దేశంలో కరోనా వార్నింగ్ బెల్స్..
posted on Jul 17, 2021 @ 11:26AM
గత రెండు సంవత్సరాలుగా మనం వింటున్న పేరు కరోనా.. దానితో ఏకంగా సంసారమే చేస్తున్నాం.. ప్రపంచవ్యాపితంగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ. ప్రజలు నిత్యం వణుకుతూ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. మొదటి వేవ్ అంతంత మాత్రమే ఉన్న సెకండ్ వేవ్ మాత్రం చుక్కలు చూపించింది. కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చింది.. మళ్ళీ థర్డ్ వేవ్ ముంచుకు వస్తుందని వార్తలు వస్స్తున్నాయి.
కొన్ని రోజులుగా ఉపశమనం ఇచ్చింది కరోనా.. అంతలోనే మన వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు.. బార్లు ఓపెన్ చేశారు. ప్రైవేట్ కాలేజీస్ ఓపెన్ చేశారు. వైన్స్ లు.. ఇక రాజకీయ పార్టీలు అయితే యద్దేచ్ఛగా ధర్నాలు, కార్యక్రమాలు, ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇంకా మనదేశంలో కరోనా యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా దేశంలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా పాకుతానే ఉంది.. కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 19,98,715 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 560 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.10కోట్లకు చేరగా.. 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న 100 రోజులు చాలా కీలకం కానున్నాయని, అత్యంత అప్రమత్తత అవసరమని అందరు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కరోనా నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని.. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని సూచింది. కాగా.. ప్రస్తుతం దేశంలో 4,24,025 యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 97.31 శాతానికి పెరిగింది. కొత్తగా 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు. మన దేశంలో ఇప్పటివరకు మొత్తం మరణాలు: 4,13,091 కరోనా మహమ్మారి నుండి కోలుకున్నవారు: 3,02,27,792 ప్రస్తుతం ఇంకా మనదేశంలో ఉన్న యాక్టివ్ కేసులు: 4,24,025 మొత్తం కేసులు: 3,10,64,908 వ్యాక్సినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.. దేశంలో ఇప్పటివరకు 39,96,95,879 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 42,12,557 డోసులు అందించినట్లు పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 19,98,715 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.