నెలరోజుల్లో బిల్లులు చెల్లించాల్సిందే.. ఇరకాటంలో జగన్ రెడ్డి సర్కార్
posted on Oct 9, 2021 @ 2:36PM
పాలకులు వస్తుంటారు.. పోతుంటారు... కానీ ప్రభుత్వం అనేది మాత్రం నిరంతర ప్రక్రియ... అలా కొనసాగుతూనే ఉంటుంది. ఒక శాశ్వత వ్యవస్థ. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న ఎవరికైనా, ముఖ్యంగా అధికార రాజకీయాలలో మునిగితేలుతున్న వారికి, ఈ చిన్ని సత్యం తెలిసే ఉంటుంది. ఒక వేళ పుట్టుకతో అబ్బిన కొన్ని ‘సుగుణాల’ వలన చేత తెలియక పోయినా, తెలియచేప్పెందుకు అన్నీ తెలిసిన అధికారులు ఉండనే ఉన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు, చెల్లించవలసిన పెండింగ్ బిల్లులు, మా ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి ... చెల్లించదు .. అని ఏ ప్రభుత్వం,ఏ ముఖ్యమంత్రి అయినా మొండికేశారంటే, ఆ ప్రభుత్వం నిస్సందేహంగా ఏపీని ఏలుతున్న వైసీపీ ప్రభుత్వమే అయి ఉంటుంది. ఆ ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డే అయ్యుంటారు. ఎందుకంటే ఇంకెవరూ కూడా, ఇంత ‘చక్కటి’ చండాల ఆలోచన చేయలేరు.ఇది వారికి మాత్రమే దేవుడు ప్రసాదించిన ప్రత్యేక వరం అంటారు, ఏపీ ప్రభుత్వ పనితీరును పరిశీలనగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.
అయితే అది దేవుడు ప్రసాదించిన వరమే అయినా, ఇంకొకటే అయినా, రాజ్యాంగబద్దం కానప్పుడు కోర్టుల మొట్టి కాయలు తప్పవు. అఫ్కోర్స్, అలా మొట్టికాయలు తినడంలో కూడా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పాత రికార్డులను తామే బద్దలు కొట్టుకుంటూ విజయపథంలో ముదుకు సాగుతున్నారు అనుకోండి,
ముఖ్యమంత్రి ‘సీతయ్య’ పోకడలు కారణంగా వస్తున్న కోర్టు తీర్పులతో ఏపీ ప్రభుత్వం మరో మారు ఇరకాటంలో పడింది.గత (టీడీపీ) ప్రభుత్వ హయాంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆపేసిన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఇప్పుడు కాంట్రాక్టర్లు యుద్ధం ప్రకటించారు. ఏకంగా రోడ్డెక్కి ప్రభుత్వాన్నినిలదీస్తున్నారు.అవును మరి,ఒకటా,రెండా ఏకంగా 80 వేల కోట్ల రూపాయల బిల్లులను రెండున్నర సంవత్సరాలు పెండింగ్’లో పెడితే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు.అందుకే, జెండాలు పక్కన పెట్టి కాంట్రక్టర్లు రోడ్డెక్కారు. పాత బిల్లులు ఇవ్వకపోతే ఇకపై ఎవరూ కొత్త పనులు చేసేది లేదని అల్టిమేటం ఇచ్చారు. బిక్షాటన చేసి జగన్ రెడ్డి ప్రభుత్వం పరువును, బట్టలిప్పి బజారులో నిలబెట్టారు.
రాష్ట్రంలో రోడ్ల దురవస్థ రాజకీయ కొరడా ఝుళిపిస్తోంది.జనసేన అదినేత శ్రమదానం అంటూ రోడ్డున పడ్డారు.తెలుగు దేశం పార్టీ, ఎక్కడిక్కడ ఆందోళననలు నిర్వహిస్తోంది. ఒక్క రోడ్లనే కాదు, ఇంకా చాలా చిన్నాచితకా పనులు వివిద కారణాలతో నిలిచి పోయాయి. ఎదో ఒకటి రెండు శాఖలు కాదు, దాదాపు ప్రభుత్వ శాఖలన్నీ కాంట్రాక్టర్లకు బకాయిలు పడ్డాయి. చివరకు పంచాయతీ ఆఫీసులకు సొంత డబ్బులతో రంగులు వేయించిన పంచాయితీ కార్యదర్శులు కూడా ఇప్పుడు ప్రభుత్వంపై, అన్ని కోణాల్లో వత్తిడి తెస్తున్నారు.మరోవైపు వచ్చే నెలలోగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంతోపాటు.. అందరికీ బిల్లులు చెల్లించినట్లు అఫిడవిట్ ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుజగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇటు చూస్తే, అటు చూస్తే ఎటు చూసినా అష్టమ దిక్కే కనిపిస్తోంది అన్నట్ల్గు, జగన్ ప్రభుత్వానికి ఎటుచుసిన పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయి.
నిజానికి,ఈ దయనీయ పరిస్థితి పూర్తిగా,ప్రభుత్వ స్వయంకృతం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు అందరూ టీడీపీ వారే అనే దురాలోచనతో కావచ్చును , అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు,చంద్రబాబు మీద కోపాన్ని, కాంట్రాక్టర్ల మీద చూపారు. కాంట్రక్టర్ల బిల్లులు ఆపేసి,వారికి ఆర్థిక ఇబ్బందులు సృష్టించి, వారు పడుతున్న కష్టాలు తెలుసుకుని ఒక రకంగా అదోరకం ఆనందం పొందారు. అయితే, ఇప్పుడు వైసీపే ప్రభుత్వం తాను తీసుకున్న గోతిలో పడి, ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ పక్క నుంచి కాంట్రాక్టర్లు వీధుల కెక్కి, ప్రభుత్వం పరువు తీస్తున్నారు, మరో వంక కోర్టు కొరడా పట్టుకుని కూర్చుంది, నెల రోజుల్లో బిల్లులు అన్నీ చెల్లించి, అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
మరో వంక రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల పనుల ఆగిపోయి అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వం పై భగ్గుమంటున్నారు. అయితే ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉందని ఎవరూ జాలి పడవలసిన అవసరం లేదు .. చేసుకున్నవారికి చేసుకున్నంత.. అంటున్నారు , జగన్ రెడ్డి బాధితులు.