ముగ్గురి పిల్లలను చంపి.. తానూ చనిపోయిన తల్లి.. ..
posted on Jul 17, 2021 @ 9:33AM
ఒకప్పుడు మనిషి జీవిత కాలం వంద వంవత్సరాల పైనే.. కొంత కాలంగా నుండి అదే మనిషి జీవిత కాలం అరవై సంవత్సరాలకు పడిపోయింది. ఈ మధ్య కాలంలో మనిషి జీవిత కాలాన్ని చెప్పలేం..ఒక మనిషి ఎప్పుడు బకెట్ తన్నుతాడో అర్థం కావడం లేదు.. ఇది పక్కన పెడితే నేటి కాలంలో చాలా మంది ప్రియురాలు వదిలేసిందని , భార్య భర్తల మధ్య గొడవలు అని , ఆఫీస్ లో బాస్ హారష్మెంట్ చేస్తున్నాడని.. తన పై అధికారి వత్తిడి పెరిగిందని..ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. అదే కాకుండా వాళ్ళు ఆత్మ హత్యలు చేసుకుని చనిపోవడంతో ఆపేయక వాళ్ళ పిల్లలను కూడా చంపేస్తున్నారు. వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు ఆనాధలు అవుతారు అని అనుకుంటున్నారెమో.
అది విశాఖపట్నం జిల్లా. అరకులోయ ప్రాంతం. శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాఫీసు కాలనీలో చోటు చేసుకుంది. మండలంలోని శిమిలిగూడ గ్రామాని చెందిన వ్యక్తి. అతని పేరు సంజీవ్. వయసు 38 సంవత్సరాలు. ఆమె పేరు సురేఖ. వయసు 34 సంవత్సరాలు. వారిద్దరూ భార్య భర్తలు. వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. కొంత వీరి జీవితం సజావుగా సాగిన ఆ తర్వాత వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేఖ.. భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తాను కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుంది. మనసుని కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.
విషయం తెలుసుకున్న అరకు శాసన సభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమయ్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి దండ్రులు చనిపోయే చనిపోయారు కానీ ఆ పసి పిల్లలు ఏం చేశారు.. కనీసం బతికి ఉంటే ఏదైనా సాధించేవాళ్లేమో.. ఆలోచించండి.