రూపాయలు 2 లక్షలు.. కొట్టేసిన ఎలుకరాజులు..
posted on Jul 17, 2021 @ 2:04PM
సంపాదించేవాడికి తెలుసు డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో.. అదే మిడ్డిల్ క్లాస్ లో అయితే మరి ఇబ్బంది పడుతుంటారు.. అందుకే చాలా మంది ఎప్పుడు ఏ కష్టం వస్తదో అని వాళ్ళు సంపాదించినా దాంట్లో కొంత పొదుపు చేసుకుంటారు. అలా కస్టపడి దాచుకున్న రూపాయి రూపాయి ఎవరైనా దొంగతనం చేస్తే.. మనకు ఆ డబ్బులు అనుభవించడానికి మనకు రాసిపెట్టి లేదు అని కొన్ని రోజులు బాధాపడి ఉరుకుంటాం.. కానీ ఆ డబ్బులు మన చేతిలో ఉండికూడా మన అవసరాన్ని తీర్చుకోలేకపోతే మస్తు బాధ అయితది కదా.. తాజాగా ఒక వ్యక్తికి అలాగే జరిగింది.. తాను కస్టపడి రూపాయి రూపాయి దాచి దాదాపు రెండు లక్షలు దాచుకున్నాడు. ఆ డబ్బులు ఉన్నాయి కానీ అతని అవసరానికి పనికిరాకుండా పోయాయి అది ఏంటో ఎలా జరిగిందో మీరే చూడండి..
అది మహబూబాబాద్ మండలం. వేంనూర్ శివారు. ఇందిరానగర్ తండాకు చెందిన ఒక వ్యక్తి. అతని పేరు రెడ్యా. కూరగాయలు అమ్ముకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. అయితే సాఫీగా సాగుతున్న అంతని జీవితంలో ఒక చిక్కు వచ్చి పడింది. గత 4 ఏళ్ల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరిశీలించి కడుపులో కణతి పుట్టిందని.. హైదరాబాద్‌కు వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకోవాలని చెప్పారు. సర్జరీకి దాదాపు 4 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. ఇంకేముంది అప్పటి నుండి ఒక పూత తినితినకుండా డబ్బులు జమ చేసే పనిలేపడ్డాడు.
అంత డబ్బు తన వద్ద లేని రెడ్యా.. నగదు జమ చేయడానికి పూనుకున్నాడు. కడుపులో నొప్పితోనే కూరగాయలు అమ్ముతూ డబ్బు కూడబెట్టాడు. తన వద్ద ఉన్న సొమ్ము.. అప్పు తీసుకొచ్చిన నగదు కలిపి మొత్తం రూ.2 లక్షలు తన ఇంట్లోని బీరువాలో దాచి ఉంచాడు. ఓ రోజు కడుపు నొప్పి భరించలేక ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. కష్టపడి సంపాదించాడు. పైసా పైసా కూడబెట్టాడు. తిండీ తిప్పలు మాని.. అహోరాత్రులు శ్రమించి డబ్బు జమ చేశాడు. ఇక ఆ డబ్బుతో.. కడుపులో పుట్టిన కణతిని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోవాలనుకున్నాడు. కానీ.. విధి వక్రీకరించింది. అతడి కష్టాన్ని బుడిదలో పోసిన పన్నీరును చేసింది.ఎలుక చెలగాటం.. ఆ వృద్ధుడికి ప్రాణసంకటం అయింది. బీరువాలో తాను దాచిన సొమ్ము తీసుకుందామని తెరిచి చూసేసరికి.. నోట్లన్ని చిరిగిపోయి కనిపించాయి. ఎలా జరిగిందోనని ఆలోచిస్తే.. ఎలుకలు కొట్టాయని అర్థమైంది. చిరిగిపోయిన నోట్లు తీసుకుని మహబూబాబాద్‌లోని బ్యాంకుల చుట్టూ తిరిగాడు. ఆ నోట్లు చెల్లవని.. హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్‌కు వెళ్లాలని బ్యాంకు అధికారులు చెప్పగా.. అక్కడ కూడా తీసుకుంటారో లేరోనని వృద్ధుడు ఆవేదన చెందుతున్నాడు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. ఎవరి మీదా ఆధారపడకుండా.. తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు.