న‌వంబ‌ర్ 19.. చ‌రిత్రలో చేదు జ్ఞాప‌కం.. దివిసీమ ఉప్పెన మాన‌ని గాయం.. 

న‌వంబ‌ర్ 19. ఈ డేట్ గుర్తుకొస్తే చాలు దివిసీమ గుండె త‌ల్ల‌డిల్లిపోతుంది. కృష్ణా జిల్లా ఉలిక్కిప‌డుతుంది. గుంటూరు, ప్ర‌కాశంలు అదిరిప‌డ‌తాయి. 44 ఏళ్ల క్రితం.. 1977 న‌వంబ‌ర్ 19.. దివిసీమ‌కు ఉప్పెన చేసిన గాయం ఇప్ప‌టికీ మాన‌నే లేదు. ఈ తేదీ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా.. గ‌త చేదు జ్ఞాప‌కం గుర్తుకొస్తూనే ఉంది. గుండెల‌ను తొలిచేస్తూనే ఉంది. కంట క‌న్నీరు పెట్టిస్తూనే ఉంది. అదేమైనా చిన్న ప్ర‌మాద‌మా?.. చ‌రిత్ర చూడ‌ని పెను ప్ర‌ళ‌యం. ప్ర‌కృతి విల‌యం.  వేలాది మందిని మింగేసిన ఉప్పెన‌. ల‌క్ష‌లాది ప‌శువుల‌ను క‌బ‌ళించిన తుఫాను. అనేక మందిని నిరాశ్ర‌యుల‌ను చేసిన విప‌త్తు.  అది న‌వంబ‌ర్ 19, 1977. శ‌నివారం. కృష్ణాజిల్లాలోని తీర‌ప్రాంతం-దివిసీమ‌. స‌ముద్రుని జ‌ల‌ఖ‌డ్గానికి బ‌లైంది.  ఆ రోజు మధ్యాహ్నం. ఆకాశమంతా న‌ల్ల‌ని మ‌బ్బులు చుట్టేశాయి. సముద్రంలో చిన్నగా అలజడి.. కాసేప‌టికే ఉధృతి పెరిగింది.. పెను ఉప్పెనగా మారింది.. సముద్రం మ‌హోగ్ర‌రూపం దాల్చి.. దివిసీమ‌పై విరుచుకుప‌డింది. గ్రామాల‌కు గ్రామాలు నామ‌రూపాలు లేకుండా చేసింది. దివిసీమ‌ను శ‌వాల దిబ్బ‌గా మార్చేసింది.  200 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు వీచాయి. గాలికి వాన తోడైంది. స‌ముద్రుడు ఉప్పొంగాడు. ఉప్పెన‌ విరుచుకుప‌డింది. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. ఆ గాలి-వాన‌ ఉధృతికి.. ఇంటి పైక‌ప్పులు ఎగిరిపోయాయి. త‌లుపులు విరిగిపోయాయి. గోడ‌లు కూలిపోయాయి. డాబా ఇళ్లు మాత్ర‌మే మిగిలాయి. మిగ‌తావ‌న్నీ నేల‌మ‌ట్టం. వ‌ర‌ద‌లో మ‌టుమాయం. భారీ వృక్షాలు సైతం నేల‌కొరిగాయి. విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామాల‌కు గ్రామాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.  1977, న‌వంబ‌ర్ 19, శ‌నివారం మ‌ధ్యాహ్నం మొద‌లైన విల‌య‌కాండ.. అర్థ‌రాత్రి కూడా కొన‌సాగింది. ఎటుచూసినా మోకాల్లోతు నీళ్లు. చుట్టూ చిమ్మ చీక‌టి. వ‌ర‌ద ఉధృతికి అనేక మంది కొట్టుకుపోయారు. తుమ్మ ముళ్ల కంప‌ల‌కు చిక్కుకొని శ‌రీరాలు కోసుకుపోయాయి. వ‌ర‌ద ముంచేసింది.. చ‌లి చంపేసింది.   దివిసీమ ఉప్పెన‌లో అధికారికంగా 14,204 మంది చ‌నిపోయారు. అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు వ‌దిలారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4 లక్షల జంతువులు మృత్యువాత ప‌డ్డాయి. లంక గ్రామాల్లో ఎటు చూసినా శ‌వాల కుప్ప‌లే... తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ల‌లో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది.  కృష్ణాజిల్లా పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం, ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్లదిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లోని వేలాది మంది ప్రాణాలు బ‌లి తీసుకొంది ఆ ఉప్పెన‌. కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్ర‌కాశం జిల్లాలోనూ ఉప్పెన ప్రభావం చూపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి. దాదాపు వంద గ్రామాలు తుపానులో కొట్టుకుపోయాయి. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి. సుమారు 172 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అంతటి విషాదాన్ని మిగిల్చిన ఆ కాళరాత్రి.. న‌వంబ‌ర్ 19.. ఈ తేదీ గుర్తుకు వస్తే దివిసీమ వాసులు ఇప్పటికీ ఉలిక్కిపడతారు. క‌న్నీటిప‌ర్యంతం అవుతారు.  1977, న‌వంబ‌ర్ 19.. క్యాలెండ‌ర్‌లో డేట్ మారే స‌రికి దివిసీమ‌లో అనేక గ్రామాలు క‌నుమ‌రుగు అయ్యాయి. వేలాది మంది భూమి మీద‌నే లేకుండా జ‌ల‌స‌మాధి అయ్యారు. ల‌క్ష‌లాది మంది ఆక‌లి కేక‌లు పెట్టారు. నిరాశ్ర‌యుల‌య్యారు. వారిని ఆదుకోవ‌డానికి అనేక ఆప‌న్న హ‌స్తాలు ముందుకు వ‌చ్చాయి. అప్ప‌టి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. రామ‌కృష్ణ మ‌ఠం, ఆర్ఎస్ఎస్ బృందాలు, ప్ర‌పంచ‌స్థాయి సేవా సంస్థ‌లు.. ఉప్పెన బాధితుల‌ను ఆదుకున్నాయి. వారికి అండ‌గా నిలిచాయి. నందమూరి తారకరామారావు దివిసీమ బాధితుల కోసం జోలెపట్టి తిరిగారు. ప‌లు గ్రామాలు పునర్-నిర్మించ‌బ‌డ్డాయి. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలతో ఐదుగురు ఉన్నతాధికారులు పదవులకు రాజీనామా ఇచ్చారు. అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదచాయల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేశారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. క్యాలెండ‌ర్‌లో న‌వంబ‌ర్ 19 వ‌చ్చిన ప్ర‌తీసారీ దివిసీమ విషాదం గుర్తుకు వ‌స్తూనే ఉంటుంది. దివిసీమ ఉప్పెన‌. అది చెద‌ర‌ని చేదు జ్ఞాప‌కం. మాన‌ని లోతైన గాయం.

పుంజుకున్న టీడీపీ.. కొండపల్లిలో కుట్రలు.. శివాజీ సంచలనం.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్‌లో  జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది.పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగిరింది. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత మండలం శ్యావాలపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే జోగి రమేష్ కు షాకిస్తూ పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం  సాధించారు. -------కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఈ నెల 22న చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాల్సిన మున్సిపల్‌ కమిషనర్‌.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కేశినేని నిర్ణయం తీసుకున్నారు------- ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు బాధ్యత మరింత పెరిగిందని వివరించారు. క్షేత్రస్థాయి సమస్యలను స్థానిక సంస్థల సమావేశాల్లో బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. -------- ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని నటుడు శివాజీ అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న మహాపాద యాత్రకు ప్రకాశం జిల్లాలో ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడంలేదన్నారు. మనమంతా బాగా పొల్యూట్‌ అయ్యామన్నారు. దీన్నుంచి బయటపడితేగాని భవిష్యత్‌ తరం బాగుపడదని ఆయన అభిప్రాయపడ్డారు. -------- భారీ వర్షంతో చిత్తూరు నగరం చుట్టూ వర్షపు నీరు చేరింది. వరద నీరు వచ్చి  చేరుతుండటంతో నీవా నది పొంగిపొర్లుతోంది. దొడ్డిపల్లి వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి నీటి ప్రవాహంలో స్కూల్ బస్సు చిక్కుకుంది. స్థానికులు గమనించి బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను సురక్షితంగా కాపాడారు. చిత్తూరు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. గంగినేని చెరువు కట్ట  ప్రమాదపు అంచుల్లో ఉంది. మిట్టూరు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ------ మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రాజీనామాను ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్  హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు.  ------ కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌, ఇందిరాపార్క్‌ దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు. రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు -------- సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధర్నాచౌక్ నుంచే సీఎం కేసీఆర్ పతనం ఆరంభమైందన్నారు. తన ముఖం అసెంబ్లీలో చూడకూడదనుకుంటే సీఎం‌ రాజీనామా చేయాలన్నారు. టీఆర్ఎస్‌లో ఏ ఒక్క నేత సంతృప్తిగా లేడని, సమయం కోసం వేచి చూస్తున్నారన్నారు. కేసీఅర్ తీరును ప్రజాస్వామ్యం అసహ్యించుకుంటోందన్నారు. వరి వేస్తే ఉరే అని మాట్లాడటం దుర్మార్గం, మూర్ఖత్వమన్నారు.  -------- ప్రముఖ నటి స్నేహ చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలపై కణత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడిపిస్తున్నారు. వారు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ రూ.26 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే, ఎంతకీ వాటా ఇవ్వకపోగా, తాను పెట్టుబడిగా పెట్టిన రూ.26 లక్షలు కూడా తిరిగి చెల్లించలేదని స్నేహ ఆరోపిస్తున్నారు. ------ ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ దేవాలయాల పూజారులు బీజేపీకి ఎదురు తిరిగారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. 2,500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరించి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసిందని, దీనికి వ్యతిరేకంగా తాము ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.  ----

కొండపల్లిలో వైసీపీ కుట్రలు... కమిషనర్ కిరికిరిపై కేశినేని ఫైర్

తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో అధికార పార్టీ కుట్రలకు తెర లేపింది. అడ్డదారుల్లో మున్సిపల్ చైర్మన్ ను కైవసం చేసుకునేందుకు కుతంత్రాలు చేస్తుందని తెలుస్తోంది. బుధవారం విడుదలైన కొండపల్లి మున్సిపల్ ఫలితాల్లో టీడీపీ మెజార్టీ సీట్లు సాధించింది. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. దీంతో కొండపల్లి మున్సిపాలిటీలో హైడ్రామా చోటుచేసుకుంది.  ఈ నెల 22న కొండపల్లి మున్సిపల్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఇందుకోసం ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తనకు ఓటు హక్కు కల్పించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని కోరారు.  ఎక్స్‌ అఫీషియో ఓటు కోసం మున్సిపల్‌ కమిషనర్‌కు ఆయన లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఎంపీ కేశినేని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాల్సిన మున్సిపల్‌ కమిషనర్‌.. ఇప్పటివరకు సమాధానం ఇవ్వకపోవడంతో కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కేశినేని నిర్ణయం తీసుకున్నారు. కొండపల్లిలో టీడీపీకి ఒక ఓటు అదనంగా మెజారిటీ ఉంది. కమిషనర్‌ కాలయాపన చేస్తున్నారంటూ టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీ పోరు సాగింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీకి 14.. వైసీపీకి 14 వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని కరిమికొండ శ్రీలక్ష్మి గెలుపొందారు. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆమె చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా, ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. 

స్థానిక పోరులో టీడీపీ హవా.. వైసీపీ ముఖ్య నేతలకు షాక్

ఆంధ్రప్రదేశ్‌లో  జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో  ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సత్తా చాటింది. ఇప్పటి వరకూ వెలువడిన మంచి ఫలితాలు సాధించింది. ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగిరింది. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సొంత మండలం శ్యావాలపురం జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక  ఎమ్మెల్యే జోగి రమేష్ కు షాకిస్తూ పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఘన విజయం  సాధించారు.  జిల్లాల వారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు..  విశాఖ జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ వైసీపీ కైవసం వైసీపీ అభ్యర్థి కోరాడ వెంకట్రావు 3,755 ఓట్ల మెజార్టీతో గెలుపు తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం  6 స్థానాల్లో వైసీపీ, 4 స్థానాల్లో టీడీపీ, ఒక్కోచోట గెలిచిన సీపీఎం, సీపీఐ విజయనగరం జిల్లాలో మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 6, టీడీపీ: 2, బీజేపీ: 1 స్థానంలో గెలుపు శ్రీకాకుళం జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ 10, టీడీపీ 5 స్థానాల్లో గెలుపు చిత్తూరు జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు  వైసీపీ 5, టీడీపీ 3 స్థానాల్లో విజయం నెల్లూరు జిల్లాలో 4 ఎంపీటీసీ స్థానాలు  వైసీపీ 3, టీడీపీ 1 స్థానంలో గెలుపు కడప జిల్లాలో 3 ఎంపీటీసీ స్థానాలు  వైసీపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. గుంటూరు జిల్లాలో 11 ఎంపీటీసీ స్థానాలు  వైసీపీ: 9, టీడీపీ: 2 స్థానాల్లో గెలుపు  గుంటూరు జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం పశ్చిమగోదావరి జిల్లాలో 14 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 10, టీడీపీ: 3, జనసేన: 1 ప.గో జిల్లాలో ఒక జెడ్పీటీసీ స్థానం వైసీపీ కైవసం తూర్పుగోదావరి జిల్లాలో 20 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 8 టీడీపీ: 6 జనసేన: 3 సీపీఐ(ఎం): 2 స్వతంత్రులు: 1  కృష్ణా జిల్లాలో 8 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 6 టీడీపీ: 2 స్థానాల్లో విజయం సాధించారు. కృష్ణా జిల్లాలో 3 జెడ్పీటీసీ స్థానాలు రెండు వైసీపీ, ఒకటి టీడీపీ గెలిచింది. కర్నూలు జిల్లాలో 7 ఎంపీటీసీ స్థానాలు 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలిచారు. కర్నూలు జిల్లాలో ఒక జెడ్పీటీసీ  వైసీపీ కైవసం అనంతపురం జిల్లాలో 16 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ: 10, టీడీపీ: 6 చోట్ల గెలిచారు

అమ‌రావ‌తే శాశ్వ‌తం.. నేతల పాపం ఊరికే పోదన్న శివాజీ..

హీరో శివాజీ. గ‌తంలో గ‌రుడ పురాణం పేరుతో ప్ర‌జ‌ల ముందుకొచ్చి సంచ‌ల‌నం సృష్టించారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వెనుక జ‌రుగుతున్న కుట్ర‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. అమ‌రావ‌తికి వీరాభిమాని. వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. ఎంత దారుణం జ‌రుగుతుందో ముందే ఊహించిన వ్య‌క్తి. అమ‌రావ‌తిని మూడు ముక్క‌లు చేసే ప్ర‌య‌త్నాన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించిన అస‌లైన‌ ఆంధ్రుడు. తాజాగా, హీరో శివాజీ రాజ‌ధాని రైతులు చేస్తున్న మ‌హా పాద‌యాత్ర‌కు ప్ర‌కాశం జిల్లాలో సంఘీభావం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  అమరావతిని ఏదో చేద్దామంటే సాధ్యం కాదని.. ఆంధ్ర‌ప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమేనన్నారు న‌టుడు శివాజీ. ఏపీ అనేది రాష్ట్రం కాదు.. కులాల కుంపటి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కులాల కుంపట్ల మధ్య ఏపీ ఏమి అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.  ఎన్నికల్లో ఎంత డబ్బులు పంచినా ఓటరు మాత్రం ఆత్మసాక్షికే ఓటేస్తారన్నారు. ప్రజలకు ఎవరికి ఓటేయాలో అర్థమైందన్నారు. నేతల పాపం ఊరికే పోదు.. వెంటాడుతోందన్నారు శివాజీ.  రాజధానిని అభివృద్ధి చేయాలనుకున్న వారు చేశారని, మరొకరు ఇంకొక మాట అంటున్నారన్నారు. బొత్స.. కొడాలి నాని.. వంటి మంత్రులు ఎన్ని మాటలైనా మాట్లాడవచ్చు.. రాజకీయ నేతలు తాము శాశ్వతం అనుకుంటే కుదరదన్నారు. జనం సినిమాలో సీన్లను గుర్తు పెట్టుకున్నంతగా సమాజంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోవటం లేదన్నారు. మీడియా కూడా వర్గాలుగా విడిపోయిందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఎవరూ గుర్తించడంలేదన్నారు శివాజీ. 

మద్యానికి హద్దులు లేవు.. తెలంగాణ షాపులకు ఏపీ వ్యాపారుల పోటాపోటీ 

తెలంగాణాలో మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం, పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా  వ్యాపారులు పోటీ పడుతున్నారు. ముఖ్యమంగా సరహద్దు జిల్లాలలో ఏపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం దశలవారీగా మద్యపానం నిషేధం పేరుతో విపరీతంగా పెంచుతోంది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యపారం చేస్తోంది. అదే విధంగా, ఏపీలో స్టాండర్డ్ బ్రాండ్స్ మద్యం దొరకదు. రాష్టంలో తయారయ్యే ప్రత్యేక బ్రాండ్స్ మధ్య్యాన్ని మాత్రమే ప్రభుత్వ మధ్య దుకాణాల్లో విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి, అలవాటైన బ్రాండ్స్ తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది.  ఈ నేపధ్యంలో, ఏపీ మధ్య ప్రియులు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరహద్దులలోని షాపులు,  బార్లలో మద్యం సేవించేందుకు వచ్చి పోతుంటారు. ఈ రకంగా ఆంద్ర సరిహద్దుల లోని తెలంగాణ ప్రాంతంలోని మద్యం దుకాణాలలో వ్యాపారం మూడు ఫుల్ ఆరు హల్ఫ్’లు అన్నట్లుగా సాగుతోంది. అందుకే,ఏపీ సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతంలోని మధ్య షాపులకు పోటీ ఎక్కువగా ఉందని, సంబధిత అధికారుల సమాచారం.  ఉదాహరణకు ఏపీలోని కర్నూలుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని  జోగులాంబ గద్వాల జిల్లాఅలంపూర్ చౌరస్తాలోని రెండు మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సైతం పోటీపడుతున్నారు. ఈ రెండు దుకాణాలకు ఒక్కొక్క దుకాణానికి  రోజుకు రూ. 20 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంటే మద్యం ప్రియుల తాకిడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మద్యం టెండర్ల కోసం భారీ సంఖ్యలో పోటీపడుతున్నారు.  మద్యం లైసెన్సు దరఖాస్తుకు ఈరోజే చివరి రోజు కావడంతో, ఈ ఒక్కరోజే 500 మంది లైసెన్సులు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇలా దరఖాస్తు చేసుకున్న వరిలో 350 మంది కేవలం ఈ రెండు దుకాణాల కోసమే వేశారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పవచ్చు. ఇందులో ఏపీనుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో లైసెన్సుల కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ సైదులు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు దరఖాస్తు చేసుకోవడం ఇబ్బందిగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు సైతం టెండర్లలో పాల్గొని... మద్యం దుకాణాలను దక్కించుకునే అవకాశం ఇచ్చిందని సైదులు పేర్కొన్నారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

వినుకొండ ఎమ్మెల్యేకు షాక్.. సొంత మండలంలో వైసీపీ ఘోర పరాజయం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ బాగా పుంజుకుంది. పలు జిల్లాలో ఊహించని విజయాలు నమోదు చేసుకుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీకి షాకిచ్చింది టీడీపీ.  గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఓటర్లు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకున్నారు. శావల్యాపురం జడ్పీటీసీగా గెలవడంతో వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు. 

బాయిల్డ్ రైస్ తీసుకోం.. కేసీఆర్‌కు కేంద్రం క్లారిటీ..

కేంద్రం వ‌రి కొంటుందా? కొన‌దా? చెప్పాలంటూ సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ మ‌హా ధ‌ర్నా చేశారు. యాసంగిలో ధాన్యం కొనాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఆపోబోమంటూ హెచ్చ‌రించారు. కేసీఆర్ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేదన్న‌ట్టు.. ధ‌ర్నా ముగిసిన వెంట‌నే కేంద్రం నుంచి ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. పార్ బాయిల్డ్ రైస్ తీసుకోబోమంటూ కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. యాసంగిలో పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని తేల్చి చెప్పింది. వ‌రి కొనుగోలుపై కేంద్రం వ‌ర్సెస్ తెలంగాణ ఎపిసోడ్ మ‌రింత ముదిరిన‌ట్టే క‌న‌బ‌డుతోంది.  ‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్ ఒక్కో విధంగా ఉంటుంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్ రైస్ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండించాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్, పప్పు ధాన్యాలు ఎక్కువ పండించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం.’’ అని కేంద్రం ప్ర‌క‌టించింది. మ‌రి కేంద్ర ప్ర‌క‌ట‌న‌పై సీఎం కేసీఆర్ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో చూడాలి...

జోగి రమేష్ కు ఝలక్.. పెడన జడ్పీటీసీ టీడీపీ కైవసం

జోగి రమేష్.. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద నోరున్న నే. ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేస్తుంటాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్  పేరు ఎత్తకుండా ఎక్కడా మాట్లాడడు. సీఎం జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికే చంద్రబాబు లక్ష్యంగా జోగి రమేష్ అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తుంటారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. మంత్రి పదవి కోసమే చంద్రబాబును అదేపనిగా జోరి రమేష్ విమర్శిస్తుంటారనే విమర్శలు కూడా ఉన్నాయి. వైసీపీలో తానే తోపు, సీఎం జగన్ కు తానే దగ్గర అని ఫోజులు కొట్టుకునే జోగి రమేష్ కు తాజాగా బిగ్ ఝలక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. పెడన జడ్పీటీసీ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు జోగి రమేష్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజుల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా పెడన జడ్పీటీసీగా టీడీపీ గెలుపోదడంతో జోగి రమేశ్ కు షాక్ తగిలింది. పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో పెడనలో జోగి రమేష్ కౌంట్ డౌన్ మొదలైందనే చర్చ సాగుతోంది. సర్వశక్తులు ఒడ్డినా జడ్పీటీసీగా గెలవలేకపోవడంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యే రమేష్ కుడా ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. పెడన విజయంతో టీడీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెడన నియోజకవర్గంలో ఇదే ఫలితం పునరావృతం అవుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అమ‌రావ‌తిలో టీడీపీదే ఘన విజ‌యం.. వైసీపీకి ముందంతా ముస‌ళ్ల పండ‌గే..!

ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్ త‌ప్ప‌క ఉంటాయి. కాస్త ఆల‌స్య‌మైనా చేసిన త‌ప్పుల‌కు శిక్ష త‌ప్ప‌క ప‌డుతుంది. 153 మంది ఎమ్మెల్యేల అధికారం ఉంది క‌దాని.. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేస్తే.. ఆ పాపం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల రూపంలో తిరిగి కొడుతోంది. త‌మ‌కు ఎదురులేద‌ని విర్ర‌వీగుతున్న వైసీపీకి.. రాజ‌ధాని ప్రాంత ఓట‌ర్లు ఓట‌మితో గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. జ‌గ‌న్‌రెడ్డికి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. రాజ‌ధాని ప్రాంతంలోని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. ఆ రెండు చోట్లా వైసీపీ ఓడిపోయింది. టీడీపీ గెలిచింది. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రాజ‌ధానిని మూడు ముక్క‌లు చేసిన‌ అధికార పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌కి పెడన ప్రజలు షాకిచ్చారు. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. పెడన జడ్పీటీసీ ఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు జోగి రమేష్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. పోలింగ్ రోజుల వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. అయినా పెడన జడ్పీటీసీగా టీడీపీ గెలుపోదడంతో జోగి రమేశ్ కు షాక్ తగిలింది. పామిడి మండలం గజరాంపల్లి ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి రామలక్ష్మి 202 ఓట్లతో గెలిచారు. వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు ఓటర్లు షాకిచ్చారు. ఎమ్మెల్యే సొంత మండలం శావల్యాపురం జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 1046 ఓట్లు మెజారిటీతో టీడీపీ అభ్యర్థి హైమావతి గెలిచారు. జడ్పీటీసీ ఎన్నికను మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సవాలుగా తీసుకున్నారు. శావల్యాపురం జడ్పీటీసీగా గెలవడంతో వినుకొండ నియోజకవర్గ టీడీపీ నేతలు నూతనోత్సాహంతో ఉన్నారు.  అస‌లే రాజ‌ధాని రైతులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ర‌గిలిపోతున్నారు. అమ‌రావ‌తిని క‌నుమ‌రుగు చేయాల‌ని చూస్తున్న స‌ర్కారుపై ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. 700 రోజులుగా ఉద్య‌మిస్తున్నా ప‌ట్టించుకోని జ‌గ‌న్‌రెడ్డిపై అక్క‌స్సుతో ఉన్నారు. ఈ స‌మ‌యంలో వ‌చ్చిన ఎంపీటీసీ ఎన్నిక‌ల‌ను మంచి అవ‌కాశంగా భావించారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ముందే గుర్తించిన వైసీపీ.. గుండాల‌పాడు, వేమ‌వ‌రం స్థానాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స్వ‌యంగా ప్ర‌చారం నిర్వ‌హించారు. పార్టీ పెద్ద‌లు సైతం ప‌రోక్షంగా స‌హ‌క‌రించారు. ఇక బెదిరింపులు, తాయిలాలు మామూలుగా జ‌ర‌గ‌లేదు. ఇంతా చేసినా.. అంత భారీ మెజార్టీతో ఆ రెండు స్థానాల్లో ఓడిపోవ‌డం అధికార పార్టీపై ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను నిద‌ర్శ‌నం. పెడన జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థి ఆర్జా నగేష్ 644 ఓట్లతో గెలుపొందారు. ఈ వ్య‌తిరేక‌త ఇలానే కంటిన్యూ అయితే.. వ‌చ్చే అసెంబ్లీ ఎల‌క్ష‌న్స్ నాటికి రాజ‌ధాని ప్రాంతంలో వైసీపీకి చావుదెబ్బ త‌ప్ప‌క‌పోవ‌చ్చు.    మ‌రోవైపు, ఏపీ వ్యాప్తంగా వెలువడుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతోంది. పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ గెలుపుబాట‌న దూసుకుపోతోంది. సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో అనేక చోట్ల హోరాహోరీ పోరు జ‌రిగింది. అనూహ్యంగా అమ‌రావ‌తి స‌మీపం ప్రాంతాలైన‌ ద‌ర్శి, కొండ‌ప‌ల్లి మున్సిపాలిటీల‌ను టీడీపీ ఖాతాల్లో వేసుకుంది. జ‌గ్గ‌య్య‌పేట‌లో ఓడినా గెలిచినంత ప‌ని చేసింది. క‌ర్నూలు జిల్లాలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి నివాసం ఉండే వార్డులోనూ టీడీపీనే గెల‌వ‌డం మామూలు విష‌య‌మా? ఇక‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప‌లుచోట్ల టీడీపీ హ‌వా కొన‌సాగుతుండ‌టం వైసీపీలో గుబులు రేపుతోంది. ఇంత‌గా అధికార బ‌లం ప్ర‌యోగించినా, దొంగ ఓట్ల‌తో దౌర్జన్యాల‌కు దిగినా.. ఈ స్థాయిలో టీడీపీ విజ‌య ఢంకా మోగిస్తుండ‌టం వైసీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తుంటే.. భ‌విష్య‌త్తుపై టీడీపీ ధీమా రెట్టింపు అవుతోంది. 

అప్పు తీర్చేందుకు కొత్త అప్పు .. రుణ చక్ర బంధంలో ఏపీ సర్కార్ 

అప్పుడెప్పుడో అప్పుల అప్పారావు లేదా అలాంటి ఇంకో పేరుతో ఒక సినిమా వచ్చింది.. సినిమా పేరు ఏదైనా ఆ సినిమా కథ మాత్రం అప్పుల చుట్టూనే తిరుగుతుంది. అందులో  ఆప్పారావు అనే క్యారెక్టర్’ ఒక అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు... అ ఆప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తూ... ఇలా అప్పుల  చక్ర బంధం బాటలో ముందుకు సాగుతుంటాడు. ఇప్పుదు ఈ సినిమా ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందో వేరే చెప్పనక్కర లేదు. అవును... ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే పంధాలో అప్పుల చుట్టూ ప్రదక్షిణ చేస్తోందనే మాట చాలా కాలంగా అంతటా వినవస్తోంది. ఇప్పుడు కొత్తగా, కేంద్ర విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించేందుకు,రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) అప్పుకోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఇక విషయంలోకి వెళితే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) లకు చాలా కాలంగా, చెల్లించ వలసిన సొమ్ములు చెల్లిచలేదు. బకాయిలు పేరుకు పోయాయి. కేంద్ర సంస్థలు ఎప్పటికప్పుడు, మర్యాద గీత దాటకుండానే  రాష్ట్ర ప్రభుత్వానికి బకాయిల సంగతి గుర్తు చేస్తూ వచ్చాయి, అయినా రాష్ట్రం ప్రభుత్వం స్పందించలేదు.ఇక చేసేది లేక, అప్పు వసులు కోసం ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ సీఎండీలు సంజయ్‌ మల్హోత్రా, ఆర్‌ఎస్‌ థిల్లాన్‌ మంగళవారం రాత్రి రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా, ఏపీ ప్రభుత్వం నుంచి అప్పులు వసూలు కోసం కేంద్ర విద్యుత్ సంస్థల అధికారులు, రాష్ట్రానికి రావడం, అంటే ప్రభుత్వానికి మాత్రమే కాదు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అవమానమే, మర్యాద తెలిసిన ముఖ్య నేతలకు  అయితే మరింత అవమానం.    అదెలా ఉన్నా, కేంద్ర విద్యుత్ సంస్థ అధికారులు నిన్న (బుధవారం) విజయవాడ విధ్యత్ సౌధలో సుమారు మూడు గంటల పాటు  రాష్ట్ర  ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్‌, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జనార్దనరెడ్డిలతో పాటుగా సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఇంధన సంస్థలు చెల్లించాల్సిన రూ.2,600 కోట్ల బకాయిల గురించి కేంద్ర ప్రతినిధులు గుర్తు చేశారు. ఇవి చెల్లించకుంటే ఏపీ జెన్కోను నిరర్ధక సంస్థగా ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇందుకు రాష్ట్ర అధికారులు తాము కొత్త రుణం తీసుకుంటున్నామని.. అది మంజూరైన వెంటనే  అప్పు తీర్చేస్తామని చెప్పిన వివరణతో ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీల అధికారులు సంతృప్తి చెందలేదు.  అక్కడి నుంచి వారు  నేరుగా  సచివాలయానికి చేరుకుని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మతో అనంతరం నేరుగా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేసమయ్యారు.  చివరకు, కేంద్ర విద్యుత్‌ సంస్థల అధికారులు, చివరి అవకాశంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఆర్‌ఈసీకి తక్షణం చెల్లించవలసిన అప్పు రూ.2500 కోట్లలో రూ.1500 కోట్లు రెండు మూడ్రోజుల్లో చెల్లించేలా ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. మిగిలిన బాకీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌ఈసీ కొంత సమయం ఇచ్చింది. ప్రస్తుతానికి అవసరమైన రూ.1500 కోట్లను ఎస్‌బీఐ నుంచి అప్పు తెచ్చేందుకు రాష్ట్రం ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.కాగా, రూ.1,500 కోట్లు అప్పుగా ఇచ్చేందుకు ఎస్‌బీఐ అంగీకరించినట్లు చెబుతున్నారు. అలా ఎస్‌బీఐ అప్పు ఇవ్వగానే...ఇలా ఆమొత్తాన్ని ఆర్‌ఈసీకి పాత అప్పు కింద చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్‌ఈసీ అప్పు తీర్చేందుకు ఎస్‌బీఐ వద్ద అప్పు చేసిన ప్రభుత్వం ఎస్‌బీఐ అప్పు తీర్చేందుకు ఇంకెవరి వద్ద చేయి చాస్తుందో ... ఏమో .. మొత్తానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అప్పుల అప్పారావు, అడుగు జాడల్లో నడుస్తున్నారా .. అనే అనుమానాలు నిజమవుతున్నట్లే ఉన్నాయి.

వైసీపీకి బిగ్ షాక్.. కొండపల్లి నగర పంచాయతీ టీడీపీదే! 

కృష్ణా జిల్లా కొండపల్లి నగర పంచాయితీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. తుది ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కొండపల్లి నగర పంచాయితీలో 29 వార్డులు ఉండగా.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలకు చెరో 14 వార్డులు దక్కాయి. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. ఈ నగర పంచాయతీలో మ్యాజిక్ ఫిగర్ 15కాగా ఎవరూ దానిని చేరుకోలేదు.దాంతో ఇండిపెండెంట్‌గా 10వ వార్డు నుంచి గెలిచిన అభ్యర్థి ఎవరికి మద్ధతిస్తారన్నది ఆసక్తిగా మారింది. దాంతో చైర్మన్ సీటు కోసం ఇక్కడ ఇరు పార్టీలు ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది.  కొండపల్లిలో అధికార పార్టీతో హోరాహోరీగా పోరాడిన తెలుగు దేశం పార్టీ.. ఫలితాలు వచ్చిన వెంటనే చక్రం తిప్పింది. 10 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన లక్ష్మిని తమవైపునకు తిప్పుకుంది. కృష్ణా జిల్లా నేతలు  చంద్రబాబు సమక్షంలో కొండపల్లి ఇండిపెండెంట్ కౌన్సిలర్ శ్రీ లక్ష్మి టీడీపీలో చేర్చారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీ కండువా కప్పుకోవడంతో టీడీపీ బలం 15కు చేరగా.. వైసీపీ బలం 14గా ఉంది. వైసీపీకి ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యే ఓటు ఉండటంతో ఇరు పార్టీల బలాబలాలు సమానమయ్యాయి. అయితే  ఎంపీ కేశినేని నాని కూడా ఎక్స్‌అఫీషియో మెంబర్ హోదాలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, దీంతో తో కొండపల్లిలో టీడీపీ బలం 16కు పెరగనుంది. నగర పంచాయితీపై టీడీపీ జెండా ఎగరనుంది. 

కేసీఆర్ ఫ్యామిలీలో కోల్డ్ వార్ ముగిసిందా? కవిత పంతం నెగ్గించుకున్నారా?

అన్న కేటీఆర్‌కు రాఖీ క‌ట్ట‌లేదు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో బ‌తుక‌మ్మ ఆడ‌లేదు. టీఆర్ఎస్ ప్లీన‌రీకి కూడా రాలేదు. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో విభేదాలు బాగా ముదిరిపోయాయ‌న్నారు. కేసీఆర్‌ను సీఎం చేయ‌డం క‌విత‌కు ఇష్టం లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆస్థి గొడ‌వ‌లు కూడా ఉన్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో క‌విత ఎమ్మెల్సీ ట‌ర్మ్ కూడా ముగిసింది. ఆమెకు మ‌రోసారి ఆ రెన్యూవ‌ల్ ద‌క్కదనే ప్రచారం జరిగింది. ఇక క‌విత ప‌ని ఖ‌తం అన్నారంతా.. అయితే, అనూహ్యంగా కవితను రాజ్య‌స‌భకు పంపిస్తారంటూ లీకులు వ‌చ్చాయి. బిడ్డ‌ను ఎంపీ చేసి, పార్ల‌మెంట్‌కు పంపించి, కుదిరితే కేంద్ర మంత్రిని కూడా చేస్తాన‌ని కేసీఆర్ త‌న కూతురిని బుజ్జ‌గించార‌ని అంటున్నారు. ఇలా క‌విత‌మ్మ అల‌క‌ను కేసీఆర్ తీర్చార‌ని చెబుతున్నారు.  నిజ‌మే కాబోలు.. అందుకే కాబోలు.. ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనిది.. ధ‌ర్నాచౌక్‌లో ప్ర‌భుత్వం త‌ర‌ఫున నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నాలో క‌విత హాజ‌ర‌య్యారు. టీఆర్ఎస్ మ‌హిళా నేత‌ల‌తో క‌లిసి ధ‌ర్నాలో కూర్చున్నారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు. ధ‌ర్నాలో క‌విత క‌నిపించ‌డంతో.. మీడియా కెమెరాల‌న్నీ అటువైపు ఫోక‌స్ చేశాయి. క‌విత‌ను జూమ్ చేసి మ‌రీ చూపించాయి. ఫోటోలు క్లిక్ మ‌నిపించాయి. మ‌హాధ‌ర్నాలో క‌విత‌నే ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యారు. మ‌రోవైపు, కేటీఆర్ మాత్రం వేదిక‌పై కాకుండా.. కింద పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ధ‌ర్నాలో కూర్చున్నారు.   కేసీఆర్ ద‌గ్గ‌ర‌కు క‌విత‌కు ఎంట్రీ లేకున్నా.. కేటీఆర్‌ను క‌ల‌వ‌కున్నా.. క‌ల్వ‌కుంట్ల కుటుంబంలో ఫ్యామిలీ వార్ ముగిసిపోయిందని అంటున్నారు. క‌విత రాక‌నే అందుకు నిద‌ర్శ‌నమ‌ని చూపిస్తున్నారు. మ‌రి, కేసీఆర్‌తో, కేటీఆర్‌తో మాట్లాడ‌లేదుగా? అంటే.. ధ‌ర్నా క‌దా.. అందుకే మాట్లాడ‌లేద‌ని చెబుతున్నారు. క‌విత‌కు రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని కేసీఆర్ బుజ్జ‌గించార‌ని.. ఆమె అల‌క వీడార‌ని.. అందుకే మ‌ళ్లీ యాక్టివ్ అయ్యార‌ని.. అంటున్నారు. అల‌కైతే వీడారు కావొచ్చు కానీ, కుటుంబ క‌ల‌హాలు మాత్రం స‌మ‌సిపోలేద‌ని.. ఇది కేవ‌లం టెంప‌ర‌రీ అడ్జ‌స్ట్‌మెంట్ మాత్ర‌మేన‌నేది కొంద‌రి మాట‌. అస‌లు సంగ‌తి మాత్రం ఆ ముగ్గురికే తెలియాలి.

వ‌డ్లు కొనకుంటే యుద్ధమే..! మోడీనే తేల్చుకోవాలన్న కేసీఆర్

రైతుల‌కు వ్య‌తిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక‌టే మాట‌.. ఏం జ‌రుగుతోంది. ఏంది గ‌డ‌బిడి ఇది. లొల్లి ఏంది అస‌లు. ఒక‌టే ఒక మాట‌. సాఫ్‌ సీదా ముచ్చ‌ట‌. తెలంగాణ‌లో పండించే వ‌డ్లు కొంట‌రా..? కొన‌రా..? అది చెప్ప‌మంటే.. మేం మ‌రాఠీలో అడిగామా? ఉర్దూలో అడిగామా? అర్థం కాని భాషలో అడిగామా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఇందిరా పార్క్ వ‌ద్ద టీఆర్ఎస్ చేప‌ట్టిన రైతు మ‌హాధ‌ర్నాలో కేసీఆర్ ప్ర‌సంగించారు. బీజేపీ నాయ‌కులు వంక‌ర టింక‌ర మాట‌లు మాట్లాడుతున్నారు. ఈ గోస ఒక తెలంగాణ‌లోనే లేదు. భార‌త‌దేశం మొత్తంలో ఉంది. ఒక ఏడాది కాలం నుంచి ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వేల ల‌క్ష‌ల మంది రైతులు వ‌రుస నిరాహార ధీక్ష‌లు చేస్తున్నారు. పంట‌లు పండించే శ‌క్తి లేక కాదు. కేంద్రం తెచ్చిన చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం త‌న విధానాలు మార్చుకోకుండా అడ్డ‌గోలుగా మాట్లాడుతోంది. ఈ దేశాన్ని న‌డ‌ప‌డంలో అన్ని పార్టీల ప్ర‌భుత్వాలు దారుణంగా విఫ‌లం చెందాయి. పంట‌లు కొన‌డానికి మీకు భ‌యం అవుతుంది. బాధ అవుతుంది. అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం కాదు.. గ్లోబ‌ల్ హంగ‌ర్ ఇండెక్స్‌లో భార‌త్ 101వ స్థానంలో ఉంది. ఇంత‌క‌న్న సిగ్గుచేటు ఏమైనా ఉంట‌దా? దేశంలో 12 కోట్ల మంది రైతుల ఉన్నారు. 40 కోట్ల ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఉంది. అద్భుత‌మైన న‌దులున్నాయి. బంగారు పంట‌లు పండే అవ‌కాశాలు ఉన్నాయి. దాదాపు సగం మంది వ్య‌వ‌సాయ రంగంపై ఆధార‌ప‌డి బ‌తుకుతున్నారు అని సీఎం కేసీఆర్ తెలిపారు. మేం రాష్ట్రం తెచ్చుకుని, చెరువుల‌ను బాగు చేసుకుని, చెక్‌డ్యాంలు క‌ట్టి, క‌రెంట్ ఇచ్చి రైతుల‌ను బాగు చేసుకున్నాం. పంట‌లు పండించుకున్నాం. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్య‌త కేంద్రానిదే. కానీ నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది. రైతాంగాన్ని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంది. హంగ‌ర్ ఇండెక్స్‌లో భార‌త్ ఆక‌లి రాజ్యం అని తెలుస్తోంది. దేశంలో ఏ మూల‌లో ఆహార కొర‌త ఉందో స‌మ‌న్వయం చేయాలి. అవ‌స‌ర‌మైతే డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ఆహారం అందించాలి. స‌మ‌స్య ఉన్న‌దంతా కేంద్రం వ‌ద్దే. కేంద్రం మీద యుద్ధం ప్రారంభ‌మైంది. ఉత్త‌ర భార‌త రైతాంగం కేంద్రానికి నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. రైతుల జీవితాల‌పై చెల‌గాట‌మాడుతోంది. కార్ల‌తో తొక్కి చంపుతోంది. ఇవాళ తెలంగాణ రైతుల‌పై బీజేపీ నేత‌లు క‌న్నేశారు. కొనుగోలు కేంద్రాల వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తున్నారు. రైతుల‌ను బ‌త‌క‌నిస్తారా? బ‌త‌క‌నివ్వారా? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు. దిక్కు మాలిన కేంద్ర ప్ర‌భుత్వం విధానాల వ‌ల్లే రైతులు న‌ష్ట‌పోతున్నారు. వ‌డ్లు వేయాలి.. మెడ‌లు వంచి కొనిపిస్తాం అని బీజేపీ నేత‌లు అంటున్నారు. ఈ దేశాన్ని పాలించే బీజేపీ అడ్డ‌గోలు అబ‌ద్ధాలు మాట్లాడుతున్నారు. ఫేస్ బుక్‌, వాట్సాప్‌ల‌లో వితండ‌వాదాలు సృష్టిస్తున్నారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

స‌మీర్ వాంఖ‌డే హిందూ కాదు ముస్లిం.. ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన‌ ఎన్సీపీ..

స‌మీర్ వాంఖ‌డే. డ్ర‌గ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన‌ప్ప‌టి నుంచీ.. దేశ‌వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఆర్య‌న్‌ఖాన్ కేసు నుంచి త‌ప్పించినా.. ఎన్సీపీతో, మంత్రి మాలిక్‌తో వివాదం మాత్రం కంటిన్యూ అవుతోంది. తాజాగా, స‌మీర్ వాంఖ‌డే హిందువు కాదు ముస్లిం అంటూ ఆధారాలు సైతం చూపించారు.  సమీర్ వాంఖడే అసలు పేరు సమీర్ దావూద్ వాంఖడే అని, అతను ముస్లిం అని రుజువు చేసే పాఠశాల సర్టిఫికెట్లు బ‌య‌ట‌పెట్టారు. సమీర్ వాంఖడేకు చెందిన రెండు పాఠశాల సర్టిఫికేట్‌లను రిలీజ్ చేశారు. స్కూలు సర్టిఫికెట్లలో సమీర్ పేరు మధ్య ‘దావూద్’ అని ఉంది. వడాలలోని సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, దాదర్ లోని సెయింట్ పాల్ హై స్కూల్ సర్టిఫికెట్లలో సమీర్ ‘దావూద్’ వాంఖడే అని ఉంది. ఆ స‌ర్టిఫికెట్స్‌లోని రిలీజియ‌న్‌ కాలమ్ లో ‘ముస్లిం’ అని ఉంది.  ఇక‌, 1995 నాటి స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్‌లో అతని పేరు వాంఖడే సమీర్ ద్యాందేవ్ అని, కులం ‘మహర్’ అని ఉంది. వాంఖడే ముస్లింగా జన్మించాడని యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎస్సీ కోటా కింద ఉద్యోగం పొందేందుకు అతను హిందూ ఎస్సీ వర్గానికి చెందినవాడినని కుల ధృవీకరణ పత్రంతో సహా నకిలీ పత్రాలను రూపొందించారని మంత్రి నవాబ్ మాలిక్ గతంలో ఆరోపించారు. నవాబ్ మాలిక్ సమీర్ వాంఖడే జనన ధృవీకరణ పత్రం కాపీని కూడా విడుదల చేశారు.  ‘‘స‌మీర్‌ కంప్యూటరైజ్డ్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నాడు. అవన్నీ బోగస్. మేం నిజమైన సర్టిఫికెట్లను కోర్టుకు సమర్పించాం, అవన్నీ డాక్యుమెంట్ చేశారు. అతను ఇప్పుడు ఉద్యోగం కోల్పోవడం ఖాయం’’అని మంత్రి మాలిక్ అన్నారు. అయితే, ఎన్సీపీ శిబిరం రిలీజ్ చేసిన త‌న స్కూల్ స‌ర్టిఫికెట్ల‌పై స‌మీర్ వాంఖ‌డే స్పందించారు. అస‌లేం జ‌రిగిందో.. త‌న పుట్టుపూర్వోత్త‌రాలు వివరించారు. ‘‘మా నాన్న‌ జ్ఞాన్‌దేవ్ కచ్రూజీ వాంఖడే హిందువు. నా తల్లి దివంగత జహీదా ముస్లిం. నేను నిజమైన భారతీయ సంప్రదాయంలో లౌకిక కుటుంబానికి చెందినవాడిని. నా వారసత్వం గురించి నేను గర్వపడుతున్నాను. నేను డాక్టర్ షబానా ఖురేషీని 2006లో ప్రత్యేక వివాహ చట్టం 1954 ప్రకారం పౌర వివాహ వేడుకలో వివాహం చేసుకున్నాను. మేమిద్దరం 2016లో సివిల్ కోర్టు ద్వారా పరస్పరం విడాకులు తీసుకున్నాం. తర్వాత 2017లో నేను క్రాంతి దీనానాథ్ రెడ్కర్‌ను వివాహం చేసుకున్నాను’’ అని సమీర్ వాంఖడే ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇలా స‌మీర్‌ వాంఖ‌డే మ‌తంపై ఎన్సీపీ లేవ‌నెత్తిన‌ వివాదం ఆస‌క్తిక‌రంగా కొన‌సాగుతోంది.   

వివేకా కేసులో నిందితుడికి సునీత భర్తే బెయిల్ ఇప్పించారా? 

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ సంచలనంగా మారగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచింది.  వివేకా కేసులో అరెస్టైన దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి సీబీఐకి సంచలన లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్యకేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు. వివేకా హత్యకు అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి హస్తం ఉందన్నారు శివశంకర్ రెడ్డి. దస్తగిరి ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయన్నారు. ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని తాను నిర్దోషినని శంకర్‌రెడ్డి చెప్పారు. ‘నన్ను కావాలనే ఈ కేసులో ఇరికిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత పదేపదే సీబీఐ అధికారులను ఎందుకు కలిశారు? సునీత సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడం కాదా? సునీత భర్తే లాయర్‌ను పెట్టి దస్తగిరికి బెయిల్‌ ఇప్పించారు. తన తండ్రిని చంపిన వ్యక్తికి సునీత భర్త ఎందుకు సహాయపడుతున్నారు? అని తన లేఖలో దేవిరెడ్డి శివ శంకర్‌ రెడ్డి ప్రశ్నించారు. 

ధ‌ర్నాచౌక్‌కి దిగొచ్చిన దొర‌.. ధ‌ర్నా ఝ‌రూరీ హై!

ఊర‌క రారు మ‌హానుభావులు. ఇక సీఎం కేసీఆర్ అయితే అస‌లే రారు. ప్ర‌జా ముఖ్య‌మంత్రిగా ఉండాల్సిన సీఎం.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముఖ్య‌మంత్రిగా, ఫామ్‌హౌజ్ ముఖ్య‌మంత్రిగా పేరు గాంచారు. ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌డ‌మే గ‌గ‌నం. ప్ర‌జ‌ల దాకా ఎందుకు.. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌ల‌కే ఆయ‌న ముఖం చూపించ‌రు. ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి నాయకుడినే ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లోకి రానీయ్య‌లేదు. టీవీల్లో కేసీఆర్ ఫైల్ విజువ‌ల్స్‌ చూడ‌ట‌మే కానీ.. ఆయ‌న నేరుగా ద‌ర్శ‌న‌మిచ్చే సంద‌ర్భాలు అతి త‌క్కువే. ఇంత త‌క్కువ‌గా ప్ర‌జ‌ల‌కు ముఖం చూపించే సీఎం.. బ‌హుషా దేశంలో కేసీఆర్ ఒక్క‌రేనేమో.  అలాంటి కేసీఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి ధ‌ర్నాచౌక్ వ‌ర‌కూ దిగొచ్చారు. నేను సైత‌మంటూ ఇందిరాపార్క్ ద‌గ్గ‌ర మ‌హాధ‌ర్నాకు కూర్చున్నారు. కేసీఆర్ అంత‌టి వారే.. స్వ‌యానా ముఖ్య‌మంత్రే.. కేంద్రానికి వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేయ‌డ‌మంటే మామూలా? అందుకే మీడియా ఫోక‌స్ మొత్తం ఆయ‌న‌పైనే. నేష‌న‌ల్ మీడియాలోనూ క‌వ‌రేజ్ వ‌చ్చింది. అదే క‌దా కేసీఆర్‌కు కావ‌ల‌సింది.. అందుకే క‌దా ముఖ్య‌మంత్రి హోదాలో ధ‌ర్నాకు దిగింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్ర‌మే.. కేంద్రం దిగొచ్చే వ‌ర‌కూ రైతు ప‌క్షాన పోరాడుతూనే ఉంటాం.. అంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్లూ ఇచ్చేశారు.  ఉద్య‌మం సమ‌యంలోనూ ఇలానే రాజ‌కీయ ప్ర‌సంగాలు ఇచ్చేవారు కేసీఆర్‌. కానీ, అంత ఉద్వేగ పోరులోనూ ఎన్న‌డూ ఇలా ధ‌ర్నాకు కూర్చున్న‌ది లేదు. పార్టీతో, ప్ర‌జ‌ల‌తో ధ‌ర్నాలు చేయించే వారే కానీ, కేసీఆరే స్వ‌యంగా ఇలా ధ‌ర్నాకు దిగిన సంద‌ర్భాలు అత్యంత అరుదు. అలాంటిది.. ఇప్పుడు ఏమంత అవ‌స‌రం వ‌చ్చిందో ఏమో గానీ, ముఖ్య‌మంత్రి హోదాలో ధర్నాచౌక్‌లో యావ‌త్ మంత్రివ‌ర్గ ప‌రివారాన్ని వెంటేసుకొని మ‌రీ మ‌హాధ‌ర్నా చేప‌ట్ట‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది.  కేసీఆర్‌ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు లాగిన ఘ‌న‌త మాదేన‌ని బీజేపీ వ‌ర్గాలు ఆ క్రెడిట్‌ను త‌మ ఖాతాలో వేసుకుంటున్నాయి. హుజురాబాద్ ఓట‌మి భ‌యంతోనే కేసీఆర్ ఇలా ధ‌ర్నా పాలిటిక్స్ చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అయితే.. కేసీఆర్‌-బీజేపీ క‌లిసి ఆడుతున్న ధ‌ర్నా డ్రామా ఇదంతా అంటూ మండిప‌డుతున్నాయి. ఎవ‌రు ఏమ‌న్నా.. సీఎం కేసీఆర్ ధ‌ర్నాకు దిగ‌డం మాత్రం హైలైట్ అనే చెబుతున్నారు. ఇదంతా రాజ‌కీయ ఎత్తుగ‌డేన‌ని అంతా భావిస్తున్నారు. ధ‌ర్నాలు చేయ‌డం కాదు.. ముందు వ‌రిపై ద‌గా చేయ‌డం మానండంటూ కేంద్ర‌రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డుతున్నారు రైతులు.

బ్యానర్ పట్టిన బాబు.. అచ్చెన్న విజయం.. దిగొచ్చిన దొర.. టాప్ న్యూస్@1PM

ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలంటూ టీడీపీ శాసన సభ్యులు నినాదాలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు బ్యానర్ పట్టుకుని అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. ఈ సందర్భంగా భారంగా మారిన పెట్రో ధరలు తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయన్నారు.  జగన్ ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ టీడీపీ అధినేత మండిపడ్డారు --------- ఏపీ శాసన మండలి బీఏసీలో గందరగోళం పరిస్థితి నెలకొంది. శాసన మండలి, శాసన సభ నిర్వహణపై చెరో రకమైన నిర్ణయం వెలువడింది. ఈ నెల 26 వరకు శాసన సభ ఉంటుందని అసెంబ్లీ బీఏసీ నిర్ణయం తీసుకోగా... శాసన మండలి ఒక్కరోజు మాత్రమే అని మండలి బీఏసీలో ప్రకటించారు. ఇందుకు నిరసనగా మండలి బీఏసీ నుంచి కౌన్సిల్ ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వాక్ ఔట్ చేశారు ------ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో కీలక అనుమానితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు,  వైసీపీ నేత, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. బుధవారం శివశంకర్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ.. ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచింది. తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని కడపకు తరలించింది సీబీఐ -------- అసెంబ్లీ ముట్టడికి పలువురు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు యత్నించారు. అసెంబ్లీ ప్రధాన మార్గం వరకూ వచ్చి నినాదాలు చేశారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంటే నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు లేదా అని మండిపడ్డారు. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వ జీవోలు 42 ,50, 51 లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.  ------ ప్రధాని మోదీ దేశాభివృద్ధిని అమ్ముకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో పెట్రోల్, డీజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ 16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు విమానాలు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి.... క్యాప్టలిజాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ---------- తెలంగాణ ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. రైతుల కోసమంటూ  ధర్నాకు దిగారు. వరి ధాన్యం విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికార పార్టీగా ఉండి కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ  వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.  --- మహాదర్నాలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.  --- వరి పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయమని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మాది కాదు అంటే మాది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన 13 మద్దతు ధర పంటల్లో వరి కూడా ఉందని తెలిపారు. మద్దతు ధర ప్రకటించడం అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థమన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు ---- పది నెలల్లో బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ భీల్ పై రెండుసార్లు అత్యాచారం కేసులు నమోదు అయిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ప్రతాప్ భీల్ రాజస్థాన్ రాష్ట్రంలోని గోగుండా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.రెండు సందర్భాల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి, పెళ్లి సాకుతో మహిళలపై ఎమ్మెల్యే ప్రతాప్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ప్రతాప్‌ భీల్‌ తనపై అత్యాచారం చేశాడని తాజాగా ఓ మహిళ అంబామాత జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ---  పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం కేసులో ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్ తప్పనిసరి అని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.స్పర్శ అనే పదాన్ని ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్‌కి పరిమితం చేయడం సంకుచితమైన, అసంబద్ధమైన వివరణకి దారి తీస్తుందని,చట్టం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేదిలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

మేళ  తాళాలతో మద్యం షాపుకు ఎమ్మెల్యే.. జగనన్న పాలనలో వెరైటీ సీన్? 

అంచలవారీగా సంపూర్ణ మధ్య నిషేధం, ఇదీ వైసీపీ ఇచ్చిన హామీ ... పాదయాత్ర ప్రతి అడుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, బామ్మలు తెలుగింటి ఆడపడుచులు అందరికీ పేరుపేరున ఇచ్చిన హామీ. మాట తప్పను,మడమ తిప్పను అంటూ మహిళలకు ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట, మడమే కాదు, మొత్తంగా మధ్య నిషేధం హమీనే జగన్ రెడ్డి ప్రభుత్వం తలకిందులు చేసింది. పాలసీని మార్చేసింది. మద్యంపై వచ్చే ఆదాయమే ఆర్థిక వ్యవస్థకు ఆధారంగా మద్యం విధానాన్ని మార్చేసింది. ఇచ్చిన హామీకి విరుద్ధంగా అంచలంచెలుగా మద్యం ఆదాయాన్ని పెంచుకుంటూ పోవడం వైసీపీ  ప్రభుత్వం నూతన విధానంగా ప్రకటించి, అమలు చేస్తోంది.   అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో మద్యం షాపుల సంఖ్య తగ్గించి, అంచెలవారీ మధ్య నిషేధంలో తొలి ముందడుగు పడిందని, ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ, నెలరోజుల క్రితం ప్రకటించిన కొత్త మద్యం పాలసీలో, షాపుల సంఖ్యను యధాతధంగా కొనసాగించాలని, నిర్ణయించింది. అంతే కాదు అది చాలదు అన్నట్లుగా, గతంలో ప్రకటించిన వాకిన్ స్టోర్స్ను విధానాన్ని కొనసాగించాలని, అందుకు అడనంగా టూరిజం సెంటర్లలో లిక్కర్ అవుట్ లెట్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవంక, మద్యం విక్రయాల ద్వారా గత ఏడాది 18 వేల కోట్ల రూపాయాలకు పైగా ఆదాయం రాగా.. ఈ సారి అది 20 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అన్నింటినీ మించి  మద్యం అమ్మకాలపై వచ్చే రేపటి ఆదాయాన్నిఈ రోజే తాకట్టు పెట్టి 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు దిగ్విజయంగా కొనసాగిస్తామన్న హామీతో రూ. 25 కోట్లు అప్పుతెచ్చుకుని పబ్బం గడుపుకుంటోంది వైసీపీ ప్రభుత్వం. అంతే కాదు, ఇదే ఖాతాలో ఇంకొంత అప్పు తెచ్చుకునేందుకు ఇటీవల కొత్త ఆలోచనలు కూడా చేసింది.  మద్యంపై విధిస్తున్న ‘వ్యాట్‌’ ఆదాయాన్ని ప్రభుత్వం రెండు ముక్కలు చేసింది. రాష్ట్ర ఖజానాకు రావలసిన వాటాకు గండి కొట్టి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఆదాయం పెంచే విధంగా వ్యాట్ ఆదాయాన్ని పంకాలు చేసింది.దీంతో అంచెలవారీ మద్య నిషేధాన్ని ప్రభుత్వం దిగ్విజయంగా అటకెక్కించిందని వేరే చెప్పనక్కరలేదు.  జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్నిమధ్యాంద్ర ప్రదేశ్’ గా మారుస్తున్న తీరు పట్ల ప్రజలు, ప్రతిపక్షలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. రాష్ట్రంలో వినూత్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా  జగన్ రెడ్డి ప్రభుత్వం బండారాన్ని బయట పెట్టేందుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మేళ, తాళాలతో లిక్కర్ మాల్‌లోకి వెళ్లారు. అక్కడ ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం ఆ మాల్‌లో పనిచేస్తున్న సిబ్బందికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మద్యం మరింత అందుబాటులోకి తెచ్చేందుకు.. షాపుల్ని పెంచడమే కాకుండా మాల్‌ను పాలకొల్లులో ప్రారంభించారని ఎద్దేవా చేశారు. ఇదేనా మద్యపాన నిషేధమా అని ప్రశ్నించారు. అందుకే సిబ్బందిని సన్మానించినట్లు చెప్పుకొచ్చారు.  మూడేళ్లు గడుస్తున్నా షాపుల్ని పెంచి మాల్స్ పెంచడం మద్య నిషేధమా అంటూ ప్రశ్నించారు రామానాయుడు. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే, రాబోయే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మద్యంపై ఎంత ఆదాయం వస్తుందో చూపించి.. జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.25వేల కోట్లు అప్పులు తెచ్చుకుందని, ఆ అప్పు తీర్చడం కోసం రాబోయే 15 ఏళ్లు మద్యం తాగించడం ప్రభుత్వ ఉద్దేశమా అని ప్రశ్నించారు. అప్పు తీర్చడానికి మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టడం మద్యపాన నిషేధమా అన్నారు. రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లు తయారు చేసి అమ్ముతున్నారని.. నాలుగు రెట్లు ధరలు పెంచి పేదల జేబుల కొట్టడమే కాకుండా.. వారి ఆరోగ్యాన్ని హరించడం నిషేధమా అంటూ జగన్ సర్కార్’కు ప్రశ్నలు సంధించారు. అయితే ఇంతటితో జగన్ ప్రభుత్వం మత్తు దిగుతుందా అంటే అనుమానమే ...