కంట్రీ క్లబ్‌ పబ్‌లో‌ లీలలు.. 

నేటి యువత ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరం ఈ విశ్వనగరం లో వినోదాలకు ఎన్నో రకాల వినోద క్షేత్రాలు ఉన్నాయి. అందులో చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నవి పబ్‌లు అని చెప్పాలి. ఈ విశ్వనగరంలో చాలా పబ్బులు  ఉన్నాయి. యువతను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లు.. స్కీమ్‌లు ఇస్తున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా..హైదరాబాద్ కంట్రీ క్లబ్‌ పబ్‌లో‌ లీలలు అన్నీ.. ఇన్నీ.. కావట.! అంతా మసక మసక చీకటేనట.! ఇప్పటికే ఇలాంటి వాటిపై  12 కేసులు ఫైల్ చేశారు హైదరాబాద్ పోలీసులు .. అయినా పబ్ తీరు మారలేదు. కట్ చేస్తే, హైదరాబాద్ కంట్రీ క్లబ్‌‌లో చీకటి మాటున జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కావట.! ఒకడికి సంతోషం , సరదా అయితే మరొకడిది ఆకలి కేకలు, అవసరం పైసా ఎక్కడుంటే దునియా అక్కటే ఉంటది.  బార్‌లో అమ్మాయిలతో డ్యాన్సులు, గేలతో పార్టీలు, సరదాలు చేస్తూ  ఓవర్ టైమ్ పబ్ నడపడమే కాకుండా.. పబ్ మాటున వ్యభిచారం కూడా నడుపుతున్నట్టు హైఫై పబ్ మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో అనేక కేసులు, వివాదాల్లో కంట్రీ క్లబ్ పబ్ చిక్కుకుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా.. ఓవర్ టైమ్ పబ్ నడిపేవారు.. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు.. అంతేకాకుండా పబ్ కు వచ్చిన కస్టమర్లతో వ్యభిచారం చేయించేవారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన గతంలో కేసులు కూడా బుక్కయ్యాయి. 2008 నుంచి ఇప్పటి వరకు.. ఈ పబ్ మీద మొత్తం 12 వివాదాలు ఉన్నాయి. తాజాగా మరో వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌ కంట్రీ క్లబ్ లోని హైఫై పబ్‌. పబ్ అన్న తర్వాత తాగుతారు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అల్లరి కూడా చేస్తారు. ఇలా తనతో  అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి సీసీ పుటేజీ కావాలని ఓ యువతి కోరింది. అయితే సీసీ పుటేజీ ఇస్తే తమ పబ్‌ పరువుపోతుందంటూ.. పబ్ యాజమాన్యం  ఫుటేజ్ ఇవ్వలేదు. అక్కడితో ఊరుకోక ఆ అమ్మాయిపై పబ్‌ సిబ్బంది దాడికి దిగడం.. కొసమెరుపు. తన మీద జరిగిన దాడిపై పంజాగుట్ట పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్ నిర్వాహకుల కోసం గాలింపు చేపట్టారు. పబ్ ఓనర్ మురళీకృష్ణతో పాటు మేనేజర్ శేఖర్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కొంచం వాసన చూస్తేనే ఆగారు అలాంటిది  క్లూ దొరికితే వదులుతారా.  ఈ విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పబ్ లో షేర్లు అమ్మేసిన.. మురళీ అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్నాడు.. ఘటన సమయంలో లేకపోయినా.. వేరే ప్రాంతం నుంచి వచ్చి మరీ దాడి చేశాడు.. ఆ అమ్మాయితో ఏమైనా పర్సనల్ తగాదాలు ఉన్నాయా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

టీటీడీ చైర్మన్ గా మళ్లీ వైవీ.. యువ నేతకు కీలక పదవి..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాబితాను ప్రకటించారు మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు నియామకాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించగా, 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు దక్కాయి. కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేశారు. ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీలకు చైర్మన్ పదవులకు అవకాశం ఇవ్వలేదు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు కోర్పారేషన్ చైర్మన్ పదవుల్లో భారీగా కేటాయింపులు జరిపారు.  గతంలో ఇప్పటివరకు ఎమ్మెల్యే రోజా నిర్వహించిన ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవర్ధన్‌రెడ్డిని నియమించారు.  కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్థానంలో అడపా శేషుకు ఇచ్చారు. రాష్ట్ర విద్యావిభాగం చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా సుధాకర్‌ సతీమణి, రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ, రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్‌గా దాడి రత్నాకర్, ఏపీ ఎండీసీ చైర్మన్‌గా అస్లాం (మదనపల్లి) నియమితులయ్యారు.  వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా సిద్ధార్థ్‌ను నియమించారు.2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు బైరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఆర్థర్‌కు బైరెడ్డికి పడట్లేదని పలుమార్లు వార్తలు పెద్ద ఎత్తునే వచ్చాయి. పేరుకే ఎమ్మెల్యేగా ఆయన గెలిచినా పెత్తనం మాత్రం బైరెడ్డిదే అని వార్తలు కూడా గుప్పుమన్నాయి. పాదయాత్ర సమయంలో నందికొట్కూరు ప్రచార సభలో మాట్లాడిన జగన్.. బైరెడ్డి తన మనసులో ఉన్నాడని ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత గల పోస్ట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు జగన్ ఇచ్చిన హామీని ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా నెరవేర్చారని బైరెడ్డి అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులు చెప్పుకుంటున్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. టీటీడీ ఛైర్మన్‌గా తిరిగి కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. తనను నమ్ముకున్నోళ్లకి ఏమీ చేయలేకపోయానని.. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విషయం సీఎం జగన్‌‌కు వివరించానని కూడా చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. దీంతో ఆయన వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారన్న ప్రచారం కూడా సాగింది. ఇవన్నింటికి చెక్ పెడుతూ.. తాజాగా జగన్ సర్కార్ ప్రకటించిన నామినేటెడ్ పదవుల జాబితాలో సుబ్బారెడ్డి పేరు ఉండటం అందరిని ఆశ్చర్యపరిచింది.

జలాలపై అసలుకే ఎసరొచ్చిందా? ఢిల్లీ పెత్తనంతో నష్టమేనా?

పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లుంది. రొట్టెముక్క కోసం కొట్టుకుంటే.. మధ్యలో కోతి వచ్చి కొట్టుకుపోయినట్లుంది. రాజకీయం కోసం మొదలెట్టారో... తెర వెనక ఏ కథ నడిపించడానికి రక్తి కట్టించారో తెలియదు గాని.. నదీజలాల వివాదాన్ని సడెన్ గా పెంచేశారు కేసీఆర్, జగన్ లు. నీళ్లు లేనప్పుడుంటే అనుకోవచ్చు.. నీళ్లు ఉన్నప్పుడు తగాదా ఎందుకు పడుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. అసలు ఏది కరెక్టో ఏది కాదో చెప్పాల్సిన బాధ్యత కేంద్రానిది కాదా అని చాలామంది ప్రశ్నించారు. సమాధానం ఇవ్వకుండా.. ఏకంగా కొత్త ప్రశ్న మనకు విసిరేసింది కేంద్రం. ఎవరు ఏం చేయాలో చెప్పకుండా అంతా తానే చేస్తానని తేల్చేసింది. అసలుకే ఎసరొచ్చిందా అని ఇప్పుడు తగాదా పడిన నేతలు తలలు పట్టుకున్నారు. ఏపీ నేతలు సంతోషం అంటూనే సవరణలు కోరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతలకు ఆ సంతోషం కూడా మిగల్లేదు. ఇక్కడ మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సింది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని. బాసు అప్పుడే చెప్పాడు ఇలాంటి తగాదాలొస్తాయని. అయితే రాజకీయాల కోసం తగాదాలు అవసరమైనప్పుడల్లా పెట్టుకుంటారని మాత్రం చెప్పలేకపోయాడు. ఇప్పుడు అదే పరిస్దితి వచ్చింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అది కూడా ఏ మీటింగ్ లేకుండా పిడుగులాగా నోటిపికేషన్ ను విసిరేసింది. ఎవరితోనూ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని ప్రకటించేసింది. కేంద్రంలో ఉంది బిజెపి కాకపోయినా.. అక్కడ మోదీ, అమిత్ షాలు లేకపోయినా అంత భయపడనక్కర్లేదు. కాని ఉన్నదెవరో.. వాళ్ల స్టయిల్ ఏంటో అందరికీ తెలుసు. అనుకూలమైన పార్టీ అధికారంలో ఉంటే వరాలు.. లేదంటే కనీసం కంటి చూపు కూడా ఉండదు. అలాంటి వాళ్ల చేతిలోకి ఇన్ని ప్రాజెక్టుల నిర్వహణ వెళ్లిపోతే.. రేపు మాట వినకపోతే మడత పేచీ పెడితే... ఏంటి పరిస్దితి? సపోజ్ ఇప్పుడు జగన్ వారికి అనుకూలంగా ఉన్నాడు.. ఓకె. కేసీఆర్ కూడా వారికి అనుకూలమే అయినా అక్కడ బిజెపికి అధికారం వచ్చే ఛాన్స్ ఉందని బిజెపి అనుకుంటుంది. అందుకని..ఆ అధికారం కోసం కేసీఆర్ ని ఇబ్బంది పెట్టడానికి ఏపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే.. ఏంటి పరిస్ధితి? బిజెపికి రాజకీయంగా కలిసొస్తుందో లేదో గాని..తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనవసరమైన భావోద్వేగాలు పెరిగిపోతాయి.. దీని వలన ప్రజలు ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులు బాగానే ఉంటారు కాని.. అసలు సమస్యలు పక్కకుపోయి.. జనం వాటి గురించే మాట్లాడుకుంటారు. అప్పుడు అసలుకే నష్టం. అందుకే ఇలా అన్నిప్రాజెక్టుల నిర్వహణ బోర్డుల చేతిలోకి..బోర్డులు కేంద్రంలో చేతిలోనూ ఉన్నంతకాలం మెడ మీద కత్తి వేలాడుతూనే ఉంటుంది.

పేకముక్కల లక్ష్మిపార్వతి.. రఘురామ హాట్ కామెంట్స్ 

తెలుగు అకాడమి పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వివాదం కొనసాగుతోంది. జగన్ సర్కార్ నిర్ణయంపై మెజార్టీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. తెలుగు బాషను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ విధానాలు, వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రికి లేఖలు సంధిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. తెలుగు అకాడమీ పేరు మార్పుపై ఘాటుగా స్పందించారు.  ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ రాజు తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చడమేంట‌ని ప్ర‌శ్నించారు. సంస్కృత అకాడమీ కావాలంటే దాని కోసం వేరుగా అకాడ‌మీ పెట్టుకోవాల‌ని సూచించారు.  తెలుగు, సంస్కృత అకాడమీ అంటూ రెండింటినీ క‌లిపి వ్య‌వ‌హ‌రించ‌డం సరికాద‌న్నారు.తెలుగు భాషాభిమానుల మనోభావాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా పేరు మారుస్తారా అని రఘురామ నిలదీశారు. ప్రభుత్వ చర్యను సమర్ధించిన తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మిపార్వతీని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ రఘురామ రాజు.  ల‌క్ష్మీపార్వ‌తి వ‌య‌సులో పెద్ద వార‌ని, అటువంటి వ్య‌క్తి తెలుగు అకాడమీ పేరును తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నార‌ని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ హోదాలో లక్ష్మీపార్వతి ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు సరికాద‌ని అన్నారు.  తెలుగు, సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేంటి? అని ఆమె అంటున్నార‌ని చెప్పారు. రెండు భాష‌లు పేక‌ముక్క‌ల్లా క‌లిసి పోతాయ‌ని లక్ష్మిపార్వతి మాట్లాడటంపై ఘురామ కృష్ణరాజు  ఫైరయ్యారు. పాలు, నీళ్ల‌లా క‌లిసిపోతాయ‌ని అయినా అన‌లేద‌ని పేక‌ముక్క‌లు అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ర‌ఘురామ అభ్యంతరం వ్య‌క్తం చేశారు.  జూద‌ప్రియుల‌కు త‌ప్ప ఇత‌రులెవ్వ‌రికీ రుచించ‌ని విధంగా ఆమె మాట్లాడ‌డం స‌రికాద‌న్నారు రఘురామ రాజు.  ఆ ప‌ద ప్ర‌యోగం వ‌ల్ల తెలుగు భాష‌ను ప్రేమించేవారంతా బాధ‌ప‌డుతున్నారని చెప్పారు.  గొప్ప అకాడ‌మీకి చైర్మ‌న్‌గా ఉన్న ఆమె స్థాయికి ఈ ప‌ద ప్ర‌యోగం త‌గ‌ద‌ని చెప్పారు. పేక‌ముక్క‌లు అంటూ చేసిన వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని  ల‌క్ష్మీపార్వ‌తిని విన్నవించుకుంటున్నానని రఘురామ అన్నారు.

రూపాయలు  2 లక్షలు..  కొట్టేసిన ఎలుకరాజులు..

సంపాదించేవాడికి తెలుసు డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో.. అదే మిడ్డిల్ క్లాస్ లో అయితే మరి ఇబ్బంది పడుతుంటారు.. అందుకే చాలా మంది ఎప్పుడు ఏ కష్టం వస్తదో అని వాళ్ళు సంపాదించినా దాంట్లో కొంత పొదుపు చేసుకుంటారు. అలా కస్టపడి దాచుకున్న రూపాయి రూపాయి ఎవరైనా దొంగతనం చేస్తే.. మనకు ఆ డబ్బులు అనుభవించడానికి మనకు రాసిపెట్టి లేదు అని కొన్ని రోజులు బాధాపడి ఉరుకుంటాం.. కానీ ఆ డబ్బులు మన చేతిలో ఉండికూడా మన అవసరాన్ని తీర్చుకోలేకపోతే మస్తు బాధ అయితది కదా.. తాజాగా ఒక వ్యక్తికి అలాగే జరిగింది.. తాను కస్టపడి రూపాయి రూపాయి దాచి దాదాపు రెండు లక్షలు దాచుకున్నాడు. ఆ డబ్బులు ఉన్నాయి కానీ అతని అవసరానికి పనికిరాకుండా పోయాయి అది ఏంటో ఎలా జరిగిందో మీరే చూడండి..  అది మహబూబాబాద్ మండలం. వేంనూర్ శివారు. ఇందిరానగర్​ తండాకు చెందిన ఒక వ్యక్తి. అతని పేరు రెడ్యా. కూరగాయలు అమ్ముకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే సాఫీగా సాగుతున్న అంతని జీవితంలో ఒక చిక్కు వచ్చి పడింది.  గత 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరిశీలించి కడుపులో కణతి పుట్టిందని.. హైదరాబాద్​కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పారు. సర్జరీకి దాదాపు 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇంకేముంది అప్పటి నుండి ఒక పూత తినితినకుండా డబ్బులు జమ చేసే పనిలేపడ్డాడు.   అంత డబ్బు తన వద్ద లేని రెడ్యా.. నగదు జమ చేయడానికి పూనుకున్నాడు. కడుపులో నొప్పితోనే కూరగాయలు అమ్ముతూ డబ్బు కూడబెట్టాడు. తన వద్ద ఉన్న సొమ్ము.. అప్పు తీసుకొచ్చిన నగదు కలిపి మొత్తం రూ.2 లక్షలు తన ఇంట్లోని బీరువాలో దాచి ఉంచాడు. ఓ రోజు కడుపు నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. కష్టపడి సంపాదించాడు. పైసా పైసా కూడబెట్టాడు. తిండీ తిప్పలు మాని.. అహోరాత్రులు శ్రమించి డబ్బు జమ చేశాడు. ఇక ఆ డబ్బుతో.. కడుపులో పుట్టిన కణతిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నాడు. కానీ.. విధి వక్రీకరించింది. అతడి కష్టాన్ని బుడిదలో పోసిన పన్నీరును చేసింది.ఎలుక చెలగాటం.. ఆ వృద్ధుడికి ప్రాణసంకటం అయింది. బీరువాలో తాను దాచిన సొమ్ము తీసుకుందామని తెరిచి చూసేసరికి.. నోట్లన్ని చిరిగిపోయి కనిపించాయి. ఎలా జరిగిందోనని ఆలోచిస్తే.. ఎలుకలు కొట్టాయని అర్థమైంది. చిరిగిపోయిన నోట్లు తీసుకుని మహబూబాబాద్​లోని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఆ నోట్లు చెల్లవని.. హైదరాబాద్​లోని రిజర్వు బ్యాంక్​కు వెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పగా.. అక్కడ కూడా తీసుకుంటారో లేరోనని వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకుండా.. తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు.

రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎవరికో తెలుసా ? 

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని మోడీతో డైరెక్ట్’గా తలపడేందుకు సిద్దమవుతున్నారా? పదవులతో పని లేకుండా పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు, వ్యూహకర్త తోడుగా అడుగులు వేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. గత కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ వార్తల్లో వ్యక్తిగా మీడియా దృష్టిని గట్టిగా ఆకర్షిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం (జులై 13వ తేదీన) ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాతో సమావేసమయ్యారు. నిజానికి ఈ సమావేశంలో ఏమి చర్చించారు, ఏమి డిసైడ్ చేశారు అనేది,పార్టీ నాయకులకు కానీ, ప్రపంచానికి తెలియదు. కానీ, రాహుల్ గాంధీని, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా ఫోకస్ చేసే విషయంపై అయితే చర్చ జరిగిందని పార్టీ వర్గాలే కాదు రాజకీయ పరిశీలకులు కూడా గట్టిగా విశ్వశిస్తున్నారు.  రాహుల్ గాంధీ లోక్ సభలో పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే, ఎందుకనో ఏమో గానీ,రాహుల్ వెనకడుగు వేశారు. ఆ ప్రతిపాదన పక్కకు పోయింది. దానితో పాటే అంతకు ముందునుంచే సాగుతున్న అధీర్ రంజన్ చౌదరి మారుస్తారన్న ప్రచారం కూడా వెనక్కి పోయింది. జూలై 19 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వరకు అధీర్ రంజన్ చౌదరే లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేతగా కొనసాగుతారని అంటున్నారు.  పార్టీలో బుసలు కొడుతున్న అసమ్మతిపై రాహుల్ గాంధీ తొలిసారిగా చాలా ఘాటుగా స్పందించారు. నిజాలను, నిర్భయంగా ఎదుర్కొనేందుకు భయపడేవారు పార్టీ  చేయివదిలి పోవాలని భీకర ప్రకటన చేశారు. భయం లేనివాళ్లే తమకు కావాలని, అలాంటివాళ్లు ఎక్కడి నుంచి వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పారు.కాంగ్రెస్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సీనియర్ నాయకుల(జీ 23)ను ఉద్దేశింఛి ఆయన ఈమాటలు అన్నారా లేక పంజాబ్’లో ముఖ్యమంత్రి అమరేదర్ పార్టీ రెబెల్ నేత నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య సాగుతున్న అంతర్గత కుమ్ములాటలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో లేక కిశోర్ మాస్టారు స్క్రిప్ట్’నే చదివారో కానీ ఆయన శుక్రవారం  కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా సమావేశంలో చేసిన ఈ ప్రకటన పార్టీలో చర్చకు దారి తీసింది. ఓ వంక, పార్టీ వదిలిపోయిన వారందరూ పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా వెనక్కిరావాలని పార్టీ పెద్దలు ‘ఘర్ వాపసీ’ ప్రయత్నాలలో ఉన్న సమయంలో, ‘ఉంటే ఉండండి పోతే పొండి’ అన్న అర్థం వచ్చే విధంగా రాహుల్ గాంధీ చేసిన ప్రకటన పట్ల పార్టీ వర్గాలు విస్మయాన్ని వ్యక్త పరుస్తున్నాయి. అంతే కాకుండా, పరోక్షంగానే అయినా పార్టీ సీనియర్ నాయకులకు ఆర్ఎస్ఎస్ ముద్ర వేసి  బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.సోషల్ మీడియా సమవేశంలో మాట్లాడిన రాహుల్,” పార్టీలో కొందరు పిరికి వాళ్ళున్నారు. వారిని బయటకు విసిరేయండి. పిరికి వాళ్ళంతా పార్టీని విడిచి వెళ్ళండి. ఆర్ఎస్ఎస్ వైపు పరుగులు తీయండి. మీరు మాకొద్దు. పార్టీకి మీ అవసరం లేదు” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్య వివాదంగా మారింది.  రాహుల్ ధోరణి  పిల్ల వచ్చి గుడ్డును ఎక్కిరించినట్లుందని పార్టీ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు. తరతరాలుగా పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులకు ఆర్ఎస్ఎస్ ముద్రవేసి అలాటి వారు పార్టీ  వదిలి పోవాలని అనడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ తనదైన ధోరణిలో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే  ట్విట్టర్ ‘ను ప్రభావవంతంగా వినియోగించుకుంటున్న రాహుల్ గాంధీ ఇక నుంచి ట్విట్టర్ వేదికగా ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాల్లో ఉన్నారని  తెలుస్తోంది. నిజానికి ఇప్పటికే రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ప్రదాని మోడీ విధానాలు, వైఫల్యాల మీద   బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలం పైన  నిరంతరం అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు, ట్విట్టర్’తో పాటుగా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా మోడీ ఫై యుద్దానికి సిద్దమవుతున్నారు. ఇక మోడీ రాహుల్ దాడిని ఎలా తట్టుకుంటారో చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు.

ఎమ్మెల్యే రోజాకు జగన్ షాక్.. ఉన్న పదవి కూడా ఊస్ట్..  

వైసీపీ ఫ్రైర్ బ్రాండ్ లీడర్ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు షాక్ తగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆమెకు ఝలక్ ఇచ్చారు. మంత్రిపదవి ఆశించిన రోజాకు ఆ పదవి దక్కలేదు. తర్వాత ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయిష్టంగానే ఆ పదవిని నిర్వహిస్తూ వస్తోంది రోజా. అయితే తాజాగా ఆమెకు ఆ పోస్టు కూడా ఊస్టింగ్ అయింది. ఏపీఐఐసీ చైర్మన్ పోస్టును మరో నేతలు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కొంత కాలంగా పార్టీలో రోజాకు పొగ పెడుతున్నారనే ప్రచారం సాగుతుండగా.. అందుకు అనుగుణంగా  ఈ నిర్ణయం ఉందనే చర్చ జరుగుతోంది.  నగరి ఎమ్మెల్యే రోజా కొంత కాలంగా చిత్తూరు వైసీపీలో ఒంటరయ్యారనే ప్రచారం ఉంది. రోజాకు పోమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం జరుగుతోందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మధ్య మాటల యుద్ధం చాలా కాలం సాగింది. ఒకరిపై ఒకరు ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోసుకున్నారు.  నగరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. జిల్లాలో పార్టీ  రాజకీయాలను శాసిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితోనూ రోజాకు విబేధాలున్నాయి.  ఇద్దరి మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరాయని సోషల్  మీడియాలో  ప్రచారం జరిగింది. రోజాకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి వర్గంగా ఉన్న కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి దక్కడంలో మంత్రి పెద్దిరెడ్డి పాత్ర ఉందని రోజా ఆరోపించారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, రోజా మంత్రి పెద్ది రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవని అదే సోషల్ మీడియాలో ద్వారా చెప్పుకున్నారు. అంతేకాదు సయోధ్య చిహ్నంగా రక్షా బంధన్ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టారు.  తాజాగా వైఎస్సార్ జయంతి వేడుకల్లో మరో మారు పార్టీలో వర్గపోరు భగ్గుమంది. రోజా వర్గం ఆమె ప్రత్యర్ధి వర్గానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్  కేజే శాంతికి వర్గం విడివిడిగా వైఎస్ జయంతి  వేడుకలు నిర్వహించడంతో పార్టీలో వర్గపోరు మళ్ళీ మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుందని అంటున్నారు. వైఎస్ జయంతి రోజునే నగరిలో రెండు గ్రూపులు విడివిడిగా నివాళులర్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో రోజా టార్గెట్ ఆమె ప్రత్యర్ధి వర్గం పావులు కదపడం చూస్తుంటే.. పార్టీ పెద్దలే తెర వెనక నుంచి కథ నడుపుతున్నారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 

దేశంలో కరోనా వార్నింగ్ బెల్స్.. 

గత రెండు సంవత్సరాలుగా మనం వింటున్న పేరు కరోనా.. దానితో ఏకంగా సంసారమే చేస్తున్నాం.. ప్రపంచవ్యాపితంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ. ప్రజలు నిత్యం వణుకుతూ  ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. మొదటి వేవ్ అంతంత మాత్రమే ఉన్న సెకండ్ వేవ్ మాత్రం చుక్కలు చూపించింది. కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చింది.. మళ్ళీ థర్డ్ వేవ్ ముంచుకు వస్తుందని వార్తలు వస్స్తున్నాయి.    కొన్ని రోజులుగా ఉపశమనం ఇచ్చింది కరోనా.. అంతలోనే మన వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు.. బార్లు ఓపెన్ చేశారు. ప్రైవేట్ కాలేజీస్ ఓపెన్ చేశారు. వైన్స్ లు.. ఇక రాజకీయ పార్టీలు అయితే యద్దేచ్ఛగా ధర్నాలు, కార్యక్రమాలు, ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇంకా మనదేశంలో కరోనా  యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా దేశంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా పాకుతానే ఉంది.. కరోనా తీవ్రత  కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 19,98,715 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. మరో 560 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.10కోట్లకు చేరగా.. 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న 100 రోజులు చాలా కీలకం కానున్నాయని, అత్యంత అప్రమత్తత అవసరమని అందరు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కరోనా నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచింది. కాగా.. ప్రస్తుతం దేశంలో 4,24,025 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. కొత్తగా 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు. మన దేశంలో ఇప్పటివరకు మొత్తం మరణాలు: 4,13,091 కరోనా మహమ్మారి నుండి కోలుకున్నవారు: 3,02,27,792 ప్రస్తుతం ఇంకా మనదేశంలో ఉన్న  యాక్టివ్​ కేసులు: 4,24,025 మొత్తం కేసులు: 3,10,64,908  వ్యాక్సినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో ఇప్పటివరకు 39,96,95,879 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 42,12,557 డోసులు అందించినట్లు పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 19,98,715 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ వివరించింది.

తిరుమలలో సిఫారస్ లేఖల రగడ.. తెలంగాణ భక్తుల ఆందోళన 

తెలుగు రాష్ట్రాల జల వివాదం ముదిరి ఇతర రంగాలపైనా పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం వద్ద కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కు చెందిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ చెత్తబుట్టలో వేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. గంటల తరబడి పడిగాపులు కాస్తున్న తమ సిఫారస్ లేఖలను పట్టించుకోవడం లేదంటూ వందల సంఖ్యలో తెలంగాణ భక్తులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది.  తిరుమల కొండపై శుక్రవారం రాత్రి తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి తాము తీసుకొచ్చిన ప్రముఖుల సిఫార్సు లేఖలను ఉదయం తీసుకుని.. అర్ధరాత్రి అవుతున్నా టికెట్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోసం పలువురు భక్తుల నుంచి సిఫార్సు లేఖలను జేఈవో కార్యాలయం సిబ్బంది తీసుకున్నారు. రాత్రి 10 గంటలైనా దర్శనం కేటాయింపు మెసెజ్‌ రాకపోవడంతో భక్తులందరూ టికెట్లు విక్రయించే ఎంబీసీ 34కు చేరుకున్నారు. ఎలాంటి కేటాయింపులు జరగలేదని అక్కడి సిబ్బంది చెప్పడంతో భక్తులు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సహనం కోల్పోయిన భక్తులు వారితో వాగ్వాదానికి దిగారు.  ‘తెలంగాణ వాళ్లకు ఎందుకు దర్శన టికెట్లు కేటాయించడం లేదు. దర్శనం లేకపోతే లేదని చెప్పాలే కానీ ఇలా అర్ధరాత్రి వరకు వానలో నిలబెడతారా? అధికారులు, డ్యూటీలో ఉన్నవారెవరూ సమాధానం ఇవ్వడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. చివరికి ఉన్నతాధికారులు విషయం తెలుసుకుని ఆందోళనకు దిగిన భక్తులకు రూ.300 దర్శనం కల్పించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది. ఒకే వీఐపీ రెండు, మూడు సిఫార్సు లేఖలు ఇవ్వడంతోనే సమస్య తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. కొద్దిరోజుల నుంచి ఇలానే దర్శనం కోసం భక్తులు ఆందోళనలకు దిగగా..  పలువురు భక్తులపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. 

జగన్ బెయిల్ రద్దైతే ఏమవుతుందో తెలుసా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కాబోతుందా? జగన్ బెయిల్ రద్దై జైలుకు పోతే ఏం జరగనుంది? వైసీపీని నడిపిదేవరు.. సీఎం పీఠం దక్కేదెవరికి? ఈ చర్చలే కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి.  అక్రమాస్తుల కేసులో గతంలో జైలుకు వెళ్లారు జగన్. 16 నెలలకు పైగా ఆయన జైలు జీవితం గడిపారు. అక్రమాస్తులకు సంబంధించి జగన్ పై మొత్తం 16 చార్జీష్టీట్లు కోర్టుల్లో దాఖలయ్యాయి. అన్ని కేసుల్లోనూ ఏ1గా ఉన్నారు జగన్. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి.  ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ రాజు వేసిన పిటిషన్ తో  ఈ అంశం కీలకంగా మారింది. రఘురామ పిటిషన్ పై ఇప్పటికే సీబీఐ కోర్టులో పలు సార్లు విచారణ జరిగింది. జగన్ తరపు కౌంటర్ కూడా దాఖలైంది. రఘురామ తరపున లాయర్ వాదనలు కూడా వినిపించారు. సాక్షులను ప్రభావితం చేస్తున్నందున జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషనర్ గట్టిగా కోరుతున్నారు.  ఈ కేసులో గతంలో కౌంటర్  దాఖలు చేయకుండా చట్ట ప్రకారం వెళ్లాలని కోరింది సీబీఐ. బెయిల్ రద్దు చేయాలని కాని వద్దని కాని చెప్పలేదు. అయితే జూలై 14న జరిగిన విచారణలో మాత్రం తన స్టాండ్ మార్చుకుంది సీబీఐ. కౌంటర్ వేయడానికి తమకు 10 రోజుల గడువు కావాలని కోరింది. దీంతో  విచారణకు జూలై 26కు వాయిదా వేసింది సీబీఐ కోర్టు.  జగన్ బెయిల్ రద్దు కేసులో సీబీఐ కౌంటర్ లో ఏం ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో చట్ట ప్రకారం వెళ్లాలని కోర్టును కోరిన సీబీఐ.. తాజాగా మాత్రం కౌంటర్ వేయనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. బెయిల్ రద్దు చేయాలని కోరితే మాత్రం జగన్ జైలుకు వెళ్లడం ఖాయమేనని అంటున్నారు. ఎంపీ రఘురామ రాజు కూడా ఇదే విషయం చెబుతున్నారు. జగన్ బెయిల్ రద్దు కావడం ఖాయమని ఆయన పక్కా ధీమాగా ఉన్నారని అంటున్నారు. కోర్టులో ఏం జరుగుతుందన్న దానిపై వైసీపీ నేతల్లోనూ టెన్షన్ కనిపిస్తోందని తెలుస్తోంది. జగన్ బెయిల్ రద్దైతే ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలు ఎటువైపు దారి తీస్తాయి.. ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు.. వైసీపీని నడిపిదెవరు అన్న చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.  అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దైతే ఏం జరుగుతుందన్న దానిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బెయిలు రద్దు అవుతుందో, లేదో తెలియదు కానీ రఘురామరాజు పార్లమెంటు సభ్యత్వం మాత్రం రద్దవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ కోసం ఏపీలో బలమైన వైసీపీని బీజేపీ వదులుకోదని నారాయణ అన్నారు. రఘురామరాజు కోరుకున్నట్టు బెయిలు రద్దయి జైలుకు వెళ్లినా జగన్‌కు వచ్చే నష్టం ఏమీ ఉండదన్నారు. గతంలో 16 నెలలు జైలులో ఉన్న జగన్ ఆ సానుభూతితో ఎన్నికల్లో గెలిచారని, మరోసారి జైలుకు వెళ్తే ఆయన అర్ధాయుష్షు కాస్తా పూర్ణాయుష్షుగా మారుతుందని నారాయణ కామెంట్ చేశారు. 

వచ్చేస్తోంది.. వచ్చేస్తోంది... థర్డ్ వేవ్.. వచ్చేస్తోంది.. .. 

లాక్ డౌన్ ఎత్తేయగానే అన్ని కార్యక్రమాలు యద్దేచ్ఛగా జరుగుతున్నాయి. పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలు పని ఉన్నాలేకున్న ప్రజలు రోడ్ల మీద విచ్చల విడిగా తిరుగుతున్నారు. ఆరోగ్య నిపుణులు ఎంత చెప్పిన ప్రజలు పార్టీల నాయకులూ వినిపించుకోవడం లేదు.. కానీ మళ్ళీ కరోనాకి భయపడి ప్రాణాలు అరచేతిలోపట్టుకుని ఇంట్లో రగ్గు తన్ని కప్పుకుని టైం రానేవస్తుంది..  వస్తోంది వస్తోంది థర్డ్‌వేవ్‌ వస్తోంది. ఎంతో దూరం లేదు. మళ్ళీ నిత్యం భయం తో మరణవార్తలు వినాల్సిన సమయం ఆసన్నమైంది.  కరోనా మూడో ముప్పు ప్రారంభ దశలో ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే బకెట్ తన్నడం తప్పదు. ఇది ఎవరో ఒకరు చెప్పిన విషయం కాదు ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన హెచ్చరికలివి. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న త‌రుణంలో ప్రపంచ‌వ్యాప్తంగా కోవిడ్ థర్డ్‌వేవ్‌ వేవ్ మొదలైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గేబ్రియాసిస్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. దుర‌దృష్టవ‌శాత్తు మ‌నం క‌రోనా థర్డ్‌వేవ్ ఆరంభద‌శ‌లో ఉన్నామ‌న్న చేదు నిజాన్ని చెప్పింది WHO. క‌రోనా వైర‌స్ నిరంత‌రం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు మారుతోంద‌ని, మ‌రింత  ప్రమాద‌క‌రమైన అతి భయంకరమైన  వేరియంట్లు ఉద్భవిస్తున్నాయ‌ని WHO హెచ్చరించింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ వైర‌స్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 111 దేశాల్లో వెలుగులోకి వచ్చింది. ప్రపంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ స్ట్రెయిన్ వ్యాప్తిచెందే అవ‌కాశాలు ఉన్నట్లు టెడ్రోస్‌ హెచ్చరించారు. కరోనా తగ్గిందన్న అపోహ చాలా దేశాల్లో కన్పిస్తోందని డబ్లుహెచ్‌వో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో కరోనా వేగంగా విజృంభిస్తోందని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. చాలామంది గుంపులు గుంపులుగా తిరుగుతున్నారని.. దీంతో వైరస్‌ మళ్లీ వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించింది. ఒకవైపు వాక్సిన్ ప్రక్రియ యూరప్‌ దేశాలతో పాటు అమెరికాలో వేగంగా జరుగుతున్నప్పటికీ డెల్టా వేరియంట్‌ విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని ప్రపంచదేశాలను భయం వైపు పరిగెత్తిస్తుందని డబ్లుహెచ్‌వో తెలిపింది. నాలుగు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. 10 వారాలు తగ్గినట్టు తగ్గి మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారత్‌లో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండియాలో వారం రోజులుగా.. 38 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో కేసులు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్న సమయంలో అన్ని రాష్ట్రాలు ఒక్కసారిగా ఆంక్షలను ఎత్తేశాయి. జనంలో నిర్లక్ష్యం కూడా పెరిగింది. దీంతో ఎప్పటి లాగే కనీస జాగ్రత్తలను గాలికి వదిలేశారు. మాస్కులు పెట్టడం మానేశారు. విచ్చల విడిగా తిరిగేస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో మళ్లీ రద్దు పెరిగింది. తీర్థయాత్రలు, సామూహిక వేడుకలు మొదలయ్యాయి. ఇలాంటి తప్పిదాలు కొవిడ్‌ మూడో దశకు కారణం కావొచ్చని వైద్యశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు మాస్కులు పెట్టుకుని.. సామజిక దూరం పాటించండి.. 

ఆయన కోసమే భూముల వేలమా? రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారు?

తెలంగాణ ప్రభుత్వానికి కాసుల పంట పండింది. హైదరాబాద్ శివారు  ప్రాంతంలోని భూములకు వేసిన వేలంలో భారీగా ధర పలికింది. కేవలం 65 ఎకరాల భూములను వేలం వేయగా... దాదాపు 22 వందల కోట్లకు అమ్ముడుపోయాయి. కోకాపేటలో ఒక ఎకరానికి గరిష్టంగా 60 కోట్లు పలకగా.. ఖానాపేటలో 55 కోట్లు పలికింది. ఇది గత రెండు రోజులుగా వస్తున్న వార్తలు. ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషాయాన్ని గొప్పగా చెప్పారు.  అయితే భూముల వేలానికి సంబంధించి మరో కోణం బయటికి వస్తోంది. తెలంగాణ సర్కార్ కు కాసుల పంట పండటం కాదు.. భారీగా నష్టం జరిగిందనేది ఆ ఆరోపణ. ఫైర్ బ్రాండ్ లీడర్ , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశారు. అంతేకాదు మై హోం రామేశ్వరరావు కోసమే భూముల వేలం వేశారని, ఇందులో వెయ్యి కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. అంత్జాతీయ బిడ్డర్లు వేలంలో పాల్గొనకుండా చేశారని, భూముల వేలంలో జరిగిన అక్రమాలకు సంబంధించి తన దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయని, అన్ని బయటపెడతానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలతో ఆయన ఏం చెప్పబోతున్నారు, ఏం ఆధారాలు బయటపెట్టనున్నారని సంచలనంగా మారింది.  హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ హైదరాబాద్ లో రియల్ దందా జోరుగానే సాగింది. దీంతో కోకాపేట భూముల వేలం పాటలను ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తాయని ఆశించారు. అందుకోసం ఈ వేలం నిర్వహణకు వివిధ స్థాయిల్లో పలు రకాల కమిటీలను వేశారు. కానీ వేలంలో ఒక్క జాతీయ కంపెనీ మినహా అన్నీ తెలంగాణకు చెందినవే పాల్గొన్నాయి. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది.  విశేషం.  హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేటలోని అత్యంత ఖరీదైన 49.951 ఎకరాలను వేలం వేసింది. దీని ద్వారా రూ.2 వేల కోట్లను సమకూర్చుకోనుంది. ఎకరం రూ.25 కోట్ల వంతున అప్ సెట్ బిడ్ అమౌంట్ గా నిర్ణయించారు. వేలంలో రూ.31.2 కోట్ల నుంచి రూ.60.2 కోట్ల వరకు పలికింది. రాజపుష్ప ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ రెండు ప్లాట్లు(7.755 ఎకరాలు, 1.65 ఎకరాలు), అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ రెండు ప్లాట్లు(7.738 ఎకరాలు, 8.946 ఎకరాలు), హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(ఎకరం), మన్నె సత్యనారాయణరెడ్డి ఒక ప్లాటు(7.721 ఎకరాలు), వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ ఒకటి(7.575 ఎకరాలు) వంతున దక్కించుకున్నాయి. ఇవన్నీ తెలంగాణకు సంబంధించనవే. కేవలం ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఒక ప్లాటు(7.564 ఎకరాలు) దక్కించుకున్నది. ఇదొక్కటే ముంబాయి బేస్డ్ కంపెనీ ఈ వేలం పాటలోని కోకాపేట ఎనిమిది ప్లాట్లల్లో ఏడు లోకల్ వారికే దక్కాయి. అందులోనూ మైహోం సంస్థకు సంబంధించిన కంపెనీలే రెండు ఉన్నట్లు తెలుస్తోంది. అక్వా స్పేస్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు చిరునామా మాదాపూర్‌లోని మై హోం హబ్‌లో ఉంది. దానికి డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, వినోద్ జూపల్లి, శ్యాంరావు జూపల్లి ఉన్నారు. అలాగే హైమా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆఫీసు కూడా మాదాపూర్‌లోని మైహోం హబ్‌లోనే ఉంది. డైరెక్టర్లుగా శ్రీనివాసరావు అరవపల్లి, శ్యాంరావు జూపల్లి, వినోద్ జూపల్లిలు ఉన్నారు. దీన్ని బట్టి కోకాపేట భూముల వేలం కొన్ని కంపెనీలకే కట్టబెట్టడానికేనా అన్న చర్చ మొదలైంది. మై హోం సంస్థ పేరుతో కాకుండా ఇతర పేర్లతో కూడిన కంపెనీల పేరిట దక్కించుకోవడం చర్చగా మారింది. ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మాత్రమే తెలంగాణయేతర కంపెనీగా తెలుస్తోంది.  కోకాపేటలోని ఈ ఎనిమిది ప్లాట్లకు ఎన్ని కంపెనీలు ఈ ఆక్షన్‌లో పాల్గొన్నాయన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన, సదుపాయాలు కలిగిన కోకాపేట భూముల ఈ వేలంపై విస్తృతంగా ప్రచారం కల్పించారు. కానీ ఇతర కంపెనీలు వేలంలో ఎందుకు పాల్గొనలేదో అర్ధం కావడం లేదంటున్నారు.ఎంత ప్రచారం చేసినా పేరెన్నికగన్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వేలం పాటలో ఎందుకు పాల్గొనలేదన్న సందేహాలు కలుగుతున్నాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు దీని వెనుక పెద్ద కుంభకోణమే ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి.   

ముగ్గురి పిల్లలను చంపి.. తానూ చనిపోయిన తల్లి.. .. 

ఒకప్పుడు మనిషి జీవిత కాలం వంద వంవత్సరాల పైనే.. కొంత కాలంగా నుండి అదే మనిషి జీవిత కాలం అరవై సంవత్సరాలకు పడిపోయింది. ఈ మధ్య కాలంలో మనిషి జీవిత కాలాన్ని చెప్పలేం..ఒక మనిషి ఎప్పుడు బకెట్ తన్నుతాడో అర్థం కావడం లేదు.. ఇది పక్కన పెడితే నేటి కాలంలో చాలా మంది ప్రియురాలు వదిలేసిందని , భార్య భర్తల మధ్య గొడవలు అని , ఆఫీస్ లో బాస్ హారష్మెంట్ చేస్తున్నాడని.. తన పై అధికారి వత్తిడి పెరిగిందని..ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు ఆత్మ హత్యలు చేసుకుని చనిపోవడంతో ఆపేయక వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తున్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు  ఆనాధలు అవుతారు అని అనుకుంటున్నారెమో.  అది విశాఖపట్నం జిల్లా.  అరకులోయ ప్రాంతం. శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని శిమిలిగూడ గ్రామాని చెందిన వ్యక్తి. అతని పేరు సంజీవ్. వయసు 38 సంవత్సరాలు. ఆమె పేరు సురేఖ. వయసు 34 సంవత్సరాలు. వారిద్దరూ  భార్య భర్తలు. వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. కొంత వీరి జీవితం సజావుగా సాగిన ఆ తర్వాత  వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేఖ.. భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తాను కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. మనసుని కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. విషయం తెలుసుకున్న అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమయ్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి దండ్రులు చనిపోయే చనిపోయారు కానీ ఆ పసి పిల్లలు ఏం చేశారు.. కనీసం బతికి ఉంటే ఏదైనా సాధించేవాళ్లేమో.. ఆలోచించండి.

ష‌ర్మిల చెంత‌కు కౌశిక్‌రెడ్డి? రేవంత్‌ దెబ్బ‌కు క‌ల చెదిరిన‌ట్టేనా?

ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ అవుతాయాయేం. కౌశిక్‌రెడ్డి చిర‌కాల స్వ‌ప్నం.. హుజురాబాద్ ఎమ్మెల్యే కావ‌డం. అందుకోస‌మే ఆయ‌న 10ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కాంగ్రెస్‌ను న‌మ్ముకొని రాజ‌కీయం చేశారు. ఓసారి ప్ర‌య‌త్నించి ఓడిపోయారు. ఈసారి మ‌రింత గ‌ట్టిగా కొట్లాడ‌తాన‌ని.. గెలుపు పక్కా అనుకునేంత‌లోనే అంతా త‌ల‌కిందులు అయిపోయింది. ఆయ‌న త‌ల‌రాత.. తిక‌మ‌క మ‌క‌తిక‌గా మారిపోయింది. ఒక్క ఫోన్ కాల్‌. ఒకే ఒక్క ఫోన్ కాల్‌. కౌశిక్‌రెడ్డి రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని రంగుల‌రాట్నంలా గిర్రున తిప్పేసింది. ఓ బ్యాడ్‌ మార్నింగ్ ఆయ‌న ఫోన్ ఆడియో వైర‌ల్‌గా మార‌డం.. మ‌ధ్యాహ్నానిక‌ల్లా గాంధీభ‌వ‌న్ నుంచి నోటీసులు రావ‌డం.. సాయంత్రానికి కాంగ్రెస్‌కు రాజీనామా చేయ‌డం.. రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించి పార్టీ నుంచి వెళ్లిపోవ‌డం.. ఇలా ఒక్క‌రోజులోనే కౌశిక్‌రెడ్డి రాజ‌కీయ జీవితం.. న‌డిరోడ్డు మీద‌కు వ‌చ్చింది. ఇప్పుడు ఆ పొలిటిక‌ల్ జంక్ష‌న్‌లో దిక్కుతోచ‌ని స్థితిలో నిల‌బ‌డి ఓ దిక్కుకోసం ఎదురుచూస్తున్నారు పాడి కౌశిక్‌రెడ్డి. త‌న‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ క‌న్ఫామ్ అయింద‌నేది ఆ ఫోన్‌కాల్ సారాంశం. అది నిజ‌మో, అబ‌ద్ద‌మో ఆయ‌న‌కే తెలియాలి. ఆ ఒక్క‌మాటే ఆయ‌న్ను కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేలా చేసింది. రేవంత్‌రెడ్డిపై విమ‌ర్శ‌లు గుప్పించేలా చేసింది. కౌశిక్‌రెడ్డిని చిన్న‌పిల్లాడ‌ని.. ఆయ‌న‌తో కేసీఆరే అలా మాట్లాడించారంటూ రేవంత్ ఆ ఎపిసోడ్‌ను చాలా లైట్‌గా తీసుకున్నారు. అదే స‌మ‌యంలో ఓ అనుమాన‌మూ వ్య‌క్తం చేశారు. కౌశిక్‌కు కేసీఆర్ టీఆర్ఎస్ టికెట్ ఇస్తార‌ని తాను అనుకోవ‌టం లేద‌ని బాంబు పేల్చారు.  రేవంత్‌రెడ్డి అనుమానించిన‌ట్టే జ‌రుగుతోంది. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్‌ రేసులో కౌశిక్‌రెడ్డి లేర‌ని తెలుస్తోంది. ఆయ‌న ఇంకా కారు పార్టీలో చేర‌కున్నా.. రేపేమాపో కారెక్క‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఇన్నాళ్లూ జ‌రిగింది. అయితే, కౌశిక్‌రెడ్డి ఫోన్‌కాల్ వైర‌ల్ కావ‌డం, అందులో కార్య‌క‌ర్త‌ల‌కు డ‌బ్బులు ఖ‌ర్చు చేద్దామంటూ మాట్లాడ‌టం, ఆ వెంట‌నే కాంగ్రెస్‌ను వీడ‌టంతో.. కౌశిక్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింద‌ని అంటున్నారు. కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటూ టీఆర్ఎస్ కోవ‌ర్టుగా ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌.. బ‌ల‌మైన కార‌ణం లేకుండా ఒక్క రోజులోనే అన్నేళ్ల‌పాటు ఉన్న పార్టీని వీడ‌టంతో.. స్థానికంగా కౌశిక్‌రెడ్డి మీద వ్య‌తిరేక‌త వెల్లువెత్తుతోంద‌నే స‌మాచారం ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా కేసీఆర్ దృష్టికి చేరిందంటున్నారు. అందుకే, ఇప్పుడు కౌశిక్‌రెడ్డిని గులాబీ పార్టీ ప‌క్క‌న పెట్టేసింద‌ని.. ఆయ‌న దారి ఆయ‌న చూసుకోమ‌ని చెప్పేసింద‌ని అంటున్నారు. దీంతో.. కొత్త దారి అన్వేష‌ణ‌లో ఉన్న కౌశిక్‌రెడ్డి అడుగులు.. తెలంగాణ‌లో కొత్త పార్టీ అయిన వైఎస్సార్‌టీపీ వైపు ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.  కాంగ్రెస్‌ను వీడుతూ మీడియా స‌మావేశంలోనే కౌశిక్‌రెడ్డి స్ప‌ష్టంగా చెప్పారు.. వైఎస్సార్ మీద అభిమానంతో ఆయ‌న స‌మ‌క్షంలోనే తాను కాంగ్రెస్‌లో చేరాన‌ని. ఆ ఒక్క పాయింట్‌ను బేస్ చేసుకొని.. ష‌ర్మిల పార్టీ ఈయ‌న‌కు గాలం వేయ‌డం.. త‌న‌కు టీఆర్ఎస్ టికెట్ రాద‌ని లీకులు వ‌స్తుండ‌టంతో కౌశిక్‌రెడ్డి సైతం ఆ పార్టీకి ట‌చ్‌లోకి రావ‌డం జ‌రిగిపోయింద‌ట‌. ష‌ర్మిల పార్టీకి చెందిన ఓ కీల‌క నేత‌తో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ట‌. ఇరువ‌ర్గాలు ఓకే అనుకున్నాయ‌ట. అయితే, కౌశిక్‌రెడ్డే కాస్త వెన‌కాడుతున్నార‌ట‌. ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ టీఆర్ఎస్ టికెట్ కోసమే గ‌ట్టిగా ట్రై చేసి.. అది వ‌ర్క‌వుట్ కాక‌పోతేనే.. ష‌ర్మిల పార్టీలో చేరి.. వైఎస్సార్‌టీపీ త‌ర‌ఫున హుజురాబాద్‌లో పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది. కౌశిక్‌కి ఇంకా కారు డోరులు పూర్తిగా మూసుకుపోలేద‌ని.. ర‌న్నింగ్ కార్ ఎక్కేందుకు ఆయ‌న ఇంకా ప‌రుగులు పెడుతున్నార‌ని.. బై బ్యాడ్‌ల‌క్ అది మిస్ అయితే.. అల్ట‌ర్‌నేట్‌గా వైఎస్సార్ ఇమేజ్‌తో ఆయ‌న కూతురు ష‌ర్మిల‌తో చేతులు క‌లిపి.. హుజురాబాద్‌లో పొలిటిక‌ల్ క్రికెట్ ఆడాల‌నేది కౌశిక్‌రెడ్డి గేమ్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. మ‌రి, ఈ ప్ర‌మాద‌క‌ర ఆట‌లో.. ఈ మాజీ క్రికెట‌ర్ మ్యాచ్ విన్ అవుతారా? లేక‌, క్లీన్‌బౌల్డ్ అవుతారా? చూడాలి....   

పంజాబ్ కప్పులో మరో తుపాను.. కెప్టెనే కింగా.. 

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం సమిసి పోయిందని అనుకుంటున్న సమయంలో  మరో ముసలం పుట్టుకొచ్చింది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, మాజీ మంత్రి,ముఖ్యమంత్రి అంతర్గత ప్రత్యర్ధి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్య తలెత్తిన సంధి కుదిరిందని, గురువారం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి హరీష్‌ రావత్‌’ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా అమరీందర్‌ సింగ్‌ను  కొనసాగించడంతో పాటు పీసీసీ పగ్గాలు సిద్ధూకు అప్పజెప్పే ఫార్ములాను కాంగ్రెస్‌ అధిష్ఠానం అమలు చేస్తుందని రావత్ ప్రకతించారు. అయితే, తాజాగా అదే హరీష్‌ రావత్‌ తూచ్ అనట్టూ నాలుక మడతేశారు.ఈ విషయంపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇదలా ఉంటే, పీసీసీ పీఠం సిద్ధూకు అప్పజెప్పడానికి ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ ఎంత మాత్రం సుముఖంగా లేరు. నిజానికి ఈ నిజం రావత్ కూడా తెలుసు, అయితే, ఆప్’కు దగ్గరవుతున్నసంకేతాలు వచ్చిన నేపధ్యంలో అధిష్టానం అనుమతి లేకుండానే, సోనియా గాంధీ పరిశీలనలో ఉన్న ఫార్ములాకు ఆమె ఓకే చెప్పినట్లు ప్రకటన చేశారు.  దీంతో  సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో గురువారం సాయంత్రం అమరీందర్‌ తన సన్నిహితులతో భేటీ కాగా.. అదే సమయంలో సిద్ధూ కూడా తన మద్దతుదారులతో సమావేశం నిర్వహించారు. దీంతో పార్టీలో మరోసారి వేడి వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన సిద్ధూ.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది పంజాబ్ కాంగ్రెస్ ఉత్కంఠ రేపుతోంది. ఓ వంక ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఎటు దారితీస్తుందో అని పార్టీ నాయకులు,ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవంక పంజాబ్’లో అధికారం హస్తగతం చేసుకుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సిద్దూకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉంది. మరో వానక సిద్దూ కూడా ఆప్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకే ఇంట్లో మూడు పార్టీలు.. సమాజ హితం కోసమేనన్న డీఎస్..

ధర్మపురి శ్రీనివాస్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని రాజకీయ నేత.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా రెండు సార్లు వ్యవహించారు డీఎస్. ఆయన పీసీసీగా ఉన్నప్పుడు రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడం మరో విశేషం. ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ నేతగా ఉన్న డీఎస్ కుటుంబంలో రాజకీయంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసిన డీఎస్.. 2017లో టీఆర్ఎస్ లో చేరారు. డీఎస్ ను రాజ్యసభకు పంపారు కేసీఆర్. అయితే కేసీఆర్ తో విభేదాలు రావడంతో కొంత కాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. కాని ఆయన్ను అధికార పార్టీ సస్పెండ్ చేయలేదు. రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీగా అధికారికంగా ఉన్నా.. ఆయన మాత్రం కారు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని చెబుతారు.  అయితే డీఎస్ చిన్న కుమారుడు అర్వింద్ బీజేపీలో చేరి.. ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక పెద్ద కుమారుడు సంజయ్ గతంలో కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. తర్వాత తండ్రితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. డీఎస్ దూరమయ్యాక సంజయ్ కూడా రాజకీయంగా సైలెంటుగానే ఉన్నారు. అయితే ఇటీవలే సంజయ్ మళ్లీ యాక్టివ్ అయ్యారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోగానే వెళ్లి తల కలిశారు. త్వరలో భారీ సభ ద్వారా కాంగ్రెస్ లో చేరతానని ప్రకటించారు. దీంతో డీఎస్ ఇంట్లో ముగ్గురు ముడు పార్టీలు అన్నట్లుగా మారిపోయింది. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మూడు పార్టీల ముచ్చటైన కుటుంబం అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు.  తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారంపై డీఎస్ స్పందించారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలు అంటూ చాలా మంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది లేనిది కేసీఆరే చెప్పాలని వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నది తనకే తెలియదని డీఎస్ కామెంట్ చేశారు. చాలా మంది ఎంపీల ఇళ్లల్లో భార్యాభర్తలు వేర్వేరు పార్టీల్లో ఉన్నారన్నారు డీఎస్. తండ్రి ఒక పార్టీలో ఉంటే కొడుకులు ఇతర పార్టీలో ఉండడం కొత్త విషయం కాదని కొట్టిపారేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ చీఫ్‌గా చక్రం తిప్పానని గుర్తు చేసుకున్నారు.  తన కొడుకులిద్దరు ఏది చేసినా సమాజానికి ఉపయోగపడే విధంగా చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు డీఎస్. ఇద్దరు పిల్లలు స్వతంత్రంగా సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఎదిగారని చెప్పారు. తనకు సంబంధం లేని పార్టీలో అరవింద్ చేరినా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. అతడు కష్టపడి ఎంపీగా గెలిచాడని అన్నారు. నిజామాబాద్ మేయర్‌గా సంజయ్ ఐదు సంవత్సరాలు రిమార్క్ లేకుండా పని చేశాడని డీఎస్ అన్నారు. తనకు జీబులు ఎక్కి, కార్లలో తిరిగి ఫోజులు కొట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు సంజయ్, అరవింద్‌లు రెండు కళ్ళ లాంటి వారని అన్నారు.

యడ్డీకి ఢిల్లీ పిలుపు అందుకేనా..? 

వాన రాకడ ... ప్రాణం పోకడా ఎవరూ ఉహించలేరని అంటారు. ఇప్పుడు దానికి పదవి పోకడను కూడా కలపచ్చు, అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇలాగే, శుక్రవారం, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వచ్చినట్లే, ఉత్తరాఖండ్ ముఖ్యమత్రి తీరద్ సింగ్’కు ఢిల్లీ నుంచి  కాల్ వచ్చింది. పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, చివర్లో ఫినిషింగ్ టచ్’గా ప్రధాని మోడీని కలిశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  సో .. ఈ రోజు (శుక్రవారం) ఢిల్లీ నుంచి కాల్ అందుకుని, ఢిల్లీ చేరిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప  విషయంలోనూ అదే సీన్  రిపీట్ అవుతుందా, అంటే, మోస్ట్లీ.. అలాగే జరగచ్చని బీజేపీ ప్రధాన కార్యాలయం వర్గాల సమాచారం. నిజానికి, యడ్డీకి ఉద్వాసన తప్పదని చాలా కాలంగా  వినిపిస్తోంది. కేంద్ర మంత్రి మండలి పునర్వవ్యవస్థీకరణలో, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి జరిగిన మార్పులు చేర్పులు కూడా అవే సంకేతాలు ఇచ్చాయని, ఇటు పార్టీ వర్గాల్లో అటు రాజకీయ, మీడియా వర్గాలలో చర్చ జరుగుతూనే ఉంది. అలాగే, యడ్డీ నెక్స్ట్ పోస్ట్, ఏపీ గవర్నర్ అని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.  ఇదలా ఉంటే, ఢిల్లీ పిలుపుపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు యడ్యూరప్ప, కుమారుడు విజయేంద్రతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాత్రి ఏడు గంటలకు ప్రధాని మోడీ ని కలుస్తున్నారు. అంతకంటే ముందే పార్టీ అధ్యక్షుడు నడ్డాతోనూ సమావేశమవుతున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, యడ్డీకి ఉద్వాసన ఖాయమని చెప్పేందుకు కూడా  లేదనే మాట కూడా సన్నగా వినిపిస్తోంది. అయితే  గత కొంత కాలంగా పార్టీలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు బహిరంగంగానే ముఖ్యమత్రి యడియూరప్పకు ఉద్వాసన పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన నాయకత్వం, ప్రభుత్వ వ్యవహారాలలో ఆయన కుమరుడు విజయేంద్ర మితిమీరిన జోక్యంపై ఎమ్మెల్యేలు  తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. యడియూరప్ప పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా యడియూరప్పపై విమర్శలు, అసంతృప్తులు ఆగిపోవడం లేదు. వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుమారుడితో సహా యడియూరప్ప ప్రధానిని కలవనుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో వంక పార్టీ అధిష్టానం కూడా యడ్డీ తీరు పట్ల అసంతృప్తిగా ఉందని ఎప్పటినుంచో పార్టీలో వినవస్తోంది.సో.. ఈరోజు కాదంటే రేపు యడ్డీ ఉద్వాసన ఖాయమని అంటున్నారు.  అదలా ఉంటే, యడ్డీ వర్గానికి చెందిన రెవిన్యూ మంత్రి అశోక్ , నాయకత్వ మార్పు పై వస్తున్న ఊహాగానాలను కొట్టి వేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదు. యడియూరప్పే సీఎంగా కొనసాగుతారు. కావేరీ నది సమస్యపై మాట్లాడడానికే ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారని  అశోక్ పేర్కొన్నారు. అయితే కావేరీ నది సమస్యపై మాట్లాడడానికే అయితే,హటాత్తుగా పిలుపు ఎందుకు వచ్చింది,హుటాహుటిన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందని కొదరు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉద్వాసనకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలతో పాటుగా, రాజకీయ విశ్లేషకులు భావిస్తునారు.

బ్రేకింగ్.. టీడీపీ ఎంపీల రాజీనామా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. తెలుగు దేశం పార్టీ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం రాజీనామాలకు సిద్ధమయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. వైసీపీ ఎంపీలు కూడా అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విశాఖ స్టీల్‌పై ముందుండి సీఎం జగన్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు రామ్మోహన్‌నాయుడు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. జగన్ ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని, అందుకే జల వివాదంపై మాట్లాడటం లేదని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని ప్రకటించారు.  టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సుమారు 18 అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై సుదీర్ఘంగా చర్చించారు. జల వివాదంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని కనకమేడల రవీంద్ర ప్రకటించారు. రాష్ట్రంలో పెట్రోల్‌పై అదనపు ట్యాక్స్‌ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నాం అని.. పదేపదే చెప్పిన సీఎం ఏం సాధించారు? అని కనకమేడల ప్రశ్నించారు. తెలుగు భాష, విద్యా విధానాన్ని నాశనం చేయడంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. న్యాయవ్యవస్థపై దాడి అంశంపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని కనకమేడల తెలిపారు.

కానిస్టేబుల్ కామ క్రీడా.. చివరికి తెడా.. 

కాకి చొక్కా వేసి ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులే దాడులు చేస్తుంటే.. సామాన్య ప్రజల భాగాలు ఎవరికి చెప్పుకోవాలి..  భర్త  వరకట్న వేధింపులు ఎదుర్కోంటున్న మహిళ, భర్త  బాధల నుంచి రక్షించాల్సిన పోలీసు వెళితే కానిస్టేబుల్ మహిళలై లైంగిక వేధించాడు. ఆ మహిళను లోబరుచుకుని లైంగికదాడి చేసిన కానిస్టేబుల్ పై పోలీసులు కేసునమోదు చేశారు. అహ్మదాబాద్‌లో నివసించే మహిళ (38) తన మాజీ భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసేందుకు మూడేళ్ల క్రితం స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. మహిళ వద్ద ఫిర్యాదు తీసుకున్న అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇక అంతే ఆమె నిజగానే అతని మాటలు నమ్మింది.. ఆ తరువాత తెలిసింది గొర్రె కసాయిని మమ్మిందని. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ కానిస్టేబుల్ మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత పులిహోర కలిపాడు.  ఈ క్రమంలో ఆ మహిళను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మహిళను ముగ్గులోకి దించాడు  పెళ్లి చేసుకుంటానని  హామీ ఇచ్చి లోబరుచుకున్నాడు. ఇంకేముంది పెళ్లి పేరుతో మూడేళ్లలో తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది. అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో తనతో గడపాలని కూడా కోరాడని, హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని కూడా మహిళ ఆరోపించింది. అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మే నెలలో తనపై దాడిచేసి కొట్టాడని ఆరోపించింది. ఆసమయంలో కేసు ఉపసంహరించుకునేందుకు తనకు డబ్బులు ఇవ్వచూపాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376-ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది దేశంలో పరిస్థితి ఆడవాళ్లపై దాడులు ఎప్పుడు ఆగుతాయో ఏమో.. సహాయం కోరి వచ్చిన ఆడవాళ్లను నిస్సహాయ స్థితిలోకి తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసం..