హుజురాబాద్ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే..
posted on Oct 9, 2021 @ 1:35PM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నామినేషన్లు ముగియడంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేయగా.. తాజాగా కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ విడుదల చేసింది. 20 మందితో క్యాంపయినర్ల జాబితాను ఏఐసీసీ అధికారికంగా విడుదల చేసింది, హుజురాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్ శుక్రవారం నామినేషన్ వేశారు.
హుజురాబాద్ లో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు..
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
దామోదర రాజనర్సింహా
పొన్నం ప్రభాకర్
మధుయాష్కీ గౌడ్
మహేశ్వర్ రెడ్డి
హనుమంతరావు
పొన్నాల లక్ష్మయ్య
అజారుద్దీన్
జగ్గారెడ్డి
మహ్మద్ అలీ షబ్బీర్
ఎమ్మెల్యే సీతక్క
కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ
నాయిని రాజేందర్ రెడ్డి