కంట్రీ క్లబ్ పబ్‌లో లీలలు..
posted on Jul 17, 2021 @ 3:45PM
నేటి యువత ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్ ఒక విశ్వనగరం ఈ విశ్వనగరం లో వినోదాలకు ఎన్నో రకాల వినోద క్షేత్రాలు ఉన్నాయి. అందులో చాలా ప్రాధాన్యత సంపాదించుకున్నవి పబ్‌లు అని చెప్పాలి. ఈ విశ్వనగరంలో చాలా పబ్బులు ఉన్నాయి. యువతను ఆకర్షించేందుకు రకరకాల ప్లాన్‌లు.. స్కీమ్‌లు ఇస్తున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా..హైదరాబాద్ కంట్రీ క్లబ్ పబ్‌లో లీలలు అన్నీ.. ఇన్నీ.. కావట.! అంతా మసక మసక చీకటేనట.! ఇప్పటికే ఇలాంటి వాటిపై 12 కేసులు ఫైల్ చేశారు హైదరాబాద్ పోలీసులు .. అయినా పబ్ తీరు మారలేదు. కట్ చేస్తే, హైదరాబాద్ కంట్రీ క్లబ్‌లో చీకటి మాటున జరిగే అరాచకాలు అన్నీ ఇన్నీ కావట.! ఒకడికి సంతోషం , సరదా అయితే మరొకడిది ఆకలి కేకలు, అవసరం పైసా ఎక్కడుంటే దునియా అక్కటే ఉంటది. బార్‌లో అమ్మాయిలతో డ్యాన్సులు, గేలతో పార్టీలు, సరదాలు చేస్తూ ఓవర్ టైమ్ పబ్ నడపడమే కాకుండా.. పబ్ మాటున వ్యభిచారం కూడా నడుపుతున్నట్టు హైఫై పబ్ మీద ఆరోపణలు ఉన్నాయి.
గతంలో అనేక కేసులు, వివాదాల్లో కంట్రీ క్లబ్ పబ్ చిక్కుకుంది. ఎటువంటి నిబంధనలు పాటించకుండా.. ఓవర్ టైమ్ పబ్ నడిపేవారు.. ముంబై నుంచి అమ్మాయిలను రప్పించి సెక్స్ రాకెట్ నిర్వహించేవారు.. అంతేకాకుండా పబ్ కు వచ్చిన కస్టమర్లతో వ్యభిచారం చేయించేవారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన గతంలో కేసులు కూడా బుక్కయ్యాయి. 2008 నుంచి ఇప్పటి వరకు.. ఈ పబ్ మీద మొత్తం 12 వివాదాలు ఉన్నాయి.
తాజాగా మరో వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ కంట్రీ క్లబ్ లోని హైఫై పబ్. పబ్ అన్న తర్వాత తాగుతారు. ఎవరైనా అమ్మాయి కనిపిస్తే అల్లరి కూడా చేస్తారు. ఇలా తనతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి సీసీ పుటేజీ కావాలని ఓ యువతి కోరింది. అయితే సీసీ పుటేజీ ఇస్తే తమ పబ్ పరువుపోతుందంటూ.. పబ్ యాజమాన్యం ఫుటేజ్ ఇవ్వలేదు. అక్కడితో ఊరుకోక ఆ అమ్మాయిపై పబ్ సిబ్బంది దాడికి దిగడం.. కొసమెరుపు. తన మీద జరిగిన దాడిపై పంజాగుట్ట పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పబ్ నిర్వాహకుల కోసం గాలింపు చేపట్టారు. పబ్ ఓనర్ మురళీకృష్ణతో పాటు మేనేజర్ శేఖర్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు కొంచం వాసన చూస్తేనే ఆగారు అలాంటిది క్లూ దొరికితే వదులుతారా. ఈ విషయంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పబ్ లో షేర్లు అమ్మేసిన.. మురళీ అనవసరంగా ఈ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకున్నాడు.. ఘటన సమయంలో లేకపోయినా.. వేరే ప్రాంతం నుంచి వచ్చి మరీ దాడి చేశాడు.. ఆ అమ్మాయితో ఏమైనా పర్సనల్ తగాదాలు ఉన్నాయా..? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.