బండా, క‌డియంల‌కు డిప్యూటీ సీఎం? వెంక‌ట్రామిరెడ్డికి ఫైనాన్స్‌? ఇద్ద‌రు రెడ్లకు ఊస్టింగ్‌?

కేసీఆర్ రాజ‌కీయ చాణ‌క్యుడు.. మాంత్రికుడు.. మాయ‌ల మ‌రాఠీ.. పిట్ట‌ల దొర‌.. ఇలా ర‌క‌ర‌కాలుగా అంటుంటారు. పాజిటివ్ లేదా నెగ‌టివ్.. ఎవ‌రు ఏమ‌న్నా.. ఆయ‌న తెలంగాణ చాణ‌క్యుడు అనే సంగ‌తిని మాత్రం అంతా ఒప్పుకుంటారు. బొక్క‌బోర్లా ప‌డినా కూడా.. ఎవ‌రూ త‌న‌ను చూసి న‌వ్వ‌కుండా.. ట‌క్కున లేచి నిలిచుంటారు. ఓడినా.. తానే గెలిచిన‌ట్టు బిల్డ‌ప్ కూడా ఇస్తుంటారు. ఇక ఆయ‌న ఆడే రాజ‌కీయ జూదం మామూలుగా ఉండ‌దు. ఏ పావును.. ఎప్పుడు ఎక్క‌డ‌ ఎలా క‌ద‌పాలో కేసీఆర్‌కు బాగా తెలుసంటారు. హుజురాబాద్ ఓట‌మి.. ఈట‌ల గెలుపు.. ద‌ళిత‌బంధు ఫెయిల్యూర్‌.. రేవంత్‌రెడ్డి దూకుడు.. త‌దిత‌ర కీల‌క ప‌రిణామాల నేప‌థ్యంలో ఎమ్మెల్సీల రూపంలో కేసీఆర్ వేగంగా పావులు క‌దిపారు. అనూహ్యంగా కొంద‌రు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేశారు. ఆ పావుల వెనుక ఆనేక వ్యూహాలు ఉన్నాయ‌ని అంటున్నారు.  బండా ప్ర‌కాశ్‌ను రాజ్య‌స‌భ నుంచి తీసుకొచ్చి.. మండ‌లిలో కూర్చోబెడ‌తార‌ని ఎవ‌రూ ఊహించి ఉండ‌క‌పోవ‌చ్చు. కేసీఆర్ చాతుర్యం అలా ఉంటుంది మ‌రి. బండా ప్ర‌కాశ్ ముదిరాజ్‌. ఆయ‌న పేరు చివ‌రున్న ముదిరాజ్ ప‌ద‌మే ఇప్పుడు ఆయ‌నకు ప్ర‌త్యేక‌త‌ను, ప్ర‌మోష‌న్‌ను తీసుకొస్తోంది. ముదిరాజ్ వ‌ర్గానికి చెందిన ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎదుర్కొడానికే మ‌రో ముదిరాజ్ నేత‌ బండా ప్ర‌కాశ్‌ను రాష్ట్రానికి తీసుకొస్తున్నార‌ని తెలిసిందే. జ‌స్ట్ ఎమ్మెల్సీని చేయ‌డ‌మే కాదు.. త్వ‌ర‌లో కేబినెట్ విస్త‌ర‌ణ‌లో ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా చేస్తార‌ని అంటున్నారు. తెలంగాణ‌లో చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఉన్న ఆ సామాజిక వ‌ర్గాన్ని టీఆర్ఎస్ నుంచి దూరం కానీయ‌కుండా.. వారంతా ఈట‌ల వెట ఉండ‌కుండా.. బండాతో బండేసి ఆ ప్ర‌వాహాన్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. గెలిచినా ఈట‌ల‌కు మ‌న‌శ్శాంతి లేకుండా వెంటాడేలా.. క‌నీసం ముదిరాజ్‌ సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న వెంట లేకుండా చేసేలా.. కేసీఆర్ స్కెచ్ వేశార‌ని చెబుతున్నారు. బండా ప్ర‌కాశ్‌ను ఎమ్మెల్సీ.. మంత్రి.. డిప్యూటీ సీఎం చేసి.. ముదిరాజ్‌ల‌ను, బీసీల‌ను కారులోనే బంధించాల‌నేది గులాబీ బాస్ వ్యూహంలా క‌నిపిస్తోంది.    ఇక క‌డియం శ్రీహ‌రికి ఎమ్మెల్సీ అంతా ఊహించిందే. అంతా ద‌ళిత మంత్రం జ‌పిస్తున్న ఈ స‌మ‌యంలో క‌డియంకు ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోతే ర‌చ్చ ర‌చ్చ అవుతుంద‌నే భ‌యంతోనే కేసీఆర్ ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌క త‌ప్ప‌లేదంటున్నారు. లేదంటే.. ఇచ్చుండ‌క‌పోవ‌చ్చుని కూడా చెబుతున్నారు. క‌డియం శ్రీహ‌రి ప‌ద‌వికాలం ముగిసి చాలా రోజులే అవుతోంది. చాన్నాళ్లుగా ఆయ‌న ఎలాంటి ప‌ద‌వీ, ప‌నీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. కేసీఆర్ ఆయ‌న్ను దాదాపు ప‌క్క‌న‌పెట్టేశారు. ఈట‌ల పుణ్యానే క‌డియంకు ఎమ్మెల్సీ రాబోతోంద‌ని అనుకోవ‌చ్చు. ద‌ళిత‌బంధు, సీఎంవోలో ద‌ళిత ఐఏఎస్‌, ద‌ళితుడైన‌ క‌డియంకు ఎమ్మెల్సీ.. ఇదే కోవ‌లో చూడాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. క‌డియంకు ఎమ్మెల్సీతోనే స‌రిపెట్ట‌క‌.. గ‌తంలో మాదిరే డిప్యూటీ సీఎం కూడా చేస్తార‌ని చెబుతున్నారు. ఏమో.. చేసినా చేయొచ్చు. ఇక‌, అనూహ్యంగా వెంక‌ట్రామిరెడ్డితో ఎమ్మెల్సీగా రాజ‌కీయ ఎంట్రీ చేయించారు కేసీఆర్‌. ఆయ‌న మాజీ క‌లెక్ట‌ర్ కాదు.. కేసీఆర్ బంట్రోతు.. అవినీతి అన‌కొండా అంటున్నారు రేవంత్‌రెడ్డి. ఎవ‌రేమ‌న్నా.. త‌న‌కు న‌మ్మ‌క‌స్తుడైన వెంక‌ట్రామిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి.. మంత్రిని కూడా చేస్తార‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాల స‌మాచారం. ఏకంగా కీల‌క‌మైన‌ ఆర్థిక శాఖ‌నే వెంక‌ట్రామిరెడ్డికి క‌ట్ట‌బెడుతార‌ని తెలుస్తోంది. హ‌రీశ్‌రావు నుంచి ఆర్థికం తీసేసి.. కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే ప‌రిమితం చేస్తార‌ని అంటున్నారు.  కేబినెట్‌లో మ‌రో ఈట‌ల లాంటి వారు త‌యార‌వ‌కుండా.. అనుమానం ఉన్న వారంద‌రినీ బ‌య‌ట‌కి పంపించేయ‌డం ఖాయ‌మంటున్నారు. ఇద్ద‌రు ముగ్గురు 'రెడ్డి' మంత్రుల‌కు గండం పొంచిఉంద‌ని తెలుస్తోంది. హంపి రిసార్ట్‌లో త‌న‌కు వ్య‌తిరేకంగా వాగిన ఓ మంత్రితో పాటు, రెడ్ల‌కే అధికారం ద‌క్కాల‌ని బ‌లంగా కోరుకుంటూ, గ‌ప్‌చుప్‌గా రేవంత్‌రెడ్డితో ట‌చ్‌లో ఉన్న మ‌రో మంత్రికి సైతం కేబినెట్ నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇలా.. ఎమ్మెల్సీల్లానే త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోవు మంత్రిమండ‌లి విస్త‌ర‌ణ‌లోనూ ప‌లు షాకింగ్‌లు, షేకింగ్‌లు త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. కేసీఆర్ క‌ద‌ప‌బోవు మంత్రి పావు ఎవ‌రికి చెక్ పెడుతుందో చూడాలి..

ఏపీ గవర్నర్ కు తీవ్ర అస్వస్థత.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలింపు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ముందు విజయవాడలోని ఓ ఆస్పత్రిని సంప్రదించగా ఆయనకు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానించారు. వెంటనే గవర్నర్ వ్యక్తిగత వైద్యులు ఆయనను హైదరాబాద్‌కు తరలించారు.  గవర్నర్‌కు గతంలో ఒకసారి కోవిడ్ సోకినట్లు తెలియవచ్చింది. ఇటీవల కాలంలో ఆయన ఢిల్లీ పర్యటనతోపాటు పలు ప్రాంతాలకు వెళ్లి వచ్చారు. మంగళవారం నుంచి గవర్నర్‌కు కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు భావించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అయితే ఆయనకు కరోనానా? లేక సాధారణ అస్వస్థత అనేది నిర్ధరాణ కావాల్సి ఉంది.

మొదట టీడీపీ గెలుపు.. రీకౌంటింగ్ లో ఫలితం తారుమారు 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలం మున్సిపాలిటీ కౌంటింగ్ లో ఉద్రిక్తతలు తలెత్తాయి.8వ వార్డులో మొదట ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు. తర్వాత వైసీపీ అభ్యర్థి కోరడంతో రీకౌంటింగ్ జరిపారు. అయితే రీకౌంటింగ్ తర్వాత వైసీపీ అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో రీకౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ టీడీపీ అభ్యర్థి కౌంటింగ్ హాల్ దగ్గర ఆందోళనకు దిగాడు. దీంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ రోజున అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు.. కౌంటింగ్ లోనూ దౌర్జన్యాలకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

బుగ్గ‌నకు బిగ్ షాక్‌.. మంత్రి ఏరియాలో టీడీపీ ఘ‌న‌ విజ‌యం..

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీకి షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. ఓవ‌రాల్‌గా అధికార పార్టీదే ఆధిప‌త్యం అయినా.. అనేక చోట్ల‌ వైసీపీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఎంత‌గా దొంగ ఓట్లు వేయించుకున్నా.. ఎంత‌లా అధికార బ‌లాన్ని అడ్డ‌గోలుగా వాడేసుకున్నా.. ప్ర‌తిప‌క్షంపై ఎన్ని కుట్ర‌లు చేసి ఎంత‌గా క‌ట్టుదిట్టం చేసినా.. ప‌లు ప్రాంతాల్లో టీడీపీ విజ‌యాన్ని అడ్డుకోలేక‌పోయారు.  క‌ర్నూలు జిల్లా బేతంచెర్ల మున్సిప‌ల్ ఎల‌క్ష‌న్‌లో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌కు భారీ షాక్ తగిలింది. బుగ్గన నివాసం ఉండే 15 వార్డులో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి వెంకట సాయి కుమార్ 114 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో టీడీపీ శ్రేణులు బేతంచెర్లలో సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే క‌ర్నూలు జిల్లాలో జరిగిన సర్పంచ్, వార్డులకు జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ ఊహించని ఎదురుదెబ్బ‌లే తగిలాయి. నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో వైసీపీ అభ్యర్థి నాగపుల్లారెడ్డిపై టీడీపీ అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందారు. నంద్యాల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఓడిపోయారు. అలాగే ఎమ్మిగనూరు మండలం కె. తిమ్మాపురంలోనూ వైసీపీ వార్డు అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో సీపీఐ అభ్యర్థి మహేశ్వరి విజయం సాధించారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామపంచాయతీ ఎన్నికలో టీడీపీ రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇలా మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ క‌ర్నూలు జిల్లాలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు త‌గిలాయి. ప్ర‌భుత్వంపై, వైసీపీ నేత‌ల‌పై ప్ర‌జా వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. అథోగ‌తి పాలు చేశార‌న్న కోపం.. ఆర్థిక మంత్రిపై చూపించిన‌ట్టున్నారు ఓట‌ర్లు. అందుకే బుగ్గ‌న నివాసం ఉండే వార్డులో వైసీపీని ఓడించి రివేంజ్ తీర్చుకున్నారు ప్ర‌జ‌లు.   

బాబు రావాలి.. జగన్ పోవాలి... జనం నాడి ఇదే..!

నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. తొలి రోజుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిన్న అల్లుడుగా.. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర రథసారధిగా చంద్రబాబు.. తన పరిపాలనాతో మంచి పేరు, ప్రఖ్యాతలు  తెచ్చుకున్నారు. రాజకీయానికి ఐటీ రంగాన్ని జోడించి.. తన దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.  దేశంలో అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాంను ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. దేశ ప్రధానులతో సైతం చంద్రబాబు సన్నిహితంగా మెలిగేవారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు చాణక్యం అందరికీ తెలిసిందే.   గతంలో హైదరాబాద్ అంటే.. జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత భాగ్యనగరంలో హైటెక్ సిటీ నిర్మించారు. హైటెక్ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీర్స్ కన్సెల్టెన్సీగా చంద్రబాబు అభివర్ణించారు. దేశంలో ఐటీ రంగానికి హైటెక్ సిటీ కేంద్ర బిందువు మారిందంటే అందంతా చంద్రబాబు చలవే. నాడు చంద్రబాబు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరాన్ని మనం నేడు చూడవచ్చు.  అంతేకాదు.హైటెక్ సిటీని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతోంది అనేది ఎవరకు కాదనలేని సత్యం. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినా... మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్‌ భాగ్యనగరానికి వచ్చినా.. అది చంద్రబాబు ఘనతే కానీ మరొకరిది కాదనేది అక్షర సత్యం.  ఉదాహరణకు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా..  పక్క రాష్ట్ర సీఎం జయలలిత.. ఓ సారి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో ప్లై ఓవర్లు, ఎటు చూసిన పచ్చని చెట్లు, విశాలమైన రహదార్లు.. చూసి జయలలిత ముగ్డురాలయ్యారు. ఆ వెంటనే ఆమె.. చెన్నైలోని తన అధికార గణానికి ఫోన్ చేసి.. హైదరాబాద్ నగరం ఎంతలా అభివృద్ధి చెందిందో వారికి వివరించడమే కాకుండా.. వారిని ఆగమేఘాల మీద హైదరాబాద్ రావాలని ఆదేశించిన విషయం విధితమే.  విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సెంటర్ పాయింట్‌ గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడితోపాటు మరో 26 గ్రామాలను చంద్రబాబు గుర్తించారు. ఆ క్రమంలో సదరు గ్రామాలను కలిపి రాజధాని పేరుతో అమరావతి ఏర్పాటు చేశారు. అందుకోసం రైతుల నుంచి భూమిని తీసుకుని... దానిని అభివృధ్ది చేసేందుకు ప్రణాళికలు సైతం రూపొందించారు.  చంద్రబాబులోని దార్శనికతకు ఇది ఒక మచ్చుతునక. ఓ సారి యూపీఏ అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టి.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదరు టీడీపీ నేతలను పీఎం మన్మోహన్ సింగ్‌ ఒక్కే ఒక్క ప్రశ్న.. మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలా ఉన్నారని.. ఆయన్ని అడిగానని చెప్పాలన్నారు. చంద్రబాబుపై పీఎం మన్మోహన్ సింగ్ ఆరా తీయడంతో అక్కడ టీడీపీ నేతలంతా అవాక్కయ్యారు. దటీజ్ చంద్రబాబు.   ఇలా చంద్రబాబు గురించి చెప్పుకుంటూ ఒకటా రెండా... చాలా ఉంటుంది. చంద్రబాబు..ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్పూర్తితో ప్రముఖ దర్శకుడు శంకర్ ఒకే ఒక్కడు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉండగా.. జన్మభూమి, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టిన, రైతు బజార్లు ఏర్పాటు చేసినా.. ఆయనకు ఆయనే సాటి.. చంద్రబాబు దార్శనికతకు ప్రతిరూపం అనడంలో అతిశయోక్తి లేదేమో. అందుకు ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే.. రాష్ట్రంలో చోటు చేసుకునే పరిణామాలు చంద్రబాబు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజధాని మారుస్తారు తమ్ముళ్లు అని  చెప్పారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు... రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్తుందన్నారు. సామాన్యులకు  సహాజ వనరులు అందవని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఇవన్నీ చంద్రబాబు ముందే ఊహించి.. ఓ దార్శనికతతో చెప్పారు. కానీ ఆయన మాటలను ప్రతి ఆంద్రుడు పెడ చెవిన పెట్టారు.  దాంతో నేడు ఆంధ్రులు పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలిసినవే. ఇక ఉత్తరాఖండ్‌లో ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆప్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లకు సైతం చంద్రబాబు పాఠాలు చెప్పారు. పరిపాలనకు, దర్శనికతకు, నీతి, నిజాయితీకులకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య కళ్యాణం... పచ్చ తోరణంలా కళకళాడాలంటే చంద్రబాబే రావాలని ఆ రాష్ట్ర ప్రజలు మనసా వాచా కర్మణా కోరుకుంటున్నారంటే దటీజ్ నారా చంద్రబాబు నాయుడు.

ఒక్కరు ఓటు వేయలే.. కుప్పంలో ఆసక్తికర పరిణామం..

ఏపీలో ప్రతిష్టాత్మకంగా సాగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కుప్పంలో మున్సిపాలిటి ఎన్నికల పోస్టల్ బ్యాలెట్‌లో ఒక్కరంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగీ ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోస్టల్ బ్యాలెట్ బాక్స్ మొత్తం ఖాళీగా ఉండిపోయింది. పోస్టల్ బ్యాలెట్ లేకపోవడంతో నేరుగా ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.  ఇక కుప్పం కౌంటింగ్ సెంటర్ వద్ద పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారు. మీడియాకు అనుమతి లేదు.. ఇక్కడికి రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అంతేకాదు.. కెమెరా తీస్తున్న వీడియో గ్రాఫర్లపై కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. మీడియాపై ఆంక్షలేంటి..? అంటూ పోలీసుల తీరుపై జర్నలిస్టులు మండిపడుతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదు.

కేసీఆర్ యుద్ధం ఎవరి పైన? టార్గెట్ ఎవరు?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ మరోసారి మాటల తూటాలు పేల్చారు. మరోసారి కడుపులో ఉన్న ఆవేదన, ఆందోళన, ఆగ్రహం మొత్తం ఒక్కసారిగా బయట పెట్టారు. కత్తులు దుశారు, కేంద్రం పై యుద్ధాన్ని ప్రకటించారు.సమస్య పాతదే.. వరి వివాదం. ప్రశ్నలు పాతవే, తెలంగాణలో పండిన వరి కొంటారో లేదో చెప్పాలని సూటి ప్రశ్నను కేంద్రంపై సంధించారు.   రెండు రోజుల డెడ్ లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత నవంబర్ 18 మహా ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. మహా ధర్నాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటారో లేదో ఆయన చెప్పలేదు కానీ, మంత్రి వర్గం మొత్తంగా ధర్నాలో కూర్చుంటుందని చెప్పారు. అలాగే, తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమెల్సీలు మొదలు క్రింది స్థాయి పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ‘ఇందిరాపార్క్’  ధర్నాలో పాల్గొంటారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’ పై జిల్లాలలో  జరుగతున్న భౌతిక దాడులను సమర్ధించుకున్నారు. బండి ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని, అంతవరకు ఆయన ఎక్కడికి వెళితే అక్కడ తెరాస రైతులు ఆయన్ని నిలదీస్తారని స్పష్టం చేశారు. ఒక విధంగా నిలదీయాలని దాడులు కొనసాగించాలని తెరాస రైతులకు/శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఆలాగే, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నిటికంటే ముఖ్యంగా, ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఎపిసోడ్స్’లో గానీ, ఈ తాజా ఎపిసోడ్’లో కానీ  బీజేపే అధ్యక్షుడు బండి సంజయ్’ని టార్గెట్ చేశారు. యాసంగిలోనూ వరి వేయాలని బండి ఇచ్చిన పిలుపు, రాష్ట్ర్ర ప్రభుత్వం కొనకపోతే మెడలు వంచికొనిపిస్తామని ఆయన చేసిన వ్యాఖ్య చుట్టూనే, ముఖ్యమంత్రి ఆగ్రహం బుసలు కొడుతోంది.  అయితే, ముఖ్యమంత్రి ఈ స్థాయిలో బండిని టార్గెట్ చేయడం వరి’ కోసమేనా? ఇంకా ఏదైనా అంతర్ వ్యూహం, సీక్రెట్ స్క్రిప్ట్ ఉందా? అంటే ముఖ్యమంత్రి బండి బుజాన తుపాకి పెట్టి ఒకటి  కంటే,ఎక్కువ తూటాలనే (వ్యూహలనే) ఎక్కుపెట్టారని రాజకీయ విశ్లేషుకులు భావిస్తున్నారు. నిజానికి ధాన్యం సమస్య కేవలం ఒక్క తెలంగాణకు మాత్రేమ సంబందించిన సమస్యకాదు,వరి పండించే అన్ని రాష్ట్రాలకు, ఆమాట కొస్తే దేశం మొత్తానికి సంబందించిన సమస్య. ఒకటి రెండు కాదు, ఏడేళ్లకు సరిపడా ధాన్యం బఫర్ స్టాక్ నిల్వలు గోడౌన్లలో పడి మగ్గుతున్నాయి. ఈ పరిస్థితిలో అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్రం కానీ, సమస్యను జటిలం చేయడం సరి కాదు, సమంజసం కాదు. సమాఖ్య స్పూర్తితో సమస్యను పరిష్కరించుకునే ప్రభుత్వాల స్థాయిలో ప్రయత్నం జరిగితేనే సమస్య ఎంతో కొంత పరిష్కారం అవుతుంది.   అంతే కానీ మంత్రులు, ప్రజాప్రతినిధులు రోడ్డు ఎక్కి, ధర్నాలు, మహా ధర్నాలు చేస్తే  సమస్య రాజకీయం అవుతుందే కానీ పరిష్కారం కాదని, వ్యవసాయ,ఆర్థిక రంగాల నిపుణులు అంటున్నారు.  సరే, అదలా ఉంచి మళ్ళీ ముఖ్యమంత్రి ఆగ్రహం,  ఆవేదనల విషయానికి వస్తే, హుజూరాబాద్’ ఉప ఎన్నిక ఓటమి ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూల కారణం అని వేరే చెప్పనక్కరలేదు. హుజూరాబాద్ ఓటమి తర్వాతనే ముఖ్యమంత్రి వరి వివాదాన్ని తెరమీదకు తెచ్చారు.అలా హుజూరాబాద్ ఓటమి ముఖ్యమంత్రి ఆగ్రహానికి మూలా కారణం అయితే, ఆ ఎన్నికల్లో ‘ఈటల రాజేందర్’ గెలిచి రావడం మరో ముఖ్య కారణం. ఈటల గెలుపు కేసీఆర్ ‘దొరహంకారాన్ని’ భయంకరంగా హర్ట్ చేసిందని, ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాల సమాచారంగా,  విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి బీజేపీలో ఈటల ఎదుగుదలను అడ్డుకునేందుకు, ఆయన తనకు ప్రత్యర్ధిగా ఎదగకుండా అడ్డుకునేందుకు, హుజురాబాద్ ఓటమిని అక్కడికే పరిమితం చేసేందుకు వ్యూహాత్మకంగా బండిని టార్గెట్ చేసి, పరోక్షంగా ఆయన్ని హీరో చేసేందుకు  సహకరిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఈటలకు చెక్ పెట్టాలనే ఆలోచన వెనక మరో వ్యూహం కూడా ఉందని అంటున్నారు. బీసీ ముదిరాజ్, క్యాస్ట్ ఓటును కాపాడుకోవాలన్నా, బీజేపీలో ఈటల ఎదగకుండా చేయడం అవసరంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఈటలను రీప్లేస్ చేసేందుకు అదే ముదిరాజ్ కులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్’కు ఎమ్మెల్సీ  టికెట్ ఇచ్చి, రాష్ట్రానికి తీసుకొచ్చారని అంటున్నారు. బండా ప్రకాష్’ మంత్రి వర్గంలోకి తీసుకోవడం కూడా ఖాయమని అంటున్నారు. అయితే, ముఖ్యమంత్రి ఈ స్థాయిలో స్కెచ్ గీసి ఎపిసోడ్ వైజ్’ గా ‘వరి’ సీరియల్ రక్తి కట్టించడం వెనక ఇదొక్కటే కారణమా అంటే కాదు, ఇదికూడా ఒక  కారణం, అంటున్నారు విశ్లేషకులు.   నిజానికి చుట్టుముడుతున్న కుటుంబ కలహాలు, పార్టీ అంతర్గత కుమ్ములాటలు, తిరుగుబాటు భయాలు, దళిత బంధు ఊబిలోంచి తప్పించుకునే ఎత్తుగడ, తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం, కేసుల భయం  ఇలా చాలా చాలా ఉపద్రవాలకు ముఖ్యమంత్రి ఎంచుకున్న సర్వరోగ నివారిణి, వరి వివాదం ... కేంద్రం పై యుద్ధం, అనే విశ్లేషణలు కూడా వినవస్తున్నాయి. అయితే, ఎంత కేసీఆరే అయినా, అన్ని సందర్భాలలో అందరినీ మోసం చేయడం అయ్యే పని కాదు. అంతే కాదు, రాష్ట్రంలో తెరాస కు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు, బండిని. బీజేపీ ని టార్గెట్ చేసినా అది చివరకు తెరాసకు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ బలపడి పది సీట్లు గెలుచుకుంటే, అది తెరాసకు అదనపు బలం, యాడెడ్ స్త్రెంత్ అవుతుంది. కానీ, ఆ పది సీట్లు బీజేపీకి దక్కితే, ఒక్కరూ తెరాస కారెక్కరు. సో ... బీజేపీని పెంచడం అంటే పాముకు పలు పోసినట్లే నని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

వైఎస్ వివేకాను చంపింది వాళ్లే.. వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..

ఆంధ్రప్రదేశ్ లో  ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ తీవ్ర కలకలం రేపుతోంది. దస్తగిరి స్టేట్ మెంట్ లో వైసీపీ ముఖ్య నేతలతో పాటు వైఎస్సార్ కుటుంబ సభ్యుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. తాజాగా వివేకా హత్యపై  ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు.  డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు.వివేకా హత్యలో పాల్గొనట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అతడిని అప్రూవర్‌గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదన్నారు. సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో  అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవని, కానీ ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చారని రాచమల్లు పేర్కొన్నారు. వివేకా హత్య విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఉందని కనుక నిరూపిస్తే తనతో సహా 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని అన్నారు.   వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్‌పై న్యాయవాదులు బుధవారం కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్రగంగిరెడ్డి బెయిలు పిటిషన్ రద్దు పిటిషన్‌పై కడప సబ్ కోర్టులో విచారణ ఎల్లుండి (19)కి వాయిదా పడింది.

అమరావతి అందరిది.. ఏపీలో మత మార్పిడీలు.. కేంద్రంపై కేసీఆర్ యుద్ధం.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ.. రాజధాని కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారంటే అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు----700 రోజులకు రాజధాని రైతుల మహోద్యమం చేరిందని ట్విటర్‌ ద్వారా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. రైతు ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుందన్నారు. ఉద్యమంలో అమరులైన 189 మంది రైతులకు నివాళులర్పించారు. ఏపీ ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్నారని మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోందని చంద్రబాబు చెప్పారు.--- కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దకేంద్ర హోంమంత్రి అమిత్‌షా దెబ్బకు బీజేపీ రాష్ట్ర నేతలు దిగొచ్చారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ సిద్ధమైంది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ ప్రకటన చేసింది. అవసరమైన సందర్భాలలో యాత్రలో పాల్గొంటామని బీజేపీ కీలక నేతలు ప్రకటించారు. రాష్ట్ర పార్టీ నేతల వ్యవహార శైలిపై నిన్న తిరుపతిలో అమిత్ షా క్లాస్ తీసుకున్నారు.  ----- ఏపీ ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లు, సెకీతో ఒప్పందాలపై ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు.  సెకీతో ఒప్పందంపై అభ్యంతరాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల ప్రధాన లక్ష్యం దెబ్బతినేలా పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. గ్రిడ్‌లో 100 శాతం కంటే అదనపు సామర్థ్యాన్ని ఎందుకు  జోడిస్తున్నారని అన్నారు.  ----  మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తున్న ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని గత జూన్‌లో ఏపీ సీఎస్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. మరోసారి ఏపీ సీఎస్‌కు ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ---- టీడీపీ నేత నారా లోకేష్ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలరా? అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నుంచి తాము పారిపోమని అన్నారు. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు..కుప్పంకు ఎందుకు మంచినీరు కూడా ఇవ్వాలేదని ప్రశ్నించారు. గెలవలేక చంద్రబాబు దొంగ ఓట్లని ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ----- వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ధాన్యం కొంటారో లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో కొన్నట్లుగా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదే కేంద్రం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులపై దాడి చేసేందుకు బండి సంజయ్ జిల్లాలు తిరుగుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.  -------- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. వీరంతా మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ---- సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారిగా ఉన్నప్పుడు వెంకట్రామి‌రెడ్డి వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ---- రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించాయని విమర్శించారు. ------ దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా వారాంతపు లాక్‌డౌన్ విధించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే కోర్టు ఇచ్చే ఆదేశాల ఆధారంగా లాక్‌డౌన్ విధింపు ఆధారపడి ఉంటుందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధానిలో తీవ్ర స్థాయికి పెరిగిపోయిన కాలుష్యంపై కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. భవననిర్మాణ, పారిశ్రామిక కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేసేందుకు మంగళవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.  

మోడీ ప్రభుత్వానికి రెండు రోజుల డెడ్ లైన్.. యుద్ధం ప్రకటించిన కేసీఆర్

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మోడీ ప్రభుత్వంపై ఆయన యుద్ధం ప్రకటించారు. తెలంగాణ ధాన్యం కొంటారో లేదో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. పంజాబ్ లో కొన్నట్లుగా తెలంగాణ ధాన్యం ఎందుకు కొనదే కేంద్రం చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులపై దాడి చేసేందుకు బండి సంజయ్ జిల్లాలు తిరుగుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరి ధాన్యం కొంటామని కేంద్ర ప్రకటించేంత వరకు బీజేపీ నేతలను టీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తూనే ఉంటారన్నారు కేసీఆర్. రైతులకు బండి క్షమాపణ చెప్పాలన్నారు. నెల రోజుల్లోగా పంట కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు కేసీఆర్. కేంద్రం వైఖరిపై ఈ నెల 18న ఇందిరాపార్క్‌ దగ్గర మహా ధర్నా చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. అప్పటికి కేంద్రం దిగిరాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.  యాసంగిలో వరి పండించాలని చెబుతున్న బండి సంజయ్.. ధాన్యం కేంద్రం కొంటదో లేదో కూడా చెప్పాలన్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని సీఎం  మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు అంశం కేంద్రం పరిధిలోనే ఉందని ఆయన తెలిపారు. పంజాబ్‌లో మొత్తం కొనుగోలు చేస్తున్నారని,  తెలంగాణలో చేయడం లేదని చెప్పారు. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. యాసంగిలో ధాన్యం కొంటామని ఎఫ్‌సీఐ రాతపూర్వకంగా తెలిపితే దానిని కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిం

క‌లెక్ట‌ర్ కాదు కేసీఆర్‌ బంట్రోతు.. వెంక‌ట్రామిరెడ్డి అవినీతి బ‌య‌ట‌పెట్టిన రేవంత్‌రెడ్డి..

వెంక‌ట్రామిరెడ్డి మాజీ క‌లెక్ట‌ర్ కాదు.. టీఆర్ఎస్ బంట్రోతు. కేసీఆర్ భూ అక్ర‌మాల‌కు స‌హ‌క‌రించినందుకే ఆయ‌న‌ను ఎమ్మెల్సీకి ఎంపిక చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారు. ప్రాజెక్టుల భూ సేక‌ర‌ణ‌లో నిర్వాసితుల‌ను బెదిరించారు. కోకాపేట భూ గోల్‌మాల్‌లోనూ వెంక‌ట్రామిరెడ్డి హ‌స్తం ఉంది. 2017లో ఆయ‌న ద‌క్క‌న్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ అధికారిగా ఉన్న‌ప్పుడు 5 వేల ఎక‌రాలు ఎవ‌రికి బ‌దిలీ చేశారు? ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పిన ఘ‌నుడు. ఇలా అనేక అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్న వెంక‌ట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు? అని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు. వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ నామినేషన్‌ను తిరస్కరించి, చట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  వెంకట్రామిరెడ్డిని కేసీఆర్ ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీని చేస్తున్నారని విమర్శించారు. అందరి ముఖ్యమంత్రులను బుట్టలో వేసుకున్న ఘనుడు వెంకట్రామిరెడ్డి అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్‌గా కేసీఆర్ నియమించారని అన్నారు. సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యం వెంక్రటామిరెడ్డిలో ఉందన్నారు రేవంత్‌రెడ్డి. అంత‌టి అవినీతి ప‌రుడైన వెంక‌ట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ ప‌ద‌వికి అన‌ర్హుడ‌ని పీసీసీ చీఫ్ తేల్చి చెప్పారు. 

పవన్ దెబ్బకు దిగొచ్చిన జగన్.. రోడ్ల రిపేర్లపై రివ్యూ 

దెబ్బకు దెయ్యం వదిలిందంటే ఇదేనేమో! జనసేనాని పవన్ కళ్యాణ్ దెబ్బకు ఏపీ సీఎం జగన్ ఇప్పుడు దిగొచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లన్నీ శిథిలావస్థకు చేరిపోయాయి. ‘ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం..‘ చందంగా మారిపోయాయి. రోడ్లన్నీ గుంతలతోనూ.. కంకర తేలిపోయి దర్శనం ఇస్తున్నాయి. మచ్చుకైనా ఒక్క అంగుళం మేర డాంబర్ రోడ్డు కనిపించని దుస్థితి ఏపీలో ఉంది. ఏపీ రోడ్లపై వెళ్లాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. పవన్ కళ్యాణ్, జనసైనికుల శ్రమదానంతో సీఎం జగన్ కళ్లకు ఉన్న గంతలు ఊడిపోయాయి. ఏపీలో రోడ్ల దుస్థితిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏపీలోని అన్ని రోడ్లపై గుంతల్ని తక్షణమే పూడ్చాలన్నారు. నెలాఖరుకు టెండర్లు పూర్తిచేసి 8,268 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. కేటగిరితో నిమిత్తం లేకుండా మొత్తం 46 వేల కిలోమీటర్ల రోడ్లకు 2022 జూన్ నాటికి మరమ్మతులు, పునరుద్ధరణ పూర్తవ్వాలని నిర్దేశించారు. ఏపీలో శిథిలావస్థకు చేరిన రోడ్ల దుస్థితిపై జనసేనాని పవన్ కళ్యాణ్ ‘అడుగుకో గుంత, గజానికో గొయ్యి‘ అంటూ తీవ్రంగా స్పందించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2 ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో, మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువు పంచాయతీ పరిధిలోని పుట్టపర్తి- ధర్మవరం రోడ్డుకు శ్రమదానంతో మరమ్మతులు చేశారు. ఇక జనసేన శ్రేణులు ఏపీలోని అనేక చోట్ల శ్రమదానంతో రోడ్ల మరమ్మతు కార్యక్రమం ఓ ఉద్యమంలా నిర్వహించారు. అంతకు ముందే పవన్ కళ్యాణ్ ఏపీలోని రోడ్ల దుస్థితిపై తీవ్రంగా స్పందించారు. నెల రోజుల్లో ప్రభుత్వం రోడ్లు మరమ్మతు చేయాలని డెడ్ లైన్ విధించారు. అప్పటికీ సర్కార్ పట్టించుకోకపోతే తానే స్వయంగా జనసైనికులతో కలిసి రోడ్ల మరమ్మతు చేస్తానని ప్రకటించారు. ఏదేమైతేనేం.. రోడ్లపై గుంతల్ని పూడ్చే ప్యాచ్ వర్క్ వెంటనే చేయాలని, ఆ తర్వాత కార్పెటింగ్ పనులు పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశించారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ ప్రాజెక్టులో టెండర్లు దక్కించుకుని, వారంలో పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాని సీఎం స్పష్టం చేశారు. రాజకీయ నేతలు ఎంతమంది ఏపీలో ఉన్నా.. రోడ్ల దుస్థితి కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా పట్టించుకోలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా.. నిలదీయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోయారు. సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రతి సమస్య పైనా నిలదీస్తూనే ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న కిడ్నీ సమస్యలపై పవన్ స్పందించారు. బాధితులతో స్వయంగా మాట్లాడారు. కిడ్నీ సమస్యపై నిపుణులతో అధ్యయనం చేయించారు. పవన్ స్పీడుతో బేజారెత్తిన రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టింది. ఆ ప్రాంతంలో కిడ్నీ రోగులకు ఓ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి ఏర్పాటైంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ సమస్యపై స్పందిస్తే.. ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారానికి ముందుకు వస్తోంది. జనం నుంచి ఓట్ల రూపంలో తీసుకున్న లబ్ధిని తిరిగి జనానికే ఇవ్వాల్సిన పరిస్థితిని పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు. లేదంటే ప్రభుత్వ పెద్దలు లావైపోతారు కదా!

టీఆర్ఎస్ దాడుల వెనుక వ్యూహమేంటి? కేసీఆర్ ఇంత స్కెచ్ వేశారా? 

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటనలు చాలా సార్లు చేశారు. ఆయన పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు. కాని ఏనాడు అడ్డంకులు రాలేదు. కాని రెండు రోజులుగా బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరి ధాన్యం  కొనుగోళ్లను పరిశీలించేందుకు నల్గొండ జిల్లాకు వచ్చిన సంజయ్ ను అడ్డుకునేందుకు అడుగడుగునా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కొన్నిప్రాంతాల్లో ఆయన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు విసిరారు. పోలీసులు నాలుగైదు ప్రాంతాల్లో లాఠీచార్జీ చేశారంటే పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో ఊహించవచ్చు. సహజంగా ఎక్కడైనా అధికార పార్టీ నేతలకు నిరసనలు ఎదురవుతుంటాయి. గ్రామాలకు వెళ్లినప్పుడు తమ సమస్యలపై జనాలు వాళ్లను నిలదీస్తుంటారు. కాని ప్రస్తుతం తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు విపక్ష నేతలు జనాల్లోకి వెళుతుంటే.. అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారు. అంతేకాదు అధికార పార్టీనే ఏకంగా బంద్ కు పిలుపిస్తోంది. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. అధికార టీఆర్ఎస్ తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తుందన్న అనుమానాలు వస్తున్నాయి.  బీజేపీ టార్గెట్ గా నిరసనలు తెలపడం, బండి సంజయ్ పై దాడికి యత్నించడం వెనుక గులాబీ పార్టీకి బలమైన వ్యూహమే ఉందంటున్నారు. హుజురాబాద్ ఓటమి తర్వాత టీఆర్ఎస్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. కేసీఆర్ ఎన్ని ఎత్తులు వేసినా, వందల కొట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఈటల రాజేందర్ ను ఓడించలేకపోయింది. హుజురాబాద్ ఫలితంతో కేసీఆర్ పై జనాల్లో మరింత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నవంబర్ 4 నుంచి దళిత బంధు అమలు చేస్తామని చెప్పారు కేసీఆర్. ఎన్నికల కోడ్ తో దళిత బంధును ఆపేశారంటూ బీజేపీపై చిందులు తొక్కారు. ఎన్నికలు ముగియగానే దళిత బంధు ఇవ్వకుండా ఎవరూ ఆపుతారో చూస్తానంటూ ప్రకటన చేశారు.  అయితే నవంబర్ రెండో వారం కూడా ముగిసింది. అయినా దళిత బంధు ఊసే ఎత్తడం లేదు కేసీఆర్. ల‌బ్దిదారుల‌కు 10 ల‌క్ష‌ల పంపిణీ జాడే లేదు.  దళిత బంధు అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి. ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. కొత్తగా రుణాలు దొరికే పరిస్థితి కూడా లేదు.  దళిత బంధు అమలు చేసే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అందులోభాగంగానే వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలంటూ నిరసనలు చేయడం, బీజేపీ నేతలను టార్గెట్ చేయడం జరుగుతుందని అంటున్నారు.హుజురాబాద్ ఓట‌మి, న‌వంబ‌ర్ 4 నుంచి ద‌ళిత‌బంధు అమ‌లు విష‌యం మ‌రుగున ప‌రిచేందుకే.. కేసీఆర్ బీజేపీని రెచ్చ‌గొట్టి ఆ ర‌చ్చ‌లో త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని  అంటున్నారు. టీఆర్ఎస్ వ్యూహంతో కొన్ని రోజులుగా దళిత బంధు అంశం, హుజురాబాద్ ఉప ఎన్నికపై కాకుండా ధాన్యం కొనుగోళ్లు, బీజేపీ నేతలతో మాటల యుద్దంపైనే రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు రోజులుగా సంజయ్ పై జరుగుతున్న దాడులతో మేటర్ పూర్తిగా సైడ్ ట్రాక్ లో పోయింది. కేసీఆర్ అనుకున్నట్లే దళిత బంధు, హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాలు మరుగునపడ్డాయనే చర్చ సాగుతోంది. కేసీఆర్ ఎత్తుల్లో భాగంగానే టీఆర్ఎస్ నేతలు ఇలా దాడులకు తెగబుడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి

అమ‌రావ‌తి కోసం మేముసైతం.. అమిత్‌షా దెబ్బ‌కు దిగొస్తున్న ఏపీ బీజేపీ..

వై.స‌త్య‌కుమార్‌. బీజేపీలో బ‌డా నేత‌. పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి. క‌రుడుగ‌ట్టిన ఆర్ఎస్ఎస్ వాది. బీజేపీలో చాలా ప‌వ‌ర్‌ఫుల్‌. మ‌న తెలుగువారే. ఆయ‌న ఈ నెల 28న అమ‌రావ‌తి రైతులు చేస్తున్న మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొన‌నున్నారు. జై అమ‌రావ‌తి నినాదం చేయ‌నున్నారు. ఏపీకి అమ‌రావ‌తినే ఏకైక రాజ‌ధానిగా ఉంచాలంటూ బీజేపీ ప‌క్షాన డిమాండ్ చేయ‌నున్నారు స‌త్య‌కుమార్‌. జాతీయ నేతనే త‌ర‌లిరానుండ‌టంతో ఇక రాష్ట్ర నాయ‌కులూ ఆయ‌న వెంట న‌డ‌వ‌క త‌ప్ప‌దు. పార్టీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ ధియోధ‌ర్‌, స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజుతో పాటు మిగ‌తా నేత‌లూ రాజ‌ధాని రైతుల‌తో క‌దం క‌దం క‌లిపి పాద‌యాత్ర చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి. ఇలా అమ‌రావ‌తి ఉద్య‌మంలో మొద‌టిసారి ప్ర‌త్య‌క్షంగా పార్టిసిపేట్ చేయ‌నుంది భార‌తీయ జ‌న‌తా పార్టీ.  రెండేళ్లుగా ఉద్య‌మం జ‌రుగుతుండ‌గా.. 700 రోజుల త‌ర్వాత ఇప్పుడు బీజేపీకి అమ‌రావ‌తి గుర్తొచ్చింది. అది కూడా అమిత్‌షా రాష్ట్రానికి వ‌చ్చి మ‌రీ మొట్టికాయ‌లు వేయ‌డంతో ఇక్క‌డి నేత‌ల‌కు త‌ల‌బొప్పిక‌ట్టింది. అయినా రాష్ట్ర నేత‌ల త‌ల‌తిక్క కుదిరిన‌ట్టు లేదు. సోమ‌వారం అమిత్‌షా పిచ్చి క్లాస్ పీకినా.. మంగ‌ళ‌వారం పాద‌యాత్ర‌లో బీజేపీ నేత‌ల జాడ లేదు. అమిత్‌షా ఆదేశాల‌తోనైనా క‌మ‌ల‌నాథులు ప‌రుగున వ‌చ్చి.. మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొంటార‌ని అనుకున్నారు. కానీ, తోలుమందం కాషాయ‌ద‌ళం అంత ఈజీగా దారికొస్తుందా? అధికార పార్టీతో ఏళ్లుగా అంట‌కాగుతున్న రాష్ట్ర నాయ‌కులు వెంట‌నే ధ‌ర్మం వైపు నిల‌బ‌డ‌టం సాధ్య‌మ‌వుతుందా? అందుకే, వీళ్ల‌ను ఇలానే వ‌దిలేస్తే.. వారంత‌ట వారు అమ‌రావ‌తి వైపు నిల‌బ‌డ‌ర‌నే విష‌యం జాతీయ నాయ‌క‌త్వానికి అర్థ‌మైపోయింది. అందుకే, స్వ‌యంగా అమిత్‌షా, స‌త్య‌కుమార్ లాంటి బడా నేత‌లే రంగంలోకి దిగారు. అమిత్‌షా ఓ రేంజ్‌లో లెక్చ‌ర్ ఇస్తే.. ఇక బీజేపీ నేష‌న‌ల్ సెక్ర‌ట‌రీ స‌త్య‌కుమార్ తానే స్వ‌యంగా అమ‌రావ‌తి పాద‌యాత్ర‌లో పాల్గొంటానంటూ ప్ర‌క‌టించి.. రాష్ట్ర నాయ‌కుల‌ను దారిన పెడుతున్నారు.  సునీల్ ధియోధ‌ర్‌, సోము వీర్రాజు, విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి.. ఈ ముగ్గురే పార్టీకి తీవ్ర న‌ష్టం చేస్తున్న‌ట్టు గుర్తించి అధిష్టానం వారిపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయింది. బీజేపీ వేదిక‌గా వైసీపీ ఎజెండా అమ‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ ఉంది. టీడీపీపై పోరాడుతూ అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా మారార‌నేది ఆరోప‌ణ. జగన్ భక్తులుగా మారి ఏపీలో బీజేపీని నాశ‌నం చేస్తున్నార‌ని సొంతపార్టీ నేతలే అంటున్నారు. వీళ్ల తీరుపై హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అందుకే అమిత్ షా తిరుపతి మీటింగ్‌లో ఆ ముగ్గురికి క్లాస్ పీకారని అంటున్నారు.  వారికి చివ‌రి ఛాన్స్ ఇస్తూ.. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌లో పాల్గొని త‌ప్పు స‌రి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఓ మీడియాను బీజేపీ నిషేధించ‌డంపైనా మండిప‌డ్డారు. టీడీపీ నుంచి వ‌చ్చిన నేత‌ల‌ను చిన్న‌చూపు చూడ‌టంపైనా  అమిత్‌షా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  క‌ట్‌చేస్తే.. అమిత్‌షా మీటింగ్ ముగిసిన వెంట‌నే ఎంపీ సీఎం ర‌మేశ్ ఆ మీడియా ఛానెల్‌లో లైవ్‌కు వ‌చ్చి.. అమిత్‌షా ఆదేశాల‌ను వెంట‌నే అమ‌లు ప‌రిచారు. కానీ, సో కాల్డ్ సీనియ‌ర్స్‌ మాత్రం ఇంకా దారికి వ‌చ్చిన‌ట్టు లేరు. వాళ్లెవ‌రూ పాద‌యాత్ర వైపు అడుగులు వేయ‌డం లేదు. ఆ మీడియాలోనూ ఇంకా క‌నిపించ‌నే లేదు. ఈ విష‌యం తెలిసి అమిత్‌షా.. ఏపీకి చెందిన జాతీయ నేత వై.స‌త్య‌కుమార్‌ను ప‌రిస్థితి సెట్ చేయ‌మ‌ని పుర‌మాయించార‌ని అంటున్నారు. దీంతో.. తాను న‌వంబ‌ర్ 28న అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌లో పాల్గొన‌బోతున్న‌ట్టు స‌త్య‌కుమార్ తెలిపారు. ఆయ‌నంత‌టి వారే వ‌స్తే.. ఇక రాష్ట్ర నేత‌లు జీహుజూర్ అంటూ వెంట న‌డ‌వ‌క త‌ప్ప‌దుగా? జై అమ‌రావ‌తి.. జైజై అమ‌రావ‌తి అంటూ పిడికిలి బిగించాల్సిందేగా? 700 రోజులుగా ఉవ్వెత్తున ఎగుస్తున్న అమ‌రావ‌తి ఉద్య‌మానికి కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయపార్టీ బీజేపీ కూడా జ‌త‌క‌లిస్తే.. ఇక రాజ‌ధానితో జ‌గ‌న్‌రెడ్డి ఆడుతున్న మూడు ముక్క‌లాట ఆగాల్సిందేగా? అంటున్నారు.

నేతాజీ నుంచి వివేకా దాకా.. ఎన్నో మిస్టరీ మరణాలు!

చరిత్రలోనే కాదు వ్యక్తుల జేవితాలలోనూ చీకటి కోణాలుంటాయి. అలాగే, కొన్ని చావులు మిస్టరీగా మిగిలి పోతుంటాయి. చరిత్రలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్  ఎప్పుడు ఎక్కడ ఎలా చని-పోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే  మిగిలి పోయింది. 1945, ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ద విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం నేతాజీకి సంబంధి వంద సీక్రెట్ ఫైళ్లను విడుదల చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఏమిటన్నది ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.  దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే ఉన్నత కుటుంబానికి చెందిన ఓ ఆడబిడ్డ మెట్టినింట కాలు పెట్టిన తర్వాత కొంత కాలానికి  ... ఆ కుటుంబంలో  వరసగా అనుమానస్పద మరణాలు సంభవిచాయని అక్కడా, ఇక్కడా వార్తలు వచ్చాయి. అయితే, దశాబ్దాలు గడుస్తున్నా ఈ అనుమానాస్పద  మరణాలకు సంబందించిన నిజానిజాలు ఏమిటన్నది మటుకు ఇంతవరకు ప్రపంచానికి తేలియదు.  ప్రముఖ రాజకీయ కుటుంబానికి అల్లునిగా వచ్చిన వ్యాపారవేత్త (అప్పుడు ఆయన ఓ మాములు వ్యాపారవేత్త, ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి)  సోదరి, 2001లో అనుమానాస్పద పరిస్థితుల్లో కారు ప్రమాదంలో చనిపోయారు. అయితే అది ప్రమాదం కాదు, హత్య అన్న ఆరోపణలు వచ్చినా, ఆ తర్వాత కథ ఏ కంచికి  చేరిందో, ఏమైందో ప్రపంచానికి తెలియదు.  ఆతర్వాత రెండేళ్లకు పెద్దింటి అల్లుని సోదరుడు 2003 అనుమానస్పద స్థితిలో హోటల్ గదిలో చనిపోయారు. చివరకు అల్లుదు గారి తండ్రి 2009లో అదే రీతిలో హోటల్ గదిలో అలాగే, అనుమానస్పద స్థితిలోనే చనిపోయారు.  అయితే  ఇవి .. హత్యలా.. ఆత్మ హత్యలా .. సహజ మరణాలా అన్నది ఇంతవరకు ప్రపంచానికి తెలియదు, ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేక పోవచ్చును.  అక్కడి నుంచి, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ కు వస్తే  దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కూడా అనుమానాలున్నాయి. ఎవరో కాదు వైఎస్ కుటుంబ సభ్యులే పలు సందర్భాలలో, వైఎస్ మంరణం పట్ల అనుమానాలు వ్యక్త పరిచారు. వైఎస్’ను హత్యచేశారని  ఆరోపించారు. ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త వైపు వేలెత్తి కూడా చూపారు. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, దివంగత నేత పేరు చెప్పుకుని, అధికారంలోకి వచ్చిన ఆయన కుమారుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే వ్యాపారవేత్తతో రాజకీయ వియ్యం కలుపుకున్నారు. సో .. వైఎస్ మరణం కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోతుంది. నిజానిజాలు ఎలా ఉన్నా, పరిటాల హత్య, కోడెల శివప్రసాద రావు ‘అత్మహత్యల’ విషయంలోనూ ఇప్పటికీ ఎవరికీ ఉండే అనుమానాలు వారికున్నాయి.  అవన్నీ ఒకెత్తు అయితే, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య మిస్టరీ మర్డర్స్ అన్నిటిలోకీ మరింత మిస్టరీగా   మలుపులు తిరుగుతోంది. వైఎస్ మరణం విషయంలో ఆయన సతీమణి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు ఎలాగైతే అనుమానాలు వ్యక్త పరిచారో .. వివేకా కుటుంబ సభ్యులు కూడా ఆయన మరణం విషయంలో అనుమానాలు వ్యక్త పరిచారు. వివేకా చనిపోయిన రోజున ఆయన కుటుంబ సభ్యుడు, వైఎస్సార్‌ సీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి తమ పదనాన్న మృతి పట్ల తమకు అనుమానాలున్నాయని, విచారణ జరపాలని  మీడియా ముందు డిమాండ్ చేశారు.  ఆ రోజున పులివెందుల ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి  ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. చిత్రం ఏమిటంటే, ఇప్పడు ఆ అవినాష్ రెడ్డి పైనే, అనుమానాలు వ్యక్త మావుతున్నాయి. ఆ రోజున ఆయన ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో ధాంటే’ అన్నట్లుగా అనుమానాలు, ఆరోపణలు వినవస్తున్నాయి. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వెనకున్న శంకర్‌రెడ్డి.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆరోపించారు. వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం, వివేకా కుమార్తె సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌ రెడ్డిల ప్రస్తావన ఉందని పట్టాభి చెప్పారు.  వివేకా హత్య జరిగిన రోజు సంఘటనా స్థలానికి చేరుకొని సాక్ష్యాలు తారుమారు చేసి గుండెపోటుగా చిత్రీకరించింది అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలే అని ఆరోపించారు. సిట్‌ను రెండుసార్లు మార్చి సీఎం జగన్‌ నీరుగార్చే ప్రయత్నం చేశారని పట్టాభి ఆరోపణలు చేశారు. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలతో పాటు జగన్‌ కూడా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, వివేకా మర్డర్ మిస్టరీ ఎప్పటికైనా విడి పోతుందా .. దోషులకు శిక్ష పడుతుందా ... ఈ బేతాళ ప్రశ్నకు బదులేది ..  

కేసీఆర్‌-బండి గ‌డ‌బిడ అందుకేనా? రేవంత్‌రెడ్డినే టార్గెటా?

ఆయ‌న తిడ‌తారు. వీళ్లు రివ‌ర్స్ తిడ‌తారు. అధికార పార్టీ ధ‌ర్నాలు చేస్తుంది. కేంద్రంలోని పార్టీ లొల్లిలొల్లి చేస్తుంది. బండి సంజ‌య్ జిల్లాల‌ బాట ప‌డ‌తారు. రైతుల రూపంలో గులాబీ నాయ‌కులు బండికి బ్రేకులు వేస్తారు. అక్క‌డ‌క్క‌డా గుడ్లు కూడా విసురుతారు. ఇలా టీఆర్ఎస్-బీజేపీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్న‌ట్టు సీన్ క్రియేట్ చేస్తారు. అనేక విష‌యాలు డైవ‌ర్ట్ చేసేందుకే.. ఆ రెండు పార్టీలు ఇలా పొలిటిక‌ల్ డ్రామా ఆడుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. రైతుల పేరు చెప్పి.. కారు-క‌మ‌లం త‌మ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నాయ‌ని మండిప‌డుతున్నారు.  వ‌రి పంట కొన‌మ‌ని కేంద్రం అంటోంద‌ట‌. యాసంగిలో పండిన పంట అంతా కొనాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌ట్టుబ‌డుతోంది. అంతా మేమే చేస్తే మీరెందుకు దండ‌గా.. ముందు వానాకాలం వ‌రి మొత్తం కొనేదాకా వ‌ద‌ల‌బోమంటూ బీజేపీ పంతం ప‌డుతోంది. కేంద్రం బాయిల్డ్ రైస్ మాత్ర‌మే కొన‌మ‌ని చెప్పింద‌ని.. వ‌రి కొన‌బోమ‌ని ఎక్క‌డ చెప్పిందో చూపించాలంటూ క‌మ‌ల‌నాథులు నిల‌దీస్తున్నారు. వ‌రి కొనుగోలు కేంద్రాల‌ను ప‌రిశీలించేందుకంటూ బండి సంజ‌య్ జిల్లాల‌ బాట ప‌ట్టారు. రైతుల‌మంటూ టీఆర్ఎస్ శ్రేణులు న‌ల్ల‌జెండాల‌తో నిర‌స‌న తెలిపుతూ.. గోబ్యాక్ అంటూ కోడిగుడ్లు విసిరి బండిని నిల‌దీస్తున్నారు. దీంతో.. స్టేట్‌వైడ్‌గా బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. ప్ర‌జ‌ల అటెన్ష‌న్ అంతా వారి మీద‌నే ఉంది.  ఆ రెండు పార్టీలు కూడ‌బ‌లుక్కొనే ఇలా ఉద్రిక్త‌త‌లు రాజేస్తున్నార‌నే అనుమానం ఉంది. వారి మెయిన్‌ టార్గెట్ రేవంత్‌రెడ్డి దూకుడును డైల్యూట్ చేయ‌డమే అంటున్నారు. వ‌రిపై టీఆర్ఎస్‌-బీజేపీ ఇలా కొట్టుకుంటుంటే.. రైతుల‌ కోసం,  రైతుల ప‌క్షాన‌ ఎంత బాగా ఫైట్ చేస్తున్నారో అని ప్ర‌జ‌ల‌ను భ్ర‌మ‌పెట్ట‌డ‌మే వారి స్కెచ్ అంటున్నారు. అస‌లైన‌ పోటీ ఆ రెండు పార్టీల మ‌ధ్య‌నే ఉంద‌నేలా సీన్ క్రియేట్ చేస్తున్నారు. అలా చేస్తూ మూడో పార్టీ కాంగ్రెస్‌కు స్పేష్ లేకుండా చేయాల‌నేది వారి ఎత్తుగ‌డ‌లా ఉంది. దుబ్బాక‌, హుజురాబాద్‌లో ఇలానే ఉద్రిక్త‌త‌లు సృష్టించి.. కాంగ్రెస్‌కు డిపాజిట్ రాకుండా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా, రేవంత్‌రెడ్డి దూకుడును అడ్డుకొనేందుకు.. ఈ రెండు పార్టీలు దూకుడు పెంచాయ‌ని అంటున్నారు. వ‌రి కొనుగోలు కేంద్రాల సంద‌ర్శ‌నకు బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు వెళ్లారు. ఆ ప్రాంతంలో బీజేపీకి అస‌లేమాత్రం ప‌ట్టు లేదు. అదంతా కాంగ్రెస్ కంచుకోట‌. అందుకే, కావాల‌నే కాంగ్రెస్ కోట‌లో అడుగుపెట్టాల‌నే.. బండి అటువైపు వెళ్ల‌డం.. టీఆర్ఎస్ అడ్డుకోవ‌డం.. ఇలా ఆ రెండు పార్టీలు వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయం చేస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఇటు కేసీఆర్‌, అటు బండి సంజ‌య్‌లు వ‌రి ఇష్యూను ఎత్తుకోవ‌డంతో.. ఇక ఆ టాపిక్‌పై రేవంత్‌రెడ్డి పోరాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. వారిద్ద‌రి జ‌గ‌డాన్ని కాంగ్రెస్ శ్రేణులు క‌ళ్ల‌ప్ప‌గించి చూడాల్సి వ‌స్తుందే కానీ.. వారు నేరుగా రైతుల త‌ర‌ఫున బ‌రిలో దిగ‌లేక‌పోతున్నారు. వ‌రి మైలేజ్ అంతా కేసీఆర్‌, బండి సంజ‌య్‌లే కొట్టేస్తున్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్, రేవంత్‌రెడ్డిని ఎదగకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీకి సాయం చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్న అభిప్రాయం ఉంది. ఇలా తెలంగాణ‌ వార్‌.. టీఆర్ఎస్‌- బీజేపీ మ‌ధ్య‌నే అనేలా స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తూ.. కాంగ్రెస్‌-రేవంత్‌రెడ్డిని సైడ్‌వేస్‌లో ఉంచేందుకు.. హుజురాబాద్ ఓట‌మి, ద‌ళిత‌బంధు అమ‌లు చేయ‌క‌పోవ‌డం త‌దిత‌ర‌ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చేందుకే.. కేంద్రంలోని అధికార పార్టీ.. రాష్ట్ర అధికార పార్టీ.. క‌లిసి ఆడుతున్న రాజ‌కీయ డ్రామా అంటున్నారు.

పిట్టల పోయి బండా వచ్చే..! గంటల్లోనే చక్రం తిప్పిన కేకే.. 

కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన  శాసనమండలి అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ప్రకటించారు సీఎం కేసీఆర్. గతంలో ఎప్పుడు లేనంతగా కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి ఊహించని ట్విస్టులు ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ గా పని చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వెంకట్రామిరెడ్డిని మండలికి ఎంపిక చేసిన కేసీఆర్.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను అభ్యర్థిగా ప్రకటించి అందరికి షాకిచ్చారు. బండా ప్రకాష్ ఎంపిక రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనకు ఎంపీగా ఇంకా మూడేండ్ల 8 నెలల సమయం ఉంది. గతంలోనూ ఎంపీలుగా ఉన్నవారిని.. ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా చేసిన సందర్భాలు చాలా తక్కువ. అంతేకాదు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నప్పటి నుంచి చాలా మంది పేర్లపై లీకులు వచ్చినా.. ఎప్పుడు బండా ప్రకాష్ పేరు రాలేదు. అయితే చివరి రోజున సడెన్ గా ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక పెద్ద కథే నడిచిందని అంటున్నారు.   భూ కబ్జా ఆరోపణలతో  ఈటల రాజేందర్ ను  గత జూన్ లో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటల ముదిరాజ్ వర్గానికి చెందిన నేత. ఆయనను తప్పించడంతో ముదిరాజులు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బీసీ సంఘాలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని  ప్రశ్నించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ దీని ప్రభావం కనిపించింది.  దీంతో ముదిరాజులను కూల్ చేసేందుకు ఆదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండలికి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పిట్టల రవీందర్ పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని, పిట్టలకు  సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని ప్రచారం జరిగింది. ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఈటల స్థానంలో.. అదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నేత పిట్టల రవీందర్ ను భర్తీ చేస్తే.. తనపై వచ్చిన అసంతృప్తి కూడా చల్లారుతుందని కేసీఆర్ భావించారని చెబుతున్నారు.  అయితే మండలి అభ్యర్థుల ఎంపికలో రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పిట్టల రవీందర్ ప్లేసులో ఎంపీగా ఉన్న బండా ప్రకాష్ పేరు వచ్చి చేరింది. దీని వెనుక ఎంపీ కేశవరావు చక్రం తిప్పారని అంటున్నారు. రవీందర్ కు కాకుండా బండాను ఎంపిక చేయడంలో కేకేనే కీలకపాత్ర పోషించారని అంటున్నారు. కవితకు రాజ్యసభ సీటు దక్కేలా కేశవరావు ఇలా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉంటే ఇక్కడ కవిత మంత్రి పదవి కావాలని కోరుతుందని, అదే ఢిల్లీకి పంపితే ఏ సమస్యా ఉండదని కేసీఆర్ కు కేకే చెప్పారని తెలుస్తోంది. దీని వల్ల కేటీఆర్ కు పోటీ లేకుండా పోతుందని వివరించారట.  ప్రకాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని చెప్పారట. కేకే సూచనతో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి పిట్టల రవీందర్ కు కాకుండా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. మొత్తంగా కేకే చివరి నిమిషంలో చక్రం తిప్పడంతో కరుడుగట్టిన తెలంగాణ వాదికి ఎమ్మెల్సీ సీటు చేజారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

అమరావతి అంద‌రి రాజ‌ధాని.. హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ క్లారిటీ!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే. అన్నివ‌ర్గాల నుంచి, అన్ని వ్య‌వ‌స్థ‌ల నుంచి ఈ విష‌యం ప‌దే ప‌దే స్ప‌ష్ట‌మ‌వుతోంది. సోమ‌వారం అమరావ‌తినే ఏపీ రాజ‌ధాని అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్టీ నేత‌ల‌కు తేల్చి చెప్ప‌గా.. మంగ‌ళ‌వారం హైకోర్టు సీజే సైతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తినే అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. అమ‌రావ‌తి ఉద్య‌మం 700 రోజుల‌కు చేరిన సంద‌ర్భంలోనే ఇలా రెండు రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌కు చెందిన కీల‌క వ్య‌క్తులు ఏపీ కేపిట‌ల్ అమరావ‌తి అని స్ప‌ష్టం చేయ‌డం కీల‌క ప‌రిణామం అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని, రైతుల పాదయాత్రకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని కోసం 30వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారంటే.. అమరావతి రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని సీజే వ్యాఖ్యానించడం ఆస‌క్తిక‌రం. ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర‌ సమరయోధులు స్వాతంత్య్రం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని, దేశ ప్రజలందరి కోసం పోరాడడమేనని అన్నారు. ఆ స్వాతంత్య్రం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు.