బాబు రావాలి.. జగన్ పోవాలి... జనం నాడి ఇదే..!
posted on Nov 17, 2021 @ 9:52AM
నారా చంద్రబాబు నాయుడు ప్రపంచంలోని తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. తొలి రోజుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు చిన్న అల్లుడుగా.. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్ణాంధ్ర రథసారధిగా చంద్రబాబు.. తన పరిపాలనాతో మంచి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. రాజకీయానికి ఐటీ రంగాన్ని జోడించి.. తన దార్శనికతతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది.
దేశంలో అక్షర క్రమంలోనే కాదు.. అభివృద్ధిలో సైతం ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు.. దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పారు. రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాంను ఎంపిక చేయడంలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. దేశ ప్రధానులతో సైతం చంద్రబాబు సన్నిహితంగా మెలిగేవారు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలను ఏకం చేయడంలో చంద్రబాబు చాణక్యం అందరికీ తెలిసిందే.
గతంలో హైదరాబాద్ అంటే.. జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ మాత్రమే గుర్తుకు వచ్చేవి. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత భాగ్యనగరంలో హైటెక్ సిటీ నిర్మించారు. హైటెక్ అంటే హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజినీర్స్ కన్సెల్టెన్సీగా చంద్రబాబు అభివర్ణించారు. దేశంలో ఐటీ రంగానికి హైటెక్ సిటీ కేంద్ర బిందువు మారిందంటే అందంతా చంద్రబాబు చలవే. నాడు చంద్రబాబు అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరాన్ని మనం నేడు చూడవచ్చు.
అంతేకాదు.హైటెక్ సిటీని ప్రపంచ పటంలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతోంది అనేది ఎవరకు కాదనలేని సత్యం. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినా... మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ భాగ్యనగరానికి వచ్చినా.. అది చంద్రబాబు ఘనతే కానీ మరొకరిది కాదనేది అక్షర సత్యం.
ఉదాహరణకు ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండగా.. పక్క రాష్ట్ర సీఎం జయలలిత.. ఓ సారి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్బంగా హైదరాబాద్ నగరంలో ప్లై ఓవర్లు, ఎటు చూసిన పచ్చని చెట్లు, విశాలమైన రహదార్లు.. చూసి జయలలిత ముగ్డురాలయ్యారు. ఆ వెంటనే ఆమె.. చెన్నైలోని తన అధికార గణానికి ఫోన్ చేసి.. హైదరాబాద్ నగరం ఎంతలా అభివృద్ధి చెందిందో వారికి వివరించడమే కాకుండా.. వారిని ఆగమేఘాల మీద హైదరాబాద్ రావాలని ఆదేశించిన విషయం విధితమే.
విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సెంటర్ పాయింట్ గుంటూరు జిల్లా తుళ్లూరు, మందడం, వెలగపూడితోపాటు మరో 26 గ్రామాలను చంద్రబాబు గుర్తించారు. ఆ క్రమంలో సదరు గ్రామాలను కలిపి రాజధాని పేరుతో అమరావతి ఏర్పాటు చేశారు. అందుకోసం రైతుల నుంచి భూమిని తీసుకుని... దానిని అభివృధ్ది చేసేందుకు ప్రణాళికలు సైతం రూపొందించారు.
చంద్రబాబులోని దార్శనికతకు ఇది ఒక మచ్చుతునక. ఓ సారి యూపీఏ అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టి.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సదరు టీడీపీ నేతలను పీఎం మన్మోహన్ సింగ్ ఒక్కే ఒక్క ప్రశ్న.. మీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎలా ఉన్నారని.. ఆయన్ని అడిగానని చెప్పాలన్నారు. చంద్రబాబుపై పీఎం మన్మోహన్ సింగ్ ఆరా తీయడంతో అక్కడ టీడీపీ నేతలంతా అవాక్కయ్యారు. దటీజ్ చంద్రబాబు.
ఇలా చంద్రబాబు గురించి చెప్పుకుంటూ ఒకటా రెండా... చాలా ఉంటుంది. చంద్రబాబు..ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్పూర్తితో ప్రముఖ దర్శకుడు శంకర్ ఒకే ఒక్కడు సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉండగా.. జన్మభూమి, శ్రమదానం కార్యక్రమాలు చేపట్టిన, రైతు బజార్లు ఏర్పాటు చేసినా.. ఆయనకు ఆయనే సాటి..
చంద్రబాబు దార్శనికతకు ప్రతిరూపం అనడంలో అతిశయోక్తి లేదేమో. అందుకు ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే.. రాష్ట్రంలో చోటు చేసుకునే పరిణామాలు చంద్రబాబు కళ్లకు కట్టినట్లు వివరించారు. రాజధాని మారుస్తారు తమ్ముళ్లు అని చెప్పారు. అలాగే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు... రాష్ట్రం మళ్లీ వెనక్కి వెళ్తుందన్నారు. సామాన్యులకు సహాజ వనరులు అందవని ప్రజలకు చంద్రబాబు సూచించారు. ఇవన్నీ చంద్రబాబు ముందే ఊహించి.. ఓ దార్శనికతతో చెప్పారు. కానీ ఆయన మాటలను ప్రతి ఆంద్రుడు పెడ చెవిన పెట్టారు.
దాంతో నేడు ఆంధ్రులు పడుతున్న ఇబ్బందులు అందరికీ తెలిసినవే. ఇక ఉత్తరాఖండ్‌లో ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆప్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌లకు సైతం చంద్రబాబు పాఠాలు చెప్పారు. పరిపాలనకు, దర్శనికతకు, నీతి, నిజాయితీకులకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్య కళ్యాణం... పచ్చ తోరణంలా కళకళాడాలంటే చంద్రబాబే రావాలని ఆ రాష్ట్ర ప్రజలు మనసా వాచా కర్మణా కోరుకుంటున్నారంటే దటీజ్ నారా చంద్రబాబు నాయుడు.