టాప్ న్యూస్ @7PM
posted on Oct 8, 2021 @ 7:28PM
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ పరిస్థితి దిగజారిపోయిందని, చేసిన పనికి డబ్బులు రాక కాంట్రాక్టర్లు రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. ‘మేము కాంట్రాక్టర్లం.. మా బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి, ఆస్తులు కరిగాయి, అప్పులు పెరిగాయి’ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, చిప్పతో ఆర్ధిస్తున్నారని అన్నారు.
------
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఎన్ని వాగ్దానాలు చేసినా...ఎన్ని అరుపులు అరిచినా... రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా.... సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు...పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు...ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని 'వైసీపీ ప్రభుత్వం' మరిచినట్టుంది’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.
-----
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వైసీపీ నేత వేధింపులను సీఎం జగన్‌కు మహిళా వాలెంటీర్ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపారు. నాదెండ్ల ఎంపీటీసీ గుడికందుల యల్లారావు వేధింపుల నుంచి తనను కాపాడలని మహిళా వాలెంటీర్ వేడుకున్నారు. తన ప్రియురాలు కుమార్తెను వాలెంటీర్‌గా పెట్టాలని తనను ఎంపీటీసీ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
-----
ఏపీ సర్కారు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. ఆర్థికమంత్రి అప్పులు శాఖ మంత్రిగా మారారని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వవయ్యా స్వామీ... పనిచేసిన వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగ? అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
----
హుజూరాబాద్‌లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి బీజేపీ నేత ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం, ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలు ఇంతకు ముందు చూడలేదన్నారు.
---------
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా, ప్రతిష్టాత్మకంగా వంద శాతం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీరు అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పడిన కేంద్ర నీతి ఆయోగ్ మరోసారి ప్రసంశించింది. సాక్షాత్తూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ట్విట్టర్ వేదికగా నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు.
-------------
హుజురాబాద్‌లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఏబీఎన్‌తో బీజేపీ నేత ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిందే టీఆర్‌ఎస్ వారేనని ఈటల ఆరోపించారు. తనపై మంత్రి హరీష్‌రావు మతిలేకుండా మాట్లాడుతున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ లేదన్నారు. డబ్బు, మద్యాన్ని కేసీఆర్ నమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.
-------
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. హుజురాబాద్ టీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి పరోక్షంగా మండిపడ్డారు. టీఆర్ఎస్‌లోకి పోతే పదవి వస్తుందని అనుకున్నారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదవీ రాలే.. పైసలు కూడా రాలేదని రేవంత్‌రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హరీష్‌రావు, ఈటల ఇద్దరూ తోడు దొంగలేనని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈటల వందల కోట్లు, కేసీఆర్ వేల కోట్లు సంపాదించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
----
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. ఆర్యన్ ఖాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ముంబయి కోర్టు విచారణ జరిపింది. ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయొద్దని ఎన్సీబీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపించారు. బెయిల్ ఇస్తే, కేసు దర్యాప్తుపై ఆ ప్రభావం పడుతుందని, సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు.
----