వివేకా కేసుపై జగన్ పార్టీ మౌనం ఎందుకు? అసలు పెద్దలు ఇరికినట్టేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్‌ స్టేట్ మెంట్  ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టి ఇప్పుడేం మాట్లాడతారని వైసీపీ నేతలను ప్రశ్నిస్తున్నారు. హత్య ఘటన మొత్తం జగన్మోహన్ రెడ్డికి తెలుసని అందుకే గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని అంటున్నారు. అసలు సూత్రధారుల్ని.. గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని విచారిస్తే మొత్తం బయట పడుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నేతలు ఇంతగా ఆరోపణలు చేస్తున్నా జగన్ పార్టీ నేతలు మాత్రం స్పందించడం లేదు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్ మెంట్ పైనా మట్లాడటం లేదు. టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం లేదు. దస్తగిరి కన్ఫెషన్‌ స్టేట్ మెంట్ పై వైసీపీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.  ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఇందులో పెద్దల పాత్ర ఉందని కూడా చెప్పారు. దీంతో దస్తగిరి చెబుతున్న ఆ పెద్దలు ఎవరన్నది చర్చగా మారింది. 2019 మార్చిలో ఆయన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. వివేకా హత్య జరిగినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నా.. అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కేసుపై దర్యాప్తు జరగకుండా అధికారులను బదిలీచేయడంలో.. మీడియాలో ప్రచారం జరగకుండా హైకోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది. అదే సమయంలో చంద్రబాబే.. టీడీపీ నేతలతో కలిసి హత్యలు చేయించారన్న ప్రచారాన్ని మాత్రం ఉద్ధృతంగా చేశారు. నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే వివేకా హత్య కేసులో తాజాగా వెలుగు చూస్తున్న పరిణామాలతో టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.  వైఎస్ వివేకాను సొంత కుటుంబసభ్యులే చంపినప్పటికీ సానుభూతి కోసం .. చంద్రబాబుపై బురద చల్లారని ఇప్పుడు నిజాలు బయటకు వచ్చాయని అంటున్నారు. దీనిపై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసు అంశంలో ప్రస్తుతానికి దస్తగిరి కన్ఫెషన్ మాత్రమే బయటకు వచ్చింది. ఇంకా బయటకురావాల్సినవి చాలా ఉన్నాయంటున్నారు. సాక్ష్యాలు తుడిచేసిన వారిని.. మర్డర్ కేసును గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేసిన వారిని సీబీఐ ప్రశ్నిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయంటున్నారు. ఆ రోజున గుండెపోటు అని .. వైఎస్ వివేకా మరణవార్తను అధికారికంగా మీడియాకు చెప్పింది విజయసాయిరెడ్డినే. అందుకే సీబీఐ సీరియస్‌గా విచారణ జరిపితే సంచలనాలు బయటకు వస్తాయని అంచనా వేస్తున్నారు టీడీపీ నేతలు. మొత్తంగా వివేకా హత్య కేసులో కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగూల్మంపై వైసీపీ నేతలు స్పందించకపోవడంపై జనాల్లోనూ చర్చ సాగుతోంది. హత్య వెనుక ఉన్న అసలు పెద్దలెవరో తేలాల్సిన అవసరం ఉందనే వాదన వస్తోంది. 

అదే జోరు.. అదే హోరు.. 15వ రోజు ‘మహాపాదయాత్ర’

అమరావతే ఏపీకి ఏకైక రాజధాని. మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలి. సీఆర్డీఏ ర‌ద్దు చేయాలి. ప్ర‌భుత్వం దిగొచ్చేదాకా ఉద్య‌మం ఆపేది లేదంటూ రాజ‌ధాని రైతులు అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నారు. రెండేళ్లుగా త‌గ్గేదే లేదంటున్నారు. ధ‌ర్నాలు, దీక్షాలతో అమ‌రావ‌తి నినాదం వినిపించారు. లాఠీ దెబ్బ‌లను ఓర్చుకుంటూ జై అమ‌రావ‌తి అంటున్నారు. అయినా, జ‌గ‌న్ స‌ర్కారు మ‌న‌సు మార‌క‌పోవ‌డంతో.. త‌మ గోడును ఆ దేవ‌దేవుడికే చెప్పుకునేందుకు.. జ‌గ‌న్‌రెడ్డి బుద్ధి మార్చాల‌ని వేడుకునేందుకు.. దండు క‌ట్టారు అమ‌రావ‌తి రైతులు. న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కూ.. అంటూ మ‌హా పాద‌యాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర తొమ్మిదో రోజు ప్ర‌కాశం జిల్లాలో జోరుగా కొన‌సాగుతోంది.   ఇవాళ జరుగుమల్లి మండలంలో మొదలైన యాత్ర సుమారు 14కి.మీ మేర సాగి కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగియనుంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్రకు స్థానిక ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది. పోలీస్ నిర్బంధ‌న‌లు ఎదుర్కొంటూ పాద‌యాత్ర‌కి సంఘీభావం చెబుతున్నారు స్థానికులు.    అమరావతి పరిరక్షణ, ఇతర ప్రాంతాలకు ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రారంభించిన మహాపాదయాత్ర.. 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.    

ఛీ ఛీ.. బూటులో బీరా ?.. ఆసీస్ ఆటగాళ్ల ఓవరాక్షన్..

దుబాయ్ వేదికగా జరిగిన టీట్వంటీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. ఫైనల్‌లో 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి తొలిసారి టైటిల్ సాధించింది. 18.5 ఓవర్లలోనే న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా సాధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్,  మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ పరుగుల వరద పారిస్తూ ఆసీస్ జట్టును విజేతగా నిలిపారు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ గెలితిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు దుబాయ్‌ మైదానంలో గెలుపు సంబరాలు చేసుకున్నారు. సౌథీ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌  బౌండరీ బాదగానే మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చిన ఆటగాళ్లు ఒకరినొకరు ఆలింగనాలు చేసుకొని సంబరపడ్డారు. తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో గోల గోల చేశారు. ఈ క్రమంలోనే ఆసీస్‌ కీపర్‌ మాథ్యూవేడ్‌, ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ ఒక బూటులో కూల్ డ్రింక్ పోసుకొని తాగారు.  దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.  ఈ వీడియో వైరల్ గా మారింది. గెలుపు సంబరాల్లో భాగంగా  ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తనపై సోషల్ మీడియాతో జోరుగా చర్చ సాగుతోంది. విజయోత్సవాల్లో ఇలాంటివి కామన్ అని కొందరు కామెంట్లు చేస్తుండగా... ఆసీస్ ఆటగాళ్లు అతి చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 

దొంగ ఓట్లు.. ఓటర్లకు బెదిరింపులు! పెనుగొండలో ఎంపీ మాధవ్ హల్చల్.. 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీతో పాటు అనంతపురం జిల్లా పెనుగొండ నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాలకు వెళుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు,  పెనుకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హల్‌చల్ చేశారు. అనుచరులను వెంటబెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి అక్కడికి చేరుకున్నారు. పార్థసారథి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎంపీ లెక్క చేయకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే  పార్థసారథిని అడ్డుకున్న పోలీసులు.. గోరంట్ల మాధవ్‌కు మాత్రం రెడ్ కార్పెట్ వేస్తున్నారు. పోలీసుల తీరుపై పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీట్వంటీ వరల్డ్ కప్ విజేత ఆసీస్.. ఫైనల్లో వార్నర్, మార్ష్ సూపర్ షో 

టీట్వంటీ విశ్వ విజేతగా ఆసీస్ నిలిచింది. కివీస్ తో జరిగిన ఫైనల్ పోరులో విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది కంగారుల జట్టు. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా తొలి ఓవర్ నుంచే ధాటిగా అడింది. అయితే ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం  రెచ్చిపోయాడు. కేవలం 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వార్నర్ కు మార్ష్ తోడయ్యాడు. 29 బంతుల్లో మిచెల్ మార్ష్ 46 పరుగులు చేశాడు. ఇద్దరు ధాటిగా ఆడటంతో ఆసిస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 13 ఓవర్ లో వార్నర్ అవుటయ్యాడు.  వార్నర్ అవుటైనా మార్ష్ జోరు మాత్రం ఆపలేదు. మరింత ధాటిగా షాట్లు కొట్టాడు. దీంతో ఆసీస్ ఈజీగానే లక్ష్యంగా దిశగా పయనించింది. 14 ఓవర్ లో హాప్ సెంచరీ పూర్తి చేశాడు మార్ష్. మూడో వికెట్ కు మ్యాక్స్ వెల్ తో కలిసి కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 17, 18 ఓవర్లలో పరుగులు తక్కువగా వచ్చినా.. 19 ఓవర్ లో బౌండరీలు కొట్టడంతో ఆసిస్ విజయం పూర్తైంది. మార్ష్ 77 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బౌల్డ్ రెండు వికెట్లు తీశాడు.  టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దెబ్బకు ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.  మిచెట్ స్టార్క్ బాధితుడిగా మారాడు.4 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు.  క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన విలియమ్సన్ ఆసీస్ ఫీల్డింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. మైదానం నలువైపులా బంతులను తరలిస్తూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కివీస్  కెప్టెన్.. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత మరో 5 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 10 ఫోర్లు, 3  సిక్సర్లతో 85 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 28, మిచెల్ 11, ఫలిప్స్ 18, నీషమ్ 13 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకోగా, జంపాకు ఒక వికెట్ దక్కింది. 

పాలిటిక్స్ లోకి సోనూసూద్! పంజాబ్ ఎన్నికల్లో పోటీ..

సినిమాల్లో విలన్.. కాని నిజ జీవితంలో మాత్రం ఆయన హీరో.. ఇదంతా చెబుతోంది ఎవరి గురించో తెలిసింది కదూ... రీల్ విలన్.. రియల్ హీరోగా జనాల నుంచి నీరాజనాలు అందుకుంటున్న సోనుసూద్ గురించే. కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది. లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను వారి స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో, అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు.ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది.  స్టార్‌హీరోలకు లేని క్రేజ్ ఆయన సొంతమైంది. సెలబ్రెటీలు సైతం సాహో అన్నారు. వెల్‌డన్‌ అంటూ అప్రిషియేట్ చేశారు.  తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్‌ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజాదరణ పొందిన సోనూ సూద్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోను రాజకీయాల్లోకి రావాలంటూ కొందర డిమాండ్ కూడా చేశారు. కొన్ని పార్టీలు కూడా ఆయనను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి.  అయితే తనపై వస్తున్న  రాజకీయ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు సోనుసూద్. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.  ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్‌ రాబోయే పంజాజ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం సోనూసూదా వెల్లడించలేదు.‘‘మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’’ అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు. సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. దీంతో సోనూ సోదరి మాళవిక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఆప్ నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఇండిపెండెంట్ గానూ పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా సోనూసూద్ సోదరి పొలిటికల్ ఎంట్రీ రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది. 

బంజార రేడియో, యూట్యూబ్ చానల్ ప్రారంభం.. తెలుగువన్ పై ప్రశంసల వర్షం 

దేశంలో బంజారా జాతికి గొప్ప విశిష్టత ఉంది. సంస్కృతి, సంప్రదాయాలకు గిరిజనులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు. అయితే ఇప్పటికీ బంజార బాష, సంస్కృతికి సమాజంలో సరైన గుర్తింపు లేదు. లంబాడాలు అభివృద్దికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. అందుకే దేశంలోనే తొలిసారిగా తెలుగు వన్ గొప్ప కార్యం చేపట్టింది. బంజార జాతి అభ్యున్నతి కోసం రెడియో , యూట్యాబ్ ఛానెల్ తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సేవాలాల్ ఉత్సవ కమిటీ మరియు స్వామి వివేకానంద సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన బంజార ఉత్సవ్ 2021లో ఈ చానెళ్లను లాంఛ్ చేశారు. బంజారా ఉత్సవ్ కు ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్  ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, సేవాలాల్ ఉత్సవ కమిటీ చైర్మన్ అశోక్ రాథోడ్ పాల్గొన్నారు.  బంజారా భాష,సంస్కృతిని పెంపొందించే టోరీ గోర్ బంజార రేడియో మరియు యూట్యూబ్ చానెల్ ను లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో బంజారా జాతి అభివృద్ధి దిశలో ముందుకు పోవాలని కోరుకున్నారు. గిరిజన బిడ్డలు గొప్ప చదువులు చదివి ఉన్నంత ఉద్యోగాలను పొందాలని దత్తాత్రేయ ఆకాక్షించారు. బంజారా జాతి అభ్యున్నతి కోసమే దేశంలోనే తొలిసారిగా  బంజార రేడియో, యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చామని తెలుగు వన్ ఎండీ రవి శంకర్ చెప్పారు.  బంజారాలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బంజారలు అన్ని రంగాల్లో ఎదగాలన్నదే తెలుగు వన్ ఆశయమని చెప్పారు రవిశంకర్. బంజార బాష, సంస్కృతిని ప్రపంచానికి గొప్పగా పరిచయం చేసేందుకు తెలుగువన్ చేస్తున్న కృషి అమోఘమని  రవీంద్రనాయక్ ప్రశంసించారు. తెలుగు వన్ ఎండీ రవిశంకర్ ను ఆయన అభినందించారు.  ఇక బంజార ఉత్సవ్ లో గిరిజన జాతి ఔన్నత్యాని తెలిపేలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంప్రాదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉత్సవాల్లో లంబాడి విన్యాసాలు, ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. 

వైసీపీ అరాచకాలు.. అమిత్ షా హామీ.. అమ్మకానికో బడి.. టాప్ న్యూస్@7PM

కుప్పం ఎన్నికల్లో అరాచకాలపై ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి చెందిన స్థానికేతరులు తిష్ట వేశారని ఆక్షేపించారు. బోగస్ ఓట్లు, ఓటర్లను భయపెట్టేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. దొంగ ఓటర్లను అడ్డుకోవడంలో పోలీస్‌శాఖ తీవ్ర వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఎస్ఈసీ, డీజీపీలు వెంటనే చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ------------ తిరుపతిలోని తాజ్‌ హోటల్‌ వేదికగా జరుగుతున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు. ------- ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టిస్తోంది. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని  టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తెలిపోయింది విజయసాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు. ----------- ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. అప్పుడు ‘అమ్మఒడి’, ఇప్పుడు ’అమ్మకానికో బడి’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీనంపై ప్రభుత్వం జీవోను జారీ చేయడం సరైందికాదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల సరెండర్‌ను సులభతరం చేయడానికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చిందంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.  ----------- జగన్ సర్కారుపై బీజేపీ నేత సునీల్ దేవదర్ అతి భక్తి ప్రదర్శించారు. రైతుల మహా పాదయాత్రలోఎవరూ పాల్గొనవద్దని ఏపీ బీజేపీ నేతలపై సునీల్ దేవదర్ ఒత్తిడి చేస్తున్నారు. రైతులకు మద్దతు పలకాల్సిన అవసరం లేదని సునీల్ దేవదర్ ఫోన్ చేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. యాత్రను ఆడ్డుకోవాలని చూస్తున్న పోలీసులకు సహకరించేందుకే.. తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు --------- ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనేందుకు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ముఖ్యమంత్రి ఎందుకు దీక్ష చేయడం లేదన్నారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. ----------- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతోన్న బంజారా ఉత్సవ్ లో బండి సంజయ్, ఈటల తదితరులు పాల్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ తండాల్లో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని బండి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు కోసం పోరాడిన రవీంద్ర నాయక్ ను కేసీఆర్ అవమానించాడని బండి సంజయ్ మండిపడ్డారు. గిరిజనులను వేదిస్తోన్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని సంజయ్ అన్నారు. -----------  గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్‌ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని మవోలు మండపడ్డారు. ---------- విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడంతో పంజాబ్‌లో పెట్రోలు ధర, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డీజిల్ ధర భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీని పెట్రోలుపై లీటరుకు రూ.5 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాయి ---------- మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. తన గేదె పాలివ్వడంలేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నవగాం గ్రామానికి చెందిన బాబూలాల్ జటావ్ వ్యవసాయదారుడు. ఆయనకు కొన్ని పాడిగేదెలు ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి కొన్ని రోజులుగా పాలివ్వడంలేదంటూ బాబూలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. గేదెను కూడా పోలీస్ స్టేషన్ కు తోలుకు వెళ్లాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేసి ఉంటారని, అందుకే పాలివ్వడంలేదని తెలిపాడు.

కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఏపీలో త్వరలో ఎమర్జెన్సీ?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. అవమానాలు ఎదురవుతున్నాయి. రెండు మూడు  రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకునేలా జగన్ సర్కారు ముఖాన తలుపులు వేసింది. రాష్ట్రం దివాళా దారిలో పోతోందనే అర్థం వచ్చేలా, అదనపు రుణం పొందేందుకు అర్హత కోల్పోయిందని ప్రపంచం అంతటికీ తెలిసే విధంగా చాటింపు వేసింది. మూలధనం వ్యయం లక్ష్యాలను చేరుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం  వెనకబడినట్లు కేంద్రం లెక్కలు చెప్పింది. ప్రస్తుత (2021-22) ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు మూలధన వ్యయంలో 26 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని,  రాష్ట్రంలో ఆస్తులను సృష్టించడంలో రాష్ట్రం వెనకబడిందని, అందుకే అదనపు రుణానికి ‘నో ఛాన్స్’ అంటూ తేల్చి చెప్పింది. ఆ విధంగా కేంద్రం అంతో ఇంతో అప్పు వేస్తుందని ఆశగా తలుపు తట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం ముఖం మీదనే కేంద్రం తలుపులు వేసింది.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖకు ఏ కంపెనీ కూడా వైద్య పరికరాలు సరఫరా చేయవద్దు అంటూ వైద్య పరికరాల ఉత్పత్తి దారుల జాతీయ యూనియన్‌ (ఏఐఎంఈడీ) తన అధికారిక వెబ్‌సైట్‌లో ‘రెడ్‌ నోటీస్‌’ జారీ చేసింది. వైద్య పరికరాలు సరఫరా చేసే కంపెనీలు.. ఆంధ్రాతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆ నోటీసులో గట్టి సూచనలు చేసింది. జాతీయ స్థాయిలో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇంతవరకు అంతో ఇంతో మిగిలుందని అనుకుంటున్న ముఖ్యమత్రి జగన్ రెడ్డి ప్రభుత్వ పరువు పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందని రాజకీయ వర్గాలు బావిస్తున్నాయి. రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ పరువుతో పాటుగా, రాష్ట్రం పరువు, రాష్ట్ర ప్రజల పరువు కూడా చుక్క మిగలకుండా చక్కగా తుడిచి పెట్టుకు పోయిందని, విశ్లేషకులు భావిస్తున్నారు.     అయితే, ‘ఇంతటితో అయి పోలేదని అసలు కథ ముందుందని ఏపీ ప్రభుత్వ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రముఖ ఆంగ్ల పత్రిక, ‘ఎకనమిక్ టైమ్స్’ ప్రచురించిన కథనం ప్రకారం, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం, రాష్ట్రంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ) విధించడం  అనివార్యమయ్యే పరిస్థితులు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదు ఎవరో వ్యక్తపరిచిన అభిప్రాయం కాదు. రాష్ట్ర ప్రభుత్వ   అధికారులే,రాష్ట్ర అర్తిఅక్ వ్యవస్థ కుప్ప కూలడం తధ్యమని,  అయితే ఎప్పుడు, అనేదే ప్రశ్నఅంటున్నారు.  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓటి పడవలో ప్రయాణం సాగిస్తోంది. సో... పడవ మునకేయడం, ఖాయం. అయితే ఎప్పుడు, నవంబర్ చివరకే మునకేస్తుందా, సంవత్సరం చివరి వరకు సాగుతుందా అనేది ఇప్పుడు, మన ముందున్నప్రశ్న అని అధికారులు అంతర్గత చర్చల్లో చర్చిస్తున్నట్లు సమాచారం. అది ముందుముందు పుట్టే అప్పుల మీద ఆధారపడి ఉంటుందని, అధికారులు అంటున్నారు. ఇక ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఎప్పుడైనా రాష్ట్రంలో అర్తిక ఎమర్జెన్సీ విధించే అవకాశం  ఉందని, సీనియర్ అధికారులే చెపుతున్నారని పత్రిక సమాచారం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021 – 22 లో రాష్ట్ర రెవిన్యూలోటు కనీవినీ ఎరుగని రీతిలో, ఎకంగా. 662.80 శాతానికి చేరుకుంది.ద్రవ్య లోటు 107.79 శాతానికి చేరింది.  అలాగని రాష్రానికి ఆదాయం లేకుండా పోయిందని అనుకునే వీలులేదు. పన్నులు పెరగడంతో రెవెన్యూ ఆదాయం పెరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ రూపంలో రావలసినదానికంటే ఎంతో కొంత ఎక్కువగానే వస్తోంది. అయినా, ఇవేవీ కూడా రాష్ట్ర ఆర్థిక పతనాన్ని ఆపలేక పోతున్నాయని అధికారాలు అంటున్నారు. అంతేకాదు, ఆదాయ మార్గాలన్నీ మూసకు పోయాయి. ఖజానాకు డబ్బులు చేర్చే కాలువలు ఎండి  పోయాయని ఏపీ ఆర్థిక శాఖ అధికారులు పేర్కొన్నట్లు పత్రిక పేర్కొంది. అలాగని, రాష్ట్ర ఆదాయం అడుగంటి పోయిందని కాదు.. ఆదాయం ఉంది, ఆర్ధిక క్రమశిక్షణ లోపించిందని అధికారులు అంటున్నారు. కాగ్ నివేదిక ప్రకారం, రూ.38,914.18 కోట్ల ఋణంతో కలుపుకుని ప్రస్తుత ఆర్థిక  సంవత్సరం తొలి ఆరు మాసాలలో  రాష్ట్ర ఆదాయం, 1,04,804.91 కోట్లుగా ఉంది. అయితే ఆదాయంలో సగం, (రూ.50, 419.15 కోట్లు) సంక్షేమ పథకాలు, ఉచితాల పేరిట కరిగిపోతే, ఉద్యోగుల జీతాలు, సబ్సిడీలు, పాత అప్పుల మీద చెల్లించే వడ్డీలు అన్నీ కలుపుకుంటే, కాగ్ నివేదిక ప్రకారం,  మొత్తం ఖర్చు రూ.1,04,723.91  కోట్లకు చేరింది. అంటే నిండా వందకోట్లు కూడా, అభివృద్ధి కార్యక్రంలకు మిగలలేదు.  రాష్ట్ర ప్రభుత్వం 2021-22 వార్షిక బడ్జెట్’లో రూ.5,000.08కోట్ల రెవిన్యూ లోటును అంచనావేసింది.అయితే, ఏప్రిల్ – సెప్టెంబర్ మద్య కాలంలోనే, రెవిన్యూ లోటు రూ.33,140.62కోట్లకు (662.80శాతం)చేరింది. అదలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు మాసాలలోనే వార్షిక లక్ష్యం, రూ.37,029.79 కోట్లకు మించి రూ.39,914.18 కోట్లు అప్పు చేసింది. నిజానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.19,986.17 కోట్లు పెరిగింది. అయినా, బడ్జెట్’ లో ప్రతిపాదించిన  రూ. 30,571.53 కోట్లు పెట్టుబడి వ్యయంలో కేవలం రూ.6,419.51 కోట్లు మాత్రమే మొదటి ఆరు నెలల్లో ఖర్చు చేసింది, అంటే, అర్తిక వ్యవస్థ పట్టాలు తప్పి పరుగులు తీస్తోందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రభుత్వం దృష్టి మొత్తం నగదు బదిలీ మీదనే కేంద్రీకృతం కావడంతో ఆర్థిక శాఖతో సహా ఏ ప్రభుత్వ శాఖ కూడా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచించడమే లేదని, అధికారులు అంటున్నారు. గత సంవత్సరం బడ్జెట్’లో  కాపిటల్ వర్క్స్ కోసంగా రూ.29,300.42 కోట్లు కేటాయిస్తే, అందులో ఖర్చు చేసింది రూ.18,385.49 కోట్లు మాత్రమే.  ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన ఆర్థిక శాఖ అధికారులు, రాష్ట్ర ఆర్ధిక  వ్యవస్థ కుప్ప కూలేది ఖాయం అనే నిర్ణయానికి  వచ్చినట్లు సమాచారం. ఎటొచ్చి ఎప్పుడన్న విషయంలోనే సమావేశంలో ప్రదంగా చర్చ జరిగిందని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.ఆలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్దంలో పరిస్థితి కొంత మెరుగు పడవచ్చని, కొందరు ధికారులలో చిన్ని చిన్నిఆశలు  ఉన్నా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే మాత్రం, కుబేరుడే దిగివచ్చిన ఎపీని కాపాడలేని  ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకుని ఆర్ధిక ఎమర్జెన్సీ విధించడం ఒక్కటే, రాష్ట్రాన్ని రక్షించే తారక మంత్రం అవుతుందని అధికారులు అంటున్నారు. అదే జరిగితే, ఆర్థిక అత్యవసర పరిస్థితి కారణం కేంద్ర పాలన విధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర సృష్టిస్తుంది. ఆ ఘనత ఒక్క ఛాన్స్ జగన్ రెడ్డికే దక్కుతుంది.

కుప్పంలో తిరుపతి తరహా దొంగ ఓటర్లు! వైసీపీ కుట్రలపై టీడీపీ ఫైర్.. 

కుప్పంలో తిరుపతి సీన్ రిపీట్ అవుతోంది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఇతర ప్రాంతాల నుంచి నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చింది వైసీపీ. ఫేక్ ఓటర్లను టీడీపీ నేతలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో జగన్ పార్టీ బండారం బట్టబయలైంది. వైసీపీ తీరుపై తిరుపతి ఓటర్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయినా వైసీపీ తీరు మాత్రం మారలేదు .ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి తరహాలోనే అక్రమాలకు తెర తీసింది అధికార పార్టీ.  తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ చేయాల్సిన అన్ని కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ల పర్వం నుంచే  అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మరింతగా బరి తెగించారు. కుప్పంలో వైసీపీ నేతలు యథేచ్చగా అరాచకలకు పాల్పడుతున్నారు. దొంగ ఓట్లు వేసేందుకు స్థానికేతరులను తరలిస్తున్నారు. కుప్పంలో పరిస్థితిని సమీక్షిస్తోన్న టీడీపీ నేత అమర్‌నాథ్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కుప్పంలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.  బయటి వ్యక్తులను కుప్పం నుంచి పంపకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు జులుం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 23వ వార్డులో నాన్ లోకల్‌కు సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,ఆయన తల్లి మాజీ ఎంపీటీసీపై స్థానికేతర వైసీపీ ప్రచార వ్యక్తులు దాడి చేశారు. 

15 ఏళ్లలోపు పిల్లలకు బస్సులో ఫ్రీ.. ఆర్టీసీ కానుక 

బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ చిన్నారులకు మంచి కానుక అందించింది.  15 ఏళ్లలోపు పిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీకి చెందిన ఏసీ, మెట్రో, డీలక్స్‌, ఆర్డినరీ.. ఇలా ఏ బస్సులోనూ చిన్నారులకు టికెట్‌ అవసరం లేదని సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అయితే ఆ ఆఫర్ బాలల దినోత్సవం ఒక్క రోజు మాత్రమే వర్తించనుంది.  ఐపీఎస్ అధికారి అయిన సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందేలా ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సజ్జనార్. ఇటీవలే పెండ్లి కోసం ఆర్టీసీ బస్సును బుక్ చేసుకోగా.. ఆ వివాహానికి హాజరై సర్ ఫ్రైజ్ ఇచ్చారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.    

బాబాయ్ పై గొడ్డలి పోటు ఎవరిది?.. అసలు పెద్దలు ఎవరు? 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కారు డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ప్రకంపనలు స్పష్టిస్తోంది. వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు.  దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.  ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ఏపీలో సంచలనంగా మారింది. టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.  వైఎస్ వివేకా హత్య కేసుపై మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘బాబాయిది గుండె పోటు అని చెప్పి నమ్మించాలని చూశారు, గొడ్డలి పోటు అని బయటపడింది. కుక్కను చంపారు, బాబాయిపై వేటు వేసి కుట్లు వేశారు?... ఇంతకీ బాబాయ్ హత్య వెనక ఉన్న అసలు పెద్దలు ఎవరు?.. అందిన సొమ్ములు, వాడిన ఆయుధాలు ఎక్కడివో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా?’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు.  వివేకా హత్య కేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. బాబాయ్‌ని లేపేసి నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై నీ దొంగ పేపర్లో రాయించిన అబ్బాయి జగనూ... సుపారీ రూ.40 కోట్లు, గొడ్డలి వేట్లు నీ ఇంటివేనట కదా! ఇప్పుడేం రాయిస్తారు మీ పత్రికలో..!’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

స్థానికేతరులతో డబ్బుల పంపిణి! కుప్పంలో వైసీపీ అరాచకాలు.. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ చేయాల్సిన అన్ని కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ల పర్వం నుంచే వైసీపీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలు వెలుగు చూడగా.. పోలింగ్ కు ముందు మరింతగా శృతిమించాయని అంటున్నారు. కుప్పంలో శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అయినా వైసీపీ నేతలు మాత్రం యథేచ్చగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  కుప్పం మున్సిపాలిటీ పరిధి పాతపేట మునిస్వామిపురంలో ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 23వ వార్డులో నాన్ లోకల్‌కు సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,ఆయన తల్లి మాజీ ఎంపీటీసీపై స్థానికేతర వైసీపీ ప్రచార వ్యక్తులు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కుప్పంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఓటర్లకు డబ్బులు పంచడంలో అధికార పార్టీకి సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలో తమను ఓడించలేరని చెబుతున్నారు. 

బాలల హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత!

బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత, పిల్లల మనసు తెలసుకుని మెలగాలి.. పిల్లలు పూలతోటలోని మొగ్గలాంటి వారు. వాళ్లను ప్రేమగా సాకాలి. నేటి బాలలే రేపటి పౌరులు. భావి భారత భాగ్య విదాతలు అని భారత తొలి ప్రధాని నెహ్రూ చాలా సందర్భాల్లో చెప్పారు.. నవంబర్ 14 తేదీన ఆయన పుట్టిన రోజు.. అదేరోజున బాలల దినోత్సవం జరుపుతారు.. చిన్న పిల్లల ద్వారానే మనం ప్రేమ సూత్రాన్ని మరింత బాగా అర్ధం చేసుకోగలం, పిల్లలు తెలివైన వారుగా ఎదగాలంటే వాళ్లకు మంచి కాల్పనిక కథలు వినిపించాలి. ఈ రోజు పిల్లలకు పండుగ రోజు లాంటింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ దినోత్సవాన్ని ఈ నెల 20న జరుపుకుంటాయి. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఎక్కువ కాలం ఆ హోదాలో సేవలందించారు. ఆయనకు గులాబీ అన్నా పిల్లలన్నా ఎంతో మక్కువ. చెప్పలేనంత ఇష్టం..  స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కులు మొదలైన వాటన్నిటికీ సుదీర్ఘ పోరాట చరిత్ర ఉంది. వాటిని సాధించే క్రమంలో గొప్ప గొప్ప అనుభవాల్ని సంపాదించినం. కానీ, ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, మానవహక్కుల విస్తారంలోకి పిల్లల్ని చేర్చం. నేటి ఈ ప్రజాస్వామ్య ప్రపంచంలో సైతం తల్లిదండ్రులు, టీచర్లు, పనిచేసేచోట్ల యజమానులు ఇంకా బయట ప్రతీచోటా పిల్లల్ని కొట్టటం, తిట్టటం, అవమానించటం, స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకోవడం, సరియైన ఆహారం అందించకపోవడం జరుగుతోంది, ఇది ఘోరమైన చర్య అని మనం అర్ధం చేసుకోవాలి.  పిల్లల హక్కుల గురించిన జ్ఞానంగానీ, చైతన్యంగానీ, ప్రయత్నంగానీ అంతగా జరుగలేదనేది వాస్తవం. తల్లిదండ్రులకు పిల్లల మీద సర్వహక్కులు వుంటాయనుకునే దూరదృష్టి నుంచి ఇంకా బయటపడలేదు. అత్యంత విచారకరమైన విషయం ఏం అంటే బుద్ది జివులనబడే వాళ్ళుకూడా- దారిద్య్రం, నిరుద్యగం, వివక్షత వంటి పరిస్థితుల్ని ముల కారణాలుగా పరిగణిస్తూ పిల్లలకు చేస్తున్న అన్యాయాన్ని పూర్తిస్థాయిలో గుర్తించలేకపోయారు.. అందుకే పిల్లల హక్కులు, పిల్లల సంరక్షణ అనే దృక్పథాలు బలపడటానికి ఒక బృహత్ ప్రచారం, ఒక ఉద్యమం అవసరమయ్యాయి.  ఈ నేపధ్యంలోనే ఐక్యరాజ్య సమితి 1989లో బాలల హక్కుల అంతర్జాతీయ ఒడంబడికను రూపొందించింది. పిల్లల పౌర రాజకీయ, ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు పూనుకున్న ఏకైక ఒప్పందం.. భారత ప్రభుత్వం 1992 డిసెంబరు 11 న ఈ ఒడంబడికను ఆమోదించింది ఈ తీర్మానంలో బాలల హక్కుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అలాగే పిల్లల హక్కుల్ని పరిరక్షించడానికి ఎవరికైనా హక్కు వుంది. అని తెలియజేశారు. అన్ని పరిస్ధితుల్లోను పిల్లలందరికీ వర్తించే సార్వత్రిక ఒప్పందమిది. తల్లితండ్రుల బాధ్యత మీద కూడా బాలల భవిష్యత్ ఆధారపడి వుంటది.. అవి క్రింద తెలిపిన విధంగా ఉండాలి.. సురక్షిత వాతావరణంలో పిల్లలు ఉండేలా చూడటం. వీలున్నంత ఎక్కువగా పిల్లలతో సంభాషిస్తూ వారి మనసు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం. పిల్లలకు సురక్షిత బాల్యమే కాక ఇంకా ఎన్నో రకాల హక్కులు ఉన్నాయని పెద్దలందరికీ తెలియజేసి, వాటిని సంరక్షించేలా చూడటం. పిల్లలకి, వారి కుటుంబానికి వీలున్నంతగా సాయపడటం. పిల్లల రక్షణకి ప్రమాదం కలిగించే వాటిని తెలుసుకుని, అలాంటి ప్రమాదాల నివారణకి కృషి చెయ్యటం. అవసర సమయాల్లో పోలీసులకి / పిల్లల సంరక్షణా సంస్ధలకి ఫిర్యాదు చేసి అవసరమైన చట్టబద్ధ భద్రతని కలిగించటం. పిల్లలు కష్టపడుతున్నప్పుడు అది వారి ఖర్మ అని బావించకూడదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఇబ్బందులతోనే పెరిగారు అన్న ఉదాసీనత ఉండకూడదు. ఇది మన సంప్రదాయం. ఎప్పట్నుంచో ఇలాగే జరుగుతోందన్న ధోరణి ఉండకూడదు. పేదరికం, లంచగొండితనం వల్లే పిల్లలకి బాధలు అన్న అలక్ష్య ధోరణి పనికిరాదు. పిల్లల కష్టాలకు తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబమే కారణం అన్న భావన సరైంది కాదు. ఆ పిల్లలకి మనకి ఏం సంబంధం లేదు అన్న ఉదాసీనతా కూడదు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఆటపాటలకు దూరంకాకుండా చూసుకోవాలి, గత 20 నెలలుగా కరోనా చేసిన విలయతాండవం అంత ఇంత కాదు.. చదువు మీద ద్యసాలేదు , ఆటలు అడలన్న ఉత్సాహం కూడా లేదు.. వీటికి తోడు స్మార్ట్ ఫోన్ లు వచ్చి వాటిలో వచ్చే ఆన్లైన్ క్లాస్ ల కంటే వాళ్ళు అడే వీడియో గేమ్ తో ఎక్కువ సమయం గడుపుతున్నారు..  పిల్లల చదువు వారి భవిష్యత్ నీ దృష్టిలో పెట్టుకొని తల్లితండ్రులు కొందరు అప్పుచేసి మరి వేలల్లో డబ్బులు కర్చుపెట్టి స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చారు.. అదికాస్తా ఆన్లైన్ క్లాస్ లు ఏమో కానీ వీడియో గేమ్స్ లో బాలలు ఫోన్ లకు విపరీతంగా అకారితులై గ్రూప్ గా కలిసి ఎక్కువ సమయం ఫోన్ తో కలక్షేపం చేస్తూన్నారు. ఈ అలవాట్లను మెల్లిమెల్లిగా బాలలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి.. అదేవిదంగా కార్పొరేట్‌ స్కూల్ లో చదివించే తల్లితండ్రులు కార్పొరేట్ విద్యా సంస్థల మధ్య పోటీ కారణంగా బాలలు ఒత్తిడికి గురవుతున్నారు కావున వారితో ఎక్కువ సమయం గడుపుతే కొంత వరకు పలితాలు వస్తావి అనేది వాస్తవం .. కానీ ఎంత మంది తల్లితడ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు!  తల్లిదండ్రులు కూడా ర్యాంకులు, మార్కులకే ప్రాధాన్యం ఇవ్వడంతో బాలల వికాసానికి దోహదపడే బాల సాహిత్యం మాటే వినిపించడం లేదు. నీతి కథలు, బాల సాహిత్య పుస్తకాల జోలికి వెళ్లే తీరికే ఉండడం లేదు. చందమామ, పేదరాశి పెద్దమ్మ, కాశీ మజిలి కథలు, అక్బర్‌ బీర్బల్‌, అరేబియన్‌ నైట్స్‌ ఇలా ఏ పుస్తకం గురించి చెప్పినా నేటి తరం బాలలు తెల్ల ముఖం వేస్తారు. ఆటలు ఆడితే సమయం వృధా అవుతుందని తల్లిదండ్రులు భావిస్తున్న ప్రస్తుత తరుణంలో పిల్లలకు శారీరక వ్యాయామం లేకుండాపోయింది. సెలవు రోజుల్లో కూడా పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పరిస్థితి నెలకొంది. దీంతో బాలల ఒత్తిడికి గురవుతున్నారు. బాల్యంలోని మాధుర్యాన్ని కోల్పోతున్నారు.. శిశు మరణాలు, పిల్లల మరణాల్ని తగ్గించేందుకు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేస్తూ పిల్లలలందరికీ అవసరమైన వైద్య సహాయం, ఆరోగ్య రక్షణలు కల్పించేందుకు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారం, పరిశుభ్రమైన త్రాగునీరు అందించడం ద్వారా, పర్యావరణ కాలుష్యం వల్ల ఏర్పడే ఇబ్బందులు ప్రమాదాలను గుర్తించడం ద్వారా పౌష్టికాహార లోపాన్ని, వ్యాధులను ఎదుర్కొనేందుకు, తల్లులకు ప్రసవానికి ముందు, ప్రసవానంతరం తగిన ఆరోగ్య సంరక్షణలు అందించేందుకు, సమాజంలో అన్ని శాఖలకు ప్రత్యేకించి తల్లిదండ్రులకు, పిల్లలకు విద్య పొందేందుకు, పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం గురించిన ప్రాధమిక విజ్ఞాన్నాన్ని వినియోగించటంలో సహకరించేందుకు, తల్లి పాల వల్ల ప్రయోజనాలు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ప్రమాదాల నివారణ గురించి వివరించేందుకు వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం గురించిన సంప్రదాయ విధానాలను నిర్మూలించేందుకు భాగస్వామ్య దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి. - పీలి కృష్ణ 7801004100

వెంకయ్యను కీర్తించిన షా.. కుప్పంలో అరాచకాలు.. గొడ్డలి వేట్లు ఎవరివి.. టాప్ న్యూస్@1PM

ఉపరాష్ట్రపతి వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న తన అభిలాష ఇప్పుడు నెరవేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. ఆదివారం వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ బీజేపీ గ్రాఫ్ పెరగడానికి వెంకయ్య ముఖ్య కారణమని...ఆయన క్రమశిక్షణకు మారుపేరని అన్నారు.-----------అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. 14వ రోజుకు చేరింది. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజవర్గాలు దాటి కొండేపి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టింది. ఇప్పటి వరకు రైతుల మహాపాదయాత్ర 152.9 కి.మీ. పూర్తి చేసుకుంది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివస్తున్నారు.  ------------ ‘‘బాబాయ్‌ని లేపేసి నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై నీ దొంగ పేపర్లో రాయించిన అబ్బాయి జగనూ... సుపారీ రూ.40 కోట్లు, గొడ్డలి వేట్లు నీ ఇంటివేనట కదా! ఇప్పుడేం రాయిస్తారు మీ పత్రికలో..!’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనంపై జారీ చేసిన జీవోలను కొట్టివేయాలన్నారు లోకేష్.  ---------- కుప్పంలో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధి పాతపేట మునిస్వామిపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.  ---------- తిరుపతిలో నిర్వహిస్తున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వేదపండితులు మహాద్వారం వద్ద వీరికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న షా, జగన్‌కు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.  ------ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. షా నేటి తిరుపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసులు తిరుపతి బైరాగిపట్టెడలో వాకింగ్ చేస్తున్న నారాయణను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ---------- ఒకరోజు మాత్రమే అసెంబ్లీ సెషన్స్‌ నిర్వహణపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఇది జగన్ రెడ్డి పలాయనవాదానికి నిదర్శనమన్నారు. చట్టసభలపై జగన్ రెడ్డి నిర్లక్ష్యానికి నిలువుటద్దమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఫేస్ చేయాలంటే జగన్‌లో సైకో ఫియర్ ఉందన్నారు. కనీసం 15 రోజులు సెషన్స్ పెట్టాలని టీడీఎల్పీ తరఫున తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలపై భారాలు మోపారన్నారు. ---------- మావోయిస్టు నేత ఆర్కే జీవిత చరిత్రను ప్రచురించడానికి అనుమతివ్వాలని ఆర్కే సతీమణి శిరీష కోరారు. చనిపోయిన తర్వాత ఎవరైనా సంస్మరణ సభ జరుపుకుంటారని...తాను అదే విధంగా ఆర్కే సంస్మరణ సభ  చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకున్నారని అన్నారు. 2004 ఆర్కేతో చర్చలకు వచ్చినపుడు మీడియాలో వచ్చిన కథనాలు, ఫోటోలు జ్ఞాపకాలు దాచుకున్నానని తెలిపారు.2010లో అరెస్ట్ అయినప్పుడు తనపై వచ్చిన ఆరోపణలు, కథనాలు కూడా దాచుకున్నానన్నారు.  ---- కరీంనగర్ జిల్లాలోని గంగాధర వ్యవసాయ మార్కెట్‌లో భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. వర్షానికి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు అయినా అధికారులు ధాన్యం కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని రైతులు మండిపడ్డారు. --------- ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కంచుకోట అయిన గోరఖ్‌పూర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రచార యాత్ర చేపట్టారు. ద్రవ్యోల్బణం ప్రధానాంశంగా ఆయన బీజేపీ పాలనను తన యాత్రలో తూర్పారబడుతున్నారు. అడుగడునా ఆయన యాత్రకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో అఖిలేష్ తన యాత్ర సాగిస్తూ, బీజేపీ పాలనలో ధరల పెరుగదలను ఎండగడుతున్నారు.

రాజస్థాన్ కాంగ్రెస్ లో పంజాబ్ పాలిటిక్స్.. గెహ్లాట్ వర్సెస్ పైలట్

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. పీసీసీ  అధ్యక్షుడు నవజ్యోతి సింగ్ సిద్దు, ఆడిందే అట పాడిందే పాట అన్నట్లుగా  సాగుతున్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మరో మూడు నలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో చెప్పడం కూడా కష్టమే అంటున్నారు. సొంత పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకులు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా పీసీసీ చీఫ్, పార్టీ అధిష్టానాన్ని సవాలు చేసి మాట నెగ్గించుకున్నారు. ఆయన పెట్టిన షరత్ కు తలొగ్గి ముఖ్యమత్రి అడ్వకేట్ జనరల్ మార్చారు. ఇలా తోక కుక్కను ఆడించడం పార్టీ చరిత్రలో ఎప్పుడు లేదని, కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి ఆవేదన వ్యక్తం చేశారంటే పార్టీ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. పంజాబ్ పరిస్థితి అలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మరో కీలక రాష్ట్రం రాజస్థాన్’లో ముఖ్యమంత్రి  అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గాల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న అతర్గత కుమ్ములాటలు మరోమారు తాజాగా తెర మీదకు వచ్చాయి.నిజానికి, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సంవత్సర కాలంపైగా పైలట్ వర్గం ఆశగా ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణను దిగ్విజయంగా వాయిదా వేస్తూ వస్తున్నారు. చివరకు, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా జోక్యం చేసుకున్నా, గెహ్లాట్ లైట్’గా తీసుకున్నారు.  ఇప్పటికే ఒకటికి రెండుసార్లు తమ వర్గానికి మంత్రి వర్గంలో స్థానం కలిపించేందుకు ప్రయత్నించి భంగ పడిన సచిన పైలట్, మరోమారు, ఢిల్లీలో శుక్రవారం (నవంబర్ 12)కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. సుమారు  45 నిముషాల పాటు ఆయన సోనియాకు తమ ఆవేదన, రోదనా వినిపించారాణి సమాచారం. అలాగే, పైలట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. 2023లో రాజస్థాన్‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు. మరోవంక ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్,ఇప్పటికే ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శీ కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ అజయ్ మాకెన్‌ను కలిశారు. రాజస్తాన్‌లో 30 మంది మంత్రుల మండలిలో ప్రస్తుతం 9 ఖాళీలు ఉన్నాయి. రాజస్థాన్ మంత్రి మండలిలో సీఎం గెహ్లాట్‌తో సహా 21 మంది మంత్రులు ఉన్నారు. గత ఏడాదిలో జులైలో ముఖ్యమంత్రి అశోక్ గేహ్లట్‌కు వ్యతిరేకంగా సచిన్ పైలట్ మద్దతుదారులు మంత్రి పదవులకు రాజీనామా చేశారు.అపప్తి నుంచి ఆ పోస్టులు ఆలా ఖాళీగానే ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య సంధి కుదిరిన ముఖ్యమంత్రి గెహ్లాట్ రాజకీయ చతురతో పైలట్ ప్లాన్’ ను ఎప్పటికప్పుడు పల్టీ కొట్టిస్తునే ఉన్నారు.ఈ నేపధ్యంలో ముఖ్యమత్రి  గెహ్లాట్ ఈసారి అయినా, పైలట్ వర్గానికి మంత్రి పదవులు ఇస్తారా, లేక పోమ్మనకుండా పొగ పెట్టి పంపిస్తారా అనేది చూడవలసి వుంది. నిజానికి, పైలట్ వర్గం ఇప్పటికే బీజేపీతో టచ్’ లో ఉన్నట్లు వార్త లొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పైలట్ కలిసి ప్రయాణం  చేసిన జ్యోతి రాదిత్య సింధియా, బీజేపీలో చేరి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.  మరో కో పైలట్ జితేంద్ర ప్రసాద(యూపీ) కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న పైలట్ మాత్రం ఇంకా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. అయితే ఈ సారి కూడా గెహ్లాట్ మొండి చేయి చూపిస్తే, పైలట్ కమలదళంలో చేరవచ్చని అంటున్నారు.

తిరుమలకు అరుదైన గౌరవం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో టీటీడీ 

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం దక్కించుకుంది. ప్రపంచంలో ఏ ఇతర ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలందిస్తున్నందుకుగాను తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇంగ్లాండ్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ సర్టిఫికెట్ అందజేసింది. తిరుమలలో టిటిడి పాలకమండలి అధ్యక్షులు  వైవి సుబ్బారెడ్డికి ఆ సంస్థ భారత దేశ అధ్యక్ష్యులు  సంతోష్ శుక్ల తరపున దక్షిణ భారత దేశ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్ అందజేశారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో  చోటు దక్కడంపై టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భక్తులకు సేవలు, సదుపాయాలు అందిస్తోందన్నారు. సాధారణ రోజుల్లో తిరుమలలో 60 నుంచి 70 వేల మంది భక్తులకు చిన్న పాటి అసౌకర్యం కూడా లేకుండా సంతృప్తికరమైన దర్శనం చేయిస్తున్నామన్నారు. క్యూలైన్ల నిర్వహణ శాస్త్రీయ పద్ధతిలోజరుగుతోందని సుబ్బారెడ్డి చెప్పారు. రోజుకు మూడున్నర లక్షలకు పైగా లడ్డూలు ఆరోగ్యకరమైన వాతావరణంలో తయారుచేసి భక్తులకు అందించడం జరుగుతోందన్నారు. కళ్యాణ కట్టలో రోజుకు 35 వేల నుంచి 45 వేల మంది భక్తులు చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంటున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా లేకుండా విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగం సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ప్రతి రోజు వేలాది మంది భక్తులు అన్న ప్రసాదం లో పరిశుభ్రమైన వాతావరణం మధ్య స్వామివారి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని సుబ్బా రెడ్డి చెప్పారు.  రోజు ఇన్ని లక్షల మంది విచ్చేస్తున్న తిరుమల క్షేత్రం పరిశుభ్రత, పచ్చదనానికి  పెద్ద పీట వేస్తోందని చెప్పారు. ప్రపంచంలో ఇతర ఏ ఆలయంలో లేని విధంగా భక్తులకు సేవలు అందిస్తున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తన బుక్కులో తిరుమలకు చోటు కల్పించిందని  తెలిపారు.  టిటిడిలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది అందరూ తాము దేవుడి సేవ చేస్తున్నామనే భక్తిభావంతో కష్ట పడి పని చేస్తున్నందువల్లే టిటిడికి ఈ గుర్తింపు వచ్చిందని చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన అధికారులు ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేశారు.  

వైఎస్ వివేకా హత్య జరిగింది ఇలా..! డ్రైవర్ దస్తగిరి స్టేట్ మెంట్స్ లో సంచలనాలు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. సీబీఐ విచారణలో భాగంగా వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. అందులో వైఎస్ వివేకాను ఎలా హత్య చేసింది వివరించారు దస్తగిరి. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి. వివేకా డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ ప్రకారం అతన్ని నలుగురు హత్య చేశారు.  వివేకా హత్యకు సంబంధించి డ్రైవర్ దస్తగరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ లో వివరాలు ఇలా ఉన్నాయి..  - 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓడిపోయాడు - ఎన్నికల్లో ఓడిపోవడానికి ఎర్రగంగిరెడ్డి మోసం చేశాడని వివేకా ఆగ్రహించాడు - బెంగళూరులో స్థలం విషయంలో పంచాయతీ కోసం పలుమార్లు వెళ్లేవారు - ఆ స్థలంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి అడిగితే వివేకా ఆగ్రహించాడు - 2018లో నేను వివేకా వద్ద డ్రైవర్ పని మానేశాను - డ్రైవర్ గా మానేసిన తర్వాత ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ ను తరచూ కలిసేవాడిని - 2019 ఫిబ్రవరి 2న ఎర్రగంగిరెడ్డిన తన ఇంటికి నన్ను, సునీల్ యాదవ్, ఉమశంకర్ రెడ్డిని తీసుకెళ్లాడు - వివేకాను చంపాలని ఎర్రగంగిరెడ్డి తనకు సూచించాడ. తాను హత్య చేయలేనని చెప్పాను.. హత్య  చేయడానికి నీవు ఒక్కడివే కాదు... మేము కూడా వస్తామన్నారు.. హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందన్నారు - వై.ఎస్.అవినాష్ రెడ్డి, వై.ఎస్.భాస్కర్ రెడ్డి, వై.ఎస్.మనోహర్ రెడ్డి, డి.శంకర్ రెడ్డి ఉన్నారని ఎర్రగంగిరెడ్డి చెప్పారు.. శంకర్ రెడ్డి 40 కోట్లు ఇస్తాడు.. అందులో 5కోట్లు నాకు ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పాడు.  -  ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత - సునీల్ యాదవ్ నాకు కోటి రూపాయలు ఇచ్చాడు. అందులో 25 లక్షలు ఇవ్వాలని మరలా ఇస్తానని సునీల్ చెప్పాడు.75 లక్షల రూపాయలను మున్నా అనేవ్యక్తి వద్ద దాచి పెట్టాను.  - ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వివేకా ఇంటి కుక్కను కారుతో ఢీకొట్టి చంపేశారు.  - నేను కదిరికి వెళ్లి గొడ్డలి కొనుగోలు చేసి సునీల్ యాదవ్ కు ఇచ్చాను - 2019 మార్చి 14వ తేదీ రాత్రి ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, నేను వివేకా ఇంటికి వెళ్లాం - వివేకా ఇంటికి వచ్చిన తర్వాత ఎర్రగంగిరెడ్డి ముందుగా ఇంట్లోకి వెళ్లాడు..తర్వాత మేము ముగ్గురం గోడ దూకి పక్క తలుపు తీసి లోపలికి వెళ్లాం - బెంగళూరు స్థలం విషయంలో వాటా కావాలని ఎర్రగంగిరెడ్డి వివేకాను అడిగాడు.ఆ సమయంలో వాదన జరగడంతో సునీల్ యాదవ్ బూతులు తిడుతూ వివేకా ముఖంపై కొట్టాడు. కిందపడిన వివేకాను ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో దాడి చేశాడు - వివేకాను గొడ్డలితో దాడి చేసి ఆయన చేత్తో ఓ ఉత్తరం రాయించాము.  - సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ఆయన ఇంట్లో కొన్ని పత్రాలు తీసుకున్నారు - బాత్ రూంలోకి తీసుకెళ్లి వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత అంతా గోడదూకి పారిపోయాం. భయపడవద్దు... అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి చూసుకుంటారని ఎర్రగంగిరెడ్డి మాకు ధైర్యం చెప్పారు

రూ. 40 కోట్ల సుపారీ.. నలుగురు హంతకులు! వివేకా కేసులో డ్రైవర్ కన్ఫెషన్ స్టేట్‌మెంట్..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో  సంచలనం వెలుగు చూసింది. సీబీఐ విచారణలో వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరి బాంబ్ పేల్చారు. వివేకా హత్యపై ఆగస్ట్ 30న దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. అందులో సంచలన విషయాలు ఉన్నాయి.  వివేకా హత్య జరిగిన తీరును వివరిస్తూ కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు డ్రైవర్ దస్తగిరి. అందులో బడా నేతల పేర్లు ప్రస్తావించారు దస్తగిరి.  కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో సీఎం జగన్ సన్నిహితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు.  ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి ప్లాన్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి రగిలిపోయినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గంగిరెడ్డి మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్‌ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్‌ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటలు బంద్ అయ్యాయని తెలిపారు. కోటి రూపాయిలు ఇస్తాం.. వివేకాను హత్యచేయాలని, గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయిల సుపారీ ఇచ్చినట్లు తెలిపారు. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి.. కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి వెల్లడించారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో 25 లక్షలు, సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు. తన స్నేహితుడు మున్నా దగ్గర మిగతా 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర.. కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి పేర్కొన్నారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది.