హుజురాబాద్ పై లేటెస్ట్ సర్వే.. షేకవుతున్న బీజేపీ, టీఆర్ఎస్!
posted on Oct 9, 2021 @ 4:32PM
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికే తెలంగాణ ఇప్పుడు హాట్ టాపిక్, రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా బైపోల్ గురించే చర్చ. హుజురాబాద్ ఏ పార్టీ గెలుస్తుంది అన్న దానిపైనే డిస్కషన్. ఈటల రాజేందర్ రాజీనామాతో జరుగుతున్న ఉప ఎన్నిక ఇప్పుడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారింది. అదే సమయంలో మీడిాయా సంస్థలు, వివిధ సర్వే సంస్థలు హుజురాబాద్ ఫలితంపై ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికపై తాజాగా వచ్చిన ఓ సర్వే సంచలనంగా మారింది. నెల క్రితం జరిపిన సర్వేకు.. ఇప్పటి సర్వే ఫలితంలో తేడా రావడం అందిరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో హుజురాబాద్ లో రోజు రోజుకు సమీకరణలు మారిపోతున్నాయని తెలుస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికపై వచ్చిన లేటెస్ట్ సర్వేలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు ఉన్నట్లు తేలింది. బీజేపీకి 42 శాతం మంది ఓటర్లు, టీఆర్ఎస్ కు 40 శాతం ఓటర్లు మద్దతు ఇచ్చారు. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సమయంలో దాదాపు 75 శాతం మంది ఆయనకు మద్దతు ఇవ్వగా.. తాజా సర్వేలో అది బాగా తగ్గింది. గత నెలలో నిర్వహించిన సర్వేలోనూ ఆయనకు 55 శాతం మంది సపోర్టుగా నిలిచారు. ఇదే ఇప్పుడు బీజేపీని కలవరపరుస్తోంది. హరీష్ రావు ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. అందుకే మూడు నెలల క్రితం 20 శాతానికి తక్కువగా ఉన్న ఓట్ల శాతం ఇప్పుడు 40 శాతానికి చేరిందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ కు ఓట్ల శాతం మరింతగా పెరుగుతుందని గులాబీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్ బల్మూర్, బీజేపీ తరపున మాజీ మంత్రి, ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. సామాజికవర్గాల వారీగా చూస్తే నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వర్గాల్లో.. టీఆర్ఎస్ కు దళిత సామాజికవర్గానికి చెందినవారు 80%, గొల్లకుర్మల సామాజికవర్గానికి చెందినవారు 80%,గౌడలలో 50% ముదిరాజ్ లలో 20 % పద్మశాలిలు 60%,రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 40 %మైనార్టీ వర్గానికి చెందిన వారు 80%మంది మొత్తంగా 40%ప్రజలు టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నారని తేలింది.
ఇక బీజేపీకి గౌడ సామాజికవర్గానికి చెందిన వారు 40% ,ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవారు 80 % పద్మశాలి వర్గానికి చెందిన వారు 40%,రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు 50%మైనార్టీ వర్గానికి చెందినవారు 10% మొత్తంగా 42% మంది ఓటర్లు మొగ్గుచూపారని సర్వేలో తేలింది. సొంత ఇలాఖాగా భావిస్తున్న ఈటలకు కమలాపూర్ లోనూ గట్టి పోటీ కనిపిస్తోంది. జమ్మికుంటలో మాత్రం టీఆర్ఎస్ కంటే ఈటల రాజేందర్ కు ఎక్కువ మద్దతు లభించింది. ఇల్లంతకుంట ,వీణవంక , హుజురాబాద్ లో రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి మాత్రం కేవలం 13% మాత్రం జైకొట్టారు. గత ఎన్నికల్లో ఆరవై వేల ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని ఆర్ధమవుతుంది.మరో ఐదు శాతం మంది మాత్రం ఎటూ చెప్పలేకపోయారు. దీంతో తటస్థంగా ఉన్న ఓటర్లు కీలకంగా మారే అవకాశం ఉంది.