ విషయంలో చంద్రబాబు సరైన వైఖరినే అనుసరించారని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.