కానిస్టేబుల్ కామ క్రీడా.. చివరికి తెడా..
posted on Jul 16, 2021 @ 6:47PM
కాకి చొక్కా వేసి ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులే దాడులు చేస్తుంటే.. సామాన్య ప్రజల భాగాలు ఎవరికి చెప్పుకోవాలి.. భర్త వరకట్న వేధింపులు ఎదుర్కోంటున్న మహిళ, భర్త బాధల నుంచి రక్షించాల్సిన పోలీసు వెళితే కానిస్టేబుల్ మహిళలై లైంగిక వేధించాడు. ఆ మహిళను లోబరుచుకుని లైంగికదాడి చేసిన కానిస్టేబుల్ పై పోలీసులు కేసునమోదు చేశారు.
అహ్మదాబాద్‌లో నివసించే మహిళ (38) తన మాజీ భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసేందుకు మూడేళ్ల క్రితం స్ధానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. మహిళ వద్ద ఫిర్యాదు తీసుకున్న అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇక అంతే ఆమె నిజగానే అతని మాటలు నమ్మింది.. ఆ తరువాత తెలిసింది గొర్రె కసాయిని మమ్మిందని. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆ కానిస్టేబుల్ మహిళతో పలుమార్లు ఫోన్లో మాట్లాడుతూ పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత పులిహోర కలిపాడు. ఈ క్రమంలో ఆ మహిళను పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మహిళను ముగ్గులోకి దించాడు పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లోబరుచుకున్నాడు.
ఇంకేముంది పెళ్లి పేరుతో మూడేళ్లలో తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు మహిళ తన ఫిర్యాదులో పేర్కోంది. అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌లో తనతో గడపాలని కూడా కోరాడని, హోటల్‌లో తనపై లైంగిక దాడి చేశాడని కూడా మహిళ ఆరోపించింది. అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు మే నెలలో తనపై దాడిచేసి కొట్టాడని ఆరోపించింది. ఆసమయంలో కేసు ఉపసంహరించుకునేందుకు తనకు డబ్బులు ఇవ్వచూపాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376-ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అది దేశంలో పరిస్థితి ఆడవాళ్లపై దాడులు ఎప్పుడు ఆగుతాయో ఏమో.. సహాయం కోరి వచ్చిన ఆడవాళ్లను నిస్సహాయ స్థితిలోకి తీసుకెళ్లడం ఎంత వరకు సమంజసం..