టీఆర్ఎస్ దాడుల వెనుక వ్యూహమేంటి? కేసీఆర్ ఇంత స్కెచ్ వేశారా? 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటనలు చాలా సార్లు చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. కాని ఏనాడు అడ్డంకులు రాలేదు. కాని రెండు రోజులుగా బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరి ధాన్యం  కొనుగోళ్లను పరిశీలించేందుకు నల్గొండ జిల్లాకు వచ్చిన సంజయ్ ను అడ్డుకునేందుకు అడుగడుగునా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కొన్నిప్రాంతాల్లో ఆయన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు విసిరారు. పోలీసులు నాలుగైదు ప్రాంతాల్లో లాఠీచార్జీ చేశారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో ఊహించవచ్చు. సహజంగా ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు నిరసనలు ఎదురవుతుంటాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు తమ సమస్యలపై జనాలు వాళ్లను నిలదీస్తుంటారు. కాని ప్రస్తుతం తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విపక్ష నేతలు జనాల్లోకి వెళుతుంటే.. అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. అంతేకాదు అధికార పార్టీనే ఏకంగా బంద్ కు పిలుపిస్తోంది. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. అధికార టీఆర్ఎస్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.  బీజేపీ టార్గెట్ గా నిరసనలు తెలపడం, బండి సంజయ్ పై దాడికి యత్నించడం వెనుక గులాబీ పార్టీకి బలమైన వ్యూహమే ఉందంటున్నారు. హుజురాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా, వందల కొట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ ను ఓడించలేకపోయింది. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ పై జనాల్లో మరింత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. ఎన్నికల కోడ్ తో దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై చిందులు తొక్కారు. ఎన్నికలు ముగియగానే దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ ఆపుతారో చూస్తానంటూ ప్రకటన చేశారు.  అయితే నవంబర్ రెండో వారం కూడా ముగిసింది. అయినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్. ల‌బ్దిదారుల‌కు 10 ల‌క్ష‌ల పంపిణీ జాడే లేదు.  దళిత బంధు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. కొత్తగా రుణాలు దొరికే పరిస్థితి కూడా లేదు.  దళిత బంధు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అందులోభాగంగానే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ నిరసనలు చేయడం, బీజేపీ నేతలను టార్గెట్ చేయడం జరుగుతుందని అంటున్నారు.హుజురాబాద్ ఓట‌మి, న‌వంబ‌ర్ 4 నుంచి ద‌ళిత‌బంధు అమ‌లు విష‌యం మ‌రుగున ప‌రిచేందుకే.. కేసీఆర్ బీజేపీని రెచ్చ‌గొట్టి ఆ ర‌చ్చ‌లో త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని  అంటున్నారు. టీఆర్ఎస్ వ్యూహంతో కొన్ని రోజులుగా దళిత బంధు అంశం, హుజురాబాద్ ఉప ఎన్నికపై కాకుండా ధాన్యం కొనుగోళ్లు, బీజేపీ నేతలతో మాటల యుద్దంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు రోజులుగా సంజయ్ పై జరుగుతున్న దాడులతో మేటర్ పూర్తిగా సైడ్ ట్రాక్ లో పోయింది. కేసీఆర్ అనుకున్నట్లే దళిత బంధు, హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాలు మరుగునపడ్డాయనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎత్తుల్లో భాగంగానే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులకు తెగబుడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి

అమ‌రావ‌తి కోసం మేముసైతం.. అమిత్‌షా దెబ్బ‌కు దిగొస్తున్న ఏపీ బీజేపీ..

వై.స‌త్య‌కుమార్‌. బీజేపీలో బ‌డా నేత‌. పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి. క‌రుడుగ‌ట్టిన ఆర్ఎస్ఎస్ వాది. బీజేపీలో చాలా ప‌వ‌ర్‌ఫుల్‌. మ‌న తెలుగువారే. ఆయ‌న ఈ నెల 28న అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు. జై అమ‌రావ‌తి నినాదం చేయ‌నున్నారు. ఏపీకి అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా ఉంచాలంటూ బీజేపీ ప‌క్షాన డిమాండ్ చేయ‌నున్నారు స‌త్య‌కుమార్‌. జాతీయ నేతనే త‌ర‌లిరానుండ‌టంతో ఇక రాష్ట్ర నాయ‌కులూ ఆయ‌న వెంట న‌డ‌వ‌క త‌ప్ప‌దు. పార్టీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ ధియోధ‌ర్‌, స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజుతో పాటు మిగ‌తా నేత‌లూ రాజ‌ధాని రైతుల‌తో క‌దం క‌దం క‌లిపి పాద‌యాత్ర చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. ఇలా అమ‌రావ‌తి ఉద్య‌మంలో మొద‌టిసారి ప్ర‌త్య‌క్షంగా పార్టిసిపేట్ చేయ‌నుంది భార‌తీయ జ‌న‌తా పార్టీ.  రెండేళ్లుగా ఉద్య‌మం జ‌రుగుతుండ‌గా.. 700 రోజుల త‌ర్వాత ఇప్పుడు బీజేపీకి అమ‌రావ‌తి గుర్తొచ్చింది. అది కూడా అమిత్‌షా రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ మొట్టికాయ‌లు వేయ‌డంతో ఇక్క‌డి నేత‌ల‌కు త‌ల‌బొప్పిక‌ట్టింది. అయినా రాష్ట్ర నేత‌ల త‌ల‌తిక్క కుదిరిన‌ట్టు లేదు. సోమ‌వారం అమిత్‌షా పిచ్చి క్లాస్ పీకినా.. మంగ‌ళ‌వారం పాద‌యాత్ర‌లో బీజేపీ నేత‌ల జాడ లేదు. అమిత్‌షా ఆదేశాల‌తోనైనా క‌మ‌ల‌నాథులు ప‌రుగున వ‌చ్చి.. మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొంటార‌ని అనుకున్నారు. కానీ, తోలుమందం కాషాయ‌ద‌ళం అంత ఈజీగా దారికొస్తుందా? అధికార పార్టీతో ఏళ్లుగా అంట‌కాగుతున్న రాష్ట్ర నాయ‌కులు వెంట‌నే ధ‌ర్మం వైపు నిల‌బ‌డ‌టం సాధ్య‌మ‌వుతుందా? అందుకే, వీళ్ల‌ను ఇలానే వ‌దిలేస్తే.. వారంత‌ట వారు అమ‌రావ‌తి వైపు నిల‌బ‌డ‌ర‌నే విష‌యం జాతీయ నాయ‌క‌త్వానికి అర్థ‌మైపోయింది. అందుకే, స్వ‌యంగా అమిత్‌షా, స‌త్య‌కుమార్ లాంటి బడా నేత‌లే రంగంలోకి దిగారు. అమిత్‌షా ఓ రేంజ్‌లో లెక్చ‌ర్ ఇస్తే.. ఇక బీజేపీ నేష‌న‌ల్ సెక్ర‌ట‌రీ స‌త్య‌కుమార్ తానే స్వ‌యంగా అమ‌రావ‌తి పాద‌యాత్ర‌లో పాల్గొంటానంటూ ప్ర‌క‌టించి.. రాష్ట్ర నాయ‌కుల‌ను దారిన పెడుతున్నారు.  సునీల్ ధియోధ‌ర్‌, సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి.. ఈ ముగ్గురే పార్టీకి తీవ్ర న‌ష్టం చేస్తున్న‌ట్టు గుర్తించి అధిష్టానం వారిపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయింది. బీజేపీ వేదిక‌గా వైసీపీ ఎజెండా అమ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ ఉంది. టీడీపీపై పోరాడుతూ అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా మారార‌నేది ఆరోప‌ణ. జగన్ భక్తులుగా మారి ఏపీలో బీజేపీని నాశ‌నం చేస్తున్నార‌ని సొంతపార్టీ నేతలే అంటున్నారు. వీళ్ల తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అందుకే అమిత్ షా తిరుపతి మీటింగ్‌లో ఆ ముగ్గురికి క్లాస్ పీకారని అంటున్నారు.  వారికి చివ‌రి ఛాన్స్ ఇస్తూ.. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొని త‌ప్పు స‌రి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఓ మీడియాను బీజేపీ నిషేధించ‌డంపైనా మండిప‌డ్డారు. టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను చిన్న‌చూపు చూడ‌టంపైనా  అమిత్‌షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  క‌ట్‌చేస్తే.. అమిత్‌షా మీటింగ్ ముగిసిన వెంట‌నే ఎంపీ సీఎం ర‌మేశ్ ఆ మీడియా ఛానెల్‌లో లైవ్‌కు వ‌చ్చి.. అమిత్‌షా ఆదేశాల‌ను వెంట‌నే అమ‌లు ప‌రిచారు. కానీ, సో కాల్డ్ సీనియ‌ర్స్‌ మాత్రం ఇంకా దారికి వ‌చ్చిన‌ట్టు లేరు. వాళ్లెవ‌రూ పాద‌యాత్ర వైపు అడుగులు వేయ‌డం లేదు. ఆ మీడియాలోనూ ఇంకా క‌నిపించ‌నే లేదు. ఈ విష‌యం తెలిసి అమిత్‌షా.. ఏపీకి చెందిన జాతీయ నేత వై.స‌త్య‌కుమార్‌ను ప‌రిస్థితి సెట్ చేయ‌మ‌ని పుర‌మాయించార‌ని అంటున్నారు. దీంతో.. తాను న‌వంబ‌ర్ 28న అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు స‌త్య‌కుమార్ తెలిపారు. ఆయ‌నంత‌టి వారే వ‌స్తే.. ఇక రాష్ట్ర నేత‌లు జీహుజూర్ అంటూ వెంట న‌డ‌వ‌క త‌ప్ప‌దుగా? జై అమ‌రావ‌తి.. జైజై అమ‌రావ‌తి అంటూ పిడికిలి బిగించాల్సిందేగా? 700 రోజులుగా ఉవ్వెత్తున ఎగుస్తున్న అమ‌రావ‌తి ఉద్య‌మానికి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ బీజేపీ కూడా జ‌త‌క‌లిస్తే.. ఇక రాజ‌ధానితో జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న మూడు ముక్క‌లాట ఆగాల్సిందేగా? అంటున్నారు.

నేతాజీ నుంచి వివేకా దాకా.. ఎన్నో మిస్టరీ మరణాలు!

చరిత్రలోనే కాదు వ్యక్తుల జేవితాలలోనూ చీకటి కోణాలుంటాయి. అలాగే, కొన్ని చావులు మిస్టరీగా మిగిలి పోతుంటాయి. చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్  ఎప్పుడు ఎక్కడ ఎలా చని-పోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే  మిగిలి పోయింది. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.  దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఉన్నత కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ మెట్టినింట కాలు పెట్టిన తర్వాత కొంత కాలానికి  ... ఆ కుటుంబంలో  వరసగా అనుమానస్పద మరణాలు సంభవిచాయని అక్కడా, ఇక్కడా వార్తలు వచ్చాయి. అయితే, దశాబ్దాలు గడుస్తున్నా ఈ అనుమానాస్పద  మరణాలకు సంబందించిన నిజానిజాలు ఏమిటన్నది మటుకు ఇంతవరకు ప్రపంచానికి తేలియదు.  ప్రముఖ రాజకీయ కుటుంబానికి అల్లునిగా వచ్చిన వ్యాపారవేత్త (అప్పుడు ఆయన ఓ మాములు వ్యాపారవేత్త, ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి)  సోదరి, 2001లో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు ప్రమాదంలో చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు, హత్య అన్న ఆరోపణలు వచ్చినా, ఆ తర్వాత కథ ఏ కంచికి  చేరిందో, ఏమైందో ప్రపంచానికి తెలియదు.  ఆతర్వాత రెండేళ్లకు పెద్దింటి అల్లుని సోదరుడు 2003 అనుమానస్పద స్థితిలో హోటల్ గదిలో చనిపోయారు. చివరకు అల్లుదు గారి తండ్రి 2009లో అదే రీతిలో హోటల్ గదిలో అలాగే, అనుమానస్పద స్థితిలోనే చనిపోయారు.  అయితే  ఇవి .. హత్యలా.. ఆత్మ హత్యలా .. సహజ మరణాలా అన్నది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేక పోవచ్చును.  అక్కడి నుంచి, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ కు వస్తే  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయి. ఎవరో కాదు వైఎస్ కుటుంబ సభ్యులే పలు సందర్భాలలో, వైఎస్ మంరణం పట్ల అనుమానాలు వ్యక్త పరిచారు. వైఎస్’ను హత్యచేశారని  ఆరోపించారు. ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త వైపు వేలెత్తి కూడా చూపారు. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, దివంగత నేత పేరు చెప్పుకుని, అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే వ్యాపారవేత్తతో రాజకీయ వియ్యం కలుపుకున్నారు. సో .. వైఎస్ మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. నిజానిజాలు ఎలా ఉన్నా, పరిటాల హత్య, కోడెల శివప్రసాద రావు ‘అత్మహత్యల’ విషయంలోనూ ఇప్పటికీ ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.  అవన్నీ ఒకెత్తు అయితే, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ మర్డర్స్ అన్నిటిలోకీ మరింత మిస్టరీగా   మలుపులు తిరుగుతోంది. వైఎస్ మరణం విషయంలో ఆయన సతీమణి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఎలాగైతే అనుమానాలు వ్యక్త పరిచారో .. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయన మరణం విషయంలో అనుమానాలు వ్యక్త పరిచారు. వివేకా చనిపోయిన రోజున ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తమ పదనాన్న మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరపాలని  మీడియా ముందు డిమాండ్ చేశారు.  ఆ రోజున పులివెందుల ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి  ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. చిత్రం ఏమిటంటే, ఇప్పడు ఆ అవినాష్ రెడ్డి పైనే, అనుమానాలు వ్యక్త మావుతున్నాయి. ఆ రోజున ఆయన ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో ధాంటే’ అన్నట్లుగా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి చెప్పారు.  వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే అని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి సీఎం జగన్‌ నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపణలు చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్‌ కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, వివేకా మర్డర్ మిస్టరీ ఎప్పటికైనా విడి పోతుందా .. దోషులకు శిక్ష పడుతుందా ... ఈ బేతాళ ప్రశ్నకు బదులేది ..  

కేసీఆర్‌-బండి గ‌డ‌బిడ అందుకేనా? రేవంత్‌రెడ్డినే టార్గెటా?

ఆయ‌న తిడ‌తారు. వీళ్లు రివ‌ర్స్ తిడ‌తారు. అధికార పార్టీ ధ‌ర్నాలు చేస్తుంది. కేంద్రంలోని పార్టీ లొల్లిలొల్లి చేస్తుంది. బండి సంజ‌య్ జిల్లాల‌ బాట ప‌డ‌తారు. రైతుల రూపంలో గులాబీ నాయ‌కులు బండికి బ్రేకులు వేస్తారు. అక్క‌డ‌క్క‌డా గుడ్లు కూడా విసురుతారు. ఇలా టీఆర్ఎస్-బీజేపీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న‌ట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అనేక విష‌యాలు డైవ‌ర్ట్ చేసేందుకే.. ఆ రెండు పార్టీలు ఇలా పొలిటిక‌ల్ డ్రామా ఆడుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. రైతుల పేరు చెప్పి.. కారు-క‌మ‌లం త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాయ‌ని మండిప‌డుతున్నారు.  వ‌రి పంట కొన‌మ‌ని కేంద్రం అంటోంద‌ట‌. యాసంగిలో పండిన పంట అంతా కొనాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డుతోంది. అంతా మేమే చేస్తే మీరెందుకు దండ‌గా.. ముందు వానాకాలం వ‌రి మొత్తం కొనేదాకా వ‌ద‌ల‌బోమంటూ బీజేపీ పంతం ప‌డుతోంది. కేంద్రం బాయిల్డ్ రైస్ మాత్ర‌మే కొన‌మ‌ని చెప్పింద‌ని.. వ‌రి కొన‌బోమ‌ని ఎక్క‌డ చెప్పిందో చూపించాలంటూ క‌మ‌ల‌నాథులు నిల‌దీస్తున్నారు. వ‌రి కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించేందుకంటూ బండి సంజ‌య్ జిల్లాల‌ బాట ప‌ట్టారు. రైతుల‌మంటూ టీఆర్ఎస్ శ్రేణులు న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెలిపుతూ.. గోబ్యాక్ అంటూ కోడిగుడ్లు విసిరి బండిని నిల‌దీస్తున్నారు. దీంతో.. స్టేట్‌వైడ్‌గా బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతా వారి మీద‌నే ఉంది.  ఆ రెండు పార్టీలు కూడ‌బ‌లుక్కొనే ఇలా ఉద్రిక్త‌త‌లు రాజేస్తున్నార‌నే అనుమానం ఉంది. వారి మెయిన్‌ టార్గెట్ రేవంత్‌రెడ్డి దూకుడును డైల్యూట్ చేయ‌డమే అంటున్నారు. వ‌రిపై టీఆర్ఎస్‌-బీజేపీ ఇలా కొట్టుకుంటుంటే.. రైతుల‌ కోసం,  రైతుల ప‌క్షాన‌ ఎంత బాగా ఫైట్ చేస్తున్నారో అని ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌పెట్ట‌డ‌మే వారి స్కెచ్ అంటున్నారు. అస‌లైన‌ పోటీ ఆ రెండు పార్టీల మ‌ధ్య‌నే ఉంద‌నేలా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అలా చేస్తూ మూడో పార్టీ కాంగ్రెస్‌కు స్పేష్ లేకుండా చేయాల‌నేది వారి ఎత్తుగ‌డ‌లా ఉంది. దుబ్బాక‌, హుజురాబాద్‌లో ఇలానే ఉద్రిక్త‌త‌లు సృష్టించి.. కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా, రేవంత్‌రెడ్డి దూకుడును అడ్డుకొనేందుకు.. ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయ‌ని అంటున్నారు. వ‌రి కొనుగోలు కేంద్రాల సంద‌ర్శ‌నకు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు వెళ్లారు. ఆ ప్రాంతంలో బీజేపీకి అస‌లేమాత్రం ప‌ట్టు లేదు. అదంతా కాంగ్రెస్ కంచుకోట‌. అందుకే, కావాల‌నే కాంగ్రెస్ కోట‌లో అడుగుపెట్టాల‌నే.. బండి అటువైపు వెళ్ల‌డం.. టీఆర్ఎస్ అడ్డుకోవ‌డం.. ఇలా ఆ రెండు పార్టీలు వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయం చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఇటు కేసీఆర్‌, అటు బండి సంజ‌య్‌లు వ‌రి ఇష్యూను ఎత్తుకోవ‌డంతో.. ఇక ఆ టాపిక్‌పై రేవంత్‌రెడ్డి పోరాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. వారిద్ద‌రి జ‌గ‌డాన్ని కాంగ్రెస్ శ్రేణులు క‌ళ్ల‌ప్ప‌గించి చూడాల్సి వ‌స్తుందే కానీ.. వారు నేరుగా రైతుల త‌ర‌ఫున బ‌రిలో దిగ‌లేక‌పోతున్నారు. వ‌రి మైలేజ్ అంతా కేసీఆర్‌, బండి సంజ‌య్‌లే కొట్టేస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని ఎదగకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీకి సాయం చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్న అభిప్రాయం ఉంది. ఇలా తెలంగాణ‌ వార్‌.. టీఆర్ఎస్‌- బీజేపీ మ‌ధ్య‌నే అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ.. కాంగ్రెస్‌-రేవంత్‌రెడ్డిని సైడ్‌వేస్‌లో ఉంచేందుకు.. హుజురాబాద్ ఓట‌మి, ద‌ళిత‌బంధు అమ‌లు చేయ‌క‌పోవ‌డం త‌దిత‌ర‌ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే.. కేంద్రంలోని అధికార పార్టీ.. రాష్ట్ర అధికార పార్టీ.. క‌లిసి ఆడుతున్న రాజ‌కీయ డ్రామా అంటున్నారు.

పిట్టల పోయి బండా వచ్చే..! గంటల్లోనే చక్రం తిప్పిన కేకే.. 

కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన  శాసనమండలి అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ప్రకటించారు సీఎం కేసీఆర్. గతంలో ఎప్పుడు లేనంతగా కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి ఊహించని ట్విస్టులు ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ గా పని చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వెంకట్రామిరెడ్డిని మండలికి ఎంపిక చేసిన కేసీఆర్.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను అభ్యర్థిగా ప్రకటించి అందరికి షాకిచ్చారు. బండా ప్రకాష్ ఎంపిక రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనకు ఎంపీగా ఇంకా మూడేండ్ల 8 నెలల సమయం ఉంది. గతంలోనూ ఎంపీలుగా ఉన్నవారిని.. ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా చేసిన సందర్భాలు చాలా తక్కువ. అంతేకాదు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నప్పటి నుంచి చాలా మంది పేర్లపై లీకులు వచ్చినా.. ఎప్పుడు బండా ప్రకాష్ పేరు రాలేదు. అయితే చివరి రోజున సడెన్ గా ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక పెద్ద కథే నడిచిందని అంటున్నారు.   భూ కబ్జా ఆరోపణలతో  ఈటల రాజేందర్ ను  గత జూన్ లో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటల ముదిరాజ్ వర్గానికి చెందిన నేత. ఆయనను తప్పించడంతో ముదిరాజులు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బీసీ సంఘాలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని  ప్రశ్నించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ దీని ప్రభావం కనిపించింది.  దీంతో ముదిరాజులను కూల్ చేసేందుకు ఆదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండలికి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పిట్టల రవీందర్ పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని, పిట్టలకు  సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని ప్రచారం జరిగింది. ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఈటల స్థానంలో.. అదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నేత పిట్టల రవీందర్ ను భర్తీ చేస్తే.. తనపై వచ్చిన అసంతృప్తి కూడా చల్లారుతుందని కేసీఆర్ భావించారని చెబుతున్నారు.  అయితే మండలి అభ్యర్థుల ఎంపికలో రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పిట్టల రవీందర్ ప్లేసులో ఎంపీగా ఉన్న బండా ప్రకాష్ పేరు వచ్చి చేరింది. దీని వెనుక ఎంపీ కేశవరావు చక్రం తిప్పారని అంటున్నారు. రవీందర్ కు కాకుండా బండాను ఎంపిక చేయడంలో కేకేనే కీలకపాత్ర పోషించారని అంటున్నారు. కవితకు రాజ్యసభ సీటు దక్కేలా కేశవరావు ఇలా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉంటే ఇక్కడ కవిత మంత్రి పదవి కావాలని కోరుతుందని, అదే ఢిల్లీకి పంపితే ఏ సమస్యా ఉండదని కేసీఆర్ కు కేకే చెప్పారని తెలుస్తోంది. దీని వల్ల కేటీఆర్ కు పోటీ లేకుండా పోతుందని వివరించారట.  ప్రకాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని చెప్పారట. కేకే సూచనతో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి పిట్టల రవీందర్ కు కాకుండా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. మొత్తంగా కేకే చివరి నిమిషంలో చక్రం తిప్పడంతో కరుడుగట్టిన తెలంగాణ వాదికి ఎమ్మెల్సీ సీటు చేజారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

అమరావతి అంద‌రి రాజ‌ధాని.. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ క్లారిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే. అన్నివ‌ర్గాల నుంచి, అన్ని వ్య‌వ‌స్థ‌ల నుంచి ఈ విష‌యం ప‌దే ప‌దే స్ప‌ష్ట‌మ‌వుతోంది. సోమ‌వారం అమరావ‌తినే ఏపీ రాజ‌ధాని అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్టీ నేత‌ల‌కు తేల్చి చెప్ప‌గా.. మంగ‌ళ‌వారం హైకోర్టు సీజే సైతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తినే అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అమ‌రావ‌తి ఉద్య‌మం 700 రోజుల‌కు చేరిన సంద‌ర్భంలోనే ఇలా రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన కీల‌క వ్య‌క్తులు ఏపీ కేపిట‌ల్ అమరావ‌తి అని స్ప‌ష్టం చేయ‌డం కీల‌క ప‌రిణామం అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని, రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని కోసం 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే.. అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని సీజే వ్యాఖ్యానించడం ఆస‌క్తిక‌రం. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని అన్నారు. ఆ స్వాతంత్య్రం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.  

ఏపీ పై షా నజర్ అందుకేనా.. జగన్ రెడ్డికి  మూడినట్లేనా? 

కేంద్ర హోమ్ మంత్రి హోదాలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొనేందుకు  తిరుపతి వచ్చిన బీజేపీ కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు,అమిత్ షా స్వామి కార్యంతో పాటుగా స్వకార్యాన్ని చక్కపెట్టుకుని వెళ్ళారు. రాష్ట్రంలో మూడు రోజులున్న అమిత్ షా, చివరి రోజు సోమవారం (నవంబర్ 15) పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టిని కేంద్రీకరించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఇంచార్జ్ సంతోష్ జీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీలు సుజన చౌదరి, సీఎం రమేష్, జీవీఎల్ నరసింహ రావు, పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇంచార్జ్ సునీల్ ధియోధర్ ఇతర ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం చర్చలు ఎదో వచ్చాం కాబట్టి, నాలుగు మాటలు  మాట్లాడి  పోదాం అన్న విధంగా కాకుండా, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో పక్కా ప్రణాలిక, అజెండాతో నిర్వహించి నట్లే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం అయ్యేపనేనా, అది సాధ్యమా అనే విషయాన్ని పక్కన పెడితే, షా చూపు ఏపీ మీద పడింది అనేది మాత్రం నిజమని అంటున్నారు.   ఈ సందర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరతీశాయని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రదానంగా అమిత్ షా మూడు విషయాలపై పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అందులో  మొదటిది, ఒక రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని కోరుతూ అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళన, పాద యాత్రకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో అభిప్రాయం, ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు తెలియచేస్తూ పార్టీ తీర్మానం చేసిన తర్వాత, ఇక ఆ విషయంలో చర్చ ఎందుకని, రైతుల ఆందోళనకు రాజకీయ రంగులు అద్దుతున్న నాయకులకు గట్టిగా చురకలు అంటించారు. రాజదాని ఆందోళనను, రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా భూములు ఇచ్చిన రైతుల ఆందోళనగానే చూడాలని స్పష్టం చేశారు. అంటే, జగన్ రెడ్డి మూడు రాజధానుల గోల్ మాల్ వ్యవహారాన్ని, కేంద్ర ప్రభుత్వం సాగానీయదని చెప్పకనే చెప్పారు.  రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతున్న నాయకులకు అమిత్ షా  చురకలు కాదు ఏకంగా వాతలే పెట్టారని సమాచారం. వైసీపీతో ఎలాంటి బంధం అనుబంధం లేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై ప్రజాఉద్యమాలను నిర్మించి, పార్టీ ఒంటరిగా ఎదిగేదుకు కృషి చేయాలని, నాయకులకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారని పార్టీ నాయకుల సమాచారం. ఒక విధంగా చూస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం పై షా ..యుద్ధాన్ని ప్రకటించారని అనుకోవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు.  అదే సమయంలో ఎన్నికల పొత్తుల గురించి ఎవరూ మాట్లాడవద్దని, సరైన సమయంలో కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, అంతవరకు ఎవరూ పొత్తుల ప్రస్తావన చేయవద్దని స్పష్టంచేశారు. అలాగే, రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవ్వాలంటే, ఇతర పార్టీలలోని సీనియర్ నాయకులను పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కలిపించాలని అన్నట్లు పార్టీ నాయకులఈ  సందర్భంగా ఆయన, అస్సాంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిస్వా శర్మను ముఖ్యమంత్రిని చేసిన విషయాన్ని గుర్తు చేశారని  సమావేశంలో పాల్గొన్న ఒక ముఖ్యనేత తెలిపారు.  అదలా ఉంటే అమిత్ షా ఒక్క సారిగా ఎపీపి ఇంతలా దృష్టిని కేంద్రీక రించడం ఏమిటే? ఇది దేనికి సంకేతం? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. షా పర్యటన  వెనక ఏదో అనూహ్య రాజకీయ  వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గడచిన రెండున్నర సంవత్సరాలలో అమిత్ షాతొలిసారిగా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా, మళ్ళీ జనవరి (2022) లో వస్తానని  ఈలోగా అమరావతి రైతుల ఆందోళనలో పార్టీ నాయకులు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటుగా, వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాలని క్లియర్ డైరెక్షన్’ ఇవ్వడంతో అమిత్  షా ఎత్తుగడ ఏమిటనే చర్చ జరుగుతోంది.  ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వరం మారింది. కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ పైనా మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రధాని మోడీని పేరు పెట్టి మరీ నానీలు తమ భాషలో విమర్శలు చేస్తున్నారు. మరో వంక జగన్ రెడ్డి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్’ తో చేతులు కలిపి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు సాగిస్తునట్లు,ఇంటల్జెన్సీ వర్గాల సమాచారం ఉందని అందులో భాగంగా ఒరిస్సా ముఖ్యమంత్రితో రహస్య మంతనాలు సాగించడం వంటి, పరిణామాల నేపధ్యంలో  జగన్  రెడ్డికి  చెక్ పెట్టేందుకే, అమిత్ షా స్టేట్’లో  పావులు కదుపుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అదే నిజం అయితే, జగన్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఉత్తరప్రదేశ్ లో బెంగాల్ ఫలితాలు?

ఉత్తరపదేశ్ శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంకా వాద్రా గట్టి ప్రయత్నం చేస్తున్నారు.ఇతర పార్టీల కంటే ఒకడుగు ముందుగానే, ప్రియాంక ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ కేవలం ఏడు  స్థానాలను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, రేపటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే, ఏమేమి చేస్తుందో చెపుతూ ప్రచార యాత్ర సాగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, ముస్లిములు, యువతను ఆకర్షించేందుకు ప్రియాంక వ్యూహాత్మకంగా పవులు కదుపుతున్నారు. మహిళలలకు సంవత్సరానికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలెండర్లు, ఆశా,అంగన్‌వాడీ మహిళలకు ప్రతి నెల రూ.10 వేల గౌరవవేతనం.కొత్త ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు రిజర్వేషన్. నెల నెలా  వెయ్యి రూపాయల వితంతు పింఛను, విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు, స్కూటీలు పంపిణీ వంటి ఉచిత వరాలు వాగ్దానం చేశారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్ఆర్సీ, సీఏఏ అమలు చేయమని వాగ్దానం చేశారు. ఇవిగాక మహిళలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు.. ఇంకా ఇతర వాగ్దానాలు, వరాలు ఎదజల్లుతున్నారు.  అయితే ఏబీపీ-సీవోటర్స్‌-ఐఏఎన్‌ఎస్‌ నిర్వహించిన తాజా సర్వే ఉత్తర ప్రదేశ్ తో  పాటుగా వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే, ఐదు రాష్ట్రాలలో ఒక పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలోనూ తిరిగి బీజేపీనే అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. మిగిలిన రాష్ట్రాల సంగతి పక్కన పెట్టి, కాంగ్రెస్ అభిమానుల్లో ప్రియాంక వాద్రా ఆశలు రేకెత్తిస్తున్న ఉత్తర ప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి గతంలో కంటే ఒకే ఒక్క సీటు మాత్రమె ఎక్కువ వస్తుందని సర్వే చెపుతోంది. గత ఎన్నికల్లో 7 సీట్లతో సరిపెట్టుకున్న హస్తం పార్టీ ఈసారి 8 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని అంటోంది.మరో వంక బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చినా, ఆ పార్టీ రేపటి ఎన్నికల్లో వందకు పైగా స్థానాలు కోల్పోతుందని సర్వే చెపుతోంది.   గత(2017) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు 325 సీట్లను సొంతం చేసుకున్నాయి. అనూహ్య ఫలితాన్ని సాధించాయి. వచ్చే ఏడాది ఎన్నికల్లో మాత్రం బీజేపీ/ ఎన్డీయే 108 స్థానాలను కోల్పోనుందని సర్వే తేల్చింది. అయినా.. 217 సీట్లను సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని వివరించింది. అదే సమయంలో గత ఎన్నికల్లో 48 సీట్లతో సరిపెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ, దాని మిత్రపక్షాలు.. ఈ సారి 156 సీట్లను దక్కించుకునే అవకాశముందని తెలిపింది. అంటే ఒక సీటు అటూ ఇటుగా బీజీపే కోల్పోయే ప్రతి సీటు సమాజ్ వాదీ ఖతాలోకే చేరుతోంది. మరో వంక బీజీపే సీట్ల విషయంలో చాలా తేడా కనిపిస్తున్నా.. ఓట్ల శాతం విషయంలో బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని పేర్కొంది. బీఎస్పీకి ప్రస్తుతమున్న 19 సీట్లలో ఒక సీటు తగ్గనుందని, కాంగ్రెస్‌ 7 నుంచి 8 పెరుగుతుందని తెలిపింది. ఈ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితిని గమనిస్తే  యూపీలో ఓటరు తీర్పు బెంగాల్ ఓటరు తరహాలో ఉండబోతోందని, విశ్లేషకులు భావిస్తున్నారు. బెంగాల్’లోలానే యూపీలోనూ బీజేపీ వ్యతిరేక ఓటు, కన్సాలిడేట్’ అవుతోందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే బీజేపీ ఓటు షేర్ పెద్దగా తగ్గక పోయినా,సమాజ్ వాదీ పార్టీ ఓటు షేర్’తో పాటు సీట్ల సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు. బెంగాల్లో బీజేపీ వ్యతిరేక లౌకిక వాద ఓటు గంప గుత్తగా తృణమూల్ ఖాతాలో చేరడం వల్లనే, తృణమూల్  తిరిగి అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్, వామపక్ష కూటమి కలిసి పోటీచేసినా ఫలితం లేక పోయింది. ఆ పార్టీల ఓటు కూడా బీజేపీ భయంతో  తృణమూల్ ఖాతాలో చేరింది. అందుకే కాంగ్రెస్, వామపక్ష కూటమి ఒక్క సీటు గెలుచుకోలేక పోయింది. అదే విధంగా యూపీలో, బీజీపీ వ్యతిరేక ఓటర్లు ఆ పార్టీని ఓడించే సత్తా ఉందని భావిస్తున్న సమాజ్ వాదీ పార్టీవైపు మొక్కు చూపుతున్నారనేది సర్వే ఇస్తున్న సంకేతం.  అయితే  సర్వేలన్నీ సత్యం కావాలని లేదుకానీ, బెంగాల్ ఎన్నికల తర్వాత తెలంగాణలోని హుజూరాబాద్ సహా, దేశంలో ఉప ఎన్నికలు జరిగిన 30 అసెంబ్లీ, మూడు లోక్ సభ ఎన్నికల ఫలితాలను గమనిస్తే, ఓటర్లు గతంలోలాగా పార్టీలు, సిద్ధాతలు, కులం, మతం ఇతర ప్రాధాన్యతలను పక్కన పెట్టి ఎవరిని అయితే ఓడించాలను కుంటున్నారో, ఆ పార్టీ, అభ్యర్ధిని ఓడించే ప్రత్యర్ధి పార్టీ, అభ్యర్ధి వైపు ఏకీకృతం అవుతున్నారు. నిజానికి హుజూరాబాద్’లో జరిగింది కూడా అదే ... కేసీఆర్’ ను ఓడించాలనే నిర్ణయానికి వచ్చిన ఓటర్లు, (అందుకు ఈటల పట్ల సానుభూతి కూడా ఒక కారణం అయితే కావచ్చును) తెరాసను ఓడించే  సత్తా ఈటల రాజేందర్’ కు మాత్రమే ఉందని గుర్తించారు. అందుకే ఆయన ఏ పార్టీ ఏమిటి? అనేది చూడ లేదు. కేసీఆర్’ ను ఓడించాలనే సంకల్పం చెప్పుకున్నారు .. తెరాసను ఓడించారు. ఈటలను గెలిపించారు.ఇక ముందు ఎక్కడైనా కూడా ఇదే వొరవడి కొనసాగే అవకాశాలే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

హరీష్ రావుకు కేసీఆర్ షాక్.. కౌంట్ డౌన్ మొదలైనట్టేనా?

ఎట్టకేలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారయ్యారు. గతంలో ఎప్పుడు లేనంతగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన సీఎం కేసీఆర్.. గవర్నర్ కోటాతో పాటు ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఆరు సీట్లకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. నామినేషన్లను చివరి రోజున విడుదలైన జాబితాలో చివరి నిమిషంలో ట్విస్ట్ కనిపించింది. మంత్రి హరీష్ రావుకు షాక్ తగిలింది.   ఎమ్మెల్యే కోటాలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా కీలక పాత్ర పోషించిన ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు ఖరారైందని రెండు రోజులుగా ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా వచ్చిన జాబితాలో ఆయన పేరు మిస్సైంది. గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి,  వెంకట్రామిరెడ్డి, బండా ప్రకాశ్ పేర్లు ఖరారు అయ్యాయి. చివరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం చేజారింది.  ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ మొదటి నుంచి మంత్రి హరీష్ రావుకు అనుచరుడిగా ఉన్నారు. ఆయనకు 2014, 2018లో అసెంబ్లీ సీటు దక్కలేదు. దీంతో ఎమ్మెల్సీ ఇస్తారని భావించారు. కాని అది కూడా రాలేదు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్సీలు ఇచ్చిన కేసీఆర్.. ఉద్యమనాయకుడికి మాత్రం హ్యాండిస్తూ వచ్చారు. మంత్రి హరీష్ రావు మనిషి కావడం వల్లే ఎర్రోళ్లకు పార్టీలో అన్యాయం జరిగిందనే ప్రచారం ఉంది. అయితే ఇటీవల హరీష్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు కేసీఆర్. ఆర్ధిక శాఖ ఉన్నా రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన వైద్యశాఖను ఆయనకే కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో హరీష్ అనుచరుడైన ఎర్రోళ్ల శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఖాయమని అంతా భావించారు. కాని ఈసారి కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ కు షాక్ తప్పలేదు. 

బీజేపీని వారే భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారా? అమిత్‌షా చెప్పేదాకా తెలియ‌దా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. టెక్నిక‌ల్‌గా ఇప్ప‌టికీ రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తినే. కేవ‌లం వైసీపీ వారికి మాత్ర‌మే మూడు రాజ‌ధానులు. ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు, కోర్టులు, ప్ర‌భుత్వ రికార్డుల్లో అమ‌రావ‌తినే ఏపీకి ఏకైక రాజ‌ధాని. ఇంత చిన్న లాజిక్.. బీజేపీ నేత‌ల‌కు మాత్రం అర్థం కావ‌ట్లేదు ఎందుక‌నో? అమ‌రావ‌తి కోసం పార్టీ తీర్మానం చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదు.. రాజ‌ధాని రైతులు 700 రోజులుగా ఉద్య‌మిస్తున్నా.. వారికి సంఘీభావం చెప్ప‌డం లేదు.. అసలు అమరావతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టే ఉంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఎందుకిలా? క‌మ‌ల‌నాథులు అమ‌రావ‌తితో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఎందుకుంటున్నారు? ఢిల్లీ నుంచి వ‌చ్చిన అమిత్‌షా.. మొట్టికాయ‌లు వేసే వ‌ర‌కూ రాష్ట్ర నేత‌ల‌కు రాజ‌ధాని కోసం ఉద్య‌మించాల‌నే విష‌యం తెలీదా? రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌నే సంగ‌తి తెలీద‌నుకోవాలా? ఇదంతా కొంద‌రు కోవ‌ర్టులు చేస్తున్న కుట్ర‌నా? అధికార వైసీపీతో అంట‌కాగుతున్న య‌వ్వార‌మా? అంటే అవున‌నే అంటున్నారు.  ఒక‌ప్పుడు బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణంపెట్టి పోరాడేవారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అంతా స‌మైక్యాంధ్ర నినాదం ఎత్తుకుంటే.. క‌మ‌ల‌నాథులు మాత్రం ఎప్పుడో చేసిన‌ కాకినాడ తీర్మానానికి క‌ట్టుబ‌డి.. తెలంగాణ‌కే మ‌ద్ద‌తుగా నిలిచారు. ఏపీలో బీజేపీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా.. పార్టీ తీర్మానానికే క‌ట్టుబ‌డి ఉన్నారు. కానీ, ఇప్పటి బీజేపీలో ఏం జ‌రుగుతోంది? ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తిస్తూ పార్టీ తీర్మానం చేశాక కూడా కాషాయ‌ద‌ళం అమ‌రావ‌తి రైతుల‌కు ఎందుకు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం లేదు? మ‌హా పాద‌యాత్ర‌లో ఎందుకు పాల్గొన‌డం లేదు? అమిత్‌షా చెప్పే వ‌ర‌కూ.. ఈ తోలుమందం నేత‌లు ఎందుకు క‌ద‌ల‌కుండా, క‌దం క‌ద‌ప‌కుండా సైలెంట్‌గా ఇంట్లో కూర్చొన్నారు? అంటూ మండిప‌డుతున్నారు ఆ పార్టీ అభిమానులు.  ఈ విష‌యంలో అమిత్‌షా ముందు పెద్ద ర‌చ్చే జ‌రిగింది. అమరావతిపై పార్టీ తీర్మానం చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అమిత్‌షా ప్రశ్నించారు. మరో నాయకుడు జోక్యం చేసుకుని అది ఓ పార్టీ చేయిస్తోందని చెప్పడానికి ప్రయత్నించగా.. ‘రైతులు భూములిచ్చారా? లేదా? ఉద్యమిస్తోంది రైతులా? కాదా? పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకు? పాదయాత్రలో పాలుపంచుకోవాలి’ అని షా ఆదేశించారు.  ఇంత‌కీ అమరావ‌తి ఉద్య‌మంలో భాగ‌స్వామి కాకుండా బీజేపీని త‌ప్పుదారి ప‌ట్టించింది ఎవ‌రు? అనే ప్ర‌శ్న పార్టీ వ‌ర్గాల్లో త‌లెత్తుతోంది. ఇంకెవ‌రు స్వ‌యానా రాష్ట్ర పార్టీ అధ్య‌క్షులు సోము వీర్రాజు, ఆయ‌న ప్ర‌ధాన అనుచ‌రుడు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డిలే అంటున్నారు. పార్టీ ఇంఛార్జి సునీల్ దియోధ‌ర్‌ను త‌మ బుట్ట‌లో వేసుకొని.. ఆ ముగ్గురూ క‌లిసి జ‌గ‌న్‌కు, వైసీపీ ప్ర‌భుత్వానికి లాభం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నేది ఓపెన్ సీక్రెట్‌. ప‌దే ప‌దే చంద్ర‌బాబును, టీడీపీని టార్గెట్ చేస్తున్నారే కానీ, వైసీపీ జోలికి మాత్రం వెళ్ల‌డం లేదు. జ‌స్ట్‌.. త‌మ‌ల‌పాకుతో కొట్టిన‌ట్టు ప్ర‌భుత్వంపై ఉత్తుత్తి పోరాటం చేస్తున్నార‌ని అంటున్నారు. ఇక విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి చేసే ఓవ‌రాక్ష‌న్ అంతాఇంతా కాదంటున్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మాన్ని అనేక సార్లు అవ‌హేళ‌న చేసిన ఘ‌నుడు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి. అందుకే జేఏసీ నేత‌ల చేతిలో చెప్పుదెబ్బ‌లు కూడా తినాల్సి వ‌చ్చిందంటున్నారు. ఆ ముగ్గురు నేత‌ల‌ వ‌ల్లే ఏపీ బీజేపీ భ్ర‌ష్టుప‌ట్టింద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అమిత్‌షా సైతం వారిపై సీరియ‌స్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష టీడీపీనే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతగా కృషి చేయాలని అమిత్‌షా ఆదేశించారు.  ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజ‌నాచౌద‌రి, సీఎం ర‌మేశ్‌ల‌ను పార్టీలో అంట‌రాని వారిగా చూస్తుండ‌టంపైనా అమిత్‌షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ‘పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరి. ఒకసారి సభ్యత్వమిచ్చాక వారంతా మన కుటుంబ సభ్యులే. వారికి సముచిత స్థానం దక్కాల్సిందే. ఏ విషయంలోనూ వారిని దూరం పెట్టరాదు. అసోంలో హిమంత బిశ్వశర్మను పార్టీలో చేర్చుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశాం’ అని అమిత్‌షా పార్టీ శ్రేణుల‌కు హితోప‌దేశం చేశారు. లోపాల‌ను స‌రిచేసుకుంటూ.. అంద‌రినీ క‌లుపుకు పోవాల‌ని గ‌ట్టిగా సూచించారు. మ‌రి, బిగ్‌బాస్ వార్నింగ్ త‌ర్వాత అయినా.. ఏపీ బీజేపీ నేత‌లు దారి కొస్తారా?  వైసీపీతో అంట‌కాగ‌డం మానేసి.. అమ‌రావ‌తి పాద‌యాత్ర‌లో పాల్గొంటారా? 

వివేకా కేసులో పెద్దలున్నారు.. వైసీపీ అదే రచ్చ.. కేసీఆర్ ట్విస్ట్.. టాప్ న్యూస్@1PM

వైఎస్ వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకొచ్చాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. వివేకా హత్య వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి డి.శంకర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్య తర్వాత దస్తగిరి.. రాజారెడ్డి ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. నిందితులందరిని ముందుండి నడిపించింది డి.శంకర్‌రెడ్డేనని అన్నారు. హత్య తర్వాత వివేకా ఇంటికి ముందు చేరుకున్నది.. శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలేనని, వైఎస్ కుటుంబానికి అవినాష్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని పట్టాభి అన్నారు.  --------- విశాఖపట్నం జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. క్యూలో నిలబడిన ఓటర్లకు ఫ్యాన్... ఫ్యాన్ అంటూ వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్లకు..తాము ఏ ఎన్నికలకు ఓటు వేస్తున్నారో తెలియక పోవడం విశేషం.. ఓటు మాత్రం వేశామని ఓటర్లు చెబుతున్నారు.  ------ ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషాకు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి  బీ–ఫారం అందజేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమ పేరును ఖరారు చేయడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్‌ బాషా... ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు.  ----- తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తోసిపుచ్చింది. పూజకార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని గతంలో టీటీడీ అఫిడవిట్ దాఖలు చేసింది. పిటీషనర్ కేవలం ప్రచారం కోసమే వస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.  -------- శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని ‌పలు కౌంటర్లలో జరిగిన స్కామ్‌పై విచారణ జరుగనుంది. ఇప్పటికే 5 కేసులకు సంబంధించి 8 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది. తాజాగా మరో 8 కేసులు ఏసీబీ నమోదు చేసింది.  శ్రీశైలం దేవస్థానంలోని పలు కీలక రికార్డులను  ఏసీబీ పరిశీలించనుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని  ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. --------- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు ------- రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ సమావేశానికి ఈటల, రఘనందనరావు, రాజసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి హాజరయ్యారు.  ----- మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేటలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ కబ్జా ఆరోపణలపై సర్వే ప్రారంభమైంది. మంగళవారం ఉదయం తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రసాద్, డివిజనల్  సర్వేయర్ లక్ష్మీ సుజాత, తహశీల్దార్ మాలతి ఆధ్వర్యంలో సర్వే మొదలైంది. పోలీసు బందోబస్తు మధ్య భూముల సర్వే జరుగుతోంది.  ----- మైసూరులోని చాముండేశ్వరి కొండల ప్రదేశాన్ని హంపి తరహాలో హైటెక్‌ మెరుగులతో తీర్చదిద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆధ్యాత్మిక, పారంపరిక పథకం కింద రూ.110 కోట్ల గ్రాంటు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇటీవల బెంగళూరు నగరాన్ని పర్యటించిన సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డికి కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ మైసూరు చాముండేశ్వరి కొండల సమగ్ర అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ---- టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా‎ చిక్కుల్లో పడ్డారు. దుబాయ్ నుంచి  టీ20 ప్రపంచకప్​ ముగించుకుని దుబాయ్​నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ముంబై ఎయిర్‎పోర్ట్‎లో దిగిన పాండ్యా వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు హార్దిక్ పౌండ్యా వద్ద గుర్తించారు. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది.  

గవర్నరునే బుక్ చేశారు.. మేమో లెక్కా? జగన్ తీరుతో ఐఏఎస్ ల బెదురు..

ఏపీలో ఐఏఎస్ అధికారులు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న ఏపీ సర్కార్ నిధులు ఇవ్వాలంటూ ఎప్పుడు ఏ శాఖపై పడుతుందో అని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల తీరుతో ఒక్కొక్క శాఖ నిర్వహణకు కూడా నిధుల్లేక అల్లాడిపోయే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. శాఖల నిధులు ఇవ్వడం ఫైనాన్షియల్ కోడ్ కు విరుద్ధం.. ఆ విషయమే చెబితే తమను ఉండనిస్తారా? అని పలువురు ఐఏఎస్ లు ఆందోళన చెందుతున్నారు. రోజువారీ ఖర్చుల కోసం కూడా ఏపీ సర్కార్ ఏదో ఒక శాఖపై పడి నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలించుకుపోతోంది. అడిగిన విధంగా నిధులు ఇవ్వని ఆయా శాఖల ఐఏఎస్ లను ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీచేసి భయపెడుతోంది. ఏపీలో ఏ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కలిసినా ఇప్పుడు ఇదే అంశంమీద చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఇద్దరు ఐఏఎస్ లు ప్రైవేటుగా కలుసుకున్నా.. ఆరోగ్యాలు, వీకెండ్ టూర్ ల గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు వారిలో ఆ పరిస్థితి లేదు. వచ్చే నెల జీతాలు వస్తాయా? లేదా అని వారి సంభాషణల్లో కనిపిస్తోంది. అప్పు కోసం గవర్నర్ నే బుక్ చేసిన ప్రభుత్వ పెద్దలు తమను మాత్రం ఎలా వదిలిపెడతారనే టెన్షన్ ఐఏఎస్ లలో పెరిగిపోతోంది. రాష్రంలోని ఆర్థికశాఖే కాకుండా అన్ని శాఖలూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి శాఖలు వెళ్లిపోతున్న వైనం ఐఏఎస్ అధికారుల మాటల్లో వ్యక్తం అవుతోంది. తప్పు అని తెలిసినా ప్రభుత్వ పెద్దల వత్తిడితో తమ తమ శాఖల్లోని నిధులు ఇవ్వక తప్పడంలేదని వారు నిట్టూర్పులు విడుస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీయడం తథ్యం.. అయితే.. అది ఎప్పుడనేదే తేలాలని ఓ ఐఏఎస్ వ్యక్తం చేసిన ఆందోళన. ఏపీ దివాలా తీసిన వాస్తవాన్ని అరచేయి అడ్డంపెట్టి దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరో అధికారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆర్థిక శాఖకే పరిమితమైన సంక్షోభం ఇప్పుడు అన్ని శాఖల్నీ చుట్టేస్తోందని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ‘మా శాఖలో ఉణ్న కొద్దిపాటి నిధుల్నీ ప్రభుత్వం లాగేసుకుంది. ఇన్నాళ్లూ ఆ డబ్బులపై వచ్చే వడ్డీతోనే ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు, ఆఫీసు నిర్వహణ నడుస్తోంది. మా శాఖ డబ్బుల్ని తిరిగి ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి అతి త్వరలోనే దాపురిస్తుందనే భయం మరో ఐఏఎస్ అధికారి మాటగా ఉంది. డబ్బుల కోసం ప్రభుత్వం తనపై ఒత్తిడి తీరును సహచర ఐఏఎస్ లతో పంచుకున్నారు. ‘నిధుల గోల్ మాల్ పై భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు విచారణ చేయిస్తే.. తమ పరిస్థితి ఏంటనే కలవరం పలువురిని పట్టుకుందని తెలుస్తోంది. తమ శాఖలో రెండేళ్లుగా పేమెంట్ల లేవని, చిన్న చిన్న మెయింటెనెన్స్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని, ఇలా అయితే.. ఆఫీసులు ఇంకెన్నాళ్లు నడపగలమంటే ఓ ఐఏఎస్ వాపోతున్నారట. ఈ పరిస్థితి చూసి సెలవుపెట్టి వెళ్లిపోవాలనిపిస్తోందని కొందరు ఆవేదనతో చెప్పుకుంటున్నారని సమాచారం. గతంలో కాస్త ఫేవర్ చేసినందుకే సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయం వారు గుర్తుచేసుకుంటున్నారు. బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు శాఖలకు ఇవ్వాల్సింది పోయి.. రివర్స్ లో అన్ని శాఖల నుంచీ నిధుల్ని ప్రభుత్వం లాగేసుకుంటోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శాఖ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ‘నో‘ చెబితే బదిలీ చేసి మరీ లాగేసుకుంటోందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కట్టిన ఫీజులు, పరీక్షల నిర్వహణకు వచ్చిన నిధుల్ని కూడా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర ప్రభుత్వానికి ముట్టజెప్పిన వైనాన్ని పలువురు ఐఏఎస్ లు ప్రస్తావించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రామకృష్ణ తమ వద్ద ఉన్న 500 కోట్ల రూపాయలు ఇచ్చేందుక నిరాకరించారు. అంతే.. ఆయనను ఊహించని విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు బదిలీ అయిపోయారు. ఇలా ఒక్కటేమిటి ప్రతి శాఖ నుంచి నిధులు లాక్కుపోయేందుకు ప్రభుత్వం రకరకాల ఫీట్లు చేస్తోందీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తీరు కారణంగా ఐఏఎస్ లు, ప్రభుత్వ సలహాదారులు వినియోగిస్తున్న కార్లకు కూడా నెలనెలా అద్దె చెల్లించే పరిస్థితి లేదు. ఒక్కో కారుకు నెలకు 60 వేల చొప్పున ఆరు నెలల అద్దె బకాయిలు ఉన్నాయట. దీంతో యజమానులు ఏ క్షణమైనా అద్దె కార్లను ఆపివేసే చాన్స్ ఉంది.

పార్లమెంట్ కు కవిత! ఎమ్మెల్సీగా బండా ప్రకాష్.. కేసీఆర్ ఖతర్నాక్ గేమ్ 

శాసనమండలి అభ్యర్థుల ఎంపికలో ఊహించని ట్విస్టులు ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనూహ్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. రాజ్యసభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇంకా మూడేళ్ల పదవి ఉన్న బండాను రాజ్యసభకు రాజీనామా చేయించి శాసనమండలికి పంపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. బండా ప్రకాష్ తో పాటు శాసనమండలి మాజీ చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇక ఐఏఎస్ గా వాలంటరీ రిటైర్మెట్ ప్రకటించిన వెంకట్రామిరెడ్డిని కూడా ఎమ్మెల్యే కోటాలోనే శాసనమండలి ఎంపిక చేసి అందరికి షాకిచ్చారు సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఖతర్నాక్ స్కెచ్ ఉన్నట్లు కనిపిస్తోంది. తన కూతూరు కవితను పెద్దల సభకు పంపించడంతో పాటు మాజీ మంత్రి  ఈటల రాజేందర్ ను టార్గెట్ చేయడమే గులాబీ బాస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం  నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నారు కవిత. ఆమె పదవి కాలం త్వరలోనే ముగియనుంది.నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు  నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో కవితను మళ్లీ మండలికి కాకుండా ఢిల్లీకి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ తో రాజీనామా చేయిస్తున్నారని చెబుతున్నారు.బండా ప్రకాశ్ ఎంపీ పదవి కాలం ఇంకా మూడేండ్లకు పైగానే ఉంది. దీంతో బండా స్థానంలో రాజ్యసభకు కవితను పంపించనున్నారు కేసీఆర్.  బండా ఎంపికలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. కేబినెట్ నుంచి గత జూన్ లో ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించడంతో రాష్ట్రంలో ఉన్న ముదిరాజులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీసీ సంఘాలు కూడా కేసీఆర్ పై అసంతృప్తిగా ఉన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆ ప్రభావం కనిపించిందనే అంచనాకు కేసీఆర్ వచ్చారట. అందుకే బీసీ సంఘాలతో పాటు ముదిరాజులను కూల్ చేసేలా తాజా ఎత్తుగడ వేశారంటున్నారు. ఈటల సామాజిక వర్గానికే చెందిన బండా ప్రకాశ్ ను ఎమ్మెల్సీగా చేసి.. తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఆ విధంగా ఈటల రాజేందర్ ప్లేస్ ను బండా ప్రకాశ్ తో సరిచేస్తారని చెబుతున్నారు. కవితను రాజ్యసభకు పంపించడంలోనూ కేసీఆర్ వ్యూహం ఉందంటున్నారు. కొన్ని రోజులుగా కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ సాగుతుందనే ప్రచారం ఉంది, కేటీఆర్, కవిత మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందనే చర్చ సాగుతోంది. అందుకే ఈసారి కేటీఆర్ కు కవిత రాఖీ కట్టలేదంటున్నారు, అంతేకాదు ప్రగతి భవన్ లో జరిగిన బతుకమ్మ వేడుకలకు కవిత హాజరు కాలేదు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీకి ఆమె డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో కూతురును కూల్ చేయడంతో పాటు కేటీఆర్ కు రాష్ట్రంలో సమస్యలు లేకుండా కేసీఆర్ తాజా స్కెచ్ వేశారంటున్నారు. కవితను ఢిల్లీకి పంపించి ఇక్కడ కేటీఆర్ కు లైన్ క్లియర్ చేస్తున్నారని అంటున్నారు. పార్టీ ఢిల్లీ వ్యవహారాలను కవితకు అప్పగిస్తారని, అవకాశం ఉంటే కేంద్రమంత్రిగా కవితకు ఛాన్స్ ఇస్తారని అంటున్నారు.  మొత్తంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఇచ్చిన ట్విస్టులపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఈటల రాజేందర్ తో నష్టపోయిన స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు కవితను రాజ్యసభకు పంపి.. కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసేలా కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు. 

అమ‌రావ‌తి @ 700.. రాజ‌ధాని కోసం తగ్గేదే లే...

అమరావతి ఉద్యమానికి 700 రోజులు. అది ఉద్య‌మం కాదు.. ఆత్మ‌గౌర‌వ నినాదం.. రాజ‌ధాని కోసం పోరాటం. అమ‌రావ‌తినే ఏపీకి ఏకైక రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ.. ఒక్క‌రోజు కూడా విశ్రాంతి లేకుండా.. నిర్విరామంగా ఉద్య‌మిస్తున్నారు రైతులు, మ‌హిళ‌లు, ద‌ళితులు. అమ‌రావ‌తి కోసం ఇప్ప‌టి వ‌ర‌కూ 189మంది అమ‌రులయ్యారంటే మాట‌లా?. రాజ‌ధాని కోసం ప్రాణాల‌ర్పించిన అమ‌రుల స్పూర్తిగా.. మ‌రింత ప‌ట్టుద‌ల‌తో పోరుబాట ప‌ట్టారు. దీక్ష‌లు, ధ‌ర్నాల నుంచి మ‌హాపాద‌యాత్ర వ‌ర‌కూ.. ఏమాత్రం త‌గ్గేదే లే అంటున్నారు. అమ‌రావ‌తి ఉద్య‌మం 700 రోజుల‌కు చేరుకున్న సంద‌ర్భంగా మహాపాదయాత్రలో సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించి మౌనం పాటించించారు. అమరావతి లక్ష్య సాధనకు ప్రతిజ్ఞ చేశారు. అమరావతి ఉద్యమ గీతాలాపనలతో ఉత్సాహం నింపారు.  అమ‌రావతి.. న‌వ్యాంధ్ర‌ క‌ల‌ల రాజ‌ధాని.. అది న‌గ‌రం కాదు.. భూత‌ల స్వ‌ర్గం.. చంద్ర‌బాబు స్వ‌ప్నం.. ఆంధ్రుల నిండు గౌర‌వం.. ఎవ‌రి దిష్టి త‌గిలిందో.. ఎవ‌రి క‌ళ్లు ప‌డ్డాయో.. ఆ సుంద‌ర స్వ‌ప్నం చెదిరి పోయింది.. ఆ క‌ల‌ల సౌధం కుప్ప‌కూలిపోయింది.. మూడు ముక్క‌లై.. ఓ ముక్క‌గా మూల‌న ప‌డింది..  ఒక్క ఛాన్స్ అంటూ అంద‌ల మెక్కాడు.. అమ‌రావ‌తిపై భ‌స్మాసుర హ‌స్తం మోపాడు.. ఇక అంతే.. అమ‌రావ‌తి స‌ర్వ నాశ‌నం.. త‌మ క‌లల రాజ‌ధాని.. మూడు ముక్క‌లై.. మోడు పోవ‌డంతో.. అమ‌రావ‌తి రైతులు భ‌గ్గుమ‌న్నారు.. ఉద్య‌మంతో ఉప్పెన‌లా విరుచుకుప‌డ్డారు.. దీక్ష‌ల‌తో జ‌గ‌న్‌పై దండ‌యాత్ర చేశారు..  2019 డిసెంబర్‌ 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రతిపాదన చేశారు CM జగన్. ఆ క్షణమే అమరావతి ఉద్యమం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు.. అమరావతి ఉద్యమంలో ప్రతిదీ ఒక చారిత్రక ఘట్టమే... వంటిపై లాఠీలు విరిగినా వెనక్కు తగ్గలేదు... వరుసగా ప్రాణాలు పోతున్నా లెక్క చేయలేదు... 29 గ్రామాల రైతులు తొలిరోజు నుంచి అదే ధైర్యంతో 700 రోజులుగా ఉద్యమిస్తూనే ఉన్నారు... పోరు మహోగ్రంగా మారుతోందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు... తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, నవులురూ.. కృష్ణాయపాలెం, తాడికొండ అడ్డరోడ్డు ఇలా 29 గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా, ఎక్కడ చూసినా ఒకటే మాట.. మన రాజధాని-మన  అమరావతి..... 5 కోట్ల మంది ప్రజల గొంతుక 700 రోజులుగా ప్రతిధ్వనిస్తోంది.. రాజధాని కోసం అనేక‌ రూపాల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు... జలదీక్షలు చేశారు... అర్థనగ్నంగా ప్రదర్శనలు చేశారు... మోకాళ్లపై నడిచారు... రాజధాని వీధుల్లో కదం తొక్కి ర్యాలీలూ చేశారు... దేవుళ్లకు మొక్కారు... ముడుపులు కట్టారు... అల్లానూ ప్రార్థించారు... ఏసు ఆశీస్సులనూ కోరారు... తమకు నామాలు పెట్టిన వాళ్ల బుద్ధి మారాలంటూ హోమాలు చేశారు... ఏ రీతిన తమ ఆకాంక్ష తెలియచేసినా అంతా శాంతిమంత్రమే...  అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులు నిరసన బాట పట్టి కేసులతో జైళ్ళకు కుడా వెళ్లారు. ఒక్క రాజధాని ప్రాంతంలోనే 600 మందికి పైగా రైతులను అరెస్టు చేసి కోర్టు బోను ఎక్కించారు. ఇది కృత్రిమ ఉద్యమం ఎంత‌మాత్రం కాదు..... ఇది పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం అంతకంటే కాదు...క‌రోనా విజృంభ‌ణ‌తో.. సామూహిక దీక్షలకు బ్రేక్ పడినా.. విడతల వారీగా ప్రతిరోజూ రైతులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అమరావతి నినాదాన్ని గొంతెత్తి చాటుతూనే ఉన్నారు. అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు కూడా సంపూర్ణ మద్దతు పలికారు. ప్రపంచంలో ఎక్కడా 3 రాజధానుల కాన్సెప్ట్ సక్సెస్ కాలేదనేది NRIల మాట‌.   తెలుగుదేశం హయాంలో 2014 సెప్టెంబర్‌ 1న కేబినెట్ తీర్మానం చేశారు. 2015 అక్టోబర్‌లో ప్రధాని చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన చేశారు. 29 గ్రామాల పరిధిలో 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నవ నగరాల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. గ్రీన్‌ఫీల్డ్ సిటీకి ప్లాన్ సిద్ధమయ్యాక పనులు పరుగులు పెట్టాయి. ఒక్కో భవనం పైకి లేచింది. సింగపూర్ సంస్థలూ రంగంలోకి దిగాయి. వేల మంది కార్మికులు రేయింబవళ్లు పని చేస్తుంటే.. విద్యుత్ వెలుగుల్లో అమరపురి వెలిగిపోయింది.   కానీ ఇదంతా గ‌తం. ఇప్పుడు ఆ వెలుగులన్నీ ఆరిపోయాయి. YCP అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి భవిష్యత్ అగమ్య గోచరమైంది. నమ్మించి గొంతు కోశారు. అధికారంలోకి రాగానే విధ్వంసానికి తెర తీశారు. అమరావతి సాక్షిగా చేసిన చట్టాలనే రద్దు చేసి వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. 3 రాజధానుల ప్రతిపాదనకు విశాఖ, కర్నూలు వాసుల నుంచి పూర్తి మద్దతు లేకపోయినా బలవంతంగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలకు రంగుల పేరుతో చేసిన వృధా 2,600 కోట్లు పెడితే  అమరావతిలో పెండింగ్ నిర్మాణాలు కొలిక్కి వచ్చేవి. పాలన మరింత సమర్థంగా జరిగే వీలుండేది.  YCPసర్కారు 3 ముక్కలాటకు తెరతీసిన నాటి నుంచి 700 రోజులుగా రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులకు కడుపు నిండా తిండిలేదు. కంటి నిండా నిద్రలేదు. రాజధానికి భూములిచ్చిన వారిలో 29 వేల 881 మంది ఉన్నారు. ఇందులో ఎకరం లోపు ఇచ్చిన చిన్నరైతులే 20 వేల మంది. వీరిలో బీసీలు, దళితులే ఎక్కువ. ఈ పేద రైతులంతా కన్నీళ్లు పెడుతున్నారు. తమను ఏడిపించి జగన్ సర్కారు ఏం సాధిస్తుందని ప్రశ్నిస్తున్నారు.   న్యాయమైన హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి అధికార పార్టీ మినహా అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. 13 జిల్లాల్లోనూ అమరావతికి మద్దతుగా దీక్షలు జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా లోకేష్, ఇతర రాజకీయ పార్టీలన్నీ రాజధాని రైతులకు బాసటగా నిలిచాయి. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినాయకులు అమరావతి ప్రాంత రైతులను పరామర్శించి దీక్షకు మద్దతు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంత రైతుల కోసం జోలె పట్టుకుని బిక్షాటన చేశారు. ఆయన భార్య భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ప్రకటించడం వంటి ఘటనలు అమ‌రావ‌తి ఉద్య‌మంలో ముఖ్య ఘట్టాలు.  రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకం సందర్భం వచ్చిన ప్రతిసారీ అమరావతి వైపే నిలబడుతున్నా.. కుట్రలు, పోలీసు బలగాలతో ఉద్యమంపై జగన్‌ సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. 29 గ్రామాల ప్రజలు చేసి తప్పేంటి..? ఆంధ్రులకు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండాలని ఆకాంక్షించడం తప్పా? ల్యాండ్ పూలింగ్‌లో అడిగిన వెంటనే భూములు ఇవ్వడం నేరమా. దశల వారీగా రాజధాని నిర్మించుకోవడానికి ఇబ్బందేంటి.. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకీ ఏ YCP నాయకుడి దగ్గరా సమాధానం ఉండదు. అందుకే, సీఎం జ‌గ‌న్ క‌నిపించినా, స్థానిక ఎమ్మెల్యే RK కనిపించినా.. ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఓటు వేసి గెలిపించినందుకు తమను ఎందుకు మోసం చేశారని క‌డుపుమంట‌తో ర‌గిలిపోతుంటారు రైతులు, మ‌హిళ‌లు.  రాజధానిపై సామాజిక వర్గం ముద్ర వేయడం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయడం.. ఖర్చు ఎక్కువంటూ ప్రచారం చేయడం.. ఇలా ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు అధికార పార్టీ నేతలు. వీటన్నింటినీ తిప్పికొడుతూనే ఉద్యమాన్ని వినూత్న రీతుల్లో ముందుకు తీసుకెళ్లారు అమరావతివాసులు. మహిళలైతే ఉద్యమంలో మొదట్నుంచి కీలకమైన పాత్ర పోషించారు. ఈ మహిళా శక్తి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. సాక్షాత్తూ ప్రధానే అమరావతికి శంకుస్థాపన చేశారు. చేయూత ఇస్తామన్నారు. చంద్రబాబు సారధ్యంలో మాస్టర్ ప్లాన్ మొత్తం సిద్ధమై నిర్మాణాలు చకచకా  మొదలయ్యాయి. ఓ పక్క ప్రభుత్వ కాంప్లెస్‌లు సిద్ధమవుతుంటే.. SRM, విట్ లాంటి ఎన్నో సంస్థలు తరలివచ్చాయి. విశ్వనగరానికి పునాదులు పడి వడివడిగా ముందుకు సాగుతున్న టైమ్‌లో.. అధికారమార్పిడితో మొత్తం తలకిందులైంది. అమరావతిని భ్రమరావతి అని నిరూపించాలనుకుని ప్రయత్నం చేసిన వారు.. వస్తూనే  విధ్వంసానికి తెరతీశారు. దీన్ని సరిదిద్దాలంటూ 700 రోజులుగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూనే ఉంది. ప్రస్తుతం అమరావతిలో సాగుతున్న పోరాటం 29 గ్రామాలకు సంబంధించింది ఎంత మాత్రం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్‌. అందుకే.. అమరావతి నినాదం రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతిచోటా మార్మోగుతోంది. కొవిడ్ కారణంగాను, కోర్టు తీర్పుల వల్లా ప్రస్తుతానికి రాజ‌ధాని తరలింపు ఆగింది. ఇది తాత్కాలికంగా ఆగడం కాదు శాశ్వతంగా అమరావతే రాజధాని అని ప్రకటించే వరకూ విశ్రమించేది లేదంటున్నారు అమ‌రావ‌తి ప్ర‌జ‌లు. అందుకే, 700 రోజులుగా ఉద్య‌మిస్తున్నారు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ.. అంటూ మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. త‌మ పోరాటం ఇక్క‌డితో ఆగిపోదు.. ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా లక్ష్యం చేరుకునే వరకూ ఎత్తిన పిడికిలి దించేది లేదంటున్నారు. ఉద్యమమే ఊపిరైతే.. రేపటి తరాల బంగారు భవిష్యత్తే నీ లక్ష్యమైతే.. ఆ స్ఫూర్తిని ఆపేదెవరు. ఆ ఆశయానికి అడ్డు తగిలేదెవరు. నియంతల్లా మారిన పాలకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా సరే.. ఆ ఉక్కు సంకల్పం గెలిచే తీరుతుంది. ఈ తథాగతుడి సాక్షిగా.. ఆ గౌతమబుద్ధుడు బోధించిన అహింసా సిద్ధాంతమే ఆయుధంగా.. అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో అంతిమ విజయం ప్రజలదే అవుతుంది. ప్రజా ఉద్యమానికి ఎలాంటి పాలకులైనా తలవంచాల్సిందే. న్యాయం, ధర్మం గెలవాల్సిందే. అమరావతి పోరాటం విజయం సాధించాల్సిందే. ఇప్ప‌టికే రెండేళ్లుగా ఉద్య‌మిస్తున్నారు. మ‌రో రెండేళ్లు ఇలానే పోరాడే స‌త్తా, స‌త్తువ, సాహ‌సం ఉంది. అప్ప‌టికి మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈసారి చంద్ర‌బాబు మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతారా.. అమ‌రావ‌తి స్వ‌ప్నం సాకారం కాక‌పోతుందా.. అనే ఆశ‌తోనే, ప‌ట్టు వ‌ద‌ల‌ని సంక‌ల్పంతో పోరాడుతున్నారు అమ‌రావ‌తివాసులు. వారి ఆకాంక్ష త‌ప్ప‌క‌ నెర‌వేరాల‌ని కోరుకుంటూ.. జై అమరావతి.. జైజై అమరావతి.

హార్దిక్ పాండ్యా దగ్గర రూ. 5 కోట్ల వాచీలు సీజ్! బిల్లులు ఉన్నాయంటున్న క్రికెటర్.. 

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా‎ చిక్కుల్లో పడ్డారు. దుబాయ్ నుంచి  టీ20 ప్రపంచకప్​ ముగించుకుని దుబాయ్​నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ముంబై ఎయిర్‎పోర్ట్‎లో దిగిన పాండ్యా వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు హార్దిక్ పౌండ్యా వద్ద గుర్తించారు. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది. తనపై వస్తున్న వార్తలపై  ఆల్ రౌండర్ హార్దిక్  పాండ్యా స్పందించారు. నవంబర్ 15న సోమవారం తెల్లవారుజామున నేను దుబాయ్ నుండి వచ్చాను. నా లగేజీని తీసుకున్న తర్వాత, నేను తీసుకువచ్చిన వస్తువుల వివరాలు చెప్పడానికి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయ కస్టమ్స్ కౌంటర్‌కి వెళ్లాను. నేను చేసిన ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. వాచ్ ఖరీదు దాదాపు రూ. 1.5 కోట్లని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం 5 కోట్లు కాదు. నేను దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను. నేను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనకు సహకరించింది. వారికి నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి వారికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను అందజేస్తాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అని పాండ్యా చెప్పాడు. గత సంవత్సరం కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు హార్దిక్ పాండ్యా. హార్దిక్ , కృనాల్ పాండ్యా దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా అనుమతి లేని బంగారం, ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారనే అనుమానంతో ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కృనాల్ వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం, కొన్ని బహిర్గతం చేయని లగ్జరీ వాచీలు దొరికాయి. 

సీఎం యోగి రాజు.. కంగనా రాణి! ఎంపీ అసద్ హాట్ కామెంట్స్..

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై దుమారం మరింత ముదురుతోంది. భారత స్వాతంత్రం, మహాత్మ గాంధీజీపై ఆమె చేసిన కామెంట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 1947లో మనకు వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఇటీవలే కామెంట్ చేశారు కంగనా. ఈ  వ్యాఖ్యలే దేశంలో  పెద్ద వివాదాన్నే రేపాయి. తాను చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పి, పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కంగనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మన దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ఒక మేడమ్ మనకు 2014లో స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారని ఎద్దేవా చేశారు. ఇదే వ్యాఖ్యలు ఒక ముస్లిం చేసి ఉంటే... ఇప్పటికే దేశద్రోహం కేసు పెట్టి, మోకాళ్లపై కాల్పులు జరిపి, ఆ తర్వాత జైలుకు పంపేవారని అన్నారు. ఆమె ఒక రాణి అని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ రాజు అయినప్పటికీ ఆమెను ఏమీ చేయరని అసద్ విమర్శించారు టీ20 మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుపొందిన తర్వాత సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు పెట్టారని... మరి ఇప్పుడు కంగనపై కూడా అవే కేసులు నమోదు చేస్తారా? అని అసదుద్దీన్ ప్రశ్నించారు. విద్రోహం కేసులను కేవలం ముస్లింలపైన మాత్రమే పెడతారా? అని అడిగారు. ఇంతకూ మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పాలని ఎంపీ అసదుద్దీన్ డిమాండ్ చేశారు.

8 కోట్ల భూ వివాదానికి 40 కోట్ల సుపారీయా? పెద్దలను తప్పించే ప్రయత్నమన్న రఘురామ.. 

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం స్పష్టించిన  సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకంపనలు రేపుతోంది. దస్తగిరి వాంగూల్మంలో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండటంతో.. హత్య వేనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.   వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా జరుగుతున్న పరిణామాలు, దస్తగిరి వాంగ్మూలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.  దస్తగిరి కన్పెషన్ స్టేట్ మెంట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని  అన్నారు. భూ వివాదాల వల్లనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోందని, ఇది కేసును తప్పుదోవ పట్టించడానికేనన్నది అర్థమవుతుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. బెంగళూరు భూ వివాదానికి, వైఎస్ వివేకా హత్యకు ముడిపెడుతున్నారని అన్నారు.  8 కోట్ల భూ వివాదానికి 40 కోట్ల సుపారీ ఇస్తారా అని రఘురామ రాజు అనుమానం వ్యక్తం చేశారు.  ఇది కరెక్ట్ కాదని, నిజాలు బయటకు తీసుకు రావాల్సిన బాధ్యత సీబీఐదేనని ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. 8 కోట్ల భూవివాదంలో 40 కోట్ల సుపారీని ఎర్రగంగిరెడ్డి ఎలా ఇస్తారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఈ హత్య వెనక అసలు నిందితులు ఎవరో బయటకు రావాలని రఘురామ డిమాండ్ చేశారు.  

హైకోర్టు న్యాయమూర్తిగా స్వలింగ సంపర్కుడు! సీజేఐ రమణ కొలీజయం సంచలనం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి పలు కీలక నిర్ణయాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా చేసిన సిఫార్సు సంచలనమైంది. తాను స్వలింగ సంపర్కుడినని గతంలో బహిరంగంగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్‌పాల్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజయం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది. గతంలో 2017, 2018, 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో సౌరభ్ పేరును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. కేంద్ర నిఘా విభాగం ఆయనను స్వలింగ సంపర్కుడిగా ప్రస్తావించకుండా, ఆయన జీవిత భాగస్వామి విదేశానికి చెందిన వ్యక్తని, స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తుండడంతో ఆయన నియామకం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫలితంగా సౌరభ్ సీనియర్ న్యాయవాదిగానే ఉండిపోయారు. తాజాగా, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయనను హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది. దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా సౌరభ్ కిర్‌పాల్ రికార్డులకు ఎక్కుతారు. 

అమిత్ షా భేటీకి కేసీఆర్ డుమ్మా అందుకేనా? తాకట్టు రాజకీయాలేనా?

దక్షిణాది రాష్ట్రాల ప్రజాసమస్యల పరిష్కారం లక్ష్యంగా తిరుపతిలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తమ సమస్యలను కేంద్ర హోమ్ మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా విన్నవించుకున్నాయి. ఈ సమావేశం ప్రధానంగా ముఖ్యమంత్రులు సమావేశం. కానీ, తెలంగాణ, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. వరదల కారణంగా తమిళనాడు ముఖ్యమంత్రి హాజరు కాలేక పోతున్నారని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.   నిజానికి, ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ వేదిక అవసరం కొంచెం చాలా ఎక్కువ. ఒక విధంగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబందించే కాకుండా, ఇరుగు పొరుగు రాష్ట్రాల సంబంధాలు, సమస్యలు చర్చించుకునేందుకు ఇదొక చక్కని అవకాశం. ఇతర విషయాలు ఎలాఉన్నా, రాష్ట్ర విభజన జరిగి ఏడు సంవత్సరాలు పూర్తయినా, విభజన హామీలు అనేకం ఇంకా అలాగే ఉన్నాయి. అంతే కాదు, రాష్ట్ర విభజన నేపధ్యంగా ఏడేళ్ళ కాలంలో కొత్తగా తలెత్తిన సమస్యలూ చాలానే ఉన్నాయి. ఈ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లేందుకు, ఏపీతోనే కాకుండా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలను నేరుగా చర్చించుకునేందుకు సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం వేదిక ఒక చక్కని అవకాశం.  అయితే, ఇంత కీలక సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం, తీసుకోవల్సినంత సీరియస్ గా తీసుకోలేదని, ఈ సమావేశానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఆ రాష్ట్ర సమస్యలను అయన చెప్పుకున్నారు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సమావేశానికి హాజరు కాలేదు. అఫ్కోర్స్, తమిళ నాడు, కేరళ ముఖ్యమంత్రులు కూడా సమావేశానికి హాజరు కాలేదు. కానీ,  ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాకపోవడానికి, తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు కాకపోవాడాన్ని ఒకే గాటన కట్టలేమని, అధికారులు అంటున్నారు. విభజన హామీల అమలు, కేంద్రం జోక్యంతో పరిష్కారం కావలసిన సమస్యలు ఎన్నో ఉన్న నేపధ్యంలో ముఖ్యమంత్రి జోనల్ సమావేశానికి హాజరు కాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని, అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  కాగా హుజూరాబాద్ ఓటమి తర్వాత, ఇటు కేంద్రం పైనా అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైన యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు సంకేతంగా తమ ధిక్కారాన్ని తెలియచేసేందుకే, సమావేసానికి హాజరుకాలేదా?థర్డ్ ఫ్రంట్ వైపు వెళుతున్నానన్న సంకేతాలు ఇచ్చేందుకు తిరుపతి సమావేశానికి హోమ్ మంత్రి ముహ్మద్ అలీని పంపి తాను దూరంగా ఉన్నారా? అనే చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో చురుగ్గా సాగుతోంది.  అలాగే హుజూరాబాద్ ఓటమి తర్వాత వరసగా రెండు రోజులు ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అటు బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపధ్యంలో,జోనల్ సమావేశానికి హాజరై, అడగ వలసిన ప్రశ్నలు అడగలేని పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా, ‘తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ’ రూటులో సమావేశానికి డుమ్మాకొట్టారా, అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.  అదే సమయంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారానికి మరో రెండేళ్లలో పదేళ్ళ గడువు ముగుస్తున్న నేపధ్యంలో హామీల అమలు, సమస్యల పరిష్కారం కాకుండా అడ్డుకునేందుకు,తద్వారా సెంటిమెంట్ మంటల్లో రాజకీయ చలికాచుకునే ఉద్దేశంతో, కేసీఆర్, కీలక భేటీకి దూరంగా ఉన్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. అయితే, రాజకీయ ప్రయోజనాలను ఆశించి, కేంద్ర రాష్ట్ర సంబధాలను రాజకీయం చేయడం వలన రాష్ట్రానికే నష్టమని, ముఖ్యంగా ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇలా కేంద్రంలో కయ్యానికి కాలు దువ్వడం వలన నష్టపోయేది రాష్ట్రమే కానీ, కేంద్రం కాదని సీనియర్ అధికారులు అంటున్నారు. చెరువు మీద అలిగితే .. చెరువుకు వచ్చే నష్టం ఉండదు, అలాగే అత్తమీద కోపం దుత్త మీద చూపినా అంతే అంటున్నారు.