యూపీలో బీజేపీ,, పంజాబ్’ లో హంగ్!
మూడు నాలుగు నెలల్లో, ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుతం ఈ ఐదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్టంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. మరి వచ్చే సంవత్సరం (2022) ప్రారంభంలో జరిగే ఎన్నికల్లో, ఎవరి ఖాతాలో ఎన్ని రాష్ట్రాలు మిగులుతాయి, ఎవరి చేతినుంచి ఏఏ రాష్ట్రాలు చేజారతాయి అనే విషయంలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోనే కాదు, దేశం అంతటా కూడా రాజకీయ వర్గాలలో ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు చర్చకు వస్తూనే ఉన్నాయో. ఎందుకంటే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, 2024లో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంకేతాలుగా నిలుస్తాయి, అందుకే యూపీ ఎన్నికల పై ఏపీ, తెలంగాణలో కూడా చర్చ జరుగుతూనే ఉంది.
ఎబీపీ-సీ- ఓటర్ నిర్వహించిన సర్వేలో, బీజేపీ ఇప్పుడున్న నాలుగు రాష్ట్రలు, ఉత్తర ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరఖండ్ రాష్ట్రాలలో అధికారాన్ని నిలుపుకుంటుందని,సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్’లో మాత్రం హంగ్ అసెంబ్లీ అనివార్యంగా కనిపిస్తింది,
ఎన్నికల్లో గెలుపు ఓటముల లెక్కలు ఎలా ఉన్నా, ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ఫలితాల ఆధారంగా చూస్తే, జాతీయ రాజకీయ ముఖ్య చిత్రంలో వస్తున్న మార్పులు కూడా, ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జాతీయ స్థాయిలో చూస్తే, బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ. అయితే, తాజా పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఒక వైపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), మరో వైపు నుంఛి తృణమూల్ కాంగ్రెస్ భారీ అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం మొదట్లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో, ఆప్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యాన్మాయంగా ఎదిగే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ఫలితాలలో కూడా, ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. పంజాబ్ లో ఇప్పటికే బీజేపీ, అకాలిదళ్’ను పడగొట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నఆప్, వచ్చే ఎన్నికల్లో, కాంగ్రెస్ పార్టీని కూడా వెనక్కి నెట్టి,హంగ్ అసెంబ్లీ లో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవ్తరిస్తుదాని సర్వ చెపుతోంది. పంజాబ్’లోనే కాదు, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల లోనూ ఆప్,కాంగ్రెస్’ గట్టి పోటీ ఇచ్జే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్’లో లాగా అధికారం అంచులకు చేరక పోవచ్చును కానీ, కాంగ్రెస్ విజయావకాశాలను ఘనంగానే దెబ్బ తీస్తుందని సర్వే లెక్కలు చెపుతున్నాయి. పంజాబ్ తో పాటు మణిపూర్ లో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు,పార్టీని దేబ్బతీసే అవకాశం అధికంగా కనిపిస్తోందని సర్వే నివేదిక తెలియ చేస్తోంది.
తాజా సర్వే ప్రకారం ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ ఓటు షేర్ ఇంచు మించుగా గత (2017) అసెంబ్లీ ఎన్నికలలో ఉన్నట్లే 41 శాతానికి కొంచెం అటూ ఇటుగానే ఉంటుంది. కానీ, సెట్ల సంఖ్య మాత్రం 241-249కే పరిమితం అవుతుంది. సమాజవాదీ పార్టీ, 32 శాతం ఓట్లతో 130 నుంచి 138సీట్లు , బీఎస్పీ 15 శాతం ఓట్లతో 15 నుంచి 19 సీట్లు, కాంగ్రెస్ 6 శాతం ఓటు షేర్’తో 3 నుంచి 7అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాసం ఉందాని సర్వే సూచిస్తోంది.
పంజాబ్ విషయానికొస్తే ఎబీపీ-సీ- ఓటర్ సర్వే ప్రకారం 117 సభ్యుల పంజాబ్ శాసన సభలో ,ఆప్ 36 శాతం ఓటల్తో 49 నుంచి 55 స్థానాలు గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ 32 శాతం ఓట్లతో 30 నుంచి 47 స్థానాలు, అకాలీ దళ్ 22 శాతం ఓటల్తో, 17నుంచి 25 స్థానాలు, బీజేపీ4 శాతం ఓట్లతో 0- 1 స్థానంలో గెలిచే అవకాశం ఉందని సర్వే చెపుతోంది. ఇక మిగిలిన మూడు రాష్ట్రాలు గోవా, మణిపూర్, ఉత్తరా ఖండ్’లో బీజేపీ అధికారం నిలుపుకుంటుందని ఎబీపీ-సీ- ఓటర్ సర్వే చెపుతోంది.