హార్దిక్ పాండ్యా దగ్గర రూ. 5 కోట్ల వాచీలు సీజ్! బిల్లులు ఉన్నాయంటున్న క్రికెటర్..
posted on Nov 16, 2021 @ 9:34AM
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. దుబాయ్ నుంచి టీ20 ప్రపంచకప్ ముగించుకుని దుబాయ్నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై ఎయిర్పోర్ట్లో దిగిన పాండ్యా వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు హార్దిక్ పౌండ్యా వద్ద గుర్తించారు. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది.
తనపై వస్తున్న వార్తలపై ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్పందించారు. నవంబర్ 15న సోమవారం తెల్లవారుజామున నేను దుబాయ్ నుండి వచ్చాను. నా లగేజీని తీసుకున్న తర్వాత, నేను తీసుకువచ్చిన వస్తువుల వివరాలు చెప్పడానికి అవసరమైన కస్టమ్స్ డ్యూటీని చెల్లించడానికి నేను స్వచ్ఛందంగా ముంబై విమానాశ్రయ కస్టమ్స్ కౌంటర్‌కి వెళ్లాను. నేను చేసిన ప్రకటనకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు అవగాహనలు వెల్లువెత్తుతున్నాయి. ఏమి జరిగిందో నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను దుబాయ్ నుండి చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అన్ని వస్తువులను స్వచ్ఛందంగా ప్రకటించాను. చెల్లించాల్సిన సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాస్తవానికి, కస్టమ్స్ విభాగం అన్ని కొనుగోలు పత్రాలను కోరింది. వాచ్ ఖరీదు దాదాపు రూ. 1.5 కోట్లని, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం 5 కోట్లు కాదు. నేను దేశంలోని చట్టాన్ని గౌరవించే పౌరుడిని. నేను అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను గౌరవిస్తాను. నేను ముంబై కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ తనకు సహకరించింది. వారికి నా పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చాను. ఈ విషయాన్ని క్లియర్ చేయడానికి వారికి కావాల్సిన చట్టబద్ధమైన పత్రాలను అందజేస్తాను. నాపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమైనవి. అని పాండ్యా చెప్పాడు.
గత సంవత్సరం కూడా ఇలాంటి చిక్కుల్లోనే పడ్డారు హార్దిక్ పాండ్యా. హార్దిక్ , కృనాల్ పాండ్యా దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా అనుమతి లేని బంగారం, ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారనే అనుమానంతో ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కృనాల్ వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం, కొన్ని బహిర్గతం చేయని లగ్జరీ వాచీలు దొరికాయి.